top of page

ప్రేమ అనేది అమృతం

Writer's picture: Neeraja PrabhalaNeeraja Prabhala


Prema Anedi Amrutham - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 01/02/2025

ప్రేమ అనేది అమృతం - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) 


ప్రేమ  అనేది  అమృతం. 

అదే  సమస్తజీవరాశిని  బ్రతికించే  దివ్యౌషధం. 

సృష్టిలో  ప్రతి జీవి  ఆ ప్రేమ  కోసం  పరితపిస్తుంది. 

అది అందకపోతే  మనిషిలో  ద్వేషం  రగిలి 

మానవుడు  దానవుడవుతాడు. 

ప్రేమైక  హృదయముంటే  స్వార్థం  దరిదాపులకు  రాదు. 

మంచితనం-మానవత్వం   ప్రేమకు  సహచరులు.    

ఈ విశాల విశ్వం  పవిత్ర ప్రేమకు  సాకారం. ప్రేమ  మనిషిని  సన్మార్గంలో  ఉంచి,

ఉన్నతశిఖరాలను  అధిరోహిస్తుంది.

ప్రేమించే మనసుంటే   జీవితం  ధన్యం.

 ప్రేమ రసాస్వాదన  లేకపోతే  జీవితం  వ్యర్థం.

ప్రమతో   అమూల్యమైన  జీవితం సార్ధకం. 

ప్రేమించు- ప్రేమను  పంచు -ప్రేమతో  జీవించు. 

అప్పుడే  ఈ జగత్తంతా  సుందర నందనవనం.


-నీరజ  హరి ప్రభల


30 views1 comment

1 Comment


ప్రేమ అనేది అమృతం: నీరజ హరి ప్రభల

ఈ కవిత ఇస్రేల్ - రష్యా - ఉక్రెయిన్ - హమాస్ ... ఇతర యుద్ధ దేశాలు చదవాలి ... ప్రపంచం స్నేహపూరిత స్వర్గం లా మారి పోటానికి... అని ఆశిస్తూ

Ii) యుద్ధ సామగ్రి నిర్మాణం ఆపు చేయాలి అంతర్జాతీయ చట్టం ద్వారా ... ఉన్న ఆయుధాలు విధ్వంసం చేయాలి అన్ని దేశాలు...

అప్పుడే సాధ్య ఉత్తి శాంతి - చర్చలు

పి.వి. పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page