#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #PeddaSir, #పెద్దసార్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
Pedda Sir - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 21/12/2024
పెద్దసార్ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఏమిటండీ..! అంత హుషారుగా ఉన్నారు..? లాటరీ గాని తగిలిందా ఏమిటి..?"
"అంత కన్నాపెద్ద విషయమే ప్రియా..! ఐ యాం సో హ్యాపీ..మనకి డబ్బు, పేరు వచ్చే గొప్ప ఛాన్స్ వచ్చిందే.."
"ఏమిటో నాకూ చెప్పరాదూ...నేనూ సంతోషిస్తాను కదూ.."
"మొన్న నాకు రియాలిటీ షో 'పెద్దసార్' నెక్స్ట్ సీజన్ కి కాల్ వచ్చింది..ఆడిషన్ కి రమ్మన్నారు..వెళ్ళాలి.."
"మీరు ఒక్కరే వెళ్తే ఎలా..? నేనూ వస్తాను..జంటగా ఎంట్రీ ఉంటుందిగా.."
"ఇది హనీమూన్ ట్రిప్ కాదే.. అక్కడ ఆటలు ఆడాలి..కష్టపడాలి..ఇక్కడ నువ్వు ఇంట్లో కూర్చున్నట్టు కాదు..తెలుసా..?"
"ఎంత చెప్పండి..! కొన్ని రోజులే కదా..! అయినా, అక్కడ మీరు నా పక్కనే ఉంటారు కదా ..నా పనులు కూడా చెయ్యడానికి.."
"మొన్నటి సీజన్ దాకా కొన్ని రోజులే..! ఇప్పటినుంచి టైం పెంచి..మూడు సంవత్సరాలు చేసారు..నువ్వు ఉండలేవే అక్కడ..వినవే.."
"నేనూ వస్తాను..ఇది ఫిక్స్"
"కానీ వాళ్ళు నన్ను మాత్రమే పిలిచారు.."
"మీకే ఎందుకంట అంత గొప్ప..?"
"ఈ మధ్య కొత్తగా..మనలాంటి మాములు వాళ్ళని కుడా షోకి పిలుస్తున్నారు..ఈ సారి నాకు వచ్చింది ఆ అవకాశం..మనం బోలెడంత సంపాదించుకోవచ్చు"
"అందుకే ఈ సంబడం..అక్కడ పొట్టి పొట్టి బట్టలు వేసుకునే అమ్మాయిలతో ఉండడానికా ఈ హుషారంతా..? నేను వస్తేనే మిమల్ని పంపేది. అయినా మూడు సంవత్సరాలా షో ఏమిటి..? చూస్తే, నెక్స్ట్ సీజన్లో పెన్షన్ కుడా ఇచ్చేలాగా ఉన్నారే..ఏదైనా నేనూ వస్తాను..అంతే "
"కిందటి సీజన్లో టెస్టింగ్ కోసం ఒక కొత్త జంటకి అవకాశం ఇస్తే, వాళ్ళు ఎప్పుడు ఇద్దరూ జంట పక్షుల్లాగా ప్రేమించుకోవడమే తప్ప..అస్సలు సరిగా ఆడనేలేదని ఈ సారి నుంచి అది విరమించుకున్నారు. పైగా నువ్వేమో..మోడరన్ డ్రెస్సెస్ వేసుకోవు..ఎప్పుడూ చీరలే కడతానంటే కుదరదు, అక్కడ పొట్టి గౌన్లు వేసుకున్నవారికే ఎక్కువ మొత్తం ఇస్తారు..వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ.."
"అదికాదు లెండి..! నేను మీ పక్కనే ఉంటే, మీరు అక్కడ ఫ్రీ గా ఉండలేరని మీ బాధ..పైగా ఇంటి పనికి, వంట పనికి సెలవు దొరుకుతుందని కాబోలు తమరికి "
'ఎలా కనిపెట్టిందబ్బా..?'
"వేరే షో ఏదో చూసుకోండి..అయినా ఒకే ఇంట్లో అన్ని రోజులు పొలోమని అంతమందిని పెట్టేసి..ఉండమంటే, ఆడ.. మగ ఎలా ఉంటారు చెప్పండి..? అసలే మీరు నన్ను వదిలి ఉండలేరు కదా.."
"అవుననుకో..కానీ తప్పదు. గెలిస్తే బోలెడంత డబ్బులు ఇస్తారు..మంచి పేరు వస్తుంది. ఓడినా డబ్బులు వస్తాయి..పేరూ వస్తుంది. అందునా మంచి రాయల్ ట్రీట్మెంట్ అక్కడ..ఎంజాయ్ చెయ్యచ్చు..ఒప్పుకోవే.."
"ఏమిటండీ ఆ రాయల్ ట్రీట్మెంట్..తిండికి వాచిపోయిన వారిలాగా, ఎవరో వస్తారనో ఏదో తెస్తారనో చూస్తారు పాపం. మాములుగా జిడ్డు మొహాలే అందరివీ, రోజూ స్నానం చేస్తారో లేదో కుడా డౌట్ నాకు. వీకెండ్ మాత్రం సినిమా హీరో, హీరోయిన్ లాగ ముస్తాబై అందరికీ కిక్ ఎక్కిస్తారు. ఆ చిన్నసార్ మాటలకి అందరూ మురిసిపోయి దండాలు పెడతారు. నిజంగా అన్ని పనులు చేస్తారంటారా అక్కడ అంతా..? ఏదో నాకే పని రాదూ అన్నట్టుగా అంటున్నారు. నిజంగా బాత్రూమ్లు వీళ్ళు కడుగుతారా..? మీకైతే మోకాళ్ళ నొప్పులు మీకు వద్దు.."
"ఛ..ఛ..నేను ఎందుకు చేస్తాను చెప్పు..వాటికి ముందే నో చెప్పేస్తాను..పాజిటివ్ గా ఆలోచించవే ప్రియా "
"అయినా సరే, మీరు అక్కడ ఎంజాయ్ చేస్తుంటే.. నేనిక్కడ ఇంట్లో కూర్చోని రాని వంటను ఎలా వండాలి చెప్పండి ..?"
"పెళ్లైనప్పటినుంచి చెబుతూనే ఉన్నాను వంట నేర్చుకోమని..విన్నావు కాదు. ఇన్నాళ్ళు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి వండి పెట్టాను. అలా అయితే పుట్టింటికి వెళ్ళు..అసలే నువ్వు వొట్టి మనిషివి కుడా కాదు.."
"వద్దండి..నాకూ మంచి పేరు, గుర్తింపు, డబ్బులు కావాలి..ఏం చేస్తారో మరి చెప్పండి.."
"నీకు ఇప్పుడు ఎంట్రీ లేకపోయినా.. మధ్యలో వీడియో కాల్ చేయిస్తారు. పండగైతే, నిన్ను లోపలికి పిలుస్తారు. అప్పుడు మంచి పట్టుచీరలో, నగలతో నిన్ను మేకప్ చేసి లోపలికి పంపిస్తారు ఒక పుట కోసం..నీకు పెద్ద పేరే వస్తుంది..అందరికి గొప్పగా చెప్పుకోవచ్చు. పైగా సెలబ్రిటీస్ వస్తారు..వారితో నువ్వు ఫోటో తీసుకోవచ్చు..మాట్లాడొచ్చు. నువ్వు వచ్చినప్పుడు నాకు ఇష్టమైన, నీకు బాగా వచ్చిన నీ చేతితో చేసిన పులిహోర తీసుకురా..అది తింటూ..నేను సెంటిమెంట్ ఫీల్ అయి ఏడుస్తూ నిన్ను మిస్ అయినట్టు ఎక్కువ బిల్డప్ ఇవ్వాలి..సెంటిమెంట్ పండితే ఒక లక్ష ఎక్కువే మనకి.."
"లక్షంటే మాటలా..! ఒక తులం బంగారం ప్లస్ పట్టుచీరలు.."
"అవీ నీకే ఇచ్చేస్తాను ప్రియా.."
"అలాగే లెండి. మీరు నా కోసం ఏడుస్తారో లేదో..పులిహోరలో ఒక రెండు చెంచాలు కారం తగిలించి తీసుకొస్తాను లెండి..అసలే అక్కడ ఆడవారిని చూసిన ఆనందంలో మీకు ఏడుపు వస్తుందో రాదో..! ఇంకొక విషయం..అక్కడ పెద్దసార్..గట్టిగా, తెలుగుని ముక్కలు ముక్కలు చేసి..ఆగి ఆగి, పదాలని సాగదీసి మాట్లాడుతాడు కదా..అతనితో నేను ఒక సెల్ఫీ తీసుకుంటానండి.."
"నీ ఇష్టం..మొత్తానికి దారిలో పడ్డావులే..! నాకు ఇచ్చే అన్ని లక్షలు ఎవరి కోసం చెప్పు..? నేను వచ్చాక..ఆ డబ్బులతో నీకు నగలు, చీరలు కొంటానే..! ఇప్పటికైనా నవ్వుతూ ఓకే చెప్పవే .."
"మీరు ఆఖరున చెప్పిన మాటలు వింటుంటే మాత్రం..ఎందుకో నాకు తెగ ఆశ పుడుతోంది. మిమల్ని పంపించాలనే ఉంది..కానీ వారానికొకసారి పూల చొక్కాలు వేసుకుని వస్తాడు చిన్నసార్ క్లాస్ పీకడానికి..కాస్త చూసుకోండి అంతే..! " అంటూ నవ్వింది భార్య ప్రియ
"మొత్తానికి ఒప్పుకున్నావు..అదే చాలు. నేను బయటకి వచ్చేసరికి..మనకి పుట్టే అమ్మాయికో అబ్బాయికో మంచి పేరు పెట్టి..మంచి స్కూల్ లో అడ్మిషన్ చూసి ఉంచు ప్రియ.."
********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Bagundi