top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

ప్రకృతి విచిత్రం



'Prakruthi Vichithram' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 26/12/2023

'ప్రకృతి విచిత్రం' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


ఈ ప్రకృతిలో జనమంతా మనుషులే

అందులో ఆడ మగ అను భేదాలే తప్ప

ఆకలి దప్పులు ప్రేమానురాగాలు

అందరి కుండే సహజ పరిణామాలు

ఆనందము ఆహ్లాదము అనుభూతి

దయ దాక్షిణ్యము సానుభూతి ఒకవైపు

కోపము పగ కక్ష ప్రతీకారేఛ్చ ఇత్యాదివి

వేరొక వైపు ఉండి నిత్య జీవితములో

కలతలు కలహాలు అలజడులు కలుగడము

ఇదీ మానవ ప్రకృతిలో భాగమే

కృత{సత్య},త్రేతా,ద్వాపర,కలి

యుగాలలో కనబడే సత్యమే

రుగ్మతలకు ఔషధము లున్నా

ఇలాంటి మనోవికారాలకు మందు లేదు

"ఏక ద్రవ్యాభిలాషి ద్వేషి"అను నానుడి

అని అనుటకంటె అది వాస్తవము.

మనుషులలో విభిన్న పోకడలు 

సృష్టి ఆరంభము నుండి వచ్చినవే

మనిషి మేధ పెరిగిన కొలది 

ఎదుటివానిని అణుచుట కొరకే 

ఉపయోగించడము కద్దు.

దేవతలనువారైనా అమృతము కొరకు 

కలహించుకొనడము-రాజులు రాజ్యము కొరకు

ప్రేమికులు ప్రియురాండ్ల కొరకు 

ధనికులు సొమ్ము కొరకు 

బీదలు కూడు గూడు గుడ్డ కొరకు

మనుషులు ఏదో ఒకటి కాంక్షించి  

కలహాలకు పూనుకొనడము ఆగని

నిరంతర పోరాటము.

భూమి నిరంతరము  గుండ్రముగా 

తిరుగుచున్నట్లే  ప్రకృతి భూమితో 

మమేకమై భూచర,జలజర ఖేచర 

జీవుల మనుగడలో   ,సముద్రపు 

అలలలో ,మూడు కాలాల గమనంలో

మనిషినించి మార్పు జేయలేని 

విధానాన్నే   కొనసాగిస్తుంది.

ఆ ప్రకృతి ప్రభావమే మానవ నైజమై

పల్లటించుచున్నది-

-సుదర్శన రావు పోచంపల్లి

40 views0 comments

Comments


bottom of page