top of page
Writer's pictureBVD Prasada Rao

పెళ్ళి అయ్యేది


'Pelli Ayyedi' New Telugu Story


Written By BVD Prasada Rao


(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

కిరణ్మయి.. ఫోన్ కాల్ కి కనెక్టయ్యింది.

"హలో.. ఇటు రాజాకిరణ్.. అటు కిరణ్మయి."

"య. య. హలో." కిరణ్మయి మెత్తగా పలికింది.

"పెద్దల సూచన ప్రకారం.. మనం కలవాలి." రాజాకిరణ్ తన కాల్ కు కారణం

వెల్లడించాడు.


"య. య." కిరణ్మయి వాల్ క్లాక్ ను చూసింది. 9-58.

"నేను మీ పోర్షన్ ముందే ఉన్నాను." రాజాకిరణ్ మాట్లాడుతున్నాడు.

"అవునా. వచ్చేసారా." విస్మయంలో ఉంది కిరణ్మయి.

రాజాకిరణ్ సరళంగా మెసులుతున్నాడు.


"వస్తున్న. డోర్ తీస్తున్న." కిరణ్మయి కదిలింది.

"నోనో. ప్లీజ్. 10-02కు తీయండి." రాజాకిరణ్ గందికయ్యాడు.

కిరణ్మయి ఆగి పోయింది.

"మా పెద్దల సూచన. మనం సరిగ్గా 10-02కి చూసుకుంటే.. మంచిదట."

రాజాకిరణ్ చకచకా మాట్లాడేసాడు.

కిరణ్మయి చిన్నగా నవ్వుకుంది. వాల్ క్లాక్ ను చూస్తుంది.

09-59-31.


ఆ ఇద్దరూ ఇంకా కాల్ లోనే ఉన్నారు.

"థ్రిల్లింగ్ గా ఉంది." రాజాకిరణ్ కుతూహలంలో ఉన్నాడు. అతడు తన చేతి

వాచీలోకి గుచ్చి గుచ్చి చూసుకుంటున్నాడు.

"ఉ. య. నాక్కూడా." కిరణ్మయి బిడియమవుతుంది. ఆమె చూపులు వాల్

క్లాక్ మీద తచ్చాడుతున్నాయి.

10-00-01.


"మీరు.. ఫ్రెండ్స్ తో ఉంటున్నారని విన్నాను." రాజాకిరణ్ సంశయంతో

ఊగిసలాడుతున్నాడు. అతడి చూపులు మాత్రం మారడం లేదు.

"య. బట్.. ఫ్రెండ్స్ అనే కన్న.. కోమేట్స్ అంటే కరెక్ట్. రిక్వెస్ట్ తో.. వాళ్లను మరో

చోటుకు.. ఉదయం నైన్ థర్టీకే సాగనంపాను. మీరు 10కి వస్తారని తెల్పబడింది."

కిరణ్మయి తొట్రుబడుతుంది. ఆమె చూపులు 10-02కై ఆరాటపడుతున్నాయి.

ఇద్దరి మధ్య మాటలు ఆగాయి.

10-01-50.


"డోర్ దగ్గరకి వచ్చేయండి." రాజాకిరణ్ జల్దుకున్నాడు.

"అలానే" కిరణ్మయి అప్పటికే డోర్ దరికి చేరిపోయి ఉంది.

"ఫైవ్.. ఫోర్.. త్రీ.." రాజాకిరణ్ కౌటింగ్ కొనసాగిస్తున్నాడు.

కిరణ్మయి కుడి చేయి డోర్ బోల్ట్ మీద చేరి ఉంది.

"టు.. ఒన్." రాజాకిరణ్ ఆవురావురన ఉన్నాడు.

10-02.

కిరణ్మయి డోర్ తెరి చేసింది.


ఆ ఇద్దరూ గమ్మున.. ఒకరిని ఒకరు.. చూసేసుకున్నారు.

పిమ్మట.. ఆ ఇద్దరు.. ఒకే మారు ఊపిరి పీల్చుకున్నారు. సుతిమెత్తగా

నవ్వుకున్నారు.. తర్వాత.. ఆ వెంబడే.. బయటికే చకచకా నవ్వేసారు.

"వెల్ కమ్." కిరణ్మయి తొలుత తేరుకుంది. అడ్డు తప్పుకుంది.

రాజాకిరణ్ లోనికి ప్రవేశించాడు.

కిరణ్మయి డోర్ మూసి.. రాజాకిరణ్ తో కలిసి.. హాలు వరకు నడిచింది.

"ప్లీజ్. కూర్చొండి." లాంగ్ సోఫా చూపింది.


రాజాకిరణ్ కూర్చున్నాడు.

కిరణ్మయి దరిలోనే ఉన్న సింగిల్ సీట్ సోఫాలో కూర్చుంది.

"కాల్ కట్ చేస్తున్నా." కిరణ్మయి ఆ పని కానిచ్చింది.

రాజాకిరణ్ నాలుక కర్చుకున్నాడు. చేతి లోని ఫోన్ ని పక్కన పడేసాడు.

ఇద్దరి మధ్య కొద్దిసేపు మౌనం.

"కాఫీ.. టీ.. ఫ్రూట్ జూస్.." కిరణ్మయి నసుగుతుంది.


"ప్రస్తుతం ఏమీ వద్దు. థాంక్స్.. నెక్స్ట్." రాజాకిరణ్ సెటిలయ్యాడు.

"నెక్స్ట్." కిరణ్మయి రిపీట్ చేసింది. అతడినే చూస్తుంది.

"మీ బయోడేటా పేపర్ ను.. ఎన్ క్లోజర్స్ ను.. పరిశీలించాను. గుడ్. బట్.."

రాజాకిరణ్ ఆగాడు.

"బట్.." కిరణ్మయి వెంటనే స్పందించింది.


"మీరు.. పంపిన మీ ఫోటోలోలా లేరు." రాజాకిరణ్ చిన్నగా నవ్వుతున్నాడు.

"బాలేనా." కిరణ్మయి వింతయ్యింది.

"అబ్బే. అది కాదు. ఫోటోలో కంటె.. బాగా ఉన్నారు." రాజాకిరణ్ హాయయ్యి

ఉన్నాడు.

"రియల్లీ. థాంక్యూ వెరీ మచ్." కిరణ్మయిలోని ఆడది నికరంగా పొంగి పొర్లి

పోతుంది.


"మరి నా గురించి.. మీ అభిప్రాయం." రాజాకిరణ్ తంటా పడుతున్నాడు.

కిరణ్మయి చక్కగా నవ్వుకుంది. చూపు మార్చుకుంది.

"ఫోటోలోని మీరు.. మీ వివరాలు.. నచ్చేక.. మా వాళ్లు నా అభిప్రాయం

తెలుసుకొనేక.. మనకు ఇలా కలిసే అవకాశం కల్పించబడింది."


"థట్స్ ఫైన్. నిజమే.. మీ వాళ్లే.. తొలుత.. పెళ్లి చూపులు ఇలా ఉంటే

బాగుంటుందని ప్రపోజ్ చేసారు. మా వాళ్లు చివరికి ఒప్పుకున్నారు. ఏమైనా.. నిజమే

స్మీ. ఈ ఏర్పాటు పసందుగా ఉంది."

"మరే.. మా వాళ్లు కాస్తా పార్వర్డ్." కిరణ్మయి గొప్పవుతుంది.

"మరి మీరు." రాజాకిరణ్ ఆ సందును వాడుకున్నాడు.

"అప్ కోర్స్. వై నాట్. ఐ యాం ఆల్సో."

రాజాకిరణ్.. ఆమెనే చూస్తున్నాడు.


"ఈ రోజుల్లోని అవసరం మేరకు.. అవకాశం వరకు.. మేము

నడుచుకుంటున్నాం. మరి మీరు స్వాగతించలేరా."

"వైనాట్. మీ క్లారిఫికేషన్ తో మరింత పట్టుగా స్వాగతించగలను."

"థాంక్యూ ప్లీజ్."

"వెల్ కమ్ ప్లీజ్."


ఇద్దరూ మెత్తగా నవ్వుకున్నారు.

"వాట్ నెక్ట్స్." రాజాకిరణ్ ఆత్రమవుతున్నాడు.

"వాట్ నెక్ట్స్." కిరణ్మయి రిపీట్ చేసింది. సన్నగా నవ్వుతుంది.

"టీ." రాజాకిరణ్ కోరాడు.

"విత్ బిస్కెట్స్." కిరణ్మయి లేచింది.


"నో. టీ ఓన్లీ." రాజాకిరణ్ చిరునవ్వు చిందించాడు.

కిరణ్మయి కిచన్ వైపు నడిచింది.

రాజాకిరణ్ చుట్టూ చూస్తూ లేచాడు. మెల్లిగా కిచన్ లోకి ప్రవేశించాడు.

కిరణ్మయి గుర్తించింది.

"నా వంటలు చౌచౌ. ఐనా రుచిగానే ఉంటాయి."


"అట్లానా. టీ తాగేక నేను వ్యాఖ్యానిస్తా."

కిరణ్మయి నవ్వేసింది.

రాజాకిరణ్ చుట్టూ చూసాడు.

"వాట్ ఈజ్ దిస్. అన్నీ ఒకటి కంటె ఎక్కువ అగుపిస్తున్నాయి. ఐ మీన్.. స్టవ్స్..

మూడు ఉన్నాయి.. అలానే.."


కిరణ్మయి అడ్డు పడింది. "య. ఈ పోర్షన్ లో షేరింగ్ తో ముగ్గురం ఉంటున్నాం.

సో. ప్రతిదీ మూడేసి ఉంటాయి. ఎవరివి వారివే." ఈజీగా నవ్వింది.

రాజాకిరణ్ తలాండించాడు.

కిరణ్మయి టీ తయారు చేస్తుంది.

"షుగర్.."

"లైట్ గా."


"థట్స్ వెరీ నైస్. మీ హెల్త్ ఛార్ట్ బాగుంది." కిరణ్మయి సంతృప్తిగా ఉంది.

"ప్రతీ ఆరు నెలలకు ఒక మారు అన్ని పరీక్షలు తప్పనిసరిగా

చేయించుకుంటాను. హెల్త్ ఈజ్ వెరీ ఎసెన్షిల్." రాజాకిరణ్ నిర్భీతయ్యాడు.

"థట్స్ గుడ్. టీ రడీ."

రాజాకిరణ్ ఒక కప్పు తీసుకున్నాడు. కదిలాడు.

కిరణ్మయి రెండో కప్పుతో అనుసరించింది.

ఇద్దరూ హాలులోకి వచ్చి కూర్చున్నారు. టీ తాగుతున్నారు.

"అచ్ఛా. నిజంగా మీ చేతి ప్రిపరేషన్ పసందుగా అనిపిస్తుంది. టీ చాలా

బాగుంది."

"థాంక్యూ." కిరణ్మయి ఆనందమవుతుంది.

"టేస్ట్ కే కాదు.. హెల్దీ పేరామీటర్స్ ను కూడా మరీ దృష్టిలో పెట్టుకుంటాను."

"తెలుస్తుంది."


ఇద్దరూ టీ తాగారు. ఖాళీ కప్పులను టీపాయ్ మీద పెట్టేసారు.

"వాట్ నెక్ట్స్." రాజాకిరణ్ ప్రయత్నిస్తున్నాడు.

"వాట్ నెక్ట్స." కిరణ్మయి తన ఫ్లోలోనే తాను ఉంది.

ఇద్దరూ మరలా నవ్వుకుంటున్నారు.

రాజాకిరణ్.. తొలుత తన నవ్వునే బ్రేక్ చేసాడు.


"మీరు బాగున్నారు. అలానే.. మా వాకబులతో మీరిచ్చిన మీ వివరాలు

సరిపోయాయి. సో. మన పెద్దల తదుపరి చర్యలకు.. నేను గ్రీన్ సిగ్నేల్ పలికేస్తాను.."

కిరణ్మయి అడ్డైంది. "వాట్. వాకబులా.. అదేం పోకడా." తను విడ్డూరంలో

పడుంది.

రాజాకిరణ్ తికమకవుతున్నాడు.


"హుష్.. మనకు పొసగదు. నా పెళ్లికై.. నేను మరో ఛాన్స్ తీసుకుంటాను."

కిరణ్మయి నిక్కచ్ఛిగా ఉంది.

"అదేమిటి." రాజాకిరణ్ తంటాలవుతున్నాడు.

"య. వాకబులతో జీవనం కొనసాగింపు వేస్ట్. నమ్మకం లేని చోట నేను

మెసలలేను. సో. నో మోర్ ప్లీజ్." కిరణ్మయి కఠినమవుతుంది.

రాజాకిరణ్ కంగారవుతున్నాడు.


"దయచేసి మీరు నాకై ప్రయత్నం విరమించేయండి." కిరణ్మయి సూటితనం

చూపింది.

రాజాకిరణ్ నోరు పెగలడం లేదు.

కిరణ్మయి లేచింది. డోర్ బార్లా తీసేసింది.


రాజాకిరణ్ తప్పక లేచాడు.

"మీ ఫోన్." కిరణ్మయి గుర్తు చేసింది.

రాజాకిరణ్.. ఒంగి.. తన ఫోన్ ను తీసుకున్నాడు.. కదిలి.. బయటికి పోయాడు.

అలా పోతూ.. 'నా అఇష్టాలు.. నీకూ అఇష్టాలు అవ్వాలి' అని తను అనుంటే..

'తనకై నేను సరే అనేవాణ్ణి.' అనుకున్నాడు.


అదే సమయాన.. కిరణ్మయి.. 'నాకు నచ్చనివి.. తను ఇకపై చేయను' అని తను

అనుంటే.. 'తనకై నేను సరే అనేదాన్ని.' అనుకుంది.


కానీ.. ఆ ఇద్దరిలో కనీసం ఒకరు.. బయలు పడుంటే.. 'వారికి పెళ్ళి అయ్యేది.'

***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





136 views0 comments

Comments


bottom of page