top of page
Writer's pictureBulusu Ravi Sarma

ఒక నీటి చుక్క

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #OkaNeetiChukka, #ఒకనీటిచుక్క


Oka Neeti Chukka - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma

Published In manatelugukathalu.com On 16/01/2025

ఒక నీటి చుక్కతెలుగు కవిత

రచన: బులుసు రవి శర్మ


ఒక నీటి చుక్క

గింజని వటవృక్షం చేస్తుంది

ఒక నీటి చుక్క

ఆచమనీయంలో అంతర్భాగమై

పూజలో మమేకం అవుతుంది

ఒక నీటి చుక్క

కొన్ని కోట్ల చుక్కలతో కల్సి

వరదలా ముంచెత్తుతుంది

ఒక నీటి చుక్క

ఉదయపు సూర్యకాంతిలో

గడ్డి పరక చివర్న వజ్రంలా మెరుస్తుంది

ఒక నీటి చుక్క

గుండెల్లో భావాలకు ప్రతిరూపంగా

కను కొసల్లో నిలుస్తుంది

ఒక నీటి చుక్క

భిన్నరూపాల్లో

పరమాత్మ లా ప్రకాశిస్తుంది

ఒక్క నీటి చుక్కే కదా ఆని

అవహేళన చేసి వృధా చేస్తే

అవసరం అప్పుడు దొరక్క

మృగతృష్ణ ని 

అనుభవంలోకి తెస్తుంది


-రవి శర్మ



44 views1 comment

1 Comment


ఒక్క నీటి చుక్క: బి. రవి శర్మ


చాలా ఉపయోగం ఈ నవ యుగం లో.

అందరికీ శిక్షణ ఇవ్వాలి .. నీటి ని పొదుపు గా వాడాలని

పి. వి. పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page