top of page
Writer's picturePitta Govinda Rao

నథింగ్ ఈజ్ పర్మనెంట్



'Nothing Is Permanent' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 19/06/2024

'నథింగ్ ఈజ్ పర్మనెంట్' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


అఖిల్ ఇంట్లో నుండి వెలివేయబడ్డాడు. అతడితో పాటు అతడిపై ప్రేమ, నమ్మకం కలిగిన అఖిల్ భార్య ఝాన్సీ, ఇద్దరు చిన్న పిల్లలు, అఖిల్ తమ్ముడు సూర్య, మరదలు లలిత, వారి పిల్లలు, మరియు అఖిల్ నాయినమ్మ సురేఖ కూడా ఉన్నారు. వాళ్ళలో కొందరు చేతిలో లగేజీ బ్యాగులు ఉన్నాయి. ముందు అఖిల్ నడుస్తున్నాడు. తర్వాత అతని భార్య, తర్వాత సూర్య, అలా అలా వరుస కట్టి దీనంగా అఖిల్ ని అనుసరించి వెళ్తున్నారు. వాళ్ళ కంటే ముందు ఏ ఇంటి నుండైతే అఖిల్ వెలివేయబడ్డాడో.. ఆ ఇంటి వాచ్ మెన్ నడుస్తున్నాడు. అతడు చొప్పదండుతో నిర్మించిన విశాలమైన పూరిపాక వద్దకు వారిని తీసుకెళ్ళి 


"సార్.. నేను చెప్పిన ఇల్లు ఇదే సార్. కొంచెం కష్టంగా ఉన్నా.. ఈ మాట చెప్పక తప్పటం లేదు సార్”. 


"అవేం మాటలు అన్నా.. ! నాకోసం, నన్ను నమ్మిన వీళ్ళకోసం ఏ ఇంట్లో అయినా ఉంటాను. ఈరోజు నాది కాదు, నాదంటు ఒకరోజు వస్తుంది. ఆ రోజు నన్ను గెంటేసే వాళ్ళే మళ్ళీ పిలుస్తారు. అప్పటి వరకు ఎన్ని అవమానాలైనా భరిస్తా. కష్టసమయంలో నాకు ఆశ్రయం కల్పించినందుకు నీకు శతకోటి వందనాలు" అన్నాడు అఖిల్.


"ఊరుకొండి సార్ అవేం మాటలు.. ? కోటీశ్వరుల కుటుంబంలో పుట్టి ఒక పేదవాడిగా మీ ఇంటి వాచ్ మెన్ గా నన్ను అన్నా అని పిలుస్తూ, జగమంత మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా చూసిన మీకు ఈ మాత్రం చేయకపోతే నాకు, నా బతుకునకు ఒక అర్థం ఉండదు కదా సార్.. ? మీరు పడ్డారు కానీ.. ! పైకి లేవటం పక్కా.. ఈ జగములో ఏదీ శాశ్వతం కాదు సార్.. మీరు సాధించే గెలుపు కోసం వెయ్యి కళ్ళతో మీరు లేని ఆ ఇంట్లో గేటు వద్ద ఎదురు చూస్తుంటా సార్ "


"థాంక్యూ అన్నా. ఆ విషయం నాకు కూడా తెలుసు. నేను మళ్ళీ పైకి లేస్తా.. . నీరు పాతళం నుండి ఎగతన్నేలా లేస్తా" అని లోపలికి వెళ్ళిపోతాడు అఖిల్. 


ఆ రాత్రి వాచ్ మెన్ తెచ్చిన భోజనంతో అందరు సరిపెట్టుకున్నారు. 


ఇక పగలు డబ్బులు సంపాదించడం కోసం ఆలోచనలో పడ్డాడు అఖిల్. అఖిల్ చాలా నిరాశలో ఉన్నాడు. 


ఆ రోజు గురువారం కావటంతో ఝాన్సీ, లలిత గుడికి వెళ్ళారు. గుడిలో ఇద్దరు కూడా దేవునితో 

" స్వామి.. ఈ భూమి మీద శాశ్వతం అంటు ఏదైనా ఉందంటే అది మీ అండదండాలే. ఇక ఏది శాశ్వతం కాదు. ఇన్నాళ్లూ నా భర్త నన్ను ఎంతో ఆనందంగా చూసుకున్నారు. ఇప్పుడు వారు కష్టాల్లో ఉన్నారు. వారికి నేను ఈ కష్ట సమయంలో అండగా ఉండాలి. తొలిసారి కుటుంబం కోసం డబ్బులు సంపాదించాల్సి వచ్చింది. ఏ కష్టాన్నైనా భరిస్తా కానీ ఏదైనా పని ఉంటే ఇప్పించండి "అని 


వాళ్ళు అలా దేవుణ్ణి ప్రార్ధించారో లేదో.. . పక్కనే ఒక భూస్వామి ఫోన్ సంభాషణ విన్నారు. 

" ఏంటీ.. . ఇప్పటికిప్పుడు వంట వాళ్ళు రారన్నారా.. ? అసలు వాళ్ళు రానని చెప్పింది. నా గూర్చి తెలిసేనా.. . ? వాళ్ళు రాకపోతే నాకు భయం ఏమీ కాదు కానీ.. ! ఇప్పటికిప్పుడు అంతమంది బంధువులకు భోజనం వండాలంటే కొత్తవాళ్ళని వెతికి తీసుకురావటమే కష్టం. అది నా బాధ. మొత్తానికి నా బంధువులు అందరూ భోజనాలకు వస్తే.. వండేవాళ్ళు లేకపోతే నా పరువు పోయేటట్లుంది" ఫోన్ కట్ చేసి తల పట్టుకున్నాడు. 


అది విన్న తర్వాత ఝాన్సీ, లలిత అతని వద్దకు వెళ్ళి

" ఆ వంట పనేదో మేం చేస్తాం అయ్యా.. ఈ ఒక్కసారికి మమ్మల్ని పెట్టుకుని చూడండి. ఎంతమందికైనా రుచికరమైన భోజనం వండి వడ్డించే బాధ్యత మేం తీసుకుంటాం. కష్టాల్లో ఉన్నాం. కాస్త పని కల్పిస్తే ఇవతల మాకు, అవతల మీకు ప్రయోజనం చేకూరుతుంది అయ్యా " వేడుకున్నారు. 


వాళ్ళ మాటలకు కరిగిన అతడు సరేనని ఒప్పుకున్నారు. దీంతో భూస్వామి ఇంటికి వెళ్ళి రావల్సిన బంధువులకు మంచిగా భోజనం వండారు. వడ్డించినపుడు కొన్ని చీవాట్లు, తిట్లు బంధువుల నుండి తప్పలేదు. ఒకప్పుడు తమ ఇంట్లో పనిమనుషులను సైతం ప్రేమగా చూసుకున్న మేము ఇప్పుడు ఇలా అవమానపడటం బహుశా దేవుడికి సంతోషమేమో.. అయినా దేవుడి పై తమకు కోపం లేదు ఎందుకంటే పని కల్పించినందుకు. 


 సాయంత్రం అయింది. యజమాని వచ్చి డబ్బులు ఇస్తూ.. 

"ఇవి మీరు పని చేసినందుకు, ఇవి మీరు బాగా వండిపెట్టినందుకు, ఇవి మీ వలన నాకు నా బంధువులు మెచ్చుకున్నందుకు" అంటూ దాదాపు ఇద్దరికీ కలిపి ఆరువేల రూపాయలు ఇచ్చాడు. 


డబ్బులు చేతికందగానే.. ఇద్దరు అతనికి ధన్యవాదాలు చెప్పి పరుగందుకోగా.. 

"కష్టాల్లో ఉన్నామన్నారు కదా.. మా ఇంట్లో వంటపనికి వస్తారా..” అడిగాడు. 


" రేపటి నుండి తప్పకుండా వస్తామ" ని చెప్పి వెళ్ళారు. 


అతను ఇచ్చిన డబ్బులు, పని దొరికినందుకు వాళ్ళు ఎంతో సంబరపడిపోయారు. అలా దాదాపు నాలుగు నెలలు పాటు ఆడవాళ్ల సంపాదన మీద ఆదారపడ్డాడు అఖిల్. 


" నా కూతురిని మహరాణిలా చూసుకుంటావనుకుంటే.. ఆమె సంపాదన పై బతుకుతున్నావా.. . ?” అని అత్తవారి నుండి కూడా చీవాట్లు తప్పలేదు. ఆ అవమానం పడలేక చివరికి చిన్న కంపెనీలో వాచ్ మెన్ గా చేరి కుటుంబాన్ని పోషించాడు అఖిల్. పనిలో కూడా ఉద్యోగుల నుండి రకరకాల మాటలు పడాల్సి వచ్చింది. అన్ని భరిస్తూ రెండున్నర ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. 


ఒకరోజు అతడి ఫోన్ కి స్నేహితుడి నుండి ఈ విధంగా మెసేజ్ వచ్చింది. 

" హాయ్.. గతంలో నువ్వు వసుధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో కొన్న షేర్స్ ఇప్పుడు సడన్ గా పెరిగాయి” అని 


ఆ మెసేజ్ చూసి అఖిల్ ఎగిరి గెంతేశాడు. ఒకప్పుడు ఆ షేర్స్ కొనటం వలనే ఇంటి నుండి వెలివేయబడ్డాడు. 


 ఇంతలోనే అఖిల్ ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే బాబాయ్ వరప్రసాద్. 

కట్ చేశాడు. 

కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఫోన్ చేయలేదు కానీ.. ! డబ్బు వచ్చింది అని తెలియగానే ఫోన్ చేశారు. గతంలో అదే డబ్బు కోసం తనను గెంటేశారు..

 గతం తలుచుకున్నాడు. 


అఖిల్, సూర్యల తండ్రి రాం ప్రసాద్ కు రెండు పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాటిని తమ్ముడు వర ప్రసాద్ ఓకటి తానొకటి నడుపుతున్నాడు. అయితే.. వీళ్ళంతా ఒకే ఇంట్లో బంగ్లా లాంటి పెద్ద విశాలమైన ఇంట్లో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. డబ్బు అధికంగా ఉన్న ఇంట్లో మనస్పర్థలు కామన్ కదా..  అందరి కంటే పెద్దవాడు‌, మరియు తెలివైన వాడు అఖిల్. రెండు కంపెనీలను పలు కంపెనీలలో పెట్టబడులు పెట్టె బలోపేతం చేయటమే అఖిల్ ఉద్దేశ్యం. చాలాకాలంగా అఖిల్ వలన తమ కంపెనీలు లాభాలు అర్జిస్తు రావటంతో అందరు అఖిల్ ని మెచ్చుకోవటం బాబాయ్, బాబాయ్ కొడుకులకు రుచించక అఖిల్ ని వదిలించుకునే అవకాశం కోసం వేచి చూడసాగారు. 


 అఖిల్ నిజాయితీపరుడు, మంచోడు. ఇంట్లో పనివాళ్ళని సైతం ఎంతో గౌరవిస్తూ.. వాళ్ళతో సామాన్యుడిలా కలిసిపోయేవాడు. తమ కంపెనీలు మరింత ముందడుగు వేయాలని వసుధ గ్రూఫ్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో షేర్స్ కొన్నాడు. వాటి కారణంగా తమ సొంత కంపెనీలు కాస్త నష్టాలకు గురవ్వల్సి వచ్చింది. అదే అదనుగా బాబాయ్ రాం ప్రసాద్ ని నమ్మించి ఆ షేర్స్ వలనే నష్టాలని ఆ నష్టాలు భర్తి చేయటానికి అఖిల్ తనకు రావల్సిన ఆస్తి వాటాను వదులుకోవాలని అలా తండ్రి రాం ప్రసాద్ గారితో బాబాయ్ వర ప్రసాద్ నమ్మించి ఇంటి నుండి గెంటివేయించగా తండ్రి మాటలకు శిరసువహించి బయటకు వచ్చాడు. 


దీన్ని వ్యతిరేకించిన అఖిల్ తమ్ముడు, నాయినమ్మలను కూడా

"నా మాటలకు అడ్డు చెప్పినవారు ఎవరైనా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు" అన్నాడు. 


అలా అఖిల్ గతాన్ని తలుచుకోగా.. భవిష్యత్ అతడిని మరలా.. గతం వైపు తిరిగి చూడనివ్వటంలేదు. తన అకౌంట్లో ఇప్పుడు అరవైవేల కోట్లకు పైగా డబ్బు ఉంది. ఆలస్యం చేయకుండా ఇల్లు మార్చేశాడు. No thing is permanent అంటూ భూస్వామి ఇంట్లో పని చేస్తున్న ఝాన్సీ దగ్గరకు ఖరీదైన కారులో వెళ్ళి ఝాన్సీని ఎత్తి గిరగిర తిప్పాడు. ఇన్నాళ్లు తన కోసం కష్టపడిన భార్య, మరదలను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తనకు కష్ట సమయంలో ఆశ్రమం కల్పించిన వాచ్ మెన్ కి తన సొంత కంపెనీలో మంచి ఉద్యోగం కల్పించాడు. 


తాను మరలా యథాతథంగా ఉండటానికి తనతో నమ్మకంతో వచ్చిన వారందరినీ చూసుకోవటానికి తన భార్య ఝాన్సీ కారణం. ఆమెకు అఖిల్ కంటే బాగా తెలుసు. ఏది కూడా శాశ్వతం కాదని ఓపికగా మనం పని చెసుకుపోతే చాలని. డబ్బు కోసం బంధాలను వదులుకున్న వాళ్ళు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. వారి వద్దకు వెళ్ళాలా వద్దా అనేది ప్రస్తుతం అఖిల్ చేతుల్లో ఉంది. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం





34 views0 comments

Comments


bottom of page