top of page

ప్రేమ అనేది అమృతం

Writer: Neeraja PrabhalaNeeraja Prabhala

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #PremaAnediAmrutham, #ప్రేమఅనేదిఅమృతం


Prema Anedi Amrutham - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 21/03/2025

ప్రేమ అనేది అమృతం - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) 


ప్రేమ  అనేది  అమృతం. 

అదే  సమస్తజీవరాశిని  బ్రతికించే  దివ్యౌషధం. 

సృష్టిలో  ప్రతి జీవి  ఆ ప్రేమ  కోసం  పరితపిస్తుంది. 

అది అందకపోతే  మనిషిలో  ద్వేషం  రగిలి 

మానవుడు  దానవుడవుతాడు. 

ప్రేమైక  హృదయముంటే  స్వార్థం  దరిదాపులకు  రాదు. 

మంచితనం-మానవత్వం   ప్రేమకు  సహచరులు.    

ఈ విశాల విశ్వం  పవిత్ర ప్రేమకు  సాకారం. ప్రేమ  మనిషిని  సన్మార్గంలో  ఉంచి,

ఉన్నతశిఖరాలను  అధిరోహిస్తుంది.

ప్రేమించే మనసుంటే   జీవితం  ధన్యం.

 ప్రేమ రసాస్వాదన  లేకపోతే  జీవితం  వ్యర్థం.

ప్రమతో   అమూల్యమైన  జీవితం సార్ధకం. 

ప్రేమించు- ప్రేమను  పంచు -ప్రేమతో  జీవించు. 

అప్పుడే  ఈ జగత్తంతా  సుందర నందనవనం.


-నీరజ  హరి ప్రభల


Comments


bottom of page