top of page

ఓ ప్రాణ సఖీ

Updated: Feb 22

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #OPranaSakhee, #ఓప్రాణసఖీ, #TeluguKathalu, #తెలుగుకథలు, #TeluguCrimeStory


O Prana Sakhee - New Telugu Poem Written By - Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 14/02/2025

ఓ ప్రాణ సఖీ - తెలుగు కవిత

రచన: వీరేశ్వర రావు మూల


కాల సంకీర్ణ చరణ  మంజీరాలు రవళించే వేళ 

చుక్కలన్నీ చందమామ తో బృందగానం చేసేవేళ !

ఫేస్ బుక్,వాట్సాప్ వదిలి ప్రబంధాల్ని ఆశ్రయించాను ప్రణయాన్ని వ్యక్త పరచడానికి !

జ్ఞాపకం గొప్పది కదా అదే కదా 

నా జీవితానికి 

వ్యాపకం !


చెరువు లో ఎర్ర కలువ ల పుప్పొడి తో ఆటలూ 

నీవు నేను ...

నీ గులాబి బుగ్గల పై నీటి బిందువులు వెల కట్ట లేని ముత్యాలై .. 

ఇంకా కళ్ళ ముందే ఉంది !

కాదు కళ్ళ ల్లోనే కాపురం పెట్టింది జ్ఞాపకం !

ఆ రోజు అట్ల తద్ది కి 

ఎర్ర జాకెట్టు నీలం పట్టు లంగా తో వచ్చి 

ఉయలలూగి, ఊయల పట్టు తప్పి నా ఒడి లో 

పడిన జ్ఞాపకం పదిలమే !

నువ్వు నేను 

గన్నేరు పూలు ఏరుకుంటూ 

నెమలి కన్నులు తెలుగు వాచకాల లో 

దాచుకుంటూ 

దొంగ చాటు గా దోర జామ పళ్ళను కోసు కుంటూ !

ఆకు పచ్చని చేలల్లో ఎర్ర తువ్వాయిల్ని తరుముతూ ..

ఘడియల్ని,రోజుల్నీ,ఋతువుల్నీ అలా 

కాలం కాన్వాసు పై ఇంద్ర ధనుస్సు లా 

దొర్లిస్తే ..

ఆ రోజు జరిగింది ! అనుకోనిది !

ఇప్పటికీ నా డైరీ లో ఖాళి పేజి 

ఫిబ్రవరి 14 

ప్రేమికుల రోజు నాకు మాత్రం బంధాన్ని ఆవిరి చేసి 

జ్ఞాపాకాల గంధాన్ని మిగిల్చింది ! 

మీ నాన్న గారికి ట్రాన్సఫరయి నీ వెటో వెళ్ళి పోయావు !

నీ నుండి సమాచారం లేదు. మిగిలింది విచారమే !

ఈ విశాల ప్రపంచం లో నీ వెక్కడా ? 

ఏ సందేశం పంపాలి ? 

హంస తోనా ? పావురం తోనా ? 

మేఘ సందేశమా ? 

ఏలా ? 

అహరహం నీ విరహ వేణువు ని ఊదు కుంటు న్నా !

నా ప్రేమ నిజమైనదైతే ,బలమైనదైతే ఏదో ఒక నాటికి నువ్వు కనిపిస్తావు !

ఇప్పటికీ నాకు జ్ఞాపకం !

దీపావళి బాంబు శబ్దానికి భయపడి నన్ను వాటేసు కున్నప్పుడు నీ అధరాల చుంబనం 

ఒక అమృత సోన !

తియ్యని జ్ఞాపకం !

ఫిబ్రవరి 14 

ప్రపంచం ప్రేమ సాగరం లో మునకలు వే సే రోజు !

నా మనో వనం లో మల్లెల చితి పై విరహ జ్వాలలు రేగుతాయి !

రస జ్వలనమై రాగ హీనమవుతుంది జీవితం !

ఋతువుల రెక్కల తో కాలం ఎగిరి పోతోంది !

జ్ఞాపకాలు చిక్కనవుతున్నాయి. 

ప్రేమ పైన నమ్మకం పెరుగు తోంది ! 

ఈ లేఖ అన్ని పత్రికల్లో ప్రకటన గా ఇస్తున్నా !

ఏదో ఒక నాటికి చూసి నన్ను గుర్తు పడతావని !

వెన్నెల మెట్లు 

దిగి 

విప్రలబ్ద లా వస్తావని 

నీ కోసం 

నిరంతరం నిరీక్షణ లో గడిపే 

పండు 

అలియాస్

పవన్ కుమార్ 


 సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






Comments


bottom of page