'New York Diary - Part 2/2' - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 19/06/2024
'న్యూయార్క్ డైరీ - పార్ట్ 2/2' తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
ఇక న్యూయార్క్ డైరీ - పార్ట్ 2 చదవండి.
పొద్దునే లేచి కిందకు వచ్చేసరికి ఘుమఘుమలు. అప్పటికే బుజ్జి వంట చేసి టేబుల్ పై సర్దేసింది.
“అదేంటి బుజ్జి, కూరలు తరిగిద్దాము అనుకుంటే.. ! వంట కూడ చేశావా?”
"ఏమి పర్లేదు. అక్కడ చేసి చేసి వచ్చావు. నా దగ్గర ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండి పోవే. ఓట్స్ జావ ఉంది, లేదా టిఫిన్ కావాలంటే తిను. నాకు ఆఫీస్ కి టైం అయింది. అత్తయ్యగారు నీకు కంపెనీ ఇస్తారు. అన్నట్లు ఈవెనింగ్ ఫోర్ కంతా ఇంట్లొ ఉంటా.. ! రెడీ గా వుండు. బయటకు వెళ్దాము" అంది.
బ్యాక్ యార్డ్ లో గులాబీ చెట్లు పూలు విరగపూసి ఉన్నాయి. ఒక బాస్కెట్ తీసుకెళ్ళి చెట్లను, గుండు చేశాను. జంద్యాల పాపయ్య శాస్త్రిగారు చూస్తే "చెట్లకు కొన్ని పూలు, ఉండనీ.. ! తల్లీ.. !” అనేవారు.
బుజ్జి అత్తగారు పూజ దగ్గరకి వచ్చేసరికి నేను దేవుళ్ళను పూలతో అలంకరించాను. ఆవిడ సంతోషపడి, నా అలంకారానికి, వెయ్యి ఎనిమిది వెండి మారేడు దళాలతో నా చేత శివుడికి పూజ చేయించారు. అంత చక్కగా పూజ చేయించినందుకు, ఆవిడకు ధన్యవాదాలు తెలిపాను.
ఈవెనింగ్ కసీనో కి తీసుకెళ్లారు. అక్కడ మా మరిది అందరికీ తల ఇరవై డాలర్స్ ఇచ్చారు వీడియో గేమ్స్ ఆడుకోమని. అందరూ గేమ్స్ ఆడి డబ్బులు గెల్చుకుంటే.. నాకు డబ్బులు పోయాయి. నేను, మొదట, యాభై డాలర్లు దాకా గెలిచినా, ఇంకా గెలుచుకోవచ్చని, ఆడితే.. అన్నీ పోయాయి. అపుడు నాకు ఒక పాట గుర్తుకు వచ్చింది. ‘అయ్యోయ్యో.. ! జేబులో డబ్బులు పోయనే.. !’ అనుకుంటూ, బాధ పడుతుంటే.. "ఇట్స్ ఓకే.. !" అని సర్ది చెప్పారు మా చెల్లి వాళ్ళు.
మా బుజ్జి కూతురు చిన్నారితో పేక ఆడేదాన్ని. ఎపుడో పెళ్లయిన కొత్తలో ఆడిన ఆటకి మళ్ళీ ఇపుడు పదును పెట్టాను. మేము ఆడిన పది ఆటల్లో మహా అయితే ఒకటి గెలిచేదాన్ని. బెట్ కాసే దాన్ని, కానీ ఓడి.. డాలర్లు ఇవ్వలేక, చివరికి ‘ఉత్తినే.. ఆడాములే!’ అనేదాన్ని.
పాపం చిన్నారి ‘ఇట్స్ ఓకే.. !’ అనేది.
మా అబ్బాయి కాల్ చేసినప్పుడు "ఒరే పేకాట.. పాపమ్మను.. ! అయ్యాను. ఇక హైదరాబాద్లో దిగగానే ఎయిర్పోర్ట్ ముందే.. ఒక చున్నీ పరచుకొని పేక ముక్కలతో కాయ్ రాజ కాయి అంటానేమో రా.. !?" అన్నాను.
"పెప్పర్ అలా చేయవులే.. ! నీకు అంత సీన్ లేదులే.. !” అన్నాడు. (పెప్పర్ నా ముద్దు పేరు లే).
మా చిన్నారి, నేను ఒక డీల్ కుదుర్చుకున్నాము. అది నాకు ఇంగ్లీష్ నేర్పేటట్లు.. నేను దానికి తెలుగు నేర్పేటట్లు. అది తెలుగు తిరగమరగ మాట్లాడింది. నాకు ఇంగ్లీష్ మటుకు రాలేదు. నా ఇంగ్లీష్ కి దానికి దిమ్మతిరిగి, తెలుగు వచ్చిందిలే.. అనుకున్నా?
బుజ్జి మిస్టిక్ లో వున్న ప్రదేశాలు ఒక్కోక్కటి చూపించింది. న్యూ లండను, నాకు బాగా నచ్చింది.
అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఫొటోస్ తీసుకుని అపుడు, వర్షం పడుతుంటే.. ఐస్క్రీమ్ తిన్నాం. మీ మొహాలు మండ.. ! వర్షంలో ఐస్క్రీమ్ తినటం, వర్షం పడుతుంటే, గొడుగేసుకుని చెట్లకి, నీళ్ళు పొస్తున్నట్లు ఉందంటారా? ఏమో బాబు.. తినాలనిపించింది, తిన్నాము.
మా చెల్లి, మా మరిది, స్టాచు ఆఫ్ లిబర్టీ, వైట్ హౌస్, చూపించారు. చాలా బావుంది, ఆరోజు వర్షం పడుతుంది. గొడుగులు వేసుకుని, వెళ్లాం. బోస్టన్ లో డక్ టూర్ అని చూపించారు. డక్ లాగా వుండే బస్ ఎక్కాము, అది నీళ్ళలో, డ్రైవ్ చేస్తుంది, రోడ్డుపైన డ్రైవ్ చేస్తోంది. కాసేపు డ్రైవరు సీట్లో కూర్చుని స్టీరింగ్ తిప్పాను. నాకు బోస్టన్ అనగానే, బోస్టన్ టీ పార్టీ, గుర్తుకు, వస్తుంది. అది చూసాను.
ఆతర్వాత, పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్లాం. నిజంగా, తిరుపతి, వెంకటేశ్వర, స్వామిని చూసినట్లే, వుంది. ఆయనకు నమో నమః అంటూ కళ్ళు మూసుకున్నాను.
ఒకరోజు మా చెల్లి, బీచ్ కి తీసుకెళ్ళింది. 'అక్కడ ఆ ఏండకే.. ఆడవాళ్ళు బికినీలు వేసుకుని ఉన్నారు. మన బెజవాడ సమ్మర్ ఎండలకి వీళ్లు ఏమి చేస్తారో?' అని వూహించా.
డాలర్ షాపుకి తీసుకెళ్ళింది ఒక రోజు. ఇక్కడ చైనా బజారులో మాదిరిగా ప్లాస్టిక్ సామాను చూసి నా కళ్లు తృప్తి చెందాయి. ఒక డాలరుకు, వస్తువులు చూసి ఏవి తీసుకోవాలి, అనుకుంటే.. ! మా చెల్లి అవన్నీ, కొనేసింది.
మా వారు అనేవారు ‘మునిసిపాలిటి చెత్త బండి చెత్త చూడగానే ఆగినట్లు, ఎక్కడ ప్లాస్టిక్ సామాన్లు కనపడితే అక్కడ ఆగిపోతావుగా.. !’
అదే గుర్తుకు వచ్చి నాకు కావాల్సినవి కొనుకున్నా, అడ్డూ.. ఆపు లేక. వస్తూ సబ్వేలో పీజా ఆర్డర్ చేసింది. దాన్ని కారులోనే తిని ఇంటికి వచ్చాము.
వచ్చే వారం వెళ్తాననుకుంటే, ఏదో బాధ మనసులో. బుజ్జి కళ్ళల్లో సేమ్ ఫీలింగ్. అయినా కొన్నాళ్ళు హ్యాపీగా గడిపి, వచ్చిందుకు చాలా ఆనందం. నాకు అన్నీ తిప్పి చూపించిన, రమణ గారికి, మనస్ఫూర్తిగా, థాంక్స్ చెప్పాను.
నెక్స్ట్ వీకెండ్ మా సంతు వచ్చి నన్ను క్లిఫ్టన్ పార్క్ కి తీసుకొచ్చింది. "అమ్మా.. ! నిన్ను మిస్సింగు.. ! మళ్ళీ వెళ్లిపోతావుగా.. ఇండియా" అని.. !
రోడ్లు మీద ట్రాఫిక్ రూల్సు మటుకు, చక్కగా పాటిస్తారు. అదొక్కటే, ఇక్కడ నచ్చింది. అల్లం తెచ్చుకోవాలన్నా కారు వేసుకుని తెచ్చుకోటం చాలా చిరాకు అనిపించింది. మా అమ్మాయి ఇంటి ముందు రోడ్ దాటితే, ఇండియన్ స్టోర్ వుంది.
ఇది ఆఫీసు కెళితే తెద్దామంటే, మా పిల్ల ‘సాహసాలు, చేయకు ఇక్కడ రోడ్లమీద’ అని ప్రతి రోజూ వొట్టు వేసి వెళ్లేది. గట్టున పెడదామన్నా.. ఇపుడు నాకు ఏలినాటి శని నడుస్తుంది. ‘మీరు చాలా జాగ్రత్తగా వుండా’లంటే.. కాలు కట్టేసుకున్నాను. అసలే హారన్ వెయ్యరు? కారు నడిపే వారు. ఎందుకొచ్చిన
గోలనీ.. ఇంకా బాధ్యతలు వున్నాయని, ఒట్టు తీసి గట్టున పెట్టలేదు.
అక్కడ లేక్స్ చాలా బావున్నాయి. మా అమ్మాయి, దగ్గర్లో వున్న అన్ని లేక్స్ తిప్పింది. రౌండ్ లేక్ అని తీసుకెళ్ళింది. అది ఎక్కడ స్టార్ అయింది, వెతుకుతూ దాని. చుట్టూతా తిరుగుతూనే ఉన్నాము. అపుడు అన్నాను, ఇక్కడ మధ్యలో గుడి వుంటే మనము చేసిన ఈ ప్రదక్షణంకి, పుణ్యం అన్నా వచ్చేది. అందరూ, రౌండ్గా తిరగబట్టే.. ఈ లేక్ కు రౌండ్ లేక్ అని వచ్చిందే.. అన్న మాటకు మా అమ్మాయి నవ్వింది.
ఆ లేక్స్ లో వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి.
మేము మా వూరిలో చిన్నప్పుడు, వాగుకు వెళ్ళి బట్టలు వుతుక్కొని వచ్చేవాళ్ళము. అదే ఈ లేక్ ఇండియాలో ఉంటే, నేను మటుకు వూరుకునే దాన్ని కాదు. ఎందుకంటే, మా వూళ్ళో చెరువు నుండి నీళ్లు తెచ్చిన దాన్ని కాబట్టి.
ఇంకా లేక్ జార్జ్ కూడా చూసాం. అది ఎండాకాలం, నీళ్ళు వుంటాయి. చలి కాలం, గడ్డ కట్టుకుని వుంటుంది టా.
అపుడు దానిపై, స్కేటింగ్ చేస్తారుటా. నేను మాటల స్పీడ్ లో లేకి జార్జ్ అంటే, మా అమ్మాయి సరి చేసింది నా ఇంగ్లీషును.
తర్వాత, నయాగరా ఫాల్స్ కు మా అమ్మాయి తీసుకెళ్ళింది. నిజంగా చూడదగిన, ప్రదేశం. ఆ బోటు లో, ఫాల్స్ మధ్యలోకి వెళితే, ఏదో గొప్ప అనుభూతి.
అక్కడ పావురాళ్లు ఎన్ని ఉన్నాయో! నేను తిన్న పాప్ కార్న్ వేస్తే, అవి చక్కగా తిన్నాయి. "ఇక్కడ అలా.. ! వేయకు, మిగిలిన పాప్కార్న్ డస్ట్బిన్లో వేయాలి, అమ్మా.. !"అంది మా అమ్మాయి. పావురాలు, తినబట్టి బతికాను, లేకుంటే.. ఇంగ్లీషులో, పరిసరాల పరిశుభ్రత గూర్చి, క్లాస్ వినాల్సి వచ్చేది
నేను ఇదివరకు, టీచరుగా పని చేసా. నేను ఎవరికైనా? ఎపుడైనా! క్లాసులు, తీస్తా, కానీ నాకు ఎవరన్నా.. ? క్లాస్ తీస్తే, కాలుతుంది.
చకచక ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి. పచ్చని, సీనరీస్ చూసి, చూసి, నా కళ్ళు, పచ్చబడతాయేమో! అనుకున్నా. డైరీలో రాసుకున్న ఆ అనుభవాల్ని మీతో పంచుకున్నాను, న్యూయార్క్ డైరీ రూపంలో.
=======================================================================
సమాప్తం
=======================================================================
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
@user-ud1vg2qu7b
• 4 hours ago
బావుందక్కా, చాలా బాగా చెప్పారు