top of page
Writer's pictureA . Annapurna

పేషంటును పలకరించడం ఎలా?

#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #పేషంటునుపలకరించడంఎలా, #PatientNuPalakarinchadamEla, #TeluguSpecialArticle #రోగిపరామర్శ


'Patient Nu Palakarinchadam Ela' - New Telugu Article Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 22/10/2024  

'పేషంటును పలకరించడం ఎలా?తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


ఎవరైనా బంధువులో స్నేహితులో తెలిసినవారో అనారోగ్యం వచ్చినా సర్జరీ జరిగినా వెంటనే చూడటానికి వెళ్ళాలి అనుకునేవారు కొన్ని సూచనలు పాటిస్తే బాగుంటుంది. భారతీయుల్లో చాలామందికి ఇదొక అలవాటు. అలా రావాలని పేషేంట్ తరఫువాళ్ళు కూడా అనుకుంటే ఒకే. 


 కానీ అది సరికాదు అని నా అభిప్రాయం. అలా వెళ్లి పలకరిస్తే పేషేంట్ కి ఇబ్బంది. పేషేంట్ కూడా వున్నవారికి ఇబ్బంది. ఈ రోజుల్లో ఎంత మేజర్ సర్జరీ అయినా మూడురోజుల్లో ఇంటికి పంపిస్తున్నారు. 


అందువలన హాస్పిటల్కి వెళ్లి డిస్టర్బ్ చేయక్కరలేదు. ఇంటికివచ్చి కొంత తేరుకున్నాక ఏ సమయంలో రావాలి అని అడిగి వెళ్ళాలి. సీనియర్ సిటిజన్స్ అయితే మరీ వారికి ఎక్కువ విశ్రాంతి అవసరం ఉంటుంది. 


 వెళ్ళినవారు వెళ్లకపోతే బాగుండదు అనుకోవలసిన అవసరంలేదు. పేషేంట్కి స్పైనల్ ఏనస్తీషియా ఇవ్వడం వలన సర్జరీ తర్వాత యూరిన్ మోషన్ అవక పేషేంట్ కడుపు నొప్పితో బాధపడటం లేదా మరో అసౌకర్యం కలగడం జరుగుతుంది. కనుక ఇంటికి వచ్చాక ఫోను చేసి పలకరించాలి. 


ఇప్పటి రోజుల్లో.. అందులో సిటీలో ఉండేవారు చాలా దూర ప్రాంతాలు వెళ్ళాలి. కనుక ఫోను కాల్ చాలు. ఇక వచ్చిన సమస్య గురించి సర్జరీ గురించి అడిగి తెలుసుకోడం జరుగుతుంది. చెప్పేవాడు క్లుప్తంగా చెప్పవచ్చు. ఏదో థ్రిల్లర్ మూవీ స్టోరీ లా అతిగా వివరించడం వినేవారికి చెప్పేవారికి తలనొప్పి. 


అంతగా కావాలంటే తెలుసుకోవాలి అనుకునేవారు గూగుల్ సెర్చిలో చూసుకోవచ్చు. భారత్ లో సర్జరీ అంటే ఏమిచేస్తారో డాక్టర్ వివరంగా చెప్పడు. వీరు అడగరు. పేషేంట్ ఎదురుగా ఎవరికో జరిగిన సర్జరీ గురించి వినే జబ్బులగురించి ఫెయిల్ అయినా కేసులు గురించి మాటాడకూడదు. 


రోగి పరిస్థితిని బట్టి వయసునుబట్టి క్లుప్తంగా ఆదరంగా ధైర్యం చెబుతూ మాటాడాలి. వారికి విశ్రాన్తి ఇవ్వాలి. ఇంటికి వచ్చే వారికి అతిధి మర్యాదను చేయలేక ఇంట్లోవారికి శ్రమ. అటు పేషేంటును ఇటు అతిధులను ఎంగేజ్ చేయడం కష్టం. 


 భారత్ లో హాస్పటల్స్ గురించి అందరికి తెలిసిందే ! పేరుకి విజిటర్స్ టైము అంటారు కానీ ఎప్పుడు ఐనా అనుమతి ఇస్తున్నారు. ( హాస్పిటల్కి ఇదోరకం పబ్లిసిటీ కాబోలు ) స్పెషల్ రూమ్ తీసుకునే వారికి కొంత పర్వాలేదు. టైము మెయింటైన్ చేస్తారు. షేరింగుకి న్యూసెన్స్ తప్పదు. ఇష్టం వచ్చినట్టు వెడుతూ వస్తూ వుంటారు. 


 మావారికి అపోలో హాస్పిటల్ లో సర్జరీ జరిగింది. అప్పుడు చూసాను. మేము స్పెషల్ రూము తీసుకున్నాం. ఎవరితోనూ సర్జరీ గురించి చెప్పలేదు. చాలా సదుపాయంగా సేఫ్ గా హాపీగా ఇంటికి వచ్చాం. 


మా పిల్లలకి తప్ప ఎవరికీ తెలియచేయలేదు. ఎందుకు అనవసరంగా హంగామా చేయడం? మనిషికి ఎదో ప్రాబ్లెమ్ రాకుండా ఉండదు కదా సాధ్యమైనంత ఈజీగా తీసుకోవాలి. అన్ని సదుపాయాలూ వచ్చాయి. ఎవరి సహాయం అవసరం ఉండదు. తప్పదు అనుకుంటే ఒకే. ప్రతీ దానికి హడావిడి అవసరంలేదు. 


 అమెరికాలో సర్జరీ జరిగితే ఫ్లవర్స్ గెట్ వెల్ సూన్ అనే కార్డు పంపుతారు. పరిచయం వున్న నైబర్స్ అయితే ఫ్రంట్ డోర్ దగ్గిర ఫ్లవర్ బొకే కార్డు వదిలి వెడతారు తప్ప తలుపులు కొట్టి వేళా పాలా లేకుండా ఇంట్లోకి వచ్చి డిస్టర్బ్ చేయరు. ఇది ఎంతో హాయిగా ఎవరికీ ఇబ్బంది కలగని పలకరింపు. ఫ్లవర్స్ చూస్తే ఇష్టపడనివారు వుండరు. పదిరోజులపాటు ఎదురుగా ఉండి రోజూ పలకరిస్తూ ఉంటాయి.. ఆ పూలు. 


మనసుకి సంతోషం ఆహ్లాదం కలిగిస్తాయి. ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎంత చక్కని అనుభూతి!

నాకు అమెరికాలో సర్జరీ జరిగితే.. బంధువుల తాకిడి ఫోను డిస్ట్రబెన్స్ లేనందుకు సంతోష పడ్డాను. 

నా అభిప్రాయం పధ్ధతి ఏమంటే సహజముగా వచ్చే ఆరోగ్య సమస్యలను సహనంతో ఎదుర్కోవాలి,

ఎవరిని శ్రమ పెట్టరాదు అని.


మరి మీరు కూడా నన్ను సమర్థిస్తారు అనుకుంటా! ఇక తప్పని పరిస్థితుల్లో మన సన్నిహితులు, స్నేహితులు వుండనే వుంటారు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ నైస్ డే!

 



********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)





 


41 views0 comments

Comments


bottom of page