#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Prathibha, #ప్రతిభ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
Prathibha - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 10/11/2024
ప్రతిభ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అది స్కూల్ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్న వేదిక. కొందరు స్టూడెంట్స్ వాళ్ళ స్టేజి పెర్ఫార్మెన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు షో స్టార్ట్ అవుతుందా..? అని ఎదురు చూస్తున్నారు మరికొందరు. మొత్తానికి మొదలైంది.. స్కూల్ హెడ్ మాస్టర్ రామ మైక్ అందుకుని మొదటిగా ఇలా అన్నారు..
"ప్రతిభ ఎవరో ఒకరి సొత్తు కాదు..మన సరస్వతి మేడంని చూస్తే, అదే అనిపిస్తుంది.." అని మేడంని సత్కరించారు హెడ్ మాస్టర్
సరస్వతి మేడంని శాలువా తో సన్మానించి మర్యాద చేసారు. సరస్వతి మేడం ఇదే స్కూల్ లో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆవిడ చెప్పే గణితం సబ్జెక్టు లో ఫెయిల్ అయిన స్టూడెంట్ లేడు..అంత బాగా అర్ధమయ్యే విధంగా చెప్పగలరు ఆవిడ. కొన్ని సంవత్సరాల కిందట భర్త యాక్సిడెంట్ లో చనిపోవడంతో, ఒంటరిగా జీవితం గడుపుతున్నారు. ఉన్న ఒక్క కొడుకు ఫారిన్ లో ఉన్నాడు. అక్కడికి రమ్మని కొడుకు ఎన్నిసార్లు అడిగినా, ఈ స్కూల్ కోసం ఇక్కడే ఉండిపోయారు మేడం. ఆవిడకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి మరీ కాలేజీ లో ఉంచారు హెడ్ మాస్టర్ రామ.
గత రెండు సంవత్సరాల నుంచి సరస్వతి మేడం కి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యాయి. డాక్టర్ ఎక్కువ నడవొద్దని.. మెట్లు ఎక్కవద్దని చెప్పారు. ఇదే విషయం చెప్పి.. రాజీనామా చేస్తానని చెబితే, హెడ్ మాస్టర్ "మీరు వెళ్ళిపోతే, మీ అంత బాగా గణితం చెప్పేవారు దొరకరు. ఎలాంటి స్టూడెంట్ కైనా లెక్కలు అర్ధమయ్యే విధంగా చెప్పగలరు మీరు. మీకు కావాలంటే మీ క్లాసు గ్రౌండ్ ఫ్లోర్ లోపెట్టిస్తాను..మీ ఇంటికి కార్ కుడా పంపిస్తాను. కావాలంటే, అప్పుడప్పుడు ఫోన్ లో క్లాసులు తీసుకోండి.." అని బతిమిలాడాడు హెడ్ మాస్టర్ రామ.
మిగతా స్టాఫ్ అందరికి కూడా సరస్వతి మేడం అంటే చాలా గౌరవం. రోజూ గుడ్ మార్నింగ్ చెప్పడమే కాదు..ఏమైనా సహాయం కావాలన్న చేసేవారు. హెడ్ మాస్టర్ తరువాత సీనియర్ అయిన సోషల్ టీచర్ పార్ధసారధికి కుడా సరస్వతి మేడం అంటే చాలా గౌరవం. ఆమె ప్రతిభను చాలా మెచ్చుకునేవాడు. ఇందరి సహకారంతో, ఆవిడ ఎప్పుడూ తన అనారోగ్యం గురించి బాధపడలేదు.
ఒక రెండు సంవత్సరాలు గడిచాయి..రెండు సార్లు కుడా సరస్వతి మేడంకే ఉత్తమ టీచర్ గా పురస్కారం ఇచ్చారు.
మిగతా టీచర్స్ అందరిలో కొంచం ఈర్ష్య మొదలైంది. 'ఆమె కన్నా మనం అంతా సీనియర్ కదా...మనం కూడా మన సబ్జెక్టులు బాగానే చెబుతాము. అయినా ఎప్పుడూ ఆవిడకే సన్మానమా..?' అంటూ మిగతా టీచర్స్ మీటింగ్ పెట్టుకున్నారు.. సరస్వతి మేడం వెళ్ళిపోయాక.
"పార్ధసారధిగారు..! మీరు సీనియర్ కదా..మీకు ఎప్పుడైనా వచ్చిందా పురస్కారం..? ఎప్పుడో ఒక్కసారి వచ్చిందేమో నాకు తెలిసి..మీరు చెప్పే సోషల్ సబ్జెక్టు అంత స్కోరింగ్ కాదు కాబట్టి, అంత ఎక్కువ మార్కులు రావు. సరస్వతీ మేడం చెప్పే లెక్కలు స్కోరింగ్ కాబట్టి..అందుకే ఎక్కువ స్కోర్ వస్తోంది. సబ్జెక్టు బట్టి గౌరవం ఇవ్వాలి కదా..ఎంతైనా మన హెడ్ మాస్టర్ ఇలా చెయ్యడము కరెక్ట్ కాదు. వచ్చే నెలలో మన హెడ్ మాస్టర్ రామ రిటైర్ అవుతారు..అప్పుడు మనలో ఎవరో ఒకరు హెడ్ మాస్టర్ అవడం ఖాయం..అప్పుడు చూద్దాం.." అని అందరూ చర్చించుకున్నారు
హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ ఫంక్షన్ గ్రాండ్ గా ప్లాన్ చేసారు స్టాఫ్ అంతా కలిసి. అతను వెళ్ళిపోతున్నందుకు బాధ ఉన్నా..నెక్స్ట్ తనే హెడ్ మాస్టర్ అవుతానని గట్టి నమ్మకం తో లోపల చాలా సంతోషించాడు పార్ధసారధి. అనుకున్నట్టుగానే, సీనియారిటీ ప్రకారం పార్ధసారధి కొత్త హెడ్ మాస్టర్ గా బాధ్యతలు తీసుకున్నాడు.
ఆ రోజు సరస్వతి మేడం వెళ్ళిపోయాక..స్టాఫ్ అంతా పార్ధసారధిగారితో రూమ్ లో మీటింగ్ పెట్టారు..
"పార్ధసారధిగారు..! ఇప్పుడు మీరు హెడ్ మాస్టర్..మీరే మా గురించి చూడాలి. ఆ సరస్వతి మేడం కి ఒక రూల్, మాకు ఒక రూల్ ఎందుకు..? మాకూ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వండి..మేము కుడా అన్నీ బాగా చేస్తాము. ఇస్తే అందరికీ ఒకేలాగా ఫెసిలిటీస్ ఇవ్వండి, లేకపోతే ఎవరికీ వద్దు." అని అందరూ వాదించారు
"అలాగైతే, మా ఆయనకి ఈ మధ్యే పక్షవాతం వచ్చింది..అలాగని..నేను ప్రతిరోజూ తొందరగా ఇంటికి వెల్లిపోతానంటే మీరు ఒప్పుకుంటారా..? అందరికీ సమస్యలు ఉంటాయి.." అన్నారు సైన్స్ మేడం
మర్నాడు హెడ్ మాస్టర్ సరస్వతి మేడంని తన ఛాంబర్ కి పిలిచి..
"మేడం గారు..! ఇప్పటినుంచి అందరికీ రూల్స్ ఒకేలాగా ఉంటాయి. మీరు కుడా అందరిలాగే క్లాసులు తీసుకోవాలి..మీకు ఫెసిలిటీస్ ఇవ్వలేము. మీరు సొంతంగా స్కూల్ కి రావాలి.. అందరిలాగా క్లాసులు తీసుకోవాలి.."
హెడ్ మాస్టర్ అయిన తర్వాత పార్ధసారధిలో చాలా మార్పు గమనించింది సరస్వతి. అయినా చేసేది ఏమీ లేక..అలాగేనని ఒప్పుకుంది. కొన్ని రోజులు కస్టపడిన తర్వాత, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యాయి. కొడుకు తిట్టడంతో..ఉన్నపళంగా ఉద్యోగానికి రాజీనామా చేసేసారు సరస్వతి మేడం.
"ఇప్పుడు స్కూల్ లో లెక్కలు చెప్పడానికి కొత్త వారిని తీసుకోవడానికి టైం లేదు..ఏం చెయ్యాలి..?" అని హెడ్ మాస్టర్ అందరి సలహా అడిగారు
"ఆ మాత్రం లెక్కలు మేము చెప్పలేమా..?" అంటూ మిగిలిన స్టాఫ్ అంతా ముందుకు వచ్చారు. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని..పైగా ఖర్చు కుడా బాగా తగ్గుతుందని.. సరే అన్నాడు పార్ధసారధి..
ఆ సంవత్సరం పరీక్షల్లో..చాలా మంది లెక్కల్లో తప్పారు. అంతే కాదు..లెక్కలు చెప్పిన టీచర్స్, వారి సబ్జెక్టు లో కుడా చాలా మంది ఫెయిల్ అయ్యారు. వచ్చిన రిజల్ట్స్ చూసి..హెడ్ మాస్టర్ చాలా సీరియస్ అయ్యారు..
"అందుకే ఎవరు చేయాల్సిన పని వారు చెయ్యాలి..మీరు చెప్పే సబ్జెక్టు సరిగ్గా చెప్పలేదు..లెక్కలు కుడా సరిగ్గా చెప్పలేదు..ఇప్పుడు మన స్కూల్ పరిస్టితి ఏమిటి..?" అని అందరినీ ప్రశ్నించాడు హెడ్ మాస్టర్
"సారీ సర్..ఎవరి ప్రతిభ వారిదే అని తెలిసింది...." అని అందరూ హెడ్ మాస్టర్ ని క్షమాపణ అడిగారు
పార్ధసారధి తాను చేసిన తప్పు తెలుసుకుని...సరస్వతి మేడం ఇంటికి వెళ్లి..మళ్ళీ స్కూల్ లో జాయిన్ అవ్వాలని బతిమాలాడు..కావాలంటే ఆన్లైన్ లో క్లాసులు తీసుకున్నా ఓకే అని చెప్పి ఒప్పించాడు.
***********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Good one
nice sir