#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #పాపలాంటిపూవులు, #PapalantiPuvulu, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 41
Papalanti Puvulu - Somanna Gari Kavithalu Part 41 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 21/03/2025
పాపలాంటి పూవులు - సోమన్న గారి కవితలు పార్ట్ 41 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
పాపలాంటి పూవులు
----------------------------------------
పూలలోని తావులు
వాటిలోని సొగసులు
అలరించు అవనిలో
స్త్రీ మూర్తుల మనసులు
పూలు చేయు సేవలు
శ్రేష్ఠమైన గుణములు
మానవాళికి స్ఫూర్తి
అసమానమే కీర్తి
మాలగా మారితే
గౌరవమే ఇచ్చును
దారంతో జతకట్టి
కంఠహారమే అగును
పాపలాంటి పూవులు
తలపించును నగవులు
వారిలా మృదుత్వము
అందాలకు అందము
మనోహరం పూవులు
మదిని గెలుచు పూవులు
మగువలకు ప్రియమైన
త్యాగమయులు పూవులు

శ్రేష్టమైనది చదువు
----------------------------------------
చదువుకుంటే బాలలు
మారుతాయి తలరాతలు
అజ్ఞానము తొలగిపోయి
అవుతారు రవిచంద్రులు
వెలుగుతాయి మస్తకాలు
చక్కబడును జీవితాలు
ఉజ్వల భవిష్యత్తుకు
అవసరమైన చదువులు
చదవాలోయ్! చక్కగా
ఎదగాలోయ్! గొప్పగా
ప్రతిరోజూ బడికెళ్ళి
ఆలకించాలోయ్! శ్రద్ధగా
ఎదిగేందుకు బ్రతుకులో
వెలుగేందుకు జగతిలో
చదవాలోయ్! చదవాలోయ్!
గురుదేవుల సన్నిధిలో

సుభాషిత రత్నాల సరాలు
----------------------------------------
స్థిరత్వం లేని మనుషులు
ఏదీ సాధించలేరు!
అదుపు తప్పిన మనసులో
ఆనందం గాంచలేరు
పగ,ప్రతీకారాలతో
విశ్వశాంతి తేలేరు
ఓర్వలేనితనంతో
నెమ్మదిని పొందలేరు
ఎక్కువైతే బద్దకము
అభివృద్ధిక అసాధ్యము
గాయమైతే హృదయము
కోలుకొనుట దుర్లభము
లేకుంటే క్షమాగుణము
తొలగిపోదు శత్రుత్వము
ఎండితే ప్రేమవనము
అందదోయ్! స్నేహఫలము

నాలుగు మంచి మాటలు
----------------------------------------
జాప్యము వద్దు పనిలోన
కోపము మాను మదిలోన
జరుగుతుంది అభివృద్ధి
దొరుకుతుంది సమృద్ధి
నిర్లక్ష్యము ప్రమాదమే!
విడిచిపెట్టు శీఘ్రమే!
పగటి కలలు కట్టిపెట్టు
అన్నిటా అవరోధమే!
వేయవద్దు వాయిదా
లేదు అందు ఫాయిదా
అక్షరాల నిజం కదా
గుర్తించుకొమ్ము సదా
నింపుకొనుము ఉత్తేజము
పొంగిపొర్లు ఉల్లాసము
ఇచ్చుటే మహోన్నతము
ఎనలేనిది దాతృతత్వము

కొలనులోని కలువలు
----------------------------------------
తెల్ల లెల్లని కలువలు
అందాలొలికే కలువలు
కొలనులోన పుష్పించే
కనువిందు చేయు కలువలు
మగువలకిష్టం కలువలు
చంద్రుని భామలు కలువలు
నీటిలోన నివసించే
సాటి లేని మేటి కలువలు
శ్రేష్టమైనవి కలువలు
సరస్సునేలే కలువలు
రేకులు విచ్చిన కలువలు
మదిని చేసే కలువలు
కలువలు! కలువలు!కలువలు!
బాలలను బోలిన కలువలు
ఆంధ్ర రాష్ట్ర పూచిహ్నము
నీళ్లతో ఉండును బంధము
-గద్వాల సోమన్న
Comments