top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు



'Pillalamarri Pinavirabhadrudu' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 26/05/2024

(కవులను గూర్చిన కథలు - పార్ట్ 6)

'పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు 


 పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు 15 వ శతాబ్దం లో జీవించిన మహాకవి. జెమినీ భారతం, శకుంతలా పరిణయం అను రెండు కావ్యాలు వ్రాసాడు.


ఈయన మహిమల్ని గురించి కొన్ని కథలు అనుశ్రుతoగా వస్తున్నాయి.


ఈయన అన్నగారైన పెదవీరన్న ఒక రోజు జపం చేసుకుంటూ వుండగా, ఆయన భార్య ఏదో పనిమీద ఆ గదిలోకి వచ్చింది. ఆమె కాళ్లకు అందెలు లేకపోవడం వలన బోసిగా వుండటం చూసి పెదవీరన ఆ సాయంత్రం కంసాలి కొట్టుకి వెళ్ళి ఆమెకు చెప్పకుండా అందెలు చేయించాల నుకున్నాడు. 


ఇంతలో ఎవ్వరో బయటినుండి " పెదవీరనగారు " అని కేక వేసారు. పరధ్యానoగా వున్న పెదవీరన జవాబు ఇవ్వలేదు. ముందు గదిలో కూర్చుని వున్న పినవీరన " ఆయన మా వదినగారికి అందెలు చేయించడానికి కంసాలి కొట్టుకి వెళ్లా”డని సమాధానం చెప్పాడు. అది పెదవీరనకు వినిపించి, తన మనసులో విషయం తమ్ముడు గ్రహించినందుకు ఆశ్చర్యం తో, జపం చేసుకునేటప్పుడు లౌకిక విషయాలు ఆలోచించినందుకు సిగ్గుపడ్డాడు.


ఒక రోజు రాజసభలో జైమిని భారతం ఆంధ్రీకరించుటకు సమర్థులు ఎవ్వరిని ప్రశ్న వచ్చింది. పండితులందరూ ఏక కంఠంతో పిన వీరన పేరు చెప్పారు. రాజుగారు పినవీరననా పనికి నియయించి  "ఎంత కాలంలో తీసుకుని రాగల”వని  అడిగారు. 


పినవీరన " నెల రోజులు చాలు " అన్నాడు. 


రాజుగారు అది నమ్మలేక "తేలేకపోతే?" అని ప్రశ్నించారు. 


పినవీరన "మీ యిష్టం వచ్చిన శిక్ష వెయ్యండి" అని జవాబు యిచ్చాడు. ఒక్క నెలలో పూర్తి చెయ్యడం బ్రహ్మ కు కూడా తరం కాదని అక్కడి పండితులు గుసగుసలాడుకున్నారు.


 నెల రోజులలో పూర్తిచేస్తానని తాంబూలం పుచ్చుకుని వచ్చిన పినవీరన్న తాటాకు మీద గంటం పెట్టకుండా, నెల రోజులు వేశ్యాగృహంలో గడిపేసాడు. ఇక మిగిలింది ఒక్క రోజు. పెదవీరన యిది చూసి కంగారు పడి తమ్ముడిని పిలిచి “ఏదో విధంగా ఆ ఒక్కరోజులో గ్రంధం పూర్తి చెయ్యి, లేకపోతే రాజసభలో అవమానం జరుగుతుంది” అని చివాట్లు వేసాడు. 


పినవీరన మందహాసం చేసి, వదినగారిని ఆ రాత్రికి ఒక గది తనకోసం బాగా అలంకారం చేసి యిమ్మని కోరాడు.


 ఆ రాత్రి పినవీరన భోజనం చేసి, గదిలోకి వెళ్లి తలుపు గడియపెట్టుకున్నాడు. పెదవీరన, తెల్లవారు జామున మెలుకువ వచ్చి లేచి, తమ్ముడు ఏం చేస్తున్నాడో అన్న ఆదుర్ధాతో ఆ గది తలుపుకి వున్న కన్నంలో నుండి చూసాడు. 


లోపల ఎనిమిది చేతులతో ఎనిమిది గంటాలతో తాటాకులమీద వ్రాస్తున్న దేవతా స్త్రీ "బావగారు చూస్తున్నా”రంటూ  దిగ్గున మాయమైంది. 


పినవీరన లేచి, తలుపు తీసి, మిగిలిన కాస్తా పూర్తి చేసాడు.


మరునాడు రాజసభ సమావేశం అయ్యింది. పినవీరన కు పరాభావం జరుగుతుంది అని, సభాసదులు గుసగుసలాడుకుంటున్నారు. పినవీరన సభలోకి వచ్చి గ్రంథం మొత్తం చదివేసాడు. అతడి ప్రజ్జకు పండితులు తప్పట్లు కొట్టారు. 


పినవీరన "వాణి నా రాణి" అని తన ఆసనం మీద కూర్చున్నాడు. ఆ మాటకు సభలో ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. 


‘ఎంత గొప్ప కవి అయినా వాణిని తన రాణి అంటాడా? యిది దైవాపచారం’ అన్నారు పండితులు. 


ఇంతలో రాజుగారి వెనుకనున్న పట్టుతెరలో నుండి, సరస్వతి తన హస్తం బయటకు చాపి "నేనతని రాణినే, ఇతడు బ్రహ్మదేవుని అవతారం" అని బిగ్గరగా చెప్పి అక్కడ వారిని అశ్చర్యపరవశులని చేసింది.


పినవీరన కవిత్వం, మృదువు గాను, సరసం గాను ఉండి, తిక్కన సోమాయాజి కవిత్వాని గుర్తుకు తెస్తుంది.


కృష్ణదేవరాయులు :: తిమ్మరసు 

 =====================


మహ్మదీయులనూ, గజపతులనూ, రెడ్లనూ జయించి వింధ్య మొదలు కన్యాకుమారి వరకు గల దక్షిణపధాన్నంతటిని పరిపాలించిన మహా చక్రవర్తి కృష్ణదేవరాయలు. 


భువనవిజయము అను సభ ఏర్పాటు చేసి, అష్టదిగ్గజములని ఏనమండుగురు కవులకు అగ్రహారాలిచ్చి పోషించి స్వయంగా " అముక్తమాల్యద"అనే భక్తి కావ్యం వ్రాసి, ‘సాహితీ సమరాoగణ సార్వభౌముడు’ అని కొనియాడబడినాడు.


చిన్నతనంలో సవితతల్లి అనేకసారులు విషం పెట్టడానికి ప్రయత్నించింది. కానీ మహా మంత్రి తిమ్మరసు అడ్డుపడి కాపాడాడు. తండ్రి అయిన నరసింహదేవరాయల అవసాన సమయంలో కుమారుల నందరిని దగ్గరికి పిలిచి తన వ్రేలికున్న ఉంగరం ఎవ్వరు తీయ్యగలరో వారు తన తరువాత రాజు అవుతారని అన్నాడు. 


ఉబ్బు జబ్బు వలన చేతివేళ్లు వాచి ఉంగరం బిగుసుకుపోయింది. రాజకుమారులకి ఎలా తియ్యాలో తెలియక యిబ్బంది పడుతుండగా, వారిలోని కృష్ణదేవరాయలు తటాలున కత్తి తీసి, తండ్రి వ్రేలు నరికి ఉంగరం తీసుకున్నాడు. 


అయినప్పటికి నరసింహ దేవరాయుల అనంతరం కృష్ణదేవరాయలు సవతి అన్నగారైన వీర వసంతరాయులే రాజయ్యాడు.


రాయుల విజయాలకు, కీర్తి కి ముఖ్య కారకుడు తిమ్మరసు మంత్రి. ఈయనకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. చదువు సంధ్య లబ్బక, తిరుపతిలో పశువులని మేపుకుని, గుత్తిలో పుల్లెలు కుట్టుకుని, చంద్రగిరి లో మధుపం చేసుకుని పెనుగొండ లో సత్రంలో లెక్కలు వ్రాసి గడిపేవాడు. 


ఒకరోజున అడివిలో తిరిగి, అలిసిపోయి ఒక చెట్టు క్రింద పడుకుని నిద్రపోయాడు. అతని మీద ఎండ పడుతుండగా, ఒక కృష్ణ సర్పం అతడి ముఖం మీద గొడుగులా పడగ విప్పి ఎండ పడకుండా చేసింది. అది ఒక తాపసి చూసి, తిమ్మరసుని లేపి "నీవు గొప్ప ధనవంతుడు వి అవుతావు” అని చెప్పి, విజయనగరం తీసుకుని వెళ్ళాడు. 


అక్కడ తిమ్మరసు, శ్రద్దగా చదువుకుని రాజుగారి ఆస్థానం లో ప్రవేశించి, పిదప మహా మంత్రి పదవి చేపట్టాడు. కృష్ణ దేవరాయులు గజపతి పై దండేత్తినప్పుడు తిమ్మరసు స్వయంగా సేనలని నడిపి, ఉపాయం తో శత్రు సైన్యంని చీల్చి, గజపతి కుమార్తె చిన్నాదేవిని రాయులకు వివాహం చేయించాడు. రాజ్జ్య పాలనకు కావలిసిన శక్తీయుక్తులు రాయులకు సమకూర్చాడు. పండితులకు, కవులకు అగ్రహారాలు యిప్పించాడు. రాయులు తిమ్మరసుని అప్పాజీ అని పిలిచేవారు. 


భట్టుమూర్తి అన్న కవి, తిమ్మరసును 


 "అయ్యా యనిపించుకొంటివి 

 నెయ్యంబున కృష్ణరాయ నృపపుంగవుచే 

 నయ్యా నీ సరియేరి 

 తియ్యని విలుకాడవయ్య తిమ్మరసయ్యా "

అని పొగిడాడు.


ఆంధ్రుల చరిత్రలో కృష్ణరాయుల కాలం స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఆనాడు విజయనగర విధులలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారుట. పెద్దనాది కవులు మహాప్రబంధాలు వ్రాసి ఆంధ్ర సాహిత్య సరస్వతిని అందలమెక్కించారు. అది నిజంగా స్వర్ణయుగమే.


ఆరవ భాగం సమాప్తం. త్వరలో ఏడో భాగం.


(ఆధారం మా తండ్రిగారు శ్రీ జీడిగుంట రాఘవేంద్ర రావు గారి రచన

-- శ్రీనివాసరావు జీడిగుంట) 


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.














 


58 views0 comments

Comments


bottom of page