top of page
Writer's pictureYasoda Gottiparthi

ప్రతిఘటన



'Pratighatana' - New Telugu Story Written By Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 23/06/2024

'ప్రతిఘటన' తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


“అమ్మా! ప్రతిరోజూ దేవాలయం వెళ్తున్నావుగా నాకోసం దండం పెట్టుకో, నేను ఎంసెట్ లో ర్యాంక్ తెచ్చుకోవాలని. "


“మీ క్షేమం, చదువు సంధ్యల కోసమే కదరా నేను గుడి కి వెళ్ళేది, నీ పేరు మీదనే అర్చన చేయిస్తు న్నాను నాన్నా! దేవాలయం దగ్గర ఉంది కాబట్టి ఎవరి సహాయం లేకుండా ప్రతి రోజూ వెళ్లగలుగు తున్నాను. అక్కడ కాసేపు కూర్చుంటే ఎంతో ప్రశాంతత వస్తుందిరా". 


“ప్రశాంతత అంటే ఎట్లుంటుంది? అమ్మా!”


“ప్రశాంతత అంటే కాసేపు ఈ సంసార బాధలు, బంధాల ఆత్మీయ తలు, ఆప్యాయతలు, కట్టుబాట్లు అన్నీ మరచి ఆ దేవునిలో లీనమై అన్నీ మరచి పోతాము. అదే ప్రశాంతత”. 


“అమ్మా! నేను పోలీస్ నవుతా నీకిష్టమేనా?"


“పోలీస్ అంటే నాకు భయం. వాళ్లు ఎప్పుడూ దొంగలను, రౌడీలను పట్టుకుంటూ వాళ్లను జైల్లో పెట్టి బాగా కొట్టుతుంటారురా”. 


“కానీ ప్రజలను దొంగల బారి నుండి, రౌడీల బారి నుండి కాపాడే వాళ్లే కదా!" ప్రజలకు రక్షణగా ఉంటారు కూడా"


"దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు అంతా అయిపోయిన తరువాత వస్తారు. కేసు నడుస్తుంది.. అని చెప్పి నెలల కొద్దీ పొడి గిస్తారు. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకురా ? నువు ముందు బాగా చదువు కోవాలి”. 

***************†**********

పురాతన హిందూ దేవాలయం అద్భుతమైన శిల్ప కళా చాతుర్యానికి అపురూప అలంకారా లకు ప్రసిద్ధి పొంది, నీలి రంగు భారీ సున్నపు రాళ్ళు, దిమ్మెల తో బాగుంది. పచ్చని చెట్లు, పూల మొక్కలతో భారీ వృక్షాలతో మధ్యలో నవగ్రహ మండపం వచ్చీ పోయే భక్తులతో పవిత్రతతో సుమనోహ రంగా ఉంటుంది. 


ప్రక్కన కోనేరు మామూలుగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల జీవ నదులు ప్రవహించే తీరాలలో నిర్మింప బడి ఉంటాయి. దేవుని అర్చనల కొరకై జలములు తీసుకురావటానికి, అభిషేకాలుచేస్తూ, తెప్పోత్సవాలు జరపడానికి ఈ కోనేరుల లో ఊరేగి స్తారు. 


దేవునికి అర్చనాది కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించి, భక్తులకు శఠగోపం, హారతులు నిచ్చి తీర్థ ప్రసాదాలను అందిస్తారు. 


“రోజూ గుళ్ళు గోపురాలని ఒంటరిగా వెళ్ళకు రమా!” అన్న భర్తతో.. 

“ ఒంటరిగా వెళ్లడం అంటే నాకేం భయం. నాకు కరాటే వచ్చు. ఎదురుగా వచ్చే వాడు భయ పడాలి”.

 

“అంత బలశాలివా మమ్మీ! మాదగ్గర కోతలు కోసినట్లు, బయట కూడా అలా మాట్లాడకే".


“ఏమోయ్! ఈరోజు న్యూ ఇయర్ డే కదా! మా ఆఫీస్ లో స్వీట్స్ కారాలు పంచి పెట్టారు. , స్వీట్ డబ్బాలు ఆ కిచెన్ లో పెట్టాను చూడవోయ్”. 


“మీరు మాత్రం అక్కడ బాగా మెక్కే వచ్చారన్న మాట. రాత్రి అందుకే అంతా ఆలస్య మయిందా మహాశయా!”


 “అమ్మా! పని అయిపోయిoదమ్మా! ఇంటికి వెళ్తున్నా నమ్మా !" చెప్తున్న పని మనిషిని.. 


“ఉండవే” అని లోపలి కెళ్ల గానే, వచ్చిలోపల కుర్చీలో కూర్చున్న శ్రీవారు జేబులో ఉన్న వంద రూపా యలు పనిమనిషి అభి చేతిలో పెట్టి, మూతి మీసాల పైన చెయ్యి పెట్టుకుని తిప్పుకుంటూ చేతిని ముద్దులు పెట్టినట్టు చూపిస్తుంటే, అది చూచిన అభికి చెమటలు పట్టాయి.

 

“ఏమిటి సారూ.. అలా సైగలు చేస్తున్నారు?" అని అక్కడే నిలబడితే ఇంకేమంటాడో? అనుకుని అమ్మగారు ఇచ్చిన స్వీట్ డబ్బా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. 


మరునాడు ఉదయం ఆరు గంటలకే వచ్చే పనిమనిషి అభి, ఎందుకు రాలేదో అర్థం కాలేదు. రేపు రానమ్మా అని చెప్పను కూడా చెప్పలేదు. ఈ పనిమనుషులను ఒక్కరోజు నమ్మేట్టు లేదు. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు మానేస్తారో చెప్పలేం అనుకుంటుండగానే అప్పటికి పదకొండు గంటలయింది. 

ఇంట్లో ఎవరూ లేరు, అప్పుడు అభి మెల్లగా నడుస్థూ, నీరసంగా డీలా పడ్డట్టు అయి వచ్చింది. 


 “ఏమిటే అభీ! అలా అయ్యావు.. నిన్న బాగానే ఉన్నావ్ కదా!. "


“అమ్మా! నిన్న మీరు వంటింట్లో ఉన్నప్పుడు సారు నాకు వంద రూపాయ లిచ్చి, నన్ను చూస్తూ మీసాలు తిప్పి, మీకేమీ చెప్పవద్దు అని సైగలు చేస్తూ, గాలిలొ ముద్దులిస్తున్నట్టు చేతులుముందుకు తిప్పాడమ్మా! అలా చేసే సరికి నాకు భయమయింది. రాత్రంతా నిద్ర లేక పనికి రాలేక పోయాను. కొంచెం జ్వరంగా ఉందని డాక్టర్ కు చూపించుకుని, మెట్లెక్కి వస్తుంటే కూడా మళ్లీ సారు అడ్డం అడ్డం గా వచ్చా డమ్మా. నేను మీ దగ్గర పనిమానేస్తా నమ్మా!"


“పని మానేయకు ? నీ తప్పేమీ లేనప్పుడు నీ కెందుకు భయం. నేనున్నాగా.. సార్ కు బుద్ధి చెప్తాను. ఈ విషయం ఎవరికి చెప్పకు”. 


“సరే వెళ్తానమ్మా” అంటూ వెళ్లి పోయింది. 


సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన భర్తను, పనిమనిషి తో చేసిన పని గురించి నిలదీసింది. 


“నేను పండుగకదా అని ఏమైనా కొనుక్కో అని వందరూపాయలు ఇచ్చాను, మగాడినని మీసాలు తిప్పుతూ, మూతిని సవ రించు కున్నాను. అంతే”. 

 

“అమ్మకేమీ చెప్పకు అని వంద రూపాయలు ఇచ్చావట. ఒక భర్త గా మాట్లాడే మాటలేనా?అది భయ పడేలా ముద్దులు పెడ్తున్నట్టు చేతులు తిప్పావని చెప్పింది. అది మంచిది కాబట్టి అమ్మ అని చెప్పుకుంది. నాకు తెలవకుండా దానికి వంద రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. అది బీదదే కానీ కారణం లేకుండా డబ్బులు అడిగి తీసుకోదు. అవసరమైతే నన్నే అడుగుతుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు చేస్తే ఏం చేస్తానో తెలుసా, అసలే కరాటే మాష్టారుని” అని హెచ్చరించింది. 


 ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మరు అని మనసులో అనుకుని, ‘ఇంకేం చేస్తాను ఇంత ప్రళయం సృష్టించిన తరువాత’ అని బెడ్ రూం లోకి తుర్రుమన్నాడు చరణ్. 

 ****************************

 మరి కొన్ని రోజులకు స్వప్న అనే ఆమె ఆఫీస్ లో స్వీపర్ ఇంటికి వచ్చింది. 

“అమ్మా, బాగున్నారా.. మీరు కూడా ఇక్కడే ఉంటున్నారా? ఎన్ని రోజులయింది. నేను మీరు లేనప్పుడు సారుకు పని చేసినాను. గిన్నెలు తోమి, బట్టలు ఉతికి పోయేదాన్ని”. 


“నీ పేరేమిటి?”


“స్వప్న అమ్మా!”


“సార్ నాతోటి ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చావు?”


“సార్ నాకు డబ్బులు ఇవ్వాలమ్మా, ఇంట్లో అమ్మ ఉంటుంది ఇస్తుంది అనీ చెప్పాడమ్మా!”


“అలాగా.. మరి సారు నాకేమీ చెప్పలేదు”.

 

ఫోన్ చేసి “మీరు స్వప్నకి డబ్బులు ఇవ్వమని చెప్పారా?” అని అడిగింది. 


“స్వప్న అనే ఆమె ఎవరోకూడా నాకు తెలియదు. డబ్బులు ఇవ్వ కు” అని చెప్పాడు. 


ఆమాటలు స్పీకర్ లో విన్న స్వప్న జాడలేకుండా వెళ్లి పోయింది. ఇలాంటి వాళ్లే భార్య, భర్తల మధ్య చిచ్చు పెట్టటానికి వస్తుంటారు. 

  ************************


ప్రతిరోజూ సాయంత్రం దేవాలయం వెళ్ళే రమాదేవి మరునాడు కూడా వెళ్లి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుళ్ళోకి వెళ్లి దండం పెట్టుకుంది. రోజూ కిట కిట లాడె జనం తో ఉన్న ఆగుడిలో ఆరోజు జనం పల్చగా ఉన్నారు. ఒకరి తరువాత ఒకరు వెళ్లిపోతున్నారు. గుళ్ళో పూజారి మాత్రమే మిగిలాడు. దేవుడు ఉండగా ఒంటరి తనమనే భయమే ఉండదు. రమాదేవి లోపలికెళ్లి హారతి, తీర్థం, ప్రసాదం తీసుకుంది. తను రోజూ వస్తుంటుంది కనుక గుర్తు పడతాడు పూజారి.. వెళ్లిపోయే రమాదేవి నీ వెనక్కి పిలిచాడు. 


“అమ్మా! అక్షింతలు వేస్తాను రండి” అని చేతిలో అక్షింతల పళ్లెంతో నిలబడి, ఆశీర్వచనం తీసుకుందా మని వెళ్ళిన రమాదేవి వంగి దండం పెడుతూ ఉండగా తలమీద దుడ్డు కర్ర తీసుకుని ఒక్కదెబ్బతీశాడు. గట్టిగా తగిలే సరికి కళ్ళు తిరిగి నట్లయింది. వంటిమీద బంగారు గొలుసులు, బంగారు గాజులు గుంజుకుంటున్నాడు. అప్పుడు అర్థమైంది బంగారం కోసం నన్ను చంపడానికి ప్రయత్నించాడు అని.


 తేరుకుని, కరాటే వచ్చిన మనిషి కావున ఒక్క తన్ను తన్నింది, మీద మీద రెండు దెబ్బలు వేసింది. పూజారి కళ్ళు తిరిగి పడి పోయే వాడల్లా, మళ్లీ తమాయించుకుని లేస్తుంటే, శరీరం పైన ఒత్తిడి చేసే సెన్సిటివ్ పాయింట్ల మీద పదునైన దెబ్బలు మరియు కిక్కులు ఇచ్చింది. రెండు దెబ్బలు వేసింది. 

వెంటనే అక్కడున్న తాడుతో కాళ్ళు చేతులు కట్టి, గుంజకు కట్టేసింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది కాసేపట్లో చాలా మంది గుమి గూడారు. 


 పోలీసులకు జరిగినదంతా చెప్పింది. అక్కడున్న సీసి కెమెరాల ఆధారంగా ముందుగా పూజారి కొట్టినది, తరువాత జరిగినది అంతా చూశారు. పూజారిని బాగా ప్రశ్నించడం తో ఇదివరలో కూడా వేరే దేవాలయం లో ఒక ఆవిడ ను చంపి, బంగారం తీసుకుని, తన అప్పులన్నీ తీర్చుకున్న సంగతి, విలాసాల జీవితం గడిపిన సంగతి చెప్పాడు. బంగారం కొన్న షాప్ వాడిని కూడా పరిశీలించారు. 


బంగారం షాప్ వాడిని, పూజారిని అరెస్ట్ చేసి, పూజారి హత్యా ప్రయత్నం చేసి నందుకు, ఇదివరలో హత్య చేసినట్టు ఒప్పుకున్నందుకు, పూజారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 

  *****************

  కరాటే విద్యతో తన ప్రాణాన్ని కాపాడుకున్నoదుకు, ఒక స్త్రీ అబల కాదు సబల అని ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇచ్చింది. ఇంట్లో తెలివి తేటలతో కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడమే కాకుండా, బయట ప్రజలలో నేరస్థులను కూడా పట్టించి నందుకు, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు ఎంతగానో సంతోష పడ్డారు. 


 సమాప్తం


యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం


41 views0 comments

Comments


bottom of page