top of page
Writer's picturePenumaka Vasantha

ఓ సీత కథ - పార్ట్ 2



 'O Sita Katha - Part 2/2' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 05/04/2024

'ఓ సీత కథ - పార్ట్ 2/2పెద్దకథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత




ఒక వారం గడిచింది. ఇక్కడ ప్రతి నిముషం రాజు గుర్తుకు వస్తున్నాడు సీతకు. పనేమీ చేసుకోకుండా రాజు ఫోటో ను గుండెల మీద పెట్టుకుని చూసుకుంటూ పడుకుంది సీత. అక్కడ రాజును గౌరీ బాగా చూస్తుందా! లేక కొడుతుందా? అనే ఆలోచనలతో గడుపుతుంది. వారం రోజులు రాజు లేకుండా ఎలా ఉన్నాను? నేను. అక్కడికి పంపి తప్పు చేసానా? నేను బతికుండే ఈ నాల్గు రోజులు నా దగ్గరే ఉంచుకోవాల్సింది.


రాజుకు ఎందుకో అమ్మ గుర్తుకు వస్తుంది. ఒకరోజు "నాన్నా! అమ్మ దగ్గరికి వెళ్దామా" అన్నాడు. 


"నాకు ఆఫీసుకు సెలవు లేద”న్నాడు రమేష్. ఎందుకో రాజుకు ఇక్కడ నచ్చటం లేదు. నాన్న ఉన్నా సరే! ఊళ్ళో ఉన్నట్లుగా లేదు. అమ్మ అన్నం కలిపి నోట్లో పెట్టటం, కధలు చెప్తూ నిద్ర పుచ్చటం. కాలువ గట్టున ఆడుకోవటం ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయి.


 రమేషు దగ్గరికి వెళ్ళి అమ్మకు ఒకసారి కాల్ చేస్తా అన్నాడు. సరేనని ఫోన్ చేసి ఇచ్చాడు. సీత ఫోన్ ఎత్తింది, "అమ్మా నేను మనూరికి వస్తాను. నన్ను తీసుకెళ్లు!" అడిగాడు.


 "లేదు నాన్న నీది ఆ వూరే, నువ్వు అక్కడే మీ నాన్న దగ్గర ఉండు!" ఫోన్ పెట్టేసింది.


 ఫోన్ పెట్టేసి ఏడుస్తూ మంచం పై కూలబడింది సీత. అపుడే ఇంట్లోకి వచ్చిన రాజయ్య సీత ఏడవటం చూసి, "ఏంటమ్మా, ఏమైందీ!" అన్నాడు.


 "నాన్నా! నేనేమీ పాపం చేసాను. నా పిల్లాడిని పెంచకోలేక వదిలేసాను.అమ్మ లేని లోటు నాకు తెలుసు. ఆ లోటు నా కొడుక్కి లేకుండా చేద్దామనుకున్నా కానీ! ఎందుకు నాన్న ఆ దేవుడు నా మీద పగ పట్టాడు. నేను పైకి మా అమ్మ దగ్గరకు వెళ్తా సరే! నా కొడుకుని చూసుకోవటానికి అమ్మ ఉండ”దని కుమిలిపోయింది సీత.


 "లేదమ్మా ఏడవకు, నీకు తగ్గిపోతే, నీ కొడుకుని నువ్వు తెచ్చుకుందువులే!" అన్నాడు. కానీ ఇంకా కొన్ని రోజులు మాత్రమే కూతురు బతుకుతుందనీ రాజయ్యకు తెలుసు. అయినా మనసును కుదుట పరచుకుని సీతకు ధైర్యం చెప్పాడు.


 కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాడు రాజు. రోజు నాన్నను అమ్మ దగ్గరికి పంపమని గొడవ చేస్తుంటే, రమేష్ కొడుతున్నాడు రాజుని. ఇక్కడ సీత పరిస్తితి అలానే ఉంది. ఫోన్ చేసి మాట్లాడుదామంటే ఇంటికి వస్తానని రాజు ఏడుస్తాడనీ ఫోన్ చేయటం లేదు సీత.


 రాజు అన్నం తినటం లేదు ఊరు వెళతానని గోల చేస్తున్నాడు. ఇక విసుగొచ్చి రామాపురం వెళ్ళే బస్ ఎక్కించాడు రమేషు రాజును. రాజు వూళ్ళో బస్ దిగటంతోనే ఇంటికి పరుగెత్తాడు. ఆరోజే సీతకు రాజును చూడాలని అనిపిస్తున్నది. ఇక్కడికొస్తే మళ్ళీ ఆ ఊరు వెళ్ళడనీ! దిగులు పడుతూ కూచుంది.


 అమ్మా! అనే పిలుపు వినిపిస్తే అది రాజు గొంతు లాగా ఉందే.. బయటకు వచ్చి చూస్తే గేట్ తీసుకుని లోపలికి వస్తున్న రాజు కనిపించాడు.


 ఓపిక లేకపోయినా రాజు అంటూ వచ్చి దగ్గరికి తీసుకుంది. "అమ్మా! నేను నీ దగ్గరే ఉంటాను. నాన్న దగ్గరికి వెళ్ళననీ!" ఏడుస్తున్నాడు. "సరే నాన్న అట్లాగే దా! ముందు అన్నం తిందువు కానీ!" అంటూ అన్నం పెట్టింది. అమ్మ దగ్గర గోరుముద్దలు, తృప్తిగా తిన్నాడు. అమ్మ పక్కన, కధలు వింటూ! పడుకున్నాడు రాజు.


 రాజయ్య వచ్చి "అమ్మ సీతా! రాజూ ఇంటికి, వచ్చాడా మీ ఆయన ఫోన్ చేసాడమ్మా రాజును పంపానని”.


"తాతా! నేను ఎక్కడో కనుక్కో!" అంటూ దుప్పటిలో నుండి అరిచాడు. "ఇదిగో ఇక్కడా!" అంటూ రాజును దుప్పటి తీసి ఎత్తుకున్నాడు. "వెధవా! వేళ్ళేదాకా తొందర, మళ్ళీ వచ్చేదాకా తొందర" రాజు చెవులు పట్టుకుని లాగుతూ అన్నాడు.


 "పదా! హాస్పిటల్ కు వెళ్దాం" అన్నాడు రాజయ్య సీతను."రేపు వెళ్దాం నాన్న మా అబ్బాయి వచ్చాడు నేను రాను. "ఆ డాక్టర్ రేపు ఉండడు పోదాం పదమ్మా!" 


"పై వారం వెళదాం నాన్న" అంది సీత. రాజూ కాసేపు అమ్మతో కబుర్లు చెప్పి ఫ్రెండ్స్ తో ఆడుకోవటానికి వెళ్ళాడు


 "అమ్మా! నేను ఇక్కడే స్కూల్ లో చేరతాను అక్కడ స్కూల్ లో ఫ్రెండ్స్ నన్ను ఎడిపిస్తున్నారు. నీ దగ్గరే ఉంటా! ప్లీజ్" అని బతిమాలాడు. ఒక నాల్గు రోజులు అట్టి పెట్టుకుని పంపోచ్చులే అనుకుని "సర్లే నాన్నా" అంది. 


ఇక ఆనందం పట్టలేక "నిజంగా నా మీద ఒట్టు" అన్నాడు.


 "నా మీద ఒట్టు" అంది సీత.


 ఆ నాల్గు రోజులు తల్లి కొడుకులు ఎంతో ఆనందంగా గడిపారు. మరుసటిరోజు నాన్నను ఇచ్చి రమేష్ దగ్గరికి పంపటానికి బాగ్ సర్దింది రాజు చూడకుండా. ఆరోజు రాత్రి రాజు కాలు తన మీదనే పెట్టుకుని రాజుకు ఇష్టమైన బుడ్డ మిరపకాయ కథ చెప్పింది సీత. అది వింటూ కిటికీలో నుండి చందమామను చూస్తూ హాయిగా పడుకున్నాడు. తెల్లగా తెల్లారినా లేవలేదు సీత.


 రాజయ్య వచ్చాడు రాజును పట్నం తీసుకెళ్ళటా నికి. రాజూ, సీత ఇద్దరూ నిద్ర లేవలేదు. సీతా లే..! లేపినా లేవలేదు సీత. అయ్యో! నా తల్లి పోయావా అమ్మా! ఇక నన్నెవరూ చూస్తారమ్మా!" ఏడుస్తూ కూర్చున్నాడు రాజయ్య.


 రాజూ లేచి చూస్తే తాత ఏడుస్తున్నాడు. "రాజూ మీ అమ్మ చనిపోయింది రా!" దగ్గరకు తీసుకుని అన్నాడు. రాజుకు అర్ధమైంది అమ్మ ఇక లేదని. అమ్మ కోసం వస్తె అమ్మ పోవటంతో ఏమి అర్ధం కాక సీత వైపు చూసి తాతను చుట్టుకుని అమ్మా! ఏడుస్తున్నాడు.


 ఊళ్ళో జనాలు అందరూ వచ్చి రాజయ్యను ఓదారుస్తున్నారు. సీత తమ్ముడు శంకర్ వచ్చాడు. "అక్కా వదిలేసి వెళ్ళావా! మమ్ములను. మా అమ్మ పోయిన దగ్గరనుండి నన్ను ఒక తల్లి లాగా చూసుకుంది మా అక్క. అపుడే పోయావా అక్కా!" అంటూ తల పట్టుకు కూర్చున్నాడు శంకర్.


 ఊరిలో జనాలు, ఆ సీతమ్మకు ఎంత ఓర్పో ఈ సీతకు అంత ఓర్పు. ఆ సీతమ్మ భూమిలోకి పోతే ఈ సీత పైకి పోయింది. జీవితంలో ఎన్నో 'ఎత్తు పల్లాలు' చూసింది. పదో ఏట నుండే తల్లి పోతే ఇంటి పని, వంట పని చేసేది. 


 మా దగ్గర వంట నేర్చుకుని అప్పటినుండి ఇప్పటి వరకు తన వంట తనే వండుకు తిన్నది. మా కెవరికి ఒంట్లో బాగా లేకపోయినా మా ఇంట్లోకి వచ్చి వంట చేసి పెట్టేది. అందరినీ! ప్రేమగా పలకరించేది. ఎవరు కష్టాలు పడుతున్నా తను పడుతున్నట్లు బాధ పడేది. అంతటి మంచి పిల్లకు ఈ జబ్బు రావటం ఏంటో! ఆ దేవుడికి న్యాయం లేదని అనుకున్నారు అందరూ కంట తడి పెడుతూ.


 రమేష్ వచ్చాడు, రాజు నాన్న దగ్గరికి పోలేదు. రమేషును చూసి అందరూ సీత జబ్బున పడితే మందిప్పించలేదు కానీ ఇపుడు చూడటానికి వచ్చాడని నిష్టూరంగా వాళ్ళలో వాళ్ళు గొనుక్కున్నారు. 


 ఈ పిచ్చిది సీత వాళ్ళాయనను ఒక్క మాట అననిచ్చేది కాదు. ఆయన్ను నేను సుఖ పెట్టలేదు కాబట్టి పెళ్లి చేసుకొని మంచి పని చేసాడని అంటుండేదని సీత గొప్ప మనసును గుర్తుకు తెచ్చుకున్నారు.


 సీత కార్యక్రమాలు అయిన తర్వాత రాజును, తనతో రమ్మని అడిగాడు రమేషు. "రాను నేనిక్కడ తాత, మామయ్య, దగ్గరుండి చదువుకుంటా”నన్నాడు రాజు.


 "అవును బావ, మా దగ్గరే ఉంటాడు. వాడు తినే ముద్ద మా దగ్గర లేకపోలేదు. వాళ్లమ్మ నన్ను పెంచింది, వాడి బాధ్యతను నేను తీసుకుంటాను. ఎపుడైనా వాడికీ ఫోన్ చేసి వాడి వివరాలు కనుక్కుంటూ ఉంటే చాలు!" అన్నాడు నిష్టూరంగా శంకర్, బావ రమేషుతో. 


 అలాగేనని వెళ్ళాడు రమేష్. రాజు తల్లి పోయిన బాధ నుండీ కోలుకుని ఇపుడు ఆ వూళ్ళోనే ఉండి చదువుకుంటాననే సంతోషంలో ఇపుడిపుడే స్కూల్ కు వెళ్తున్నాడు. 


 తర్వాత పెద్దయి వాళ్ళ అమ్మ సీత కలను నెరవేర్చాడు రాజు. పెద్ద క్యాన్సర్ డాక్టరుగా ఆ ఊరిలోనే సీత పేరు మీద హాస్పిటల్ కట్టించి కాన్సర్ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నాడు ఈ రాజు.


========================================================================

సమాప్తం

========================================================================

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.



131 views0 comments

Comentarios


bottom of page