top of page

పెళ్ళాం ఊరెళ్ళింది


'Pellam Urellindi - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 26/10/2023

'పెళ్ళాం ఊరెళ్ళింది' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"ఒరేయ్ సుబ్బు! కోడలు ఎప్పుడు వస్తుంది రా ఇంటికి?"


"రెండు రోజుల్లో వచ్చేస్తుంది లే అమ్మా!"


"ఎప్పుడూ నీ పెళ్ళాం ఊరు వెళ్ళడం...నాకు నువ్వు ఫోన్ చేసి రమ్మనడం...ఏమిటి రా ఇది? మొగుడూ పెళ్ళాం అంటే, కొంచం సర్దుకుపోవాలి కదరా! ఇప్పటికి ఇది మూడో సారి..నేను ఇలా రావడం"


"వచ్చేస్తుంది లే అమ్మ! మా ఆవిడ ఇలా వెళ్లి.. అలా వచ్చేస్తుంది..రెండు రోజుల్లో"


"ఎప్పుడూ చూస్తూనే వున్నాను కదా!"


"వచ్చేస్తుంది లే..నన్ను నమ్ము అమ్మా!"


"ఇంతకీ నీకూ కోడలికి వచ్చిన గొడవ ఏమిటో చెప్పమంటే..ఎప్పుడూ చెప్పవు.."


"టైం వచ్చినప్పుడు చెబుతాను లే!"


"ఒరేయ్ సుబ్బు! రెండు రోజులు అవుతుంది..పెళ్ళాం ఎందుకు రాలేదు? ఫోన్ చెయ్యరా! అంత బెట్టు ఎందుకు? అసలు గొడవ దేని గురించో నాకు చెప్పాల్సిందే...ఈ రోజు..”


***

ఆ రోజు నేను రమ్య తో కలిసి టీవీ లో సీరియల్ చూస్తున్నాను. సీరియల్ ఇంక అయిపోతుందనగా, సస్పెన్స్ లో ఆపేసాడు. నేనేమో అత్తగారిని కోడలు చంపేస్తుందని...కాదు కోడలిని అత్త చంపేస్తుందని రమ్య నాతో గొడవ పడింది..


"అవును లెండి! కోడలంటే అంత చెడ్డదా మీకు..అంటే నేనే అంత చెడ్డ కోడలినా? చెప్పండి..ఏదో మీ అమ్మ చాలా మంచిది అయినట్టు చెబుతున్నారు"


"మధ్యలో మా అమ్మ ఎక్కడ నుంచి వచ్చింది రమ్య?"


"అయితే కోడలిని చంపేస్తుందిలే...ఆ అత్తగారు. ఇప్పుడు ఓకే నా?"


"అంటే...నన్ను చంపేస్తారా? మీరు ఉండి ఏమిటి చేస్తున్నారు మరి! మీ అమ్మగారు నన్ను చంపేస్తుంటే?...నా మీద మీకు అసలు ప్రేమ లేదండీ!"


"మధ్యలో నేనేం చేసాను?"


"మళ్ళీ సీరియల్ వచ్చే వరకూ ఈ సస్పెన్స్ ఉంటుంది రమ్య! ఇక చాలు ఆపు"


"లేదండీ! మీకు మీ అమ్మంటేనే చాలా ఇష్టం...నేనంటే అసలు ఇష్టం లేదు...నేను పుట్టింటికి వెళ్ళిపోతాను..మీ అమ్మనే పిలుచుకుని సేవలు చెయ్యండి"


"అదేంటే! అలా అంటావు..ఎప్పుడూ ఏదో దానికి గొడవ పెడతావు"


"అంటే! ఎప్పుడూ నేను గొడవ పెట్టే దానిలా కనిపిస్తున్నానా?"


అలా అనేసి బట్టలు సర్దుకుని...వెళ్ళిపోయింది.


"బాగుంది రా! ఇద్దరూ నన్ను కుడా ఇరికించి, మరీ కొట్టుకున్నారు. మరి అంతకు ముందు ఏం జరిగిందో?"


"కిందటి సారేమో..RRR సినిమా కోసం..RRR సినిమా లో రామ్ చరణ్ బాగా చేసాడని నేను...కాదు జూనియర్ ఎన్టీఆర్ బాగా చేసాడని రమ్యా..మాట్లాడుకున్నాం"


"మాట్లాడుకున్నారా? గొడవ పడ్డారా?"


"మాట్లాడుకుంటూ..ఆ తర్వాత గొడవ పడ్డాం అమ్మా!"


"దానిలో గొడవ పడడానికి ఏముంది?"


"చిరంజీవి ఫ్యాన్ కాబట్టి..మీరు రామ్ చరణ్ బాగా చేసాడని అంటున్నారు" అని రమ్య అలిగింది.

"నేనేమో.. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి..నీకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమని రమ్య తో అన్నాను"


అంతే! అప్పుడు పుట్టింటికి బయల్దేరింది రమ్య..


"దీనికన్నా ముందేమో ఎన్టీఆర్ గ్రేట్ అని రమ్యా, ఏయన్ఆర్ గ్రేట్ అని నేను..ఇద్దరికీ గొడవ"


"చాలా బాగుంది రా!ఇలాంటి మొగుడూ పెళ్ళాం గొడవ ఎక్కడా చూడలేదు..వినలేదు..పోనీ..ఇప్పుడు ఆ సీరియల్ పెట్టు..చూస్తాను.."


"నిజమే! ఇప్పుడు ఆ సీరియల్ వస్తుంది కదా!"


సీరియల్ మొదలయింది..అత్తా కోడలు మధ్య గొడవ కంటిన్యూ అవుతోంది..సడన్ గా ఇద్దరూ కలసిపోయారు.. హ్యాపీ గా మాట్లాడుకుంటున్నారు..


"చూసావా సుబ్బు! ఇలానే ఉంటుంది"


సీరియల్ అయిపోగానే, రమ్య ఇంటికి వచ్చేసింది...ఇక్కడ కూడా అందరూ హ్యాపీ!


"సీరియల్స్, సినిమాలు ఆనందించడానికి చూడండి..కొట్టుకోవడానికి కాదు.." అని అత్తగారు హితబోధ చేసింది.


"అలాగే అత్తయ్యా!"


"సరే అమ్మా!"


“ఇక మీదట ఇద్దరూ చక్కగా ఉండండి..”


*****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ




Comments


bottom of page