top of page
Writer's pictureA . Annapurna

నో కామెంట్ ప్లీజ్!



'No Comment Please' - New Telugu Article Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 29/06/2024  

'నో కామెంట్ ప్లీజ్!' తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


ఈ మధ్య పార్టీల జోరు పెరిగింది. ఏమి తోచకపోతే పార్టీ. ఎవరింటికి వెళ్ళక్కరలేకుండా పార్టీ. పిల్లల పుట్టినరోజుల పార్టీ. అమ్మాయి అమెరికా వెడుతున్నదని పార్టీ. అబ్బాయి పదేళ్లకు ఇంటికి వచ్చాడని పార్టీ. 


అమెరికాలో బిడ్డని కనబోతున్నారని ఇండియాలో పార్టీ. ఇలా అర్ధం పర్ధం లేకుండా డబ్బు ఖర్చు చేసే పార్టీలు విసుగు వస్తున్నాయి. మొహమాటానికి దగ్గిరవాళ్ళు అయితే విసుక్కుంటూ వెడతాం. 


వాళ్ళ కర్చుగురించి మనకెందుకుగాని మన ఖర్చు వృధా. ఎంత అంటే ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న చోటుకి క్యాబ్ ఖర్చు, ట్రాఫిక్ ఇబ్బంది. ఇక గిఫ్ట్ ఏమి ఇవ్వాలి.. అయిదువందలు అంటే వందతో సమానం. ఏదో ఒక వస్తువులు అంటే వాళ్ళు అమెరికా తీసుకువెళ్లరు. వెండి బంగారం కొనలేము. కనుక డుమ్మా కొట్టేయడం బెస్టు. మహా ఐతే మళ్ళీ పిలవరు. అది మరీ బెస్టు. 


 మా దగ్గిర బంధువులు వైజాగ్ నుంచి హైదరాబాదు వచ్చి కూతురి పెళ్లి చేశారు. పెళ్లికొడుకుది హైదరాబాదు. ఏమిటో అర్ధంలేని హడావిడి. పెళ్లి తెల్లవారుజామున త్రీ కి. అందుకే పెళ్లికూతురును అక్కడే చేశారు. వచ్చిన వారికి అప్పుడు గిఫ్ట్. ఎదురుసన్నాహం చేసినపుడు గిఫ్ట్. భోజనాలు చేసి వచ్చాక ఒక గిఫ్ట్. 


మధ్యలోనే మ్యూజిక్ కాన్సర్ట్. ఆటలు పాటలు పెళ్లి ఐపోయాక వచ్చేస్తుంటే గిఫ్ట్. అందులో దగ్గిరవాళ్ళకి ఒకరకం, మధ్యరకానికి ఫ్రెండ్స్కి ఒకరకం. స్టేటస్ను బట్టి హెచ్చుతగ్గులు. ఏమిటో అర్ధంకాక పిచ్చిమొహాలు వేసాం. ఇంటికొచ్చి మరునాడు పనిమనిషికి ఆ గిఫ్టులు ఇస్తే ''నేను ఏమి చేసుకోను ?నాకొద్దమ్మా.. !” అంది. 


అసలే మామెయిడ్ రోజుల్లో స్టైల్లో ఉంటుంది. నేను ఇచ్చిన ఖరీదైన డ్రెస్సులు తీసుకోదు. దానికి నచ్చవు. 

"నీకు ఫ్యాషన్ తెలీదు. ఈసారి నీతో షాపింగ్కి వచ్చి సెలక్ట్ చేస్తాను ''అంటుంది. 


మరి ఆ ఇచ్చేవాళ్ళు మనీ ఎందుకు వృధా చేస్తారు? అనుకున్నాను. అదొక షో.. అంతే!


 అదలా ఉంచితే మావారి బంధువు ఒకరోజు ఫోను చేశారు. 

''మా నాన్నగారి వంద ఏళ్ళ పుట్టినరోజుకి పార్టీ ఇస్తున్న. నువ్వు వదిన తప్పకుండా రావాలి !’ అని. 


 నాకు చాలా ముచ్చటవేసింది. 


“తల్లి తండ్రి అంటె ఎంత గౌరవం.. దగ్గిర వుంచుకోడమేకాదు, పుట్టినరోజు పార్టీ ఇవ్వడం, అందరిని పిలవడం గ్రేట్! అన్నాను” అతడిని మెచ్చుకుంటూ. 


 ''తర్వాత విచారిస్తావ్, అనవసరంగా పొగడకు..” అన్నారు మావారు. 


''నేను అన్నది తప్పు ఏముంది? ఆయన తండ్రి పట్ల బాధ్యతగా వున్నారు అంటె మెచ్చుకోవాలి కదా!” అన్నాను. 


 ''ఇప్పుడు పుట్టినరోజు చేసుకుంటూన్నది మాపెద నాన్న వరుస. ఆయన జీవించి లేడు''


 ''ఏమిటీ.. చనిపోయిన వారికి పుట్టినరోజు చేయడమా..” ఆశ్చర్యంగా అన్నాను. 


 ''అంతేకాదు డియర్. మా పెదనాన్న పదిహేనేళ్ళు వోల్డేజ్ హోములో నరక యాతన పడితే ఒకరోజు చూడటానికి వెళ్ళలేదు. చనిపోయాక హోమ్ వారినే కార్యక్రమాలు జరిపించేయమని డబ్బు పంపించాడు.


ఈ ఆదర్శ కుమార రత్నం, ఇప్పుడు వందేళ్ల పుట్టినరోజు అంటూ ఫోటో పెట్టి పార్టీ అంటున్నాడు''అని మావారు చెబితే నాకు నోటమాట రాలేదు. 


 ఇంకో బంధువు నాకు మెస్సేజ్ పెట్టేడు అమెరికానుంచి. 

 అమెరికాలోవున్న ఇద్దరు కొడుకులు వున్నా, మా అత్త, భర్త చనిపోతే ఒంటరిగా ఉండేది. డబ్బుకి లోటు లేదు ఆవిడకు. కానీ ఒంటరితనంతో బాధ పడేది. ఆవిడ వయసు అరవై మాత్రమే. అనారోగ్యం లేదు. 


ఎందరో బంధువులు, పరిచయస్తులూ వున్నా రోజూ ఎవరూ వచ్చి పలకరించలేరు. వారి ఇబ్బందులు వారికి ఉంటాయి. ఫోనులో మాటాడితే ఏమవుతుంది? అందరికి అన్ని చెప్పుకోలేరు. అమెరికాలో డాక్టరుగా కోట్లు సంపాదించిన కొడుకులు తల్లిని దగ్గిర వుంచుకోలేదు. ఆనాధలు చేసి వదిలేశారు. 


ఆవిడ చదువుకున్నారు. వుద్యోగంచేశారు ఇంగిలీషు వచ్చును. అమెరికాలో వుంచుకోడానికి ఎలాంటి సమస్యా లేదు. అయినా పట్టించుకోలేదు. ఆవిడ కేవలం దిగులుతో చనిపోతే సర్వీస్ సెంటర్ వారినే ఎలట్రిక్ క్రిమేషన్ చేయమని డబ్బు పంపించారు. ఇది జరిగి ఇరవై అయిదేళ్ళు అయిన సందర్భంగా ముఖ్యమైన బంధువులకు ఆన్లైన్ భోజనం ఆర్దర్చేసి పంపించేసి తల్లి ఋణం తీర్చేసుకున్నారు. 


తల్లిని పట్టించుకోని వాళ్ళు ఇప్పుడుమాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటె ఇండియాలో ఆస్తులు అమ్ముకుని చివరిగా వచ్చి వెళ్ళిపోతూ చేసిన ఘనకార్యం ఇది. 


 ఇప్పటి తరం ఆలోచనలు ఇలా వున్నాయి. కన్నతల్లి మీద ప్రేమ -, ఇప్పుడు తినే ఫుడ్డు, వాతావరణం రక్త సంబంధాన్ని సైతము కలుషితం చేస్తున్నాయి అనుకోవడం కంటే ఏమి చేయగలం?

 

నో కామెంట్..

********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)





 



24 views0 comments

Comments


bottom of page