పోలీస్ హెల్ప్ లైన్
- Sudha Vishwam Akondi
- 5 days ago
- 2 min read
#SudhavishwamAkondi, #Police Helpline, #పోలీస్, #హెల్ప్లైన్, #సుధావిశ్వంఆకొండి,#TeluguKathalu, #తెలుగుకథలు #కొసమెరుపు

Police Helpline - New Telugu Story Written By Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 10/04/2025
పోలీస్ హెల్ప్ లైన్ - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
"హలో! " అంటూ ఒక లేడీ వాయిస్.
"చెప్పండి మేడమ్!"
"ఇక్కడ నన్ను తిండి పెట్టకుండా, లేదంటే పాడైపోయిన తిండి పెట్టి తినమని చంపుతుంది మా అత్త. ఆవిడ హింస నుండి నన్ను రక్షించండి"
"అడ్రస్ చెప్పండి. మీరు ధైర్యంగా ఉండండి. పోలీసులు ఎప్పుడూ మీ ప్రజల సేవలో"
ఆవిడ అడ్రెస్ చెబితే నోట్ చేసుకున్న పోలీసులు, ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో బయలుదేరారు.
'ఏం జరిగిందో? కట్నం కోసం అలా చేస్తుందేమో ఆమె అత్త? పాపం ఆడపిల్లను రక్షించాలి' అనుకుంటూ వెళ్లారు ఆ అడ్రస్ కి.
ఇచ్చిన ఇంటి అడ్రెస్ ప్రకారం వెళ్లిన పోలీసులు, అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తున్న ఒకమ్మాయిని చూశారు.
"ఏమ్మా! కంప్లైంట్ ఇచ్చింది మీరేనా?" అని అడిగారు పోలీసులు.
"అవునండీ! నేనే ఇచ్చాను. నా పేరు రాణి. నేను ఇక్కడే ఒక ఆఫీస్ లో పని చేస్తున్నాను. మా అత్త ఎప్పుడూ టీవీ చూస్తూ కూర్చుంటుంది. నేను, మా ఆయన కష్టపడి జాబ్ చేసి వస్తుంటే, తిని ఇంట్లో కూర్చుని, కనీసం మంచిగా వండి పెట్టాలి అనే జ్ఞానం లేదు. రోజూ పాడైపోయిన తిండి పెడుతోంది టీవీ మోజులో పడి. మీరే కొంచెం బెదిరించి చెప్పండి ఆవిడకు. ఈవిడే మా అత్త" అంటూ ముందు రూమ్ లో కూర్చుని ఉన్న ఒకావిడను చూపించింది.
పోలీసులు అత్త వైపు చూశారు.
"అన్నీ నేనే చేయాలి అంటోంది కోడలు. పూచికపుల్ల తీసి అటు పెట్టదు. నాకు పనిలో కొంచెం కూడా సాయం చేయదు. ఎంతకని చేయాలి నేనే? మీరే చెప్పండి!" కోపంగా అన్న అత్త మాటలు విన్నారు పోలీసులు.
అప్పుడు కోడలు అత్తపైన మళ్లీ కంప్లైంట్స్ చెప్పడం, అత్త కోడలు పైన చెప్పడం జరుగుతూనే ఉంది. ఆగడం లేదు వారి గోల!
ఈ ఇద్దరి గొడవలు విన్న పోలీసులు తలలు పట్టుకుని నిట్టూర్చారు.
తర్వాత తేరుకుని వాళ్లకు సర్దిచెప్పారు.
"ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ సర్దుకుపోవాలమ్మా! ఇదెక్కడి గొడవ? ఈ చిన్న విషయానికి పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా? " అని కోడలికి చీవాట్లు వేసి, ఇద్దరికి సర్ది చెప్పేసరికి వారి తల ప్రాణం తోకకు వచ్చింది.
# సమాప్తం #
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
Comments