top of page
Writer's pictureDivakarla Padmavathi

పాపం సుబ్బారావు!

#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #PapamSubbarao, #పాపంసుబ్బారావు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


'Papam Subbarao' - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 28/10/2024

'పాపం సుబ్బారావు!తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఆఫీసు నుండి తిరిగి వచ్చిన సుబ్బారావుకి ఎదురు వచ్చింది వారం రోజుల క్రితం అలిగి పుట్టింటికెళ్ళిన కాంతం. ఆమెకి సరిగ్గా వంట వండటం రాదని సుబ్బారావు అనడంతో ఇద్దరిమధ్యా మాటామాట పెరిగి కోపంవచ్చి పుట్టింటి కెళ్ళిపోయిందామె. వంట నేర్చుకొనే తిరిగి ఇంట్లో అడుగుపెడతానని 'మంగమ్మ శపథం' లాగా 'కాంతమ్మ శపథం' చేసి వెళ్ళిందామె. 


ఆమె తప్పకుండా వంట నేర్చుకొనే వచ్చి ఉంటుందని అనుకొని సుబ్బారావు చాలా సంతోషించాడు. కాంతం కూడా తన పంతం మరిచిపోయి భర్తని నవ్వుతూ పలకరించింది. 

వంటింట్లోంచి ఘుమఘుమలు నాసికకు తగలడంతో ఆనందంతో తబ్బిబ్బయిపోయాడు సుబ్బారావు. పుట్టింటికెళ్ళి వంటలో కాంతం ప్రావీణ్యం సంపాదించిందని అర్ధమైంది. 


బాత్రూంకి వెళ్ళి తయారై వచ్చిన భర్తకి భోజనం వడ్డించిందామె. భయపడుతూనే అన్నం నోట్లో పెట్టుకున్నాడు. కానీ, ఆశ్చర్యం! అంతకన్నా అద్భుతం! ఇంత త్వరగా కాంతం ఎలా వంట నేర్చుకుందో బోధపడలేదు సుబ్బారావుకి. అయినా ఆమెని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 


"శభాష్ కాంతం! వంట చాలా అద్భుతంగా ఉంది! నీ చేతి వంట అమోఘం! వారం రోజుల్లో ఇంత బాగా వంట చెయ్యడం ఎలా నేర్చుకున్నావు? నిన్ను అన్ని మాటలన్నందుకు నన్ను క్షమించు" అంటూ ఆమెని విపరీతంగా పొగిడాడు. 


వెంటనే సీరియస్ అయిపోయింది కాంతం. ఆమె ముఖం హఠాత్తుగా అప్రసన్నంగా మారింది. సుబ్బారావు వైపు కోపంగా చూసింది. అమెందుకలా చూసిందో సుబ్బారావుకేమాత్రం అర్ధం కాలేదు. 


"మా ఊరినుండి వంటమనిషి రంగిని తెచ్చుకున్నాను. ఈ వంటంతా రంగి చేసింది. నేను చేసిన వంట మీకు నచ్చలేదుకానీ, రంగి వంట మాత్రం విపరీతంగా నచ్చిందా? ఉండండి, మీ పని చెప్తాను!" అని చేతిలోని గరిట ఎత్తేసరికి ఒక్కసారి బిక్కచచ్చిపోయాడు పాపం సుబ్బారావు. 


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


69 views0 comments

Comments


bottom of page