top of page
Writer's picturePitta Govinda Rao

పెళ్లికి వేళాయె


'Pelliki Velaye' - New Telugu Story Written By Pitta Gopi

'పెళ్లికి వేళాయె' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఈరోజుల్లో ప్రేమించని వాళ్ళు ఎవరూ కనపడరు.

పైగా పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకునే వాళ్ళు లేకపోలేదు.


ఆ కోవకు చెందిన వాళ్ళే చరణ్ - పూజ లు


ఎనిమిదేళ్ళ ప్రేమ వాళ్ళది.


అయితే చరణ్ కంటే పూజ ఒక్క ఏడాది చిన్న వయసు. అయినా చరణ్ ఎక్కడ చదివితే పూజ అక్కడ చేరేది.


సంవత్సరాలు మారినా.. చదువులు మారినా.. ఇద్దరు ఒకే పాఠశాల, ఒకే కళాశాలలో చదువు కొనసాగించి తమ ప్రేమ గొప్పదని చాటి చెప్పుకున్నారు.


చరణ్ నిజాయితీ పూజకి నచ్చింది. అందుకే ఎన్ని సంబంధాలు వచ్చినా కాదనుకుని తల్లిదండ్రులను ఒప్పించింది.


నిజంగా చరణ్ మంచివాడు.


గ్రామంలో వారితోనే కాదు, అందరితో కలిసిపోగల నేర్పరి.


చరణ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వెంటనే ఒక కంపెనీలో చేరాడు.


ఎప్పుడు వీలు దొరికిన పూజతో ఫోన్ మాట్లాడటమే అతని హాబీ.


పూజకు ఫోన్ చేసి "మరో రెండు మూడు నెలల్లో మన ప్రేమ విషయం మా అమ్మనాన్నలకి చెప్పి మీ పెద్దలతో మాట్లాడిస్తే మన పెళ్ళికి ఏర్పాట్లు చేస్తా”రని హుషారుగా చెప్పాడు చరణ్.


"రెండు మూడు నెలలా.. ముందు వాళ్ళు ఒప్పుకుంటే ఎన్ని నెలలైనా నాకు నో ప్రాబ్లమ్ చరణ్ "


"అదేంటీ.. తప్పకుండా నీ మాట వింటారన్నావ్ కదా"..

"భయపడకు. తప్పకుండా వింటారనే నమ్మకం ఉంది. అయినా ఏదో మూల భయం ఉండదా చెప్పు"


"సరే ఎలాగోలా మీ వాళ్ళని ఒప్పించు. ఎలాగైనా మనం ఒకటి కావాల్సిందే. లేకపోతే నేను బతకలేను.. " అంటాడు చరణ్.


"అరేయ్ పిచ్చోడా.. నువ్వు లేకపోతే మరి నేను ఉండగలనా.. తప్పకుండా ఒప్పిస్తా. సరేనా "


“హు సరే. ఉంటాను" అని ఫోన్ కట్ చేస్తాడు.


ఒకరోజు ఇంటికి వచ్చిన పూజా తో


"నీకు పెళ్ళి సంబంధం చూశామమ్మా! అబ్బాయి మాకు తెగ నచ్చేశాడు. ఇక నీ జీవితానికి ఏ ఢోకా ఉండదు " అన్నాడు తండ్రి వెంకటాద్రి.


"అప్పుడే పెళ్ళా.. ఒక రెండు మూడు నెలలు ఓపిక పట్టండి నాన్న.. "


"ఇంకా మేం ఓపిక పట్టలేమమ్మా. చాలా సంబంధాలు వద్దన్నావ్. ఇప్పుడు చదువు కూడా పూర్తి అవుతోంది. అబ్బాయి చాలా మంచోడట. మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడట. పరీక్షలు అవగానే నీ పెళ్ళి. అంతే " అన్నాడు వెంకటాద్రి.


సహనం కోల్పోయిన పూజ "నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను చేసుకోను" అన్నాది.


"ఎవరినైనా ప్రేమించావా.. " అడిగింది తల్లి రాధిక.


"ప్రేమించాను" చెప్పింది పూజ.


"చూడమ్మా పూజ.. నీ ప్రేమ విషయం ఇన్నాళ్లు దాచుకుని ఎన్నో సంబంధాలు వద్దని, ఇప్పుడు మాకు నచ్చిన సంబంధం కాదంటే ఎలా ?


పైగా నీ మీద నమ్మకంతో ‘అమ్మాయిదేముంది.. మా ఇష్టమే అమ్మాయి ఇష్టం’ అని ఒప్పేసుకున్నాం. అబ్బాయి మంచి చెడులు మాకు బాగా తెలుసు. నువ్వు ప్రేమను మర్చిపో. ఈ సంబంధం కాదనకు. ఇదిగో అబ్బాయి ఫొటో" అంటూ ఫొటో ఇచ్చి వెళ్ళిపోతాడు.


పూజ బాధతో ఆ ఫొటో ముఖం కూడా చూడకుండా చించి డస్ట్ బిన్ లో పడేస్తుంది.


పూజ పరీక్షల కోసం సిద్ధం అవుతుంది. ఒకరోజు అనుకోకుండా చరణ్ గట్టిగా వాటేసుకుని ఏడుస్తాడు. తేరుకున్న పూజ చరణ్ ను చూసి తానూ హత్తుకొని ఏడుస్తుంది.


"చరణ్! మన పెళ్లికి మా వాళ్ళు ఒప్పుకోలేదు సరికదా వేరే అబ్బాయి సంబంధం చూశారు. నిన్ను వదిలి నేను ఉండలేను రా".. అని ఏడుస్తుంది.


"పూజా! మా వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ని నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటానంటే.. ‘ఇప్పుడు చెప్తావా.. మేము అమ్మాయి తరపు వాళ్ళకి మాట ఇచ్చేశాం. కులము మతము మాకు లేదు కానీ.. ఇప్పుడున్న పరిస్థితులలో ఆ అమ్మాయి ని మర్చిపో’ అన్నారు” అని ఏడుస్తూ చెప్తాడు.


"మనిద్దరం చచ్చిపోదామా" అంటుంది పూజ.


"అదొక్కటే మార్గం" అంటాడు చరణ్.


"ప్రేమ విఫలం అయితే చచ్చిపోవటమే పరిష్కారం కాదు. విడిగా ఉన్నా.. ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు. మీరు చనిపోయి తల్లిదండ్రులకు, మాకు విషాదం కలిగించకండి" అంటూ స్నేహితులు వచ్చి చెప్తా.


"బతికి కూడా ఒకరిపై ఒకరు ప్రేమని పంచుకోవచ్చు. చనిపోతే మీ ప్రేమని గెలుపించుకున్నట్లేనా.. ఎలా.. ఆలోచించండి " అని వెళ్ళిపోతారు.


దీంతో చరణ్ - పూజలకు ఏం చేయాలో పాలుపోక ఏం మాట్లాడకుండానే ఎవరి దారిన వాళ్ళు పోతారు.


పూజ వరుడి ఇంటికి వెళ్ళే ముందు చరణ్ కి ఫోన్ చేస్తుంది.


"చరణ్ నా పెళ్లికి వస్తున్నావు కదూ.. ” అని ఏడుస్తుంది.


"సారీ పూజా! ఈ రోజే నా పెళ్ళి కూడా. అమ్మాయి ముఖం కూడా చూడకుండా పెళ్ళి చేసుకోవల్సి వస్తుంది అని కలలో కూడా ఊహించుకోలేదు"


"నన్ను కూడా అబ్బాయి ని చూడమని ఫొటో ఇస్తే నీ మీద ప్రేమతో అబ్బాయి ని చూడకుండానే చించిపడేశా. నీలాంటి పరిస్థితి నాది కూడా. పైగా చివరిగా చూసేందుకు కూడా వీలులేకుండా ఇద్దరి పెళ్లి ఒకేరోజు వేర్వేరు వాళ్ళతో ముడిపెట్టాడీ దేవుడు " బిగ్గరగా ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది.


పెళ్లి పీటల మీద తల్లిదండ్రులను గమనిస్తున్నాడు చరణ్. వాళ్ళు అమ్మాయి తల్లిదండ్రులతో ఎంతో సందడి చేస్తు గడుపుతున్నారు.


ఇంతలో పెళ్ళి కుమార్తె వస్తుంది.


దగ్గరకు రాగానే చరణ్ పూజని చూసి షాక్ అయిపోతాడు. తేరుకుని తల్లిదండ్రులను "ఈ అమ్మయేనా" అని అడుగుతాడు. అవునంటారు వాళ్ళు


చరణ్ ఆనందం పట్టలేక పెళ్ళి పీటల మీద నుండి లేచి "పూజ.." అని బిగ్గరగా అరుస్తూ ముందుకు వెళ్తాడు.


బాధతో తల దించుకుని వస్తున్న పూజ అది చూసి ఒక్కసారి షాక్ అయి తేరుకుని పరిగెత్తి వచ్చి చరణ్ ని హత్తుకుంటుంది. ఇరువురి తల్లిదండ్రులు ఆశ్చర్యం తో చూడసాగారు.


"పెళ్ళే ఇష్టం లేదని వరుడు ఫొటో చించేశావ్ కదే.. ఇప్పుడు ఇలా గంతులు వేస్తున్నావేంటీ " అడిగాడు తండ్రి. ఆనందం పట్టలేని పూజ నవ్వుతూ ఉండిపోయింది.


ఇక ఈ పెళ్లి విషయంలో మా పై కోపంతో ఉన్న చరణ్ ఇప్పుడు ఇంత సరదాగా ఉన్నాడు ఏంటో.. అనుకున్నారు అతని తల్లిదండ్రులు.


"నాన్నా! నా జీవితంలో పూజ నే ఊహించుకున్నాను. మీ వల్ల నా ఆనందం పోయిందనుకున్నాను. అందుకే అమ్మాయి ని చూడలేదు. ఇప్పుడు మా ప్రేమకు సరైన వేళ టైం సెట్ అయింది. నిజంగా ఈ క్షణం మర్చిపోలేనిది" అంటాడు.


"ఇక పెళ్ళికి వేళాయె” అంటూ పంతులు గారు పిలవటంతో ఆనందంగా పెళ్ళి పీటలెక్కారు చరణ్- పూజ లు.


***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం





43 views0 comments

Comments


bottom of page