#PeddalaMataVinteMelu, #పెద్దలమాటవింటేమేలు, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #పిల్లలకథలు, #TeluguChildrenStories

Peddala Mata Vinte Melu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 24/02/2025
పెద్దల మాట వింటే మేలు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఊరి బయట వ్యవసాయ పొలం మోటబావిలో కప్పలు, ముసలి తాబేలు నివాసముంటున్నాయి.
'మిక్కీ' బాండ్రు కప్పపిల్ల అపుడప్పుడు నూతిలోని బండరాతి మీద కూర్చుని ఎండలో చలి కాచుకుంటుంది. ఆ సమయంలో తాబేలు తాత కూడా నీటి బయటికొచ్చి ఎండ కాగేది.
ఎండ ఉన్నప్పుడు నూతి గట్టు మీద కాకులు, గోరొంకలూ వచ్చి కబుర్లు చెప్పుకునేవి.
మిట్ట మధ్యాహ్నమైనందున సూర్యుడి ఎండ కాంతి తిన్నగా నూతి నీటి మీద పడి మెరుస్తూ కనబడేది.
చీకటి పడినప్పుడు నూతిలో వెలుగు లేక నల్లగా కనబడటం చూసిన మిక్కీ పగలు ఎండ కాగుతున్నప్పుడు తాబేలు తాతని తన మనసులోని అనుమానాన్ని వ్యక్త పరిచింది.
"ఓ అదా ! అదంతా వేరు ప్రపంచము. నూతి గట్టు బయట మనుషులు, పక్షులు, అనేక జంతువులు, కొండలు, చెట్లు ఉంటాయి. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, నక్షత్రాలు కనబడతాయి.
సూర్యుడి వల్ల ఎండ వచ్చి కాంతిగా ఉంటే పగలనీ, సూర్యకాంతి లేక నల్లగా ఉంటే రాత్రి అనుకుంటారు బయటి ప్రపంచ జీవులు.
అక్కడ పగలు కొన్ని ప్రాణులు జీవిస్తే రాత్రి చీకటిలో మరికొన్ని ప్రాణులు సంచరిస్తాయి. మనకి పగలైనా రాత్రైనా ఇక్కడే జీవితం " అని వివరణ ఇచ్చింది.
తాబేలు తాత మాటలు విన్న మిక్కీ కప్పపిల్ల " తాతా, తాతా ! నాకు నూతి బయటి ప్రపంచాన్ని చూడాలనుంది. మనుషుల్నీ, జంతువుల్నీ, కొండలు చెట్లూ చూస్తాను " గోముగా అడిగింది.
"వద్దురా, బిడ్డా ! అక్కడ మనం ఉండలేము. మన ప్రాణాలకు రక్షణ ఉండదు. నీలాంటి చిట్టి ప్రాణుల్ని పాములు, గుడ్లగూబ డేగ వంటి పక్షులు పట్టుకు తినేస్తాయి. వేసంగి ఎండలకు చెరువులు గుంతలూ నూతులు నదులూ నీళ్లు లేక ళఎండిపోతాయి. నీళ్లు లేకపోతే సచ్చిపోతాము. ఇక్కడైతే సంవత్సరం పొడవునా నీరుండి నాచు, పురుగులు ఆకులూ తినడానికి లబ్యమవుతాయి.
నేను చిన్నప్పుడు అక్కడి ప్రపంచాన్ని చూసాను కాబట్టి చెబుతున్నాను. భూమి మీద జనాలు ఏది కనబడితే దాన్ని పట్టుకుని తినేస్తారు. నేను మా అమ్మా నాన్నతో కలిసి పెద్ద చెరువులో నివాసం ఉండేవాళ్లము.
ఒకరోజు కొంతమంది మత్స్యకారులు చేపలు పట్టడానికి చెరువులో వలలు వేస్తే చేపలతో పాటు అమ్మా నాన్నలు వారి వలలో చిక్కితే వెంట పట్టుకుపోయారు. నాఅదృష్టం బాగుండి గట్టునున్న రాళ్లలో ఉండబట్టి ప్రాణాలతో బయట పడ్డాను.
తర్వాత కొంతమంది పిల్లలు చెరువు గట్టు మీద ఆడుకుంటు నన్ను చూసి పట్టుకుని ఈ పంటపొలం దిగుడు బావిలో పడేసారు అప్పటి నుంచి నా జీవితం ఇక్కడే హాయిగా సాగిపోతోంది. " తన జీవిత అనుభవం తెలియ చెప్పాడు తాబేలు తాత.
"లేదు, తాతా ! నాకు బయటి ప్రపంచం చూడాలని ముచ్చటగా ఉంది " అని మొండి పట్టు పట్టింది మిక్కీ.
అప్పుడే అక్కడికి వచ్చిన తల్లి కప్ప విషయం తెలుసుకుని చిన్నూ, అలా అల్లరి చెయ్యొద్దని మందలించింది. ఎవరెన్ని చెప్పినా మిక్కీ తన మంకు పట్టు వదల లేదు. " అలాగే లే " అని అప్పటికి శాంతింప చేసారు తాబేలు తాత, తల్లి కప్ప.
కొద్ది రోజుల తర్వాత వర్షాలు పుష్కళంగా కురిసి మోటబావి నిండా నీళ్లు చేరి గట్టు వరకూ వచ్చాయి.
పొలం యజమాని వ్యవసాయానికి మోటబావి నుంచి నీళ్లు తోడటం మొదలు పెట్టాడు.
ఇదే అదను అనుకుని కప్పపిల్ల మిక్కీ మోట బకెట్లో దూకింది. నీటితోపాటు గట్టుపై కొచ్చింది. మిక్కీని గమనించిన తాబేలు తాత హెచ్చరించే లోపున మోటబకెట్టు పైకి వెళిపోయింది. తాత కేకలు విన్న తల్లికప్ప గాబరా పడసాగింది. వారికి ఏం చెయ్యడానికి తోచడం లేదు.
నీటితో పాటు గట్టు పైకి చేరిన మిక్కీ రైతునీ పంటపొలాల్ని, గట్టు మీదున్న చెట్లనీ చూసి ముచ్చట పడసాగింది.
పక్క పొదలోంచి పెద్ద నాగుపాము బుస్సున పైకి వచ్చి మిక్కీని మింగబోయింది. పామును చూసిన రైతు కట్టె తీసుకుని పామును చంపేసాడు.
మిక్కీ ఇంకా ముందుకు వెల్దామని గెంతుకుంటూ వెళ్లబోయింది. ఇంతలో చెట్టు మీదున్న గెద్ద ఎగురుతు వచ్చి మిక్కీని కాళ్లతో పట్టుకోపోయింది. గబుక్కున బురద గుంటలో దూకి ప్రాణం రక్షించుకుంది.
బాబోయ్, తాబేలు తాత చెప్పినట్టు బయటి ప్రపంచమంతా ప్రమాదకరమని గ్రహించి మెల్లగా మెల్లగా గట్టు వరకు వచ్చి కాళీ మోటబకెట్లో దూకి నూతిలోకి చేరింది మిక్కీ.
ప్రాణాలతో మిక్కీ తిరిగి వచ్చినందుకు ఆనందపడ్డాయి తల్లి కప్ప, తాబేలు తాత.
"పిల్లలూ, పెద్దలు చెప్పే మంచి మాటలు వింటే ఆపదల నుంచి కాపాడుకోవచ్చు"
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
సర్, మీ కథ నచ్చి మా ఇంట్లోని చిన్న పిల్లకు విన్పించాను. చాలా ఆసక్తిదాయకంగా ఉంది అన్నారు.