top of page

పరస్పర సహాయం

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #ParasparaSahayam, #పరస్పరసహాయం, #పిల్లలకథలు, #TeluguChildrenStories,  #బాలలకథ


'Paraspara Sahayam' - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 19/10/2024

'పరస్పర సహాయం' తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 ధర్మవరం గ్రామంలో నివసించే జనులందరు దైవ భక్తులే. రామాలయం, శివాలయం, వినాయక,

గ్రామ దేవతలకు గుడులు కట్టించి పర్వదినాల్లో భక్తితో పూజిస్తుంటారు.


 ఆ ఊరిలో గణపయ్య శెట్టికి కిరాణా దుకాణం ఉంది. పట్నం నుంచి పప్పులు, నిత్యావసర సరుకులతో పాటు బియ్యం, చిరుధాన్యాలు కూడా అమ్ముతుంటాడు. దురాశకు పోకుండా నమ్మకంగా నిత్యావసర వస్తువులు అమ్మడమే కాకుండా దాన ధర్మాలు చేస్తాడని పేరుంది.


 గణపయ్య శెట్టికి దుకాణంలో ఎలుకల బాధ ఎక్కువైంది. నిత్యావసర వస్తువులే కాకుండా ఇంట్లో

బట్టలు కూడా కొరికి పాడుచేస్తున్నాయి ఎలుకలు. వినాయక భక్తుడైన గణపయ్య , మూషికం గణేషుడి వాహన మైనందున వాటికి ప్రాణహాని కలిగించడం ఇష్టం లేక ఎలకల బోనులో బంధించి ఊరికి దూరంగా కొండ ప్రాంతంలో వదిలి పెట్టేవాడు.


 అలా చాల ఎలుకల్ని బోనులో బంధించి మైదాన ప్రాంతంలో వదులుతు మూషికాల బాధ నుంచి విముక్తుడయే వాడు. అక్కడ ఎలుకల్ని పక్షులు, పాములు పట్టుకుపోయేవి.


 ఒకసారి పెద్ద పందికొక్కు ఎలుక గణపయ్యకు బోనులో చిక్కింది. దాన్ని జాగ్రత్తగా మైదాన ప్రాంతంలో వదిలి వచ్చాడు.


 మైదాన ప్రాంతంలో చేరిన పందికొక్కు ఎలుక అక్కడి వాతావరణానికి భయపడి దగ్గరలోని కలుగులో దూరింది. గణపయ్య శెట్టి ఇంట్లో నిర్భయంగా తిరిగి కడుపు నింపుకునేది. ఇక్కడ గెద్దలు, గుడ్లగూబలు, పాములతో భయం పుట్టి బయటకు రావాలంటే భయపడతు గడుపుతోంది. సమయానికి సరైన ఆహారం లేక ఆకలితో అలమటిస్తోంది.


 అటువంటి సమయంలో పందికొక్కు ఎలుక నివాసముండే రాళ్లగుట్టలకు దగ్గరగా కొన్ని పావురాలు మేత కోసం సంచరిస్తుండేవి.


 ఒకరోజు పందికొక్కు దైర్యం చేసి కలుగు నుంచి బయటకు వచ్చి "ఆకలిగా ఉంది , ఏమైనా తిండిగింజలు పెట్ట”మని మేత మేస్తున్న పావురాల్ని ప్రాధేయపడింది.


 "ఇళ్లలో ఉండే నువ్వు ఇక్కడికెలా వచ్చా"వని అడిగాయి పావురాలు ఆశ్చర్యంగా.


 తను నివాసముండే ఇంటి యజమాని నన్ను బోనులో బంధించి ఇక్కడ వదిలిపోయాడని, తిండి లేక ఇబ్బందులు పడుతున్నానని తన గోడు చెప్పుకుంది పందికొక్కు ఎలుక.


 "అయ్యో , అలాగా! నీ బాధ వింటే జాలేస్తోంది. తప్పక నీ ఆకలి తీరుస్తా"మని తలిచి పావురాలు దగ్గరలోని పొలాల నుంచి వరి, గోధుమ, పళ్లు, చిరుధాన్యాలు తెచ్చి ఎలుక ఆకలి తీర్చేవి. ఇలా వారి మద్య స్నేహం ఏర్పడింది.


 రోజులు గడుస్తున్నాయి. పందికొక్కు ఎలుక హాయిగా పావురాలు తెచ్చే ఆహారం తింటూ సంతోషంగా ఉంది. ఒకసారి వేటగాడు పావురాల సంచారం చూసి మైదానంలో చుట్టూ వలపన్ని వెళ్లాడు.


ఎప్పటిలా ఎలుకతో కబుర్లు చెప్పుకుంటూ మేత తింటున్న పావురాలు వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయి. అవన్నీ భయంతో పైకి రాలేక, "మూషిక మిత్రమా, మమ్మల్ని ఈ వలనుంచి రక్షించి ప్రాణాలు కాపాడ"మని ప్రాధేయ పడ్డాయి.


పావురాల ఆపదను గ్రహించిన మూషికం వెంటనే కలుగు నుంచి బయటకు వచ్చి తన పదునైన దంతాలతో పావురాల చుట్టూ ఉన్న వలను కొరికి బంధ విముక్తిని చేసింది. పావురాలన్నీ ఆనందంగా గాల్లోకి ఎగిరిపోయాయి.


 కొద్ది సమయం తర్వాత వల దగ్గరకు వచ్చిన వేటగాడు చూస్తుండగానే పావురాలు వల నుంచి 

తప్పించుకుని బయట పడటం చూసి నిరాశ పడ్డాడు. తర్వాత నుంచి పావురాలు జాగ్రత్తగా పరిసరాల్ని గమనిస్తూ సంచరించేవి.


 నీతి : స్నేహమంటే ఒకరికొకరు సహాయపడటం.


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

   కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


31 views0 comments

Comments


bottom of page