top of page
Writer's pictureGadwala Somanna

ప్రగాఢ విశ్వాసం

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PragadaViswasam, #ప్రగాఢవిశ్వాసం


'Pragada Viswasam' - New Telugu Poem Written By Gadwala Somanna

Published In manatelugukathalu.com On 03/11/2024

'ప్రగాఢ విశ్వాసంతెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


దేశభక్తి చూపుతాం

దేశశక్తి చాటుతాం

సరిహద్దు సైనికులై

భారతమ్మ వారసులై


క్షమాగుణం పంచుతాం

చెలిమి కలిమి పెంచుతాం

మహనీయుల మనసులై

మమతలున్న మనుషులై


జగతి ప్రగతి కోరుతాం

ప్రగతి బాట సాగుతాం

భారతీయ పౌరులై

బాధ్యత గల  వీరులై


కలసిమెలసి బ్రతుకుతాం

కలహాలను వీడుతాం

అజాతశత్రువులై

ఆదర్శ పురుషులై


హక్కులకై కలబడుతాం

ఆపదలో నిలబడుతాం

జన హృదయ నేతలై

ఘన వహించిన దాతలై


కష్టపడి ఎదుగుతాం

వినయంతో ఒదుగుతాం

కడుపు నింపు రైతులై

కరుణార్ధ హృదయులై


-గద్వాల సోమన్న




17 views0 comments

Comments


bottom of page