పద్మనాభం
- Srinivasarao Jeedigunta
- Nov 12, 2022
- 2 min read
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link

'Padmanabham' New Telugu Story
Written By Jidigunta Srinivasa Rao
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఏమిటీ అలా కదలకుండా పడుకున్నారు..? టైం పది అయ్యింది, లేవండి. మరీ బద్ధకం ఎక్కువ అయ్యింది ఈ మధ్య!” అంటూ గలగలా మాట్లాడేస్తోంది కమల.
“అప్పుడే ఎందుకు లేచావు కోడిలాగా.. ఈ రోజు గ్రహణం, కదలకుండా పడుండాలి” అన్నాడు పద్మనాభం.
“అయ్యో రాత, చూడక చూడక ఒక్కసారి నిన్న భక్తి టీవీ చూసారు. ఏమి విన్నారో ఏమిటో! అందులో చెప్పింది గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకోవాలి అని.. మీరెందుకు, మనవలు వుండి..?” అంది నవ్వుతూ కమల.
“ఏడిచినట్లు వుంది వాళ్ళు చెప్పింది. గర్భిణీలకా..! ఏదీ వివరంగా చెప్పరు. యివ్వాలిసిన దానాల గురించి తప్పా.. అనవసరంగా కదలకుండా పడుకునే సరికి కాళ్ళు చేతులు బిగసుకు పోయాయి” అంటూ మెల్లగా లేచి నుంచుని, మళ్ళీ మంచం మీద పడిపోయాడు పద్మనాభం.
కమల కంగారు పడుతూ “ఏమైంది? మెల్లగా లేవండి. పెద్ద.. ఒక గంట కూడా కాలేదు గ్రహణం మొదలై.. ఈ కాస్తకేనా ఈ నాటకాలు?” అంటూ మళ్ళీ పైకి లేపి, “మీ నాన్నగారు సరైన పేరు పెట్టారు- ‘పద్మనాభం’ అని” అంది నవ్వుతూ.
“చాలు.. ఆపు నీ ఎత్తిపొడుపులు. మార్నింగ్ వాకింగ్ లో ఈ పాటికి పది కిలోమీటర్లు వెళ్ళివుండే వాడిని. అనవసరంగా టీవీ వాళ్ళు నన్ను కన్ఫ్యూస్ చేసారు” అన్నాడు పద్మనాభం ఒళ్ళు విరుచుకుంటో.
“అవును.. ‘వెళ్తే’ కానీ ఎప్పుడైనా సూర్యోదయం చూస్తేగా తమరు? రేపటినుండి అయినా నడక మొదలు పెట్టండి, లేదంటే ఆపొట్ట తో నిజంగా పడుకోవాలి. కరెక్ట్ గా సూట్ అవుతుంది గ్రహణం రోజులకి” అంది పక్కున నవ్వుతూ కమల.
“అవునోయ్! రేపటినుండి వాకింగ్ మొదలుపెట్టాలి. సాయంత్రం వెళ్ళి షూస్ కొనుక్కుంటా” అన్నాడు పద్మనాభం బ్రష్ నోట్లో పెట్టుకుంటో.
“ఆలా అని చెప్పి అమెరికాలో మీ అమ్మాయి చేత నాలుగు రకాల షూస్ కొనిపించుకుని, ఒక్కటీ వేసుకోవడం లేదు. అవి వాడండి చాలు. అయినా మీ విషయం నాకు తెలియదా! నడిచి వెళ్లడం, వచ్చేడప్పుడు ఆటోలో రావడం. మీరూ, మీ మార్నింగ్ వాక్” అంటూ పొగలు కక్కుతున్న కాఫీ గ్లాస్ అందించింది మొగుడి చేతికి.
కాఫీ తాగుతూ, “ఈ రోజు టిఫిన్ ఏమిటి?” అన్నాడు పద్మనాభం.
“టిఫిన్ తినకూడదు, గ్రహణం విడిచిన తరువాత ఒకేసారి అన్నం వండుతాను. అప్పటి వరకు ఓపిక పట్టండి” అంది కమల.
“ఏమిటో నీ పిచ్చ! కాఫీ తాగచ్చు గాని టిఫిన్ తినకూడదట” అంటూ పేపర్ పట్టుకుని మేడ మీదకి వెళ్తున్న పద్మనాభం తో, “మేడ మీద కి వెళ్తే గ్రహణం కనిపిస్తుంది. మీ రాశి వారికి కీడు, అయినా మన పెళ్ళికి ముందే మా శాస్త్రి గారు చెప్పారు మీ రాశి వాళ్ళని చేసుకుంటే నాకు కీడు అని. అయినా వినకుండా మిమ్మల్ని ప్రేమించిన పాపానికి పెళ్లి చేసుకున్నాను. యిప్పుడు వున్న కీడు చాలు, మళ్ళీ గ్రహణం చూసి కొత్త కీడు అంటించుకోకండి మహానుభావా” అంది కమల.
“నా రాశికి కీడు వుంది అన్న శాస్త్రి గారు యింకా వున్నాడా, వుంటే ఈ సారి మీ ఊరు వెళ్ళినప్పుడు చూపించు. హత్య చేసి జైలు కి పోతా” అన్నాడు పద్మనాభం మళ్ళీ మెట్టు దిగి సోఫాలో కూర్చుంటూ.
ఈ విధంగా వీళ్ళ గొడవ తో గ్రహణం పట్టడం, విడవడం జరిగిపోయింది.
లంచ్ బదులు డిన్నర్ కాలానికి నాలుగు మెతుకులు తిన్నారు.
శుభం.
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comentarios