#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #NijalaNippuKanikalu, #నిజాలనిప్పుకణికలు
Nijala Nippu Kanikalu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 16/01/2025
నిజాల నిప్పు కణికలు - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
కాకూడదు! మదిలోన
కన్నవారే బరువు
అవసాన దశలోన
ఆదరిస్తే పరువు
విజ్ఞానం పంచే
గురువే కల్పతరువు
మంచిని బోధించే
భగవంతుడే గురువు
జీవితాలు సరిచేసి
చూపును బ్రతుకు తెరువు
విజ్ఞాన గని గురువు
మెదడుకు వేయు ఎరువు
విలువైన పుస్తకాలు
విజ్ఞానానికి నెలవు
అనుదినము పఠిస్తే
మేలులెన్నో కలవు
కష్టపడక పోతే
విజయాలే దొరకవు
అపజయాల పరంపర
జీవితాన తప్పవు
పగటి కలలు కంటే
ఆశలు నెరవేరవు
బద్ధకం వశమైతే
మనోవాంఛలు తీరవు
-గద్వాల సోమన్న
నిజాల నిప్పు కణికలు: సోమన్న
చాలా బాగుంది .. వారు వ్రాసే ప్రతి కవిత లా .. బహు ఉపయోగం సమాజానికి
పి. వి. పద్మావతి మధు నివ్రితి
గద్వాల సోమన్న గారు రాసిన "నిజాల నిప్పు కణికలు" అనే కవితలో జీవితంలో విజ్ఞానం, శ్రమ, గురువుల ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించడమైనది. ఈ కవితలో, గురువులు, జీవిత పాఠాలు నేర్పించే వారికి సమానంగా, వారు జ్ఞానాన్ని పెంచే శక్తిగా అవతరించి, విద్యార్థుల జీవితాలను సరిచేసి దిశ చూపుతారు. పుస్తకాలు, విద్య అంటే మనకు ఉన్న గొప్ప సంపదగా పరిగణించబడతాయి. ప్రతి రోజు చదవడం, కష్టపడటం మన విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీవితం లో ఉన్న గురువు – ఒక పెద్ద ఉపాధ్యాయుడే కాక, ప్రతి మనిషి స్వంతంగా నేర్చుకునే విషయాలను చెప్పే జ్ఞానం, జీవితంతో సంబంధం ఉన్నది.