'Oka Navve Chalu' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 01/08/2024
'ఒక నవ్వే చాలు' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఆనంద్! నిన్ను మన బాస్ పిలుస్తున్నారు.. వెళ్ళు.. !" అన్నాడు సతీష్.
'అమ్మో.. ! బాస్ ఎందుకు పిలుస్తున్నారో.. ?' అని ఆనంద్ భయపడుతూ ఉండడం చూసిన తన స్నేహితుడు సతీష్..
"ఏంటి ఆనంద్! లోపల ఏదో దెయ్యం ఉన్నట్టు అలా భయపడుతున్నావు.. ?" అన్నాడు.
తన పరిస్థితి వివరించాడు ఆనంద్..
నేను బాగా చదువుకుని.. ఎప్పుడూ కాలేజీ ఫస్ట్ వచ్చేవాడిని. కానీ, ఒక రోజు ఒక సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందంటారు.. కానీ ఒక అమ్మాయి నవ్వే.. నా జీవితానికి ఎసరు అవుతుందని అనుకోలేదు.
ఒక రోజు కాలేజీ లో ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వింది. నేను ఏదో అనుకుని.. రోజూ అమ్మాయి వెంటపడి.. ప్రేమంటే ఏమిటో కుడా తెలియని నేను.. ప్రేమ పుస్తకాలు చదివి.. లవ్ స్టొరీ సినిమాలు తెగ చూసేసి, మరీ ఆ అమ్మాయిని లవ్ చేశాను. డేరింగ్ చేసి తాళి కుడా కట్టేసాను. ఏదో ఆస్కార్ అవార్డు సాధించినంత గొప్పగా ఫీల్ అయ్యాను..
"మంచిదే కదా.. అంతా శుభమే కదా!.. " అన్నాడు సతీష్.
ఇప్పుడు అసలు కథ విను మరి..
ఏరి కోరి వెంటపడి ప్రేమించినందుకు.. తాను చెప్పిన మాటే వినాలన్నది నా భార్య. లవ్ నేనే చేసాను కాబట్టి.. వైఫ్ చెప్పినట్టు వినాలని లాజిక్ చెప్పింది.
తొక్కలో లాజిక్ అని.. కొట్టి పడేసాను. అంతే.. మర్నాడు రెండు తిట్టి.. తన వశం చేసేసుకుంది. అప్పటినుంచి, నా పేరు లోని ఆనందమే తప్ప.. జీవితంలో అసలు ఆ ఆనవాలే లేవు..
అప్పటినుంచి.. రోజూ ఇంటిపని, వంటపని.. అన్నీ నేనే చెయ్యాల్సి వస్తోంది. ఉదయాన్నే నిద్ర లేచి.. అన్ని పనులు చేసుకుని.. ఆఫీస్ కు రావాలి. దీనికి తోడు, మా ఆవిడ.. సెలవు రోజు ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి, నేను వంట బాగా చేస్తానని.. తనకి బాగా రెస్ట్ దొరుకుతున్నాదని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్స్ ని రెచ్చగొడుతోంది. వాళ్ళ మొగుళ్ళు అందరూ.. నా దగ్గరకు వచ్చి క్లాసు పీకుతున్నారు.. నీ వల్లే, మా ఇంట్లో మేమూ వంట చేయాల్సి వస్తుందని. అంతా నా ఖర్మ.. !
ఈ మధ్యే, మా ఆవిడ తమ్ముడు.. తన ఫ్యామిలీ తో సహా మా ఇంట్లో దిగాడు. వచ్చి ఇరవై రోజులైంది. రోజూ అందరికీ వంట చేసి, ఇంటిపని చేసుకుని ఆఫీస్ కు వచ్చేసరికి.. ఇంకా ఆలస్యం అయిపోతుంది. నా పెళ్ళాం ఏమో.. వాళ్ళని ఎప్పుడు వెళ్తారా? అని అడగదు.. నేనేమో అడగలేను. మా ఆవిడ.. తన తమ్ముడి పెళ్ళాం తో కలిసి టీవీ సీరియల్స్ చూడడం.. రాత్రైతే తమ్ముడిని కలుపుకుని ముగ్గురూ పేక ఆడడం.. పోనీ నన్నూ ఆటకి పిలుస్తారా.. కొంచం రిలీఫ్ వస్తుందంటే.. 'ఆయనకి ఇంట్లో చాలా పని ఉంటుంది' అంటూ.. మా ఆవిడ నా సరదాకి బ్రేక్ వేస్తుంది..”
"నీ కథ వింటుంటే, నా కంట్లో కన్నీరు ఆగట్లేదు. కష్టాలు శాశ్వతం కాదు లే ఆనంద్.. ! నీ కథ మన బాస్ కు వినిపించు. నీకు ప్రమోషన్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. ఆయనదీ వాళ్ళింట్లో నీలాంటి పరిస్థితే.. " అని 'ఆల్ ది బెస్ట్' చెప్పి లోపలికి పంపించాడు సతీష్.
************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments