'Panigrahanam - 10' New Telugu Web Series
Written By Bhagavathula Bharathi
రచన: భాగవతుల భారతి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
పాణిగ్రహణం ధారావాహిక చివరి భాగం
జరిగిన కథ..
హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి. ఆమె చెల్లెలు సుగాత్రి.
హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల.
సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష.
గతం గుర్తుకొస్తుందతనికి.
కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల. అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త. అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది సాగరమేఖల. హాస్పిటల్ లో కోలుకుంటుంది. భర్తను, పిల్లల్ని వదిలి హైదరాబాద్ లో ఉద్యోగం చూసుకొని ఒంటరిగా ఉంటుంది ఆమె.
ఫోన్ రావడంతో గత కాలపు ఆలోచనలనుండి తేరుకుంటాడు విరూపాక్ష. ఫోన్ లో లక్ష్మణ అనే వ్యక్తికి అతని భార్య విడాకుల నోటిస్ పంపినట్లు విని బాధ పడతాడు. 'పాణిగ్రహణం కన్సల్టెన్సీ' పేరుతో ఒక సంస్థను ప్రారంభిస్తాడు విరూపాక్ష.
మిత్రులను, పత్రికా విలేఖరులను ఆహ్వానించి సహకారం కోరుతాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ అభిప్రాయం బేధాలను సామరస్యంగా పరిష్కరించడమే ఈ కన్సల్టెన్సీ ఉద్దేశమని చెబుతాడు.
ముందుగా సాగర మేఖల కాపురం సరిదిద్దాలనుకుంటాడు.
ఆమె భర్తకు కాల్ చేసి సాగర మేఖలకు అతనంటే విముఖత లేదని చెబుతాడు.
మొదట్లో అతను సరిగ్గా బదులివ్వక పోయినా విరూపాక్ష పట్టుదల వల్ల మెత్తబడతాడు.
సాగర మేఖలలో కూడా మార్పు వచ్చి భర్త దగ్గరకు వెళ్తుంది.
సమీర్ కాపురాన్ని కూడా అతని తండ్రి సహకారంతో సరిదిద్దుతాడు.
భర్తను కోల్పోయిన వైదేహికి సంబంధం కుదురుస్తాడు విరూపాక్ష
ఇక పాణిగ్రహణం ధారావాహిక పదవ భాగం చదవండి.
"మీరెవరండీ? ఎక్కడినుంచి వచ్చారు?
"నా పేరు విరూపాక్ష.. ఇక్కడ మా ఊరి అమ్మాయి సునీల అనీ.. ఉందని తెలిసి చూసిపోదామని వచ్చాను." ఓ ఇంటిముందు ఆగిఅడిగాడు.
గొంతువిని.. పరుగున బయటికివచ్చి
"నువ్వా అన్నా? ఇంతదూరం వచ్చావ్! రా అన్నా!"అంటూ పిలిచింది లక్ష్మణభార్య.
బైక్ ఆపి లోపలికి వెళ్ళాడు. ఒకేగది.
పెద్దగానే ఉంది. సామానంతా తీర్చినట్లుగా
ఉంది. కుట్టుమిషను. బట్టలగుట్టలు.
"నన్ను లక్ష్మణ పంపాడు. " అబద్దమని తెలిసినా అనేసాడు.
వెయ్యి అబద్దాలాడైనా ఓ కాపురం నిలబట్టాలి.
కానీ ఆ అబద్దం ఆమెకళ్ళల్లో కోటి కాంతులై చిమ్మింది. మనసులో కోటి వీణలు మ్రోగించింది. " నిజమాఅన్నా ?!" అంది ఆశగా.
"వస్తావామరీ?! ఏమిటిదంతా?చెప్పకుండామాయమయ్యావ్!
ఇన్నాళ్ళకి మళ్ళీ?!.. మీ వాళ్ళు
విడాకులనీ కోర్టులనీ, కేసులనీ, గందరగోళం.. మీ వాళ్ళదగ్గర లేకుండా ఇక్కడెందుకున్నావ్? పాపేదీ? "
అంతే.. భోరున ఏడ్చింది.
కాసేపటికి తెప్పరిల్లి చీరతో కన్నీళ్ళు తుడుచుకుని..
"నేను పాపిష్ఠి దాన్ని! నీ దగ్గర దాచలేను.
చెప్పేస్తానన్నా! నన్ను నువు తిట్టినా సరే!"
"కుమార్ సార్! ఉద్యోగ నిమిత్తం మన ఊళ్ళోనే ఉండేవాడు. రోజూ
మెస్ లో భోజనానికి వచ్చేవాడు..
బోలెడు డబ్బుంది 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి కాలేదు. "
"మాటా మాటా కలిపాడు. కళ్ళూ కళ్ళూ కలిపాడు. రోజూ ఎన్నో ముచ్చట్లు చెప్పేవాడు. మాటల్లో తేనె లొలికించాడు అరచేతిలో స్వర్గం చూపించాడు. "
"రాజుని చూసిన మీదట మెుగుణ్ణి చూస్తే మెుట్ట బుద్ధయిందనే సామెత నా లాంటి వాళ్ళని చూసే పుట్టిఉంటుంది. "
"తన సూటూ, బూటూ, టక్కూ,
పర్శనాలిటి నన్ను వెఱ్ఱెక్కించేసాయ్.
నీ మెుగుడు పనికిరానివాడు. చేతకానివాడు. నీ లాంటి అందగత్తె ఇక్కడుండాల్సింది కాదు.
నేనైతే అందలాల్లో ఉంచుతాను. తనతో పాటు వచ్చేయమన్నాడు. ఓ విషఘడియలో.." చెబుతూనే ఏడ్చింది.
మళ్ళీ తనే.. తమాయించుకుని..
"ఉంచుకున్నోడు మెుగుడవుతాడా? పెంచుకున్నోడు కొడుకవుతాడా? అని శాస్త్రమే ఉందిగా అన్నా! అవసరం తీర్చుకున్నాడు. పైగా నగలు, డబ్బులూ, స్థలం తాలూకు కాగితాలూ అన్నీ తీసుకుని పారిపోయాడు. నేను మిషన్ కుట్టుకుని బ్రతుకుతున్నాను. నాకు తెలిసిన కాస్త విద్య అదేగా!"
"మరిపాప!?"
"ఇంకానయం! పాపని దూరంగా గురుకుల పాఠశాలలో చేర్చా! ఎందుకైనా మంచిదని..”
"ఇదంతా లక్ష్మణకు తెలుసా? " అని అడిగి..
‘తెలిసీ మా దగ్గర దాచాడా? చెప్పి బాధపెట్టాలా? చెప్పకుండా మోసంచేయాలా? భవిష్యత్తులో, అన్నయ్యా! ఇదేంటి అంటే? ముఖం చూపించగలనా?..’ మనసులో అనుకున్నాడు విరూపాక్ష.
"ఏమో! నాకు తెలీదన్నా! నాముఖం తనకి చూపించలేను. అందుకే విడాకులు తీసుకుని, పాపని మా ఆయనకు అప్పజెప్పి నేను దూరంగా పోతాను. విడాకులిస్తే, తను మళ్ళీ పెళ్ళి చేసుకుని.. సుఖంగా బ్రతుకుతాడని.. " ఏడుస్తూ చెప్పింది.
కళ్ళు తుడుచుకుని "అన్నా! నీకు పున్నెం ఉంటుంది. పిల్లను వాళ్ళ నాన్న దగ్గరకు జేర్చు. నేను ఎలాగోలా బ్రతుకుతా. నేను చేసిన తప్పుకి, పిల్ల దిక్కులేని దౌతుంది!" మళ్ళీ ఏడుస్తోంది.
"సరే! నేను వెడుతున్నానమ్మా! మళ్ళీ మనం మన ఊళ్ళోనే కలుద్దాం. సరేనా! "
ఆ మాటకి కళ్ళు తుడుచుకుని, కృతఙ్ఞతగా ఆమె చూసిన చూపు..
'ఎన్ని కోట్లిచ్చినా కొనలేనుగదా! ' కన్స ల్టెన్సీ పెట్టినందుకు, మగాడి చేతిలో మోసపోయిన
ఈమెను కాపాడినప్పుడుకదా! జన్మకు సార్ధకత! అనుకున్నాడు, విరూపాక్ష.
"నీ ఫోన్ నెంబర్ ఉందా? "
"నాకు ఇదిగో.. ఇదే చిన్న ఫోన్. నెంబర్ తీసుకో అన్నా! "
"లక్ష్మణా! రా! కూర్చో! మీ ఆవిడను కలిసాను. తను నీ దగ్గరకు రావాలని అనుకుంటోంది. నువ్వు ఏమనుకుంటావోనని ఆగింది. ఇదిగో ఫోన్ నెంబర్.. అదీ!.. ఏంలేదూ!.. వాళ్ళమ్మా వాళ్ళు మీ ఇద్దరి మధ్యా చిచ్చుపెడుతున్నారు.. అంతే!" అని నీళ్లు నములుతూ చెప్పాడు.
లక్ష్మణ లేచి నిలబడి.. "అన్నయ్యా! మీరే నిజం దాచి మా ఇద్దర్నీ కలపాలనుకుంటున్నారో.. అది నాకు తెలుసు. కానీ ఎవరికీ చెప్పలేదు. మా వాళ్ళకి కూడా.. ఇదే తప్పు నేను చేస్తే, తను క్షమించదా?! నా పిల్లకోసమైనా, మేం కలుస్తాం. మమ్మల్ని కలపటానికి నువ్వు చాలా కష్టపడ్డావ్. నీ కష్టం వృధా పోనీను. ఇప్పుడే ఫోన్ చేస్తా " అన్నాడు.
"మంచి గొప్పోడివిరా నువ్వూ " లక్ష్మణను కౌగిలించాడు విరూపాక్ష.
@@@@@@@@@@
'పాణిగ్రహణం కన్సల్టెన్సీ'..
మెుదటి వార్షికోత్సవం..
"'సఖ్యం సాప్తపదీనం'.. అంటే ఏడడుగులు కలిసి నడుస్తే సఖ్యం ఏర్పడుతుంది.
"ముఖ్యంగా కల్యాణానికి ఈ ఏడడుగులు తడబడకుండా నడవాలంటేే.. మెుదటి అడుగే జాగ్రత్తగా వేయాలి. పాణిగ్రహణానికి గ్రహణం పట్టకుండా ఉండాలంటే..
గ్రహాల అనుకూలతే కాదు.. మానసిక అనుకూలతలూ కావాలి. అన్ని విడాకుల కేసులలోనూ చిన్న చిన్న కారణాలే.. చిన్న మెలికలే.. చిక్కుముడి విప్పేస్తే.. మూడుముళ్ళూ పీటముళ్ళే.. "
"ఇంతవరకూ సక్సెస్ ఫుల్ గా వందవిడాకుల కేసుల్లో.. వంద జంటల్ని కలిపింది ఈ కన్స ల్టెన్సీ. "
ఓ సాగరమేఖల, సమీర్, వైదేహి, లక్ష్మణ, సునీల.. ఇలా ఎన్నో జంటల్ని కలిపింది మా కన్సల్టెన్సీ.
"కానీ.. ఇకనుండీ.. విడాకులకే అవకాశం లేని జంటల్ని, సమాజానికి ఆదర్శంగా అందించటం కోసం..
మా 'పాణిగ్రహణం' నుండి.. నేను చేయించిన వైదేహీ పరిణయం స్ఫూర్తితో..
'సప్తపది వివాహవేదిక' అనే కొత్త సంస్థ ఏర్పాటు చేయబడుతోంది. "
విరూపాక్ష ప్రకటించగానే చప్పట్లు మారుమ్రోగినాయ్.
"సార్.. ఇప్పటికే చాలా మాట్రిమోనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ్. అవి విడాకులను ఆపగలుగుతున్నాయా?జీవన ప్రయాణంలో చివరి మజిలీ వరకూ నడిపించే మార్గదర్శిను లౌతున్నాయా? ఈ విషయంలో మీ స్పందన ఏమిటో?"
"పాణిగ్రహణం కన్స ల్టెన్సీ పెట్టినరోజున, ఎన్నో సందేహాలూ, సంశయాలూ ఉన్నాయ్ వాటి సత్ఫలితాలలోనే సమాధానం ఉంది. సమాధానం కోసం ఎదురుచూస్తాం అన్నారుగా! సమాధానం దొరికిందా? ఫలితాలు ఎలాఉన్నాయంటారు? "
"అంటే 'సప్తపది వివాహవేదిక ' కూడా అటువంటి అత్యుత్తమమైన ఫలితాలనే చూపిస్తుందని ఆశిద్దామా? మీరు స్థాపించిన 'సప్తపది' లో ప్రత్యేకత ఏమిటో? "
జర్నలిస్ట్ ప్రశ్నకు విరూపాక్ష జవాబు.. చిరునవ్వుతో కూడిన..
"వెయిట్ అండ్ సీ"..
$$$$శుభం$$$$
========================================================================
ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి శ్రీమతి భాగవతుల భారతి గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం.
========================================================================
భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments