top of page

పల్లె పరవశం

Writer: Yasoda GottiparthiYasoda Gottiparthi

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #పల్లె పరవశం, #PalleParavasam, #TeluguFarmerStory, #తెలుగురైతుకథ


Palle Paravasam - New Telugu Story Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 06/03/2025

పల్లె పరవశం - తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


"రామారం" అనే పల్లెపట్టు పెక్కు రమణీయ మైనది. ఆ ఊరును దైవ ప్రసాదంగా భావిస్తారు. తమ పొలాల్లో ధాన్యపురాశులు కుప్పలు తెప్పలుగా పొగయ్యేటట్లు పండించేవారు. ప్రజలు అన్నపూర్ణా దేవి బంధువుల అన్పించేటంత ఉదారులు. పండితులు, ఋషులు చేసే యజ్ఞ యాగాదుల వల్ల మబ్బులై వర్షం కురుస్తూ ఉండేవి. అక్కడ గృహిణుల ముఖపద్మములు సూర్యోదయానికి పూర్వమే వికసించగా, గృహకృత్యములతో భర్తల దైనందిన జీవన క్రమానికి స్ఫూర్తిని, సహకారాన్ని అందించే వారు. 


రామయ్యకు ముగ్గురు కొడుకులు. పెద్ద చదువులకని పట్టణాలకు వెళ్లి, అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రామయ్య భార్య కొంతకాలానికి మరణించడం వల్ల ఒంటరివాడయినా వ్యవసాయం తో పంటలను ఊరి వారందరికీ అందించి, పట్టణాలకు, కుమారులకు కూడా బియ్యం వగైరా పంటలను పంపించేవాడు. 


“నాన్న! ఎప్పుడూ నీ ఆలోచ నలు భూమి చుట్టూ పంటలు పండించడం మీదనే పెట్టుతున్నావా?" కొడుకు వీరేంద్ర.


"నీ ఆరోగ్యం కూడా నువ్వు చూసుకోవాల్సిందే కదా. దూరంగా ఉన్న మా ఆలోచనలు, మా జాగ్రత్తల వల్ల నీకు ఏమాత్రం ఉపయోగం లేనట్టే, నీ ఆరాటం, అభిమానం, ప్రేమ, నీ వ్యవసాయం మీద నువ్వు చూపిస్తున్నా, భూమి సారహీనమయి, పంట అంతంత మాత్రమే. నీకు అభిమానం తప్ప".. అంటుంటే


“ఏమంటున్నావ్ రా! ఇంతవరకు నన్ను ప్రాణంగా చూసుకున్నది ఈ భూమి, గాలి, నీరు. ఇందులో పండిన పంటలే నన్ను నా కుటుంబాన్ని పోషించాయి. ఇప్పుడు నేను దూరం చేసుకోలేను" అని తనుమాత్రం బుక్కెడు తిని, సంతృప్తిగా కాలక్షేపం చేసేవాడు. 


తండ్రి వృద్దాప్య దశలో కూడా కష్టపడడం, తమ వెంట తీసుకువెళతా మన్నా రాకపోవడం వారికి నచ్చకపోయేది. రామయ్య తను చేసే పనికి ఏనాడైనా ముగ్గురు కొడుకులు సంతోష పడ్తారని ఎదురు చూసాడు కాని అలా జరగలేదు. 


గ్రామ ప్రజలు పిల్లల భవిష్యత్తుకై పెద్ద కళాశాల కోసం ప్రభుత్వాన్ని కోరారు. మారు మూల గ్రామo కోసం శ్రద్ధ తీసుకొని చేసే వారు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీయగా రామయ్య పెద్దకొడుకును కలిశారు. బ్యాంకు మేనేజర్ గా అన్ని లోన్స్ వచ్చేట్టు చేస్తాను కానీ, మా నాన్న మాతో వచ్చేట్టు చేయాలి, ఆ బాధ్యత మీదే” అని అడిగారు. 


ఊరివారందరూ రామయ్యకు దూరం గా ఉండడం, ఆయన మాట వినకపోవడం, పడించిన ధాన్యాన్ని తీసుకోక పోవడం వంటి నిరాదరణకు గురి అయ్యాడు. రామయ్య మానసికంగా క్రుంగి పోవడం, ఆరోగ్యం పాడవడం దగ్గరివారు కూడా నీ కొడుకుల దగ్గరికి వెళ్లిపోవచ్చు కదా!" అని సలహాలు ఇవ్వడం చేసారు. 

“నేను నమ్ముకున్న భూమిని వదిలి పోలేను, నా కోసం నాకొడుకులే వస్తారు” అనేవాడు. విన్న వాళ్ళు నవ్వుకునేవారు. 


*******

స్కూల్ శంకుస్థాపన కోసం వచ్చిన పెద్దకొడుకు ఊరందరికి పెద్ద వాడుగా, ప్రియమైన వాడుగా చూసిన రామయ్య అతి సంతోషంతో నేను కోరుకున్నది జరుగుతుంది అనుకొని కొడుకుని, “రా నాయనా! ఇక్కడే ఉండి అన్నదాత గా పేరు తెచ్చుకో, మరణానికి ముందు కొన్ని క్షణాలు అయినా నన్ను సంతోష పెట్టావు" అని కొడుకు చేతిలో కన్నుమూసాడు. ఆ స్కూల్ తండ్రి పేరుతొ చిరస్థాయిగా నిలిచింది. తండ్రి పేరుతో వ్యవసాయాన్ని చేతిలోకి తీసుకున్నాడు.. 

 ********


“సార్! కూర్చోండి ఎండల బడి వచ్చినారు. మంచినీళ్లు తెస్తాను” అని లోపలికి వెళ్ళాడు సోమయ్య. 


ఇంతలో అంబాసిడర్ కారు నుండి దిగిన వీరేంద్ర “కుండలో నీళ్లే గుండెను చల్ల పరుస్తాయి, చల్ల బరుస్తున్నాయి” అనుకున్నాడు. 



గొంతు దాటుతున్న నీటి పుట్టుకకు ఈ భూమి ఆధారం. చల్లని నీళ్లను త్రాగిన వీరేందర్ చిన్ననాడు పొలంగట్లపై తిరిగినాడు. నా సంతోషమే తన సంతోషం. తన ఆటపాటే పొలం తల్లికి ఆనందంగా ఉండే అంత బలం. అంతే బలమైన ఆహారాన్ని అన్ని కాలాల్లోనూ అందించింది. తన బిడ్డ కళ్ళేదుటే కలకాలం కనపడాలని తాను ఎప్పటికప్పుడు వర్షాన్ని కోరుకుంది. పచ్చడి గడ్డిని పండించి గొడ్డు గోదా కడుపు నింపి వాటి వ్యర్ధాలను తను ఆహారంగా తీసుకొని మంచి బలాన్ని ఇచ్చే పంటలను తన బిడ్డలకు అందిస్తాను.. అని అందరికీ వాగ్దానం చేసింది ఈ భూమి తల్లి. 


‘ఆనాడు ఆ మాటలన్నీ విడిచి పెట్టాను. అందినంత చేత పట్టుకుని అలా పెట్టుబడి పెట్టి వ్యవసాయం అంతా తన చేతిలోకి తీసుకున్నాను. ఆధునిక యంత్రాలతో అన్ని పనులు ఏ కూలీ అవసరం లేకుండా కృత్రిమ వ్యవసాయ పద్ధతుల్లో కృత్రిమ ఎరువులు, హైబ్రిడ్ పంటలు పండించిన పలు రకాల పంటలను పట్టణాలకు ఎగుమతి చేస్తూ పచ్చ నోట్ల సందడితో పెద్దవాళ్ల పరిచయంతో పేదోళ్ళను.. పండించే రైతులను మరచాను.’ ఆలోచిస్తున్నాడు వీరేంద్ర.  


“అయ్యా! ఏదో బాగా ఆలోచనలో ఉన్నట్లున్నారు"


“వ్యవసాయమే నమ్ముకుని జీవించే భూమన్నలు భారమని పారిపోయారా?. తమను తాము రక్షించుకుందామని ఎక్కడికి వెళ్లారు సోమయ్య. పిల్లాపాపలతో అడుక్కు తింటున్నారా? లేక ఏ ఆ అడవుల్లోనైనా దారి దొంగలుగా మారారా?”


“మీకు అలా అర్థమైందా సార్? వాళ్లు అలాంటి అరాచక పనులు చేయరు. నలుగురికి మేలు చేసి అందులో ఆనందం పొందేవాళ్ళు తప్ప అన్యాయం చేసే వాళ్ళు కారు. 

మీలా ఆలోచించేవారు.. మీరు ఒక్కరే కాదు చాలామంది ఉన్నారు” అని సర్ది చెప్పాడు సోమయ్య. 


“మాలాంటి వాళ్ళ సంగతి నీకు చాలా తెలిసింది.. కానీ మీ వాళ్ల సంగతి మాత్రం దాచి పెడుతున్నావ్?”

 

“ఎక్కడో దాక్కోలేదండి, మీ ఎదురే వస్తున్నారు.. చూడండి. 

ఎవరు వాళ్ళు.. వచ్చేవాళ్ళు.. వాళ్లంతా నాకు తెలిసిన వాళ్ళు.. నా వాళ్లే వాళ్ళు. వచ్చి ఏం చెప్తారో చూడండి” అనుకోగానే వాళ్లలో ఒక్కొక్కళ్ళు వచ్చి.. 


“ఒరేయ్ వీరేందర్! ఇన్నాళ్లు కళ్ళు మూసుకొని నువ్వు చెప్పినవన్నీ విని.. పెట్టినది తిని మమ్మల్ని మేము మోసపోయాం. మా వందమందిలో పదిమందికి బ్లడ్ ప్రెషర్, షుగరు, చర్మవ్యాధులు, క్యాన్సర్లు, గుండె జబ్బులు వస్తున్నాయని తెలుసుకున్నాం."


“అవన్నీ నావల్ల నా లాంటి వాళ్ళ అని ఆభాండాలు వేస్తున్నారు. మేలు చేసిన నాకు తగిన బుద్ధి చెప్పారు” అని మేక వన్నె పులిలాగ మాట్లాడాడు వీరేంద్ర. 


“నీకు తగిన బుద్ధి చెప్పమని మా కళ్ళు తెరిపించింది భూమి. ఈ భూమిని నమ్ముకుని ఎలాంటి కష్టంలో నైనా పంటలు పండించే రైతన్నలు అమాయకులు. మీ మాటలు విని భూమిని వదులుకుని రకరకాల జబ్బులతో మంచానపడే అనుభవిస్తున్న మాకు సేవలు చేస్తూ, ‘మీలాంటి వాళ్లే తమ తెలివితేటలతో మా శరీరబాధలకు కారణాలు’ అని వచ్చిన పట్టణవాసులు చెప్పుకొచ్చారు.”

 

‘మీరు వాళ్లకు అవకాశం ఇవ్వకండి? వారు భూమిపై చేసే అఘాయిత్యాలను ఆపండి. భూమికి హాని చేసే వివిధ రకాల రసాయన ఎరువులు వాడి ఆ పంటల వల్ల ఆరోగ్యానికి నష్టం కలిగిస్తున్నారు. పట్టణాల్లో ఆ తిండి తిని నష్టపోయిన వాళ్ళు వీరేందర్ లాంటి వాళ్ళ వల్లే అని తెలుసుకోండి’ అని చెప్పి నీ వద్దకు పంపించారు” అని సోమయ్య చెప్పగానే.. 


ఆరాత్రి ఆవేదనతో నిద్ర పోయాడు. 


వీరేంద్ర అమ్మా నాన్న"నువ్వు ఎపూడు వస్తావురా? అని ఎదురు చూస్తున్నాం. నీకళ్ళను నీ వేలు తోటే పొడిపించాలని.. రైతులను తయారు చేసి వారి దగ్గరికి పంపించి. పట్టణ ప్రాంత వాసులను నీ పైకి పురికొల్పాము. 


ఇప్పటికైనా భూమాతకు, అన్నదాతలకు మేలు చేసే పనులను చేపట్టి అందరిలో ఒకడిగా ఉండి పోరా” అని తల్లి తండ్రి వీరేంద్రకు కలలో కనిపించారు. 


మనసు మార్చుకుని భూసార పరీక్షలు చేయించి రైతులకు మంచి చేయడం ప్రారంభించాడు వీరేంద్ర. 


 శుభం. 


యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం




 
 
 

Comentários


bottom of page