top of page

నేపాల్‌ సాహసయాత్ర



'Nepal Sahasayathra' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 26/12/2023

'నేపాల్‌ సాహసయాత్ర' తెలుగు కథ

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)



అద్భుతమైన, సాహసవంతమైన నేపాల్‌ యాత్రా విశేషాలు. 

ఆద్యంతము ఆహ్లాదకరమైన ప్రకృతి, గగుర్పాటు కలిగించే ప్రయాణాలు, మానసోల్లాసము కలిగించే చక్కటి హిమబిందువులతో కూడిన పిల్లగాలులు. 


అన్నీ కలిసి మనలను ఎక్కడికో మరోలోకానికో, సుందర సుదూర తీరాలకో గొంపోవుచున్న అనుభూతులు. 


"ఇదిగో నవలోకం వెలసే మనకోసం" అన్నట్లు

సాగింది. 


మార్చి 23 న హైద్రాబాద్‍ లో బయలుదేరి ఫ్లైట్‌ లో బెంగళూరు చేరుకున్నాము. అరగంట తరవాత బెంగుళూరు నుండి మరొక ఫ్లైట్‌ లో గోరఖ్‌పూర్‌ చేరుకున్నాము. 


ఆ రోజు అక్కడే బస చేశాము. గోరఖ్‌పూర్‌ హిందువులకు మరియు బౌద్దమతస్థులకు పుణ్యస్థలము. బుద్దుడు నిర్యాణము చెందిన ప్రాంతము. గోరఖ్‌నాథ్‌ వెలసిన ప్రాంతం. శివుడు గోరఖ్‌నాథ్‌ గా వెలసిన పుణ్యభూమి.


 బౌద్దమతం లో మహాయాన శాఖకు చెందిన మందిరాలు అతి నిశ్శబ్ద వాతావరణం లో ప్రశాంతంగా తపస్సు

చేసుకుంటున్నట్లు ఉన్నాయి. ఆ మందిరాలను దర్శించాము. 

మరుసటి దినము బస్సులో నేపాల్‌ కు బయలు దేరాము. మౌంట్‌ఎవరెస్ట్‌ సముద్రమట్టానికి ఎగువన 29, 029 అడుగులు( 8, 848 మీటర్లు). మౌంట్‌ ఎవ

రెస్ట్‌ ఈ భూమ్మీద అతి ఎత్తైన శిఖరము. తూర్పున కలదు. హిమాలయాల్లో మహా లంగూర్‌ ప్రాంతంలో నేపాల్‌ మరియు చైనా సరిహద్దులకు ఆవరించుకొని యున్నది. 


నేపాల్‌ లోని పోఖారా ప్రాంతమునకు చేరుకున్నాము. 

పోఖారా ప్రకృతి అందాలకు ఆటపట్టు. అత్యంత సుందరము, రమణీయమైన ప్రాంతం. సముద్రమట్టానికి ఎగువన 827 మీటర్లు, పశ్చిమంగా ఖాట్మండ్‌కు 200కి. మీ.

 ఈ పట్టణానికి centre of adventure అనే పేరు కలదు. హిమాలయాల మీదకు ట్రెక్కింగ్‌ ఇక్కడ నుంచే వెళుతుంటారు చాలామంది. ఈ పట్టణం లో

అందాలకు నెలవైన ఎన్నో సరస్సులు కలవు. అత్యద్భుతమైన హిమాలయాల ప్రకృతి సౌందర్యమంతా ప్రశాంతంగా పెనవేసుకుని యున్నది. 


మరుసటి రోజు ముక్తినాథ్‌ నకు పయనమయ్యాము. వయా జామ్‌సన్‌ గుండా. 

ఈ ప్రయాణమంతా ఎంతో ఉత్సాహభరితం గానూ గగుర్పాటు చెందుతూ వెళ్ళాము. ఇక్కడ అంతా కలిసి జీపులలో వెళ్ళాము. గంఢకీ నదీ పరివాహక ప్రాంతం. పరమ పవిత్రమైన సాలిగ్రామాలు దొరుకు చోటు. ఒక కిలో మీటరు

ఉందనగా జీపు ప్రయాణము ఆపేశారు. అక్కడ నుండి దగ్గర దగ్గర ఒక కిలో మీటరు దూరం గుర్రాలపై పయనించాము. అక్కడ నుండి అరకిలోమీటరు దూరం నడక ప్రయాణం. గుర్రాలమీద పయనం మరియు నడక దారి అత్యంత

కఠినంగా ఉండును. ఒకపక్క హిమాలయాల నుంచి వచ్చే మంచు వర్షపు గాలులతో ఉక్కిరిబిక్కిరి అగుచూ ముక్తి పొందుటకు, ముక్తినాథుని దర్శించుటకు వెళ్ళు

భక్తులను చూసుకుంటూ మనకి మనమే ఉత్తేజం పొందుతూ సాగింది పయనం. 


ఎట్టకేలకు ముక్తినాథుని దర్శనము లభించింది. అప్పటివరకూ పడిన శ్రమా, బడలికా, ఆయసము మటుమాయమైపోయినవి. అక్కడ ఉన్న 108 చల్లని గుండాల నీటిని తలపై సంప్రోక్షించుకుని బయటకు వచ్చాము. ఎంతో పవిత్రమైన పుణ్యస్తలంగా హిందువులు, బౌద్దులు విశ్వసిస్థారు ముక్తినాథ్‌ లోయను. 


Mukthinath is s sakred place for both Hindus & Bhuddhists located In Mukthinath valley at an attitude of 3, 710 meters at the foot of the Thorong La mountain pass( part of Himalayas) in musstang, Nepal. 


ముక్తినాథుని హైందవులలో వైష్ణవ సంప్రదాయము వారు ఎనిమిది ప్రముఖ వైష్ణవ క్షేత్రములలో ఒకటిగా తలంతురు. మిగిలిన ఏడూ శ్రీరంగము, తిరుపతి, శ్రీముఖము, నైమిషారణ్యము, తోటాద్రి, పుష్కర్‌ మరియు బదరీనాథ్‌. 


108 వైష్ణవ క్షేత్రాలలో శ్రీరంగము మొదటిది, ముక్తినాథ్‌చివరిది. ఇవన్నియూ స్వయంభువుగా వెలసిన క్షేత్రాలే. 


ఆ రోజు అక్కడే బస చేశాము. అత్యద్భుతమైన అనుభవము. 

మరుసటి రోజు బయలుదేరి తిరిగి పోఖారా కు వచ్చాము. ఆ రోజు ' తలాబ్ వరాహి' ని దర్శించుకున్నాము. ' లేక్‌మందిర్‌' అని కూడా పిలుస్తారు. రెండు అంతస్తుల భవనాకారం మరియు పగోడా ఆకృతిలో ఉంటుంది ఈ ఆలయం. ఖాస్కీ జిల్లాలో కలదు. ఈ ఆలయం ఒక చిన్న ద్వీపము నందు తూర్పు బాగపు ఫెవ్వా సరస్సు నందు కలదు. పోఖారా లో యున్న సుందరమైన సరస్సులలో ఇది ఒకటి. దగ్గరలోనే కల వింద్యావాసినీ, భద్రకాళీ అమ్మ వారల దర్శనం చేసుకున్నాము. 


దగ్గరలోనే ప్రపంచ ప్రసిద్ద శాంతి స్తూపము ను చూశాము. ప్రశాంతముగా పక్షుల కిలకిలరావములు తప్పితే అంతా నిశ్శబ్దమే అక్కడ. 


ఇక్కడ నుంచి బయలుదేరి మనోకామ్‌నా దేవీ ఆలయమునకు బయలుదేరాము. ఈ ఆలయం 105 కిలోమీటర్ల దూరంలో ఖాట్మండ్‌కు మరియు ఘోక్రా జిల్లాలో

కలదు. దుర్గభవాణీ ఆలయం. కోరిన కోర్కెలు నెరవేర్చే తల్లిగా ప్రఖ్యాతి గాంచిన మహిమాన్వితమైన దేవి. ఒక కొండ మీద నిర్మితమైంది. ఆ కొండమీద వెళ్ళుటకు రోప్‌వే

మార్గమొక్కటే కలదు. అక్కడ నుంచి బసకు చేరుకున్నాము. 

మరుసటి రోజు పశుపతినాథ ఆలయము నకు బయలు దేరాము. ఈ ఆలయము నేపాల్‌ లోని ఆలయముల లో కల్లా చాలా పెద్దది. ఖాట్మండ్‌ లో కలదు. యునెస్కో వారు గుర్తించిన ప్రాచీన కళాఖండము గా గుర్తింపు పొందినది. ఇచ్చట శివలింగమును శక్తి దేవతగా ఆరాదిస్తారు. ఈ ఆలయము ఖాట్మండ్‌ కు ఏడు కిలోమీటర్ల  దూరంలో రత్నాపార్క్‌ లో కలదు. 


అచ్చట నుండి గుహ్యేశ్వరీ మాత గుడికి వెళ్ళాము. 108 శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటిగా కొలచెదరు. అచ్చట నుండి బుద్దనీలకంఠ ఆలయము నకు బయలుదేరాము. ఈ ఆలయము ఖాట్మండ్‌ కు పశ్చిమంగా పది కిలోమీటర్ల దూరంలో రత్నాపార్క్‌ కు దిగువగా గల శివపురినేషనల్‌ పార్క్‌ లో కలదు. ఈ ఆలయమును జలనారాయన్‌ మందిర్‌ అని కూడా పిలుస్తారు. బుద్దనీలకంఠ యనగా బుద్దనికి సంబందించినది కాదు. బుద్ద నీలకంఠ యనగా నీలపు నాలుక యని యర్థము. ఎల్లప్పుడూ నీటిలో తేలియాడుతూ

ఉంటారు ఈ స్వామి విగ్రహము. అందుకే జల్‌నారాయణ్‌ అని కూడా పిలుస్తారు. 


ఇచ్చట నుండి కాలభైరవ ఆలయమునకు పయనమైతిమి. పరమశివుని చే సృజించబడినవాడు. ఈ ఆలయాన్ని మళ్ళీ పుననిర్మించిన చక్రవర్తి బహదూర్‌ షా  1851 లో. 


అక్కడ నుండి చిట్వా జంగల్‌ కు బయలుదేరాము. రాత్రి అక్కడే బస. అత్యద్భుతమైన అడవి. చుట్టు పక్కల అంతా కీకారణ్యము. అందులో అతిథిగృహాలు. జంతువులు తిరిగే అన్ని చోట్లా మొత్తము ఇనుపకంచెలతో మొత్తం చుట్టబడివుంది. 


రాత్రిపూట ఎక్కువ జంతువులను చూడలేక పోయాము. 

మరుసటి రోజు జనక్‌పురి కి బయలుదేరాము. సీతమ్మ వారి పుట్టిల్లు. సీతారాముల కళ్యాణము జరిగిన ప్రదేశము. జానకీ మందిరము అత్యంత వైభవోపేతంగా, కళాత్మకంగా, సుందరమైన కళాకృతులతో నిర్మించబడింది. భారత దేశ ఆర్థిక సహాయ సహకారములతో నిర్మిచబడినది. 


వివాహమంటపము ఎంతో విశాలంగా, ఎంతదూరము నుండి చూచినా చూపరులకు కనువిందు చేయును. ఆ రోజు అక్కడే బస. 


మరుసటి రోజు లుంబినీ వనము నకు పయనమైతిమి. బుద్దుని జన్మస్థలము. బుద్దుని జననము 623బిసీ. లుంబినీ వనములో పుట్టెను. రూపాన్‌దేహి జిల్లాలో   కలదు. చుట్టుపక్కల అంతా పెక్కు బుద్దుని విగ్రహములు, ఆయన బోధించిన ప్రవచనాలు చాలా చోట్ల చెక్కబడ్డాయి. బంగారు పూతతో అన్ని విగ్రహాలు, స్తూపాలు ధగధగ కాంతులో మెరుస్తున్నాయి.

 

ఇక్కడ నుండి విందవాసినీ ఆలయమునకు వెళ్ళాము. పోఖారా లోని అత్యంత ప్రముఖమైన ఆలయము. సముద్రమట్టానికి ఎగువన 3000 అడుగుల లో

అన్నపూర్ణ మరియు మచ్ఛపుచ్ఛారే హిమాలయ శిఖరముల దగ్గర ఉంది. 

ఇక్కడ నుండి స్వయంభునాథ స్తూపము నకు బయలు దేరాము. బౌద్ద మతావలంబులకు ఎంతో పవిత్రమైన పుణ్య స్థలము. ఖాట్మండ్‌ వాలీ లోని మహాచైత్యము. 


ఇది కూడా యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ గుర్తింపు పొందినది. 

బుద్దపార్క్‌. అమితాబబుద్ధ, అవలకైతేశ్వర, పద్మసంభవ. ( బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు) ఆవిధంగా కొలుస్తుంటారు. 


మరుసటి రోజు గోరఖ్‌పూర్‌ కు బయలు దేరి వచ్చాము. 

గోరఖ్‌పూర్‌ లో గోరఖ్‌నాథ్‌ మందిరమును సందర్శించాము. స్వామి వారికి భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించాము. యాత్ర సఫలవంతము గా జరిగినందుకు. 


గోరఖ్‌పూర్‌ లో అత్యంత పురాతనమై అధ్యాత్మిక పుస్తకాలు అచ్చువేయుటలో అగ్రగామి అయిన గీతాప్రెస్‌ ను చూశాము. ధర తక్కువ. మన్నిక ఎక్కువ లాగా ఉంటాయి వాళ్ళు అచ్చు వేసిన పుస్తకాలు. కొన్నిటిని ఖరీదు చేశాము. 

ఆ రోజు గోరఖ్‌పూర్‌ లో బసచేసి మరుసటి రోజున తిరుగు ప్రయాణము. 


గోరఖ్‌పూర్‌ టూ బెంగళూర్‌ టూ హైద్రాబాద్‍. ఫ్లైట్‌ లో వచ్చేశాము. 


"హిమగిరి సొగసులు, మురిపించెను మనసులు" అన్నట్లు గా కొనసాగింది మా 'నేపాల్‌ సాహస యాత్ర'. 

------------------------------శుభమ్-----------------------------------


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు. 



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







Comentarios


bottom of page