'Pramada - Pramida' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 20/06/2024
'ప్రమద- ప్రమిద' తెలుగు కథ
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
గ్రీకు పురాణాల్లో ఫీనిక్స్ అనే పక్షి ఉంటుంది. సూర్యుడిని అందుకోవాలని అది ఆశ పడుతుంది. ఎగిరి.. ఎగిరి.. సూర్యుడికి దగ్గరవుతుంది. ఆ వేడికి రెక్కలు మాడి కిందపడిపోతుంది. కానీ దాని కోరిక చావదు. గాయాలు మానాక మళ్ళీ ఎగరడం మొదలెడుతుంది. ఇది ఫీనిక్స్ పట్టుదలను పాఠంగా నేర్పే కథ! ఈమె జీవితం కూడా తెలుసుకోవాలిసిన పాఠమే!
వరంగల్ లో ఓ కుగ్రామం. 1988 వ సంవత్సరం. ఓ యువతి పొలంలో కలుపు తీస్తోంది. ' ఝుమ్' మని ఆకాశంలో ఏదో చప్పుడు. ఆమె ఆసక్తిగా చూసింది.
' విమానం ! నా జీవితంలో ఎప్పటికైనా ఆ విమానం ఎక్కాలి' ఆశపడిందామె.
అందులో తప్పు లేదు. కానీ ఆమె పరిస్థితులు వేరు. పెళ్ళయింది. ఆమె కది అత్యాశే. కానీ, ఆమె అలా అనుకుంటే. ఇప్పటికీ ఇంకా అదే పొలంలో పనిచేస్తుండేదేమో!
బేగంపేట ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్ 2000 వ సంవత్సరము. ఫీనిక్స్ ఎంత ఎగిరినా సూర్యుడిని అందుకోలేకపోయింది. కానీ ఆ యువతి కల నెరవేరింది. ఆకాశంలో ఎగరాలన్న ఆశ తీరింది. అమెరికా వెళ్ళింది. అంతటితో ఆగిపోలేదు. ఆమె లక్ష్యం మరింత విస్తృతమైనది. ఆమె సంకల్పం ఫీనిక్స్ ఆశకన్నా గొప్పది. అందుకే ఇప్పుడామె యు. ఎస్. బెస్ట్ కంపెనీ కి ' సిఇఓ'. ఆమె పేరు ప్రభావతి.
అమెరికా ఆరిజోనాలో ఫీనిక్స్ అనే నగరం ఉంది. ప్రభావతి స్థాపించిన సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యాలయము కూడా అక్కడే ఉంది.
(Every successful story has a painful begining--Dr, A. P. J. Abdulkalam)
ప్రతీ విజయగాథ ఒక బాధాకరమైన పరిస్థితి నుండే ప్రారంభమవుతుంది.
(No Pain.. No gain.. ):
వరంగల్ జిల్లాలోని మారుమూల పల్లెలో ఒక సాధారణ కుటుంబం. అక్కచెళ్ళెళ్ళలో ప్రభావతి ఒకరు. ఎమర్జన్సీ సమయం లో తండ్రి బాలనరసింహ ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు. " తల్లి లేని పిల్ల" అనే అబద్దంతో ప్రభావతిని హనుమకొండ లో అనాధబాలికల శరణాలయంలో చేర్పించాడు తండ్రి. అమ్మ బతికే ఉన్నా అనాధలా ఉండటం ప్రభావతిని బాధించింది.
గెయిన్:
హాస్టల్లో ఉండటం వలన మమతానురాగాలకు దూరమైనప్పటికీ ఆ బాధ
ను మరచిపోవడానికి ప్రభావతి స్నేహితులతో ఎక్కువగా గడిపేది. మిగిలిన సమ
యము చదువులకు వెచ్చించేది. పదవ తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది.
వేసవి సెలవుల్లో టైపింగ్ నేర్చుకుంది. టీచర్ ఉద్యోగానికి ఒకేషనల్ కోర్సు చేసింది.
(Accept And Adapt to the reality-వాస్తవాలని అంగీకరించాలి. అనుగుణంగా
మలచుకోవాలి)
వాస్తవం: అప్పుడు ప్రభావతికి పద్దెనిమిది ఏళ్ళు. ఒకేషనల్ కోర్సు టీచర్ ఉద్యోగా
నికి అర్హత కాదని తెలుసుకుంది. ఇంకా చదువుకోవాలని ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు
పెళ్ళి చేశారు. ఇద్దరు ఆడపిల్లలకు తల్లి కూడా అయ్యింది. వ్యవసాయ కుటుంబం
పేదరికం. పొలంపనులు చేయడానికి పిల్లలను ఇంటి దగ్గరే వదిలి వెళ్ళాల్సివచ్చేది.
రోజుకూ ఐదురూపాయిలు కావాలి. దారి ఖర్చులకు.
చిరుదీపం: జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలసిన పాఠం ' వాస్తవాలని అంగీక
రించడం. అవి ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే ఫలితం ఏమీ ఉండదు. చిరు దీపం వెలిగించాలి. ఆ దీపమే ' నేషనల్ సర్వీస్
వాలంటీర్ నోటిఫికేషన్' అతి కష్టం మీద ప్రభావతి అందులో చేరింది. నిన్న మొన్నటి వరకూ తనతో కలసి పనిచేసిన వారికే తను వయోజనవిద్య నేర్పింది.
(No Condition is peramanant -ఏ పరిస్థితి శాశ్వతం కాదు)
కండిషన్స్: ఏడాదిగడిచింది. నెహ్రూ యువకేంద్రంలో అవకాశం వచ్చింది. కానీ ఇతర ప్రాంతాలకు తిర
గాలి. అంటే మకాం హన్మకొండకు మారాలీ. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు.
పిల్లలు తనలాగే బతకకూడదు. వారికి మంచి భవిష్యత్తు నివ్వాలి. అంటే హనుమ
కొండకు వెళ్ళక తప్పదు. చిన్నఇనప్పెట్టెలో సామాన్లు సర్దుకుని ఇద్దరు పిల్లలని తీసు
కుని హన్మకొండకు బయలుదేరింది.
మార్పు: ఏదీ శాశ్వతం కాదు. మార్పు మాత్రమే శాశ్వతం. ప్రభావతి కోరుకుంది కూడా
అదే. ఉద్యోగం చేస్తోంది. కానీ అదొక్కటే సరిపోదు. టైలరింగ్ నేర్చుకుంది. లంగాలు కుట్టి దుకాణాల కిచ్చేది. టైపింగ్ పాసయింది. ఎలాగైనా డిగ్రీ చేయాలని నిర్ణయించు
కుంది. ఇప్పుడు తనను ఆపేవారు ఎవరూ లేరు. ఓపెన్‌యూనివర్సిటీ నుంచి డిగ్రీ
పాసయ్యింది. కష్టపడి సోషల్‌స్టడీస్ టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది. పద్దెని
మిది నెలల తరువాత రెగ్యులర్ అయ్యింది.
( Work for growth-ప్రగతి కోసం కృషి)
కృషి :చేసేపనిలో నాణ్యత ఉండాలి. అందులో ఎదిగేందుకు ప్రయత్నించాలి. ప్రభావతి అదే చేసింది. పరకాల మండలం రామకృష్ణా పాఠశాలలో ఉద్యోగం. నాలుగవ తరగతి వరకూ ఉంటుంది. ఆ పాఠశాలలో పిల్లలు వంద లోపే ఉంటారు. అదే ఊళ్ళో ప్రయివేటు బడులలో పిల్లలు ఎక్కువగా ఉండేవారు. ప్రభావతి రోజూ బస్ లో వెళ్ళి వచ్చేది. ఆలస్యం అయితే ఆ రోజుకి ఆబ్‌సెంట్ వేసేవారు హెడ్‌మాస్టర్. తిరిగి వెనక్కి రాలేదు.
ఆలోచన: ఊరిలోకి వెళ్ళి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడేది. ప్రయివేటు పాఠశాల కు ప్రభుత్వ
పాఠశాలకు తేడా తెలియజెప్పింది. వారిలో మార్పు వచ్చింది. ఏడాదిలోనే ప్రభుత్వ పాఠశాలకు సొంతభవనం, మూడు వందలకు పైగా పిల్లలు, మూతబడిన ప్రయివేటు పాఠశాల ఉపాద్యాయులకు కూడా ఉపాధి కల్పించింది.
ప్రగతి: నలుగురు చేసే పనిని నలుగురిలా కాకుండా వైవిధ్యంగా తన దైన శైలిలో చేసి విజయం సాధించింది ప్రభావతి. ఆ సమయం లోనే ఎం. ఎ సోషియీలజీ వన్ సిట్టింగ్ లో పాసయ్యింది. టీచర్ ఉద్యోగం నుంచి మండల్ గల్ర్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గా పదోన్నతి పొందింది.
( Never wait for miracle-అద్భుతాల గురించి ఎదురు చూడొద్దు ).
ప్రగతి కోసం: జీతం పెరిగింది. జీవితం బాగుంది. ఇకచాలు, ఇంతకన్నా సాధించ
డము వీలు కాదు అని సర్దుకుని సంతృప్తి చెందితే ఎదుగుదల ఆగిపోయినట్లే.
చాలా మంది ఈ కంఫర్డ్ జోన్ కోసమే బతుకుతారు. ఇంకా ఎదగాలంటే జీవితంలో ఏదో అద్భుతాలు జరగాలని ఎదురు చూస్తుంటారు. అలాంటి మనిషి సగటుమనిషి
గానే మిగిలిపోతారు.
( Low aim is crime-మన లక్ష్యాలు పెద్దవిగా ఉండాలి. )
ప్రయత్నించాలి. కానీ అద్భుతాలు జరగాలని ఎదురు చూడవద్దు. ఈ సారి ప్రభావతి లక్ష్యం
పద్దతి ప్రయత్నం మొదలు పెట్టింది.
కృషి: బంధువుల్లో చాలా మంది అమెరికా లో ఉండటంతో తను కూడా అక్కడికి
వెళ్ళాలనుకుంది. కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంది. వీసా కోసం ప్రయత్నించింది. మరి పిల్లలు, వారికి నచ్చజెప్పి హాస్టల్లలో చేర్పించింది. H1వీసా దొరకలేదు. విజిటర్స్ వీసా
మీద అమెరికా వెళ్ళింది. కానీ ఈ వీసాతో ఉద్యోగం చేయడానికి అక్కడ చట్టం అను
మతించవు. అయినా తను అక్కడ బతకాలంటే ఏదో అద్భుతం జరగాలి. కానీ అది
జరగదని ఆమెకు తెలుసు.
(Never loose courage-ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. )
ధైర్యం: నెలకు ఇరవై వేల రూపాయిల ప్రభుత్వఉద్యోగం వదులుకుని కొత్తజీవితం
మొదలు పెట్టాలనుకుని అమెరికాలో అడుగు పెట్టిందంటే, ఆమెది ఖచ్చితంగా
సాహసోపేతమైన నిర్ణయమే. మొండి ధైర్యమే. కానీ ఆ ధైర్యం ఇప్పుడు కోల్పోవాల్సి
వచ్చింది. ఇలా పేయింగ్ గెస్ట్ గా ఉంటూ చిన్న చిన్న దుకాణాలలో పని చేయాలి.
మళ్ళీ ప్రశ్న. జీవితంలో ఎప్పుడో ఎదురైన సమస్య కాదు. ఎప్పుడూ ఎదురయ్యే
సమస్యే. ఏం చేయాలి? ఒక చాన్స్ ఉంది. భారతీయుల దుకాణాలలో పనిచేసే అవ
కాశం ఉంది. ఒక మ్యూజికల్ ఇన్స్‌ట్రుమెంట్స్ దుకాణములో మేనేజర్ గా చేరింది.
ముందడుగు;; ఇంగ్లీష్ రాదు. చేతిలో పైసలు లేవు. షాప్ లో పనిచేస్తే వచ్చిన డబ్బులు సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితులలో వెనుకడుగు వేయాల్సి వస్తుంది.
కానీ ఆమె అడుగు ముందుకే పడింది. తమ ఊరి వాళ్ళ సహాయంతో ఓ సాఫ్ట్‌వేర్
కన్సల్టెన్సీ లో ఉద్యోగం సంపాదించింది. ఆ తరువాత CA Americca కంపెనీలో
రిక్రూటర్ గా చేరింది.
( Associate with good people-మంచి వాళ్ళతో సన్నిహితంగా ఉండాలి).
మంచివాళ్ళ లాగా ఎలా బతకాలో ఎవరూ పాఠంగా నేర్పరు. పరిస్థితులు నేర్పిస్తా
యంతే. చాలా సార్లు చూసి నేర్చుకోవలసిందే. అంటే మనం ఎవరితోనైనా ఎక్కువ కాలం కలసి ఉంటామో వారు మన కన్నా అన్ని విషయాలు తెలిసిన వారై ఉండాలి.
(With association) ప్రభావతి అలాంటి వారితో కలిసి పనిచేసి కొంచెం కొంచెం
ఇంగ్లీష్ నేర్చుకుంది. వీసా గడువు మాత్రం దగ్గర పడుతోంది. ఎక్స్‌టెన్సన్ చేసు
కోవాలి. H1 వీసా కోసం ఎన్నో కష్టాలు పడింది. మొత్తానికి సాధించింది. వర్జీనియా
లో మంచి ఉద్యోగము సంపాదించింది. కాలంతో పాటే కష్టపడితేనే ఇవన్నీ దొరికాయి.
( Inspire and give hope-స్ఫూర్తిని రగిలించు. ఆశని కలిగించు).
స్ఫూర్తి: మే 2000 సం।। లో అమెరికా వెళ్ళిన ప్రభావతి అక్టోబర్ 20005 నాటికి
సొంత కంపెనీ ప్రారంభించగలిగింది. తన పరిస్థితులను అర్థం చేసుకుని ఎవరినీ నిందించకుండా తనకు తానుగా ఎదిగి ఇప్పుడు "'అమెరికా కీ సొల్యూషన్స్" పేరు
తో కంపెనీ ప్రారంభించింది.
సాధారణ రైతుకూలీ నుంచి సక్సెస్‌ఫుల్ గా ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
Hope: జీవితంలో ఒక్కసారైనా అమెరికా చూసి రావాలని కలలు కనే సగటు భారతీయురాలిగానే ఆలోచిస్తే ఆమె ప్రభావతి ఎందుకు అవుతుంది? అమెరికాలో ఎదురైన అనుభవంతో గ్రామీణ భారతంలోని మహిళాసాధికారకత, స్వావలంభన కోసం పనిచేస్తోంది. తన ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేసింది. మంచి భవిష్యత్తు నిచ్చింది. వృద్ధాశ్రమాలకూ, అనాధలకు, తన వంతు సహాయం చేస్తోంది. కాలేజీ విద్యార్థులకు తన జీవితాన్ని మోటివేషన్ పాఠంగా చెబుతోంది.
చివరగా ఒక మాట ;; మీ లక్ష్యసాధన కోసం అవసరమైతే పస్తులుండండి. అవసరమైతే అవహేళనలు ఎదురుకొనండి. " పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు. కానీ పేదవాడిగానే చచ్చిపోతే ఖచ్చితంగా అది మీ తప్పే. మీ లక్ష్యం పెద్దదిగా ఉండాలి".
____________________________________________శుభంభూయాత్_________________
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments