#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #PandugaSaragam, #పండుగసరాగం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Panduga Saragam - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 21/03/2025
పండుగ సరాగం - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
ఇన్నాళ్లకు పిలవ గానే బతుకమ్మ, దసరా పండుగ లకు వస్తామన్నారు ఇద్దరు కూతుళ్లు నవ్య, భవ్య వాళ్ళ పిల్లలను తీసుకుని. ఒక్కసారిగా వారి చిన్నతనం గుర్తుకొచ్చింది. పండుగ రోజు వీధి వాకిట్లో ముగ్గులు పెడుతూ, కలిసి చెమ్మచెక్క లాడుతూ, ఓకే కంచంలో తింటూ, ఓకే మంచంలో పడుకుoటూ బడికి వెళుతున్నప్పుడు కూడా జంటగా భుజాల మీద చేతులు వేసుకుని చూచే వాళ్ళందరూ అక్కా చెల్లెళ్ళ ప్రేమ ఎంత మధురం అని ముక్కు మీద వేలేసుకునే వారు.
మళ్లీ నాముంగిట ముత్తయిదువులై, అమ్మలై అనంత మైన ఆనందాన్ని పంచుతారు. ( బాల్యం లో) పక్కింట్లో కుందేళ్ళు చూడడానికి వెళ్లి వాటికి క్యారెట్స్, గడ్డి అందించి అవి చెంగు చెంగున ఎగు రుతూ ఉంటే పొందిన ఆనందం, అక్కడ వాళ్ళింట్లో అక్కా వాళ్లు అభిమానంతో స్వీట్స్ తినిపించి ముద్దు చేసిన విషయాలు వాళ్లు చెప్పినవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.
చదువులో పోటీ పడుతూ క్లాస్ లో ఫస్ట్ రావడం, టీచర్స్ మెచ్చు కోవడం మీ అమ్మాయిలను పెద్ద చదువులు చదివించండి అని ప్రోత్సాహం తోనే వాళ్లు ఇప్పుడు గెజిటెడ్ పోస్టుల్లో ఉన్నారు.
“అమ్మ గారూ! సరుకులు తెచ్చాను” అన్న మాటతో తన లోకం లోకి వచ్చింది. “తెచ్చిన సరుకులు డబ్బాల్లో సర్దు సత్యం. అలాగే పిండి వంటలు చేసే వాళ్లు ఎవరైనా ఉంటే చెప్పు".
అక్కడికి వచ్చిన భర్త “రక రకాల స్వీట్స్, పిండి వంటలు అంటున్నావ్? అన్ని రకాలు ఎందుకు?” అన్నాడు పరాంకుశం.
అమ్మాయిల ఇష్టాలు నాకు ఇంకా గుర్తున్నాయి. పెద్దమ్మాయి కి లడ్డూలు, మైసూర్ పాక్, చెక్కలు.. ఇంకా గుర్తు చేసుకుంటాను. మరేమో చిన్నమ్మాయి కి..”
“చాలు తల్లి చాలు. వాళ్ల మీద నీకున్న ప్రేమ, నీ జ్ణాపకాలు నన్ను ఆశ్చర్య పరుస్తున్నాయి.”
“అక్కడితో ఆగిపోయారెందుకు ? వాళ్ల పిల్లలకు ఏమీ ఇష్టాలో తెలుసుకోవాలంటే ఫోన్ కలపండి” అంటూ పట్టు పట్టడం తో “వాళ్లు ఇప్పుడు ఆఫీస్ లో ఉంటారు. ‘లేడికి లేచిందే పరుగు’ అన్నట్టు ఏది వచ్చినా తట్టు కోలేవు". అంటూ బయటికి వెళ్ళాడు.
“ఇద్దరితో సాయి కూడా ఆడ పిల్ల అయితే మీరేం తట్టుకునే వారు. వాడి ధైర్యమే కదా మీకు. వాడు పండుగకు రాడు. మగ పిల్లవాడు రాక పోయినా ఫరవా లేదు అనుకునే మనస్తత్వం మీది.”
*******************
తన చిన్నతనం లో సంస్కృత పాఠశాల లో చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి. గురువులు పాఠాలు బోధించడం, చదువు నేర్పించడం, సంస్కారం తో పాటు భర్తను ప్రేమగా చూచుకొనే విధం, పిల్లలను ప్రేమగా పెంచడం వంటి విషయాలు తెలియచెపుతూ ఉంటే, తియ్యని ఊహాలుగా ఊహించుకొనేదాన్ని. ఆరోజులే చాలా బాగుంటాయి అని అనుకునేదాన్ని. పెళ్ళిలో తనను అదృష్టవంతురాలు అనుకున్నారందరూ.
పెళ్ళయిన తరువాత అంతా తారుమారు అయ్యింది. అనుభవం అయింది. చిన్నతనం రోజులే బాగుంటాయి అన్పించింది. మనుషుల మనస్తత్వాలను తెలుసుకుని మసలు కోవాలి. ఈ జీత భత్యం లేని, ఎవరూ జాలి పడని బంధానికి బరువు బాధ్యతలు పెడుతూ, నాలుగు గోడలే జీవితానికి సరిహద్దులై చిన్న ప్రపంచానికి చిరు దివ్వెల కాంతి కిరణాలు చుట్టూ ప్రసరిస్తున్నాయి ఈ నాటికీ.
ఫోన్ రింగ్ అవడం తో గతం లోనుండి బయటకు వచ్చింది.
“అమ్మా హల్లో! నేను భవ్య ను మాట్లాడుతున్నా..”
“ఆ.. చెప్పమ్మా భవ్యా.”
“మేము వస్తున్నాం కదా. గదులన్ని శుభ్రం చేయించి, ఇల్లు పాతగా అయితే కలర్స్ వేయించు. కొత్త సోఫా సెట్స్ తెప్పించి ఇల్లంతా అందంగా అలంకరించి రెడీ చెయ్యి, మావారు చాలా సంవత్స రాల తరువాత వస్తున్నారు. బ్రతిమలాడి తీసుకువస్తున్నా నేను. ఆయనకు మర్యాదల్లో ఏ లోటూ రాకుండా చూచుకోవాలి.”
“అదేంటమ్మా.. అలా చెప్పాలా మాకు? అన్నీ చేస్తున్నాను తల్లీ. రాక రాక వస్తున్నారు. మీరు వస్తున్నారు అంటే సంతోషం మాత్రమే కాదు, అందర్నీ సంతృప్తిగా, సరదాగా ఉంచాలని చూస్తాము. నీ కిష్టమైన పిండి వంటలన్నీ చేస్తున్నాం. మీరాక కోసం ఎదురు చూడడం నిమిషాలు గంటలుగా గడుస్తున్నాయి.”
“సరే అమ్మా! నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను” అని ఫోన్ పెట్టే సింది. చివరిలో చెప్పిన మాటకు కొండంత బలం వచ్చింది.
చిన్న కూతురు ఫొన్ చేసి “నాకు కొన్ని కాటన్ డ్రెస్ లు కొని పెట్టమ్మా. మేము ఊరంతా చూడడానికి ప్రత్యేక మైన కారును, డ్రైవర్ ను మాట్లాడండి. మీ మనవడు, మనవరాలు ఏటి గట్టు ను, పచ్చని చేలను, పరుగులెత్తే పాడి ఆవులను, గంతులేసే దూడలను, గలగల పారే సెలయేరు లను చూస్తామని అంటున్నారు” అంది.
******************
తను చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఊరు వెళ్లడం అంటే భలే సరదా. ఆ ఊరి జ్ఞాపకాల్లో ముఖ్యమైనవి అమ్మమ్మ చేసి పెట్టే చిరుతిళ్ళు, గది నిండా ధాన్యం పొస్తే వాటి మీదికి ఎక్కి ఆడడం, హాల్లో కట్టిన పెద్ద ఉయ్యాల బల్లపైన ఊగడం, మా మామయ్య తో గిల్లి కజ్జాలు, రోజూ ఏదో ఒక రకంగా వాడిని ఏడిపించడం, అమ్మమ్మా తాతయ్యా కు చెప్పి తిట్టించడం, మరీ కోపం తెప్పించి కొట్టించడం..
ఆ మామయ్యనేపెళ్ళిచేసుకున్నాను. కొన్నాళ్లకే అమ్మమ్మ జబ్బుతో చని పోయింది. అమ్మమ్మ పోయిందనే బెంగతో తాతయ్య కొన్నాళ్లకు చనిపోయాడు. అమ్మా నాన్న తో కలిసి అమ్మమ్మ ఊరుకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అక్కడి పరిస్థితులు అన్నీ మారి పోయాయి. అప్పటి వాగులు లేవు. వాటి పైన బ్రిడ్జ్ లు కట్టేశారు. పచ్చని పొలాలు మాయ మయ్యాయి. పరిశ్రమలు వచ్చాయి.
*********"****************
ఇద్దరు బిడ్డల తరువాత మగ సంతానం కోసం, తాత ఆస్తికి వారసుడు, తన వంశానికి కొడుకు పుట్టాలనీ ఎన్నో ఆశలతో ఎవరూ ఏది చెప్పినా, ఎక్కడ ఏ దేవుడు కనికరిస్తాడో అని పూజలు చేస్తూ, అలా దగ్గరి స్నేహితుడి మాయ ప్రకారం చిన్న మారుమూల గ్రామం లో ఒక వైదుడు ఇచ్చే ప్రకృతి మందును తింటే కొడుకు పుడుతాడని తెలుసుకుని భార్యను తీసుకుని వెళ్లి ఆ మందును తినిపించాడు.
ఆ మందు ప్రభావమో, దేవుని దయ వల్లనో కొడుకు పుట్టాడు ఎంతో గారాబంగా చూచుకుంటూ పెంచి పెద్ద చేసి విద్యా బుద్దులు నేర్పించి ప్రయోజకున్ని చేయాలని, బస్తీ చదువులు, బలాదూర్ తిరుగుళ్ళు వంట బట్టాయి.
**********************
“ఒరేయ్ మధు! అమ్మ వారి జాతర అవుతుందట రా! మా ఊళ్ళో అమ్మ వాళ్లు రమ్మంటున్నారు. అక్క వాళ్లు కూడా వస్తున్నారు. చాలా బాగా గొప్పగా జరుగుతుంది. చాలా దూరం నుండి కూడా వస్తారు. నువ్వు కూడా రారా. నాకు కాస్తా టైం పాస్. నువ్వు కూడా ఎంజాయ్ చేయొచ్చు". అన్నాడు జాన్.
“సరేరా! ఎలాగూ వారం రోజులు సెలవులు వస్తున్నాయిగా. మా ఊరికి వెళ్ళే బదులు మీ ఊరికే వస్తాను" అన్నాడు మధు.
ఇద్దరూ వెళ్లి జాతరలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ముందుగా ఇంటికి వెళ్ళగానే తన వారి నందరినీ పరిచయం చేశాడు.
“జాతర కంటే మీరిద్దరూ రావడం నాకు పండుగ లాగా ఉందిరా” అంది తల్లి.
“కొత్త రకం వంటలు చేస్తున్నట్టు ఉన్నావే” అన్నాడు జాన్.
ఘుమ ఘుమ వాసనలు చూస్తూ “మేమందరం ఇంటిలోనే ఉన్నాం కదా అమ్మా! రోజూ ఇలా రుచిగా వoడ కూడదా?" అన్నాడు చిన్న కొడుకు.
“ఏం మాట్లాడ వేమే? ఏదో ఒకటి మాట్లాడు” అన్నాడు భర్త.
“నేను రోజూ వండినట్లే వండాను. మన ఇంట్లో పెరట్లో మొక్కలకు తెంపిన కూరగాయలు. అప్పటికప్పుడు చెట్టు మీద కూరగాయలు రుచే వేరు. అంతే నండి. పెద్దోడు వస్తున్నాడని వాటిని అలా కాపాడాను అంతే” అంటూ సంతోషంగా చెప్పింది.
“ఎంతైనా అమ్మలకు కొడుకంటేనే ప్రేమ” అన్నది బిడ్డ.
“అందులో పెద్ద కొడుకంటెనే ఎక్కువ ప్రేమ” అన్నాడు చిన్న కొడుకు.
తల్లి తండ్రులకు పిల్లల మీద ప్రేమ అంతా సమానమే. చిన్న వాళ్లకు పెద్దవాడు తనకంటే ముందుగా వచ్చి ఎక్కువ ప్రేమ పొందాడు అనే అభిప్రాయం. అది సూటి పోటీ మాటలతో తెలియ చేస్తారు. కాక పోతే పెద్ద వాడికి బాధ్యతలు ముందుగానే వస్తాయి. అమ్మా నాన్న కష్ట సుఖాలు, తన తరవాతి వారందరి యోగ క్షేమాలు చూచు కోవాలంటే తల్లి తండ్రి ప్రేమ ద్వారానే తెలుసు కోగలుగుతాడు.
“అన్నయ్యా! ఇదిగో బాల్, బ్యాట్. మనం క్రికెట్ ఆడుకుందాం పద. నేను రెడీ” అంటూ గుంజుకుని వెళ్తుంటే
“ఏమిటే ఈ ప్యాంట్ షర్ట్ తో ప్రత్యక్ష మయ్యావు?అన్నది పెద్దమ్మ.
“ఇది మా బాబాయి కూతురు మధు. పేరు అనుపమ. అందరూ "అను" అని పిలుస్తారు. చాలా అల్లరి పిల్ల హైదరాబాద్ లోనే చదువు కుంటుంది. అప్పుడప్పుడూ వచ్చి కలిసి ఆటలు పాటలు చేస్తుంది.”
****************************
జాతర వెళ్ళడానికి ఎద్దుల బండ్లు ముస్తాబు చేశారు. గంగమ్మ జాతర కు నంది వాహనముల బండ్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు, నీలం రంగు, కుoకుమ రంగు, పసుపు రంగు వస్త్రాలతో చాందినీ బండ్లు చూడ ముచ్చటగా తిరుగుతున్నాయి.
బొమ్మల షాపుల్లో పిల్లలు ఒకరు పట్టుకున్న బొమ్మను మరొకరికి కావాలని జుట్టు పీక్కోవడాలు చూస్తే నవ్వు వచ్చింది మధు, జాన్ లకు.
“ఒరేయ్! మా చిన్నప్పుడు మా అక్కలిద్దరూ ఇలాగే చేసే వాళ్లురా. వాళ్లిద్దరి బొమ్మలు ఓకే లాగున్నా, నేను మధ్యలో వెళ్లి నేను కొనుక్కున్న కారు బొమ్మను చూడగానే మరచి పోయి వాళ్ళిద్దరూ కలిసి ఆడుకునే వాళ్లు.”
కొంచెం దూరం లో బావ మరదలుకు ప్రేమగా పూసల దండలు కొనిస్తున్నాడు.
“బావా! నేను ఈ దండ వేసుకుని ఎలా ఉన్నానో చెప్పు?"
“ఈ పూసలతో పాటు మెరుస్తూ ఉన్నావు. నాకళ్ళు జిగేల్ మన్నాయి” అంటూ బుగ్గల మీద చిటికెలు వేశాడు.
“బావా! నువ్వు చిటికెలు వేస్తుంటే నాలో కోటి ఆశలు చిగురిస్తు న్నాయి. కలకాలం కలిసి ఉందా”మని అంటూ..
“అటు వైపుగా వెళ్దామా! జెయింట్ వీల్ ఎక్కుదామా? "
“సరే నువ్వెలా అంటే అలా” అంటూ వెళ్లిపోయారు.
షాపింగ్ చేస్తూ టీనేజ్ అమ్మాయిలు వెనుక నిలబడి జులాయిలు నడుముగిల్లడం, జడలు గుంజడం టీజ్ చేయడం చూసిన మధు, జాన్ లు వెంటనే వెళ్లి,
“ఒరేయ్! ఏoటి రా అక్కడ ఏం జరుగుతుంది ?” అనీ “వాళ్ల పని పట్టుదామా” అంటూ వాళ్ల దగ్గరికి వెళ్లి, “ఏం చేస్తున్నారు రా? ఆ వెధవ వేషాలు, అమ్మాయిలంటే అంత చులకనా" అని చెయ్యి విరిచాడు మధు.
“ఏమైందిరా.. నీకేం కష్టం రా. నీకు కావాల్సిన వాళ్లా వాళ్లు” అంటుంటే, “అవునురా. నీ అంతు చూసేంత కావాల్సిన వాళ్లు రా. వాళ్లు చెప్పుకో లేరురా ఇలాంటివి. కానీ.. చూస్తూ ఊరుకోం లేముగా ఇలాంటివి” అంటూ పొట్టలో ఒక గుద్దు గుద్దాడు.
నలుగురు అమ్మాయిలు వచ్చి “థ్యాంక్స్ అన్నయ్యా. వీళ్ళను ఎన్ని తన్నులు తన్నినా సిగ్గు రాదు.”
కొంచెం సేపటి లో అరుపులు విన వచ్చాయి. ఏమిటా అని అటు వైపు వెళ్లారు. టిఫిన్ హోటల్లో గ్యాస్ మంటలు అంటుకుని కొందరు హా హా కారాలు చేస్తున్నారు. అందరూ పరుగెత్తారు. అక్కడున్న నీళ్లతో మంటలు ఆర్పారు.
అనుపమ బండిలో నుండి మెడికల్ కిట్ తెచ్చి మoటలు అంటుకున్న వారికి ప్రథమ చికిత్స చేసింది. అందరినీ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు. అక్కడున్న వాళ్ళందరూ ధన్యవాదాలు తెలిపారు.
***
అనుపమ హౌస్ సర్జన్ చేస్తుంది. అలా సెలవుల్లో కలిసి నప్పుడల్లా పరిచయాలు పెరిగి ప్రేమకు దారి తీసింది.
ఒకరోజు “నాన్నా! నేను అనుపమ ను ప్రేమిస్తున్నాను. పెళ్ళి కూడా చేసుకుంటాను" అన్నాడు మధు.
“హఠాత్తుగా ఈ పెళ్ళి మాటలేమిటీ రా? పెద్ద వాళ్ళం మేమున్నాం ఒక్క మాటైనా చెప్పవా? సరే అమ్మాయి ఎవరూ? వివరాలు ఇవ్వు” అని చాటు మాటుగా ఆ అమ్మాయి కుటుంబం గురించి ఆరా తీశాడు. వాళ్ళను పిలిపించాడు.
“అమ్మాయి తల్లి తండ్రి మర్యాద గా జరిగిన సంగతంతా చెప్పి “మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకుంటారని ఆశిస్తున్నాము.” అన్నారు.
“చూడండి. ఈ రోజుల్లో ప్రేమలు పై పై ఆకర్షణలు మాత్రమే. ఎండకు వెలిసి పోతాయి, వానకు కొట్టుకొని పోతాయి. మీ కులం, సాంప్ర దాయాలు, ఆచారాలు వేరు. సినిమాల్లో చూడడం వినోదమే కానీ.. జీవితాలకు విషాదం. మాకు ఇంకా ఇద్దరూ అమ్మాయిలు ఉన్నారు. వాళ్లకు సంబంధాలు చూసేటప్పుడు ఈ విషయం అడ్డoకి అవుతుంది. అందరికీ విశాల హృదయం ఉండదు. వాళ్ల జీవితం అస్తవ్యస్తం అవుతుంది. కోరి కోరి ప్రశాంతంగా ఉన్న జీవితం లో అల్ల కల్లోలం అవుతుంది” అన్నాడు మధు తండ్రి.
మధు వెంటనే వచ్చి చేసుకుంటే “అనుపమ నే పెళ్ళి చేసుకుంటాను. పెళ్ళి చేయండి నాన్నా” అన్నాడు,
“నలుగురూ ఇష్ట పడితే ఆ పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది. ఇద్దరి ఇష్టం కోసం అందరినీ దూరం చేసు కోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ముందు ముందు అపోహలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. కులం దేశం లో వేళ్ళూనుక పోయింది. తండ్రి కులం పేరుతో పిల్లలు పెరిగితే తల్లి నుండి ఇగొలు ప్రారంభ మవుతాయి. ఆధునికత పెరిగిందని, అంతా గ్లోబలైజేషన్ అనీ, ఆన్లైన్ వ్యవహారాల నీ సమాజం లో మార్పు వచ్చినా, మనుషుల మనసుల్లో మార్పు రాలేదు”
ఎంత నచ్చ చెప్పినా వినకుండా పెళ్ళి చేసుకుని కుటుంబానికి దూరం అయిపోయాడు మధు. అనుబంధాలు మాయమైనా అనుపమ మనసులో మాత్రం అత్తగారి మీద అనురాగం పోలేదు. ఎప్పటికైనా అందరం ఒక్కటి కావాలని ఆశ పడేది.
*********************
“అమ్మమ్మా ! తాతయ్యా!" అంటూ వచ్చి ముందుగా కాళ్లకు దండం పేట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు పెద్దమ్మాయి కొడుకు చరణ్.
ఆశ్చర్యంగా చూస్తుంటే “నాన్నా, వీడు నాకొడుకు” అన్నది.
“మరి ప్రక్కన ఉన్నది ఎవరు?” అన్నట్టు చూస్తుంటే ఆ “అమ్మాయి వాడి గర్ల్ ఫ్రెండ్” అంది.
వచ్చిన అమ్మాయిలు, అల్లుళ్ళతో సరదాగా గడపకుండా, ముక్త సరిగా మాట్లాడుతూ పరాంకుశo మూల గదిలో కూర్చోవడం భార్య గమనించింది.
“ఏమిటండీ.. రాక రాక వచ్చిన వారితో నాలుగు రోజులు కలిసి మెలిసి ఉండoడి. ప్రేమ పెళ్లి అని కొడుకును దూరం చేసుకున్నాం. ఇప్పుడు అమ్మాయిలను కూడా దూరంచేసుకుని నేను బ్రతుక లేనండి.”
*****************
సూర్యోదయం కాక ముందే పూజ గదిలో నుండి అగరుబత్తుల వాసన తో ఇల్లంతా కమ్ముకుని, సుప్రభాతం వినపడు తుంటే వేరే ఎక్కడో దేవాలయం నుండి అనుకుని ఆలపిస్తూ మెట్లు దిగి రాగానే తులసి కోట దగ్గర ప్రదక్షిణం చేస్తున్న క్రొత్త అమ్మాయి కనిపించడం తో క్షణం సేపు కళ్ళు నులుము కుంటూ చూసాడు. మనుమడు తీసుకు వచ్చిన అమ్మాయే గీత అని వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
“తాతయ్యా గారూ! కాఫీ తీసుకోండి" అని చేతికిచ్చి వెళ్ళింది.
పది రోజులలో అందరికీ కావలిసిన అమ్మాయిలా కలిసి పోయి అందరి మనసులను ఆకట్టుకుంది.
“అమ్మా గీతా! మీ అమ్మా నాన్నలను రమ్మని ఫోన్ చేయమ్మా! మీ పెళ్ళి విషయాలు మాట్లాడు కుందాం" అనగానే ఎగిరి గంతేసింది.
ఆ మాటలు విన్న భార్య పరాంకుశం లో వచ్చిన మార్పు చూసి ‘వొక్క మంచి పనితో తనలోని కల్మషాన్ని కడిగేసు కుంటాడు’ అని సంతోషించింది.
అందరూ సంతోషంగా ఉన్న సమయం లో ఇంట్లోకి వచ్చిన కొడుకు, కోడలును చూసి పరాంకుశం “నిన్నెవరు రమ్మన్నారురా? ఎవరు పిలిచారు అని వచ్చారు?” అని కోప్పడుతుండగా రయ్ మని గీత వచ్చి..
“తాతయ్యా! వీళ్ళే మా అమ్మా నాన్నా” అంటూ తల్లి తండ్రి దగ్గరికి వెళ్లి కౌగలించుకుంది. అందరూ అవాక్కయ్యారు.
అంతా తెలిసిన పెద్ద బిడ్డ పెద్దగా నవ్వుతూ “నాన్నా! ఇదంతా నిజమే. ఈ రోజే అసలు సిసలైన పండుగ. ఘనంగా చేసుకుందాం." అంది.
“గీతా, చరణ్ లు ఒక్కటైన రోజు. శుభస్య శీఘ్రం" అన్నాడు తాత.
అందరూ నవ్వారు.
శుభం.
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Comments