'New Year resolutions' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 07/01/2024
'న్యూ ఇయర్ రిజల్యూషన్స్' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఈ రోజు మన పెళ్ళిరోజు కదండీ! ఎందుకు అంత డల్ గా ఉన్నారు.. ?" అడిగింది భార్య అనురాధ
"ఒక పక్క సంతోషంగా ఉన్నా.. మన పెళ్ళిరోజు తర్వాత వచ్చే న్యూ ఇయర్ తలచుకుంటేనే భయం వేస్తోంది అను.. "
"ఎందుకండీ భయం.. ?"
"ఎందుకా.. ? నీకు తెలియదా అను.. ?"
"నేను ఉండగా.. మీకెందుకు భయం.. చెప్పండి.. !"
"మన పెళ్ళి రోజు డిసెంబర్ లో అయిన తరువాత.. నువ్వు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటూ స్టార్ట్ చేస్తావు కదా.. "
"పాపం అండి.. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటే, అది ఒక నోము లాంటిది.. ఇంకా చెప్పాలంటే పండుగ లాంటిది.. "
"ఇలాగే చెప్పి... గత మూడు సంవత్సరాలుగా నా బ్యాంకు బ్యాలన్స్ ఖతం చేస్తున్నావు.. తెలుసా అను.. ?”
"పాపం.. లెంపలు వేసుకోండి.. "
"ఇలాగే చెప్పి.. నా నోరు కట్టేస్తున్నావు అను.. "
"ఐనా.. మీరే నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు మరి.. "
"అదే.. ఆ రోజు ఆ పెళ్లిళ్ల పేరయ్య అన్న మాటలకు అర్ధం ఇప్పుడే నాకు తెలుస్తోంది.. "
"ఐనా.. నేను ఏమంత పెద్ద తప్పు చేసానని?.. అంత లాగ ఫీల్ అయిపోతున్నారు?" అంది అను..
మన స్టొరీ చెబుతాను అను... అందరికీ తెలియాలి కదా!...
******
పెళ్ళికి ముందు ఎంతో హుషారు గా ఉండేవాడిని... యుద్దానికి వెళ్ళే సైనికుడిలాగ. బోల్డంత బ్యాంకు బ్యాలన్స్ తో.. ధైర్యంగా పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. అప్పటివరకు 'లోన్' అంటే ఏమిటో నాకు అస్సలు తెలియదు.. 'ఈఎంఐ' అంటే స్పెల్లింగ్ కుడా తెలియదు. ఈ సంగతి తెలిసిన బ్యాంకు వాళ్ళు, లోన్స్ తీసుకోమని కాల్స్ కుడా చేసేవారు కాదు. జీతం లో ఎక్కువ భాగం పొదుపు చేసుకుంటూ.. హ్యాపీ గా ఉండేది నా జీవితం.. తెలుసా అను..
రోజూ నేను నవ్వుతూ.. తిరుగుతూ ఉంటే, మా అమ్మ 'వీడికి ఇక పెళ్ళి చేసేయాలి'.. అనుకుంది. వెంటనే, ఆ పెళ్లిళ్ల పేరయ్య ను పిలిచి.. సంబంధం చూడమని చెప్పింది.
"పెళ్ళి ఎవరికండీ.. ?" ఆత్రంగా అడిగాడు పేరయ్య
"అది.. "
"చెప్పక్కర్లేదు లెండి.. ముఖం లో అంత నవ్వు ఉన్నాదంటే, మీ అబ్బాయే పెళ్ళికొడుకు.. అర్ధమైంది.. ! పేరేమిటో.. ?"
"నేనే శ్రీకాంత్.. అయినా అదేంటండి.. ! అలా అనేసారు.. ?"
"పెళ్ళికి ముందే మన మగవాళ్ళు ఇలా నవ్వుతాము.. ఆ తర్వాత నవ్వాలన్నా కష్టంగా ఉంటుంది.. " అన్నాడు పేరయ్య.
"నాకేమి అర్ధం అవలేదు పేరయ్య గారు.. " అన్నాను.
"అర్ధం అవకపోవడమే మంచిది. పెళ్ళైతే.. అన్నీ తెలుస్తాయి శ్రీకాంత్.. ఇంతకీ.. ఎలాంటి అమ్మాయిని చూడాలో.. చెప్పనేలేదు?"
"నాకు.. ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిని చూడండ్.. లైఫ్ హ్యాపీ గా ఉండాలి కదా... "
"అలాగే బాబు.. "
‘ఈ అబ్బాయిలందరూ... పెళ్ళాం అందంగా కావాలనుకుంటారు కానీ.. పొదుపుగా ఖర్చుపెట్టే పెళ్ళాం రావాలని ఎవరూ అడగరు.. ’ మనసులో అనుకున్నాడు పేరయ్య.
"మీరు చెప్పిన లక్షణాలు ఉన్న అమ్మాయినే చూస్తాను.. నాకు ఇక సెలవు.. " అన్నాడు పేరయ్య
ఆ తర్వాత... పెళ్ళి చూపులలో నువ్వు నన్ను చూసి నవ్వడం.. నేను నిన్ను ఓకే చేసేయ్యడం.. వెంటనే పెళ్ళి అయిపోవడం.. అన్నీ వెంటనే జరిగిపోయాయి అను..
పెళ్ళైన మొదటి సంవత్సరంలో...
‘న్యూ ఇయర్ లో నేను ఒక కొత్త రిజల్యూషన్ తీసుకున్నానండి.. మీరు జరిగేలా చూడాలి.. ’ అని నువ్వు అడిగావు అను.. ఏదో నోము అనుకుని, సరే అన్నాను. తీరా నిన్ను ఏమిటని అడిగితే..
‘ప్రతి నెల నాకు బంగారం కొనాలి’ అని అడిగావు. ‘కొనకపొతే, మనకి పాపం’ అని అన్నావు.. పోనిలే, అని పెళ్ళైన మొదటి సంవత్సరం పెళ్ళాం ముచ్చట పడిందని ఓకే చేశాను..
‘బంగారం కొనడం మంచిదే కదా.. ’ అని నువ్వు అన్నావు.
రెండో సంవత్సరం... చీరలు కొనాలనేది నా రిజల్యూషన్ అని చెప్పావు. చీరలంటే, ఏ పండక్కో ఒకట కొంటావనుకుంటే, కాదని.. అలా కొంటూనే వున్నావు.. ఈ ఆన్లైన్ ఆర్డర్స్ పుణ్యమా అని.. వాడు అలా చీరలు తెస్తూనే వున్నాడు.. నువ్వు మళ్ళీ అలా ఆర్డర్స్ పెడుతూనే ఉన్నావు...
‘బయటకు వెళ్లి చీరలు కొనాలంటే, టైం లేదండి.. అందుకే ఈ ఆన్లైన్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాను.. ’ అని నువ్వు అన్నావు. ఆ సంవత్సరం లో.. కొన్న చీరలు ఉంచడానికి చోటు చాలక.. ఎన్నో కొత్త బీరువాలు కొనాల్సి వచ్చింది.. మళ్ళీ అదో ఖర్చు. పోనీ.. ఆ చీరలు ఎక్కువ కడతావా అంటే, ఎప్పుడు ఆ నైటీ వేసేసుకోవడమే కదా! ఒకటి రెండు సార్లు చీరలు కట్టేసి.. పాతవైపోయాయని ఎవరికో ఇచ్చేయ్యడం.. చీర రేట్ కు డబుల్ రేట్ పెట్టి జాకెట్టు కుట్టించిన డబ్బులు అన్నీ దండగే! నాకు..
‘ఆడవారికి కొత్త చీరలు లేకపోతే ఎలా చెప్పండి.. ! ఇంకా నేను చాలా నయం తెలుసా.. ! మా ఫ్రెండ్స్ అయితే అన్నీ కాస్ట్లీ చీరలే కొంటారు.. ’ అని నువ్వు సమర్దించుకున్నావు..
మూడవ సంవత్సరం.. ‘న్యూ ఐటమ్స్ రిజల్యూషన్’అన్నావు.. ఆ ఇయర్ లో పాత వస్తువులన్నీ మార్చేసి.. కొత్తవి కొన్నావు. నేనేమో వేలకు వేలు పెట్టి కొన్న వస్తువులన్నీ.. ఎక్స్చేంజ్ ఆఫర్ పేరుతో ఐదు వందలకో.. వెయ్యికో ఇచ్చేయడం.. వేలకు వేలు పెట్టి మళ్ళీ కొత్తవి కొనడం.. అలా చేసి ఇల్లంతా కొత్త వస్తువులతో నింపావు. పాతవాటి కోసం, కొత్తవాటికోసం నేను పెట్టిన పర్సనల్ లోన్ ఇంకా తీరనే లేదు..
‘ఇంకా నేను చాలా నయం తెలుసా.. ! మా ఫ్రెండ్స్ అయితే అంతా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ కొంటారు.. నేను ఓన్లీ లోకల్.. ’అని నువ్వు అప్పుడు కవర్ చేసావు
ఇంక ఈ సంవత్సరం నీ రిజల్యూషన్ అయితే.. మరీ దారుణంగా ఉంది..
‘నా మాట నా భర్త ఖచ్చితంగా వినాలి.. అన్నీ చెయ్యాలి.. ’ అన్నావు. ఇదెక్కడి రిజల్యూషన్? ఎప్పుడు ఏం అడుగుతావో తెలియక, నిద్ర కుడా సరిగ్గా పట్టట్లేదు నాకు.. ”
“ఒక్క చీరలో, నగలో.. ఇలా రిజల్యూషన్ పెట్టుకుంటే, బోర్ కొడుతుందండీ.. ! ఏం చెయ్యమంటారు.. ? అందుకే ఆల్ ఇన్ వన్ గా ఒకే రిజల్యూషన్ పెట్టుకున్నాను.. ”
‘అయితే, ఈసారి ఏ బ్యాంకు కో కన్నం వెయ్యాల్సిందే.. మరి.. ’ అని నేను మనసులో అనుకున్నాను..
******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
留言