top of page
Writer's picture Lavanya Kumari Pendekanti

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 9


'Prema Chejarithe 9' New Telugu Web Series

Written By Pendekanti Lavanya Kumari

ప్రేమ చేజారితే - ధారావాహిక తొమ్మిదవ భాగం

రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి

(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)


గత భాగంలో జరిగినది


డాక్టర్ నితిన్ పిల్లలకు అర్థమయ్యే విధంగా కుశాల్, కుశాల్ క్లాస్మేట్లకు కౌన్సెలింగ్ కొనసాగిస్తుంటాడు .


ఇక ఈ భాగం చదవండి...


ఆరోజు ఉదయం కుశాల్ ఉలిక్కిపడి కలవరిస్తూ లేచాడు, మనసులో ఏవో తెలియని భావనలు, అదోమాదిరి అలజడి, విపరీతమైన బాధ...

ఎవరో ఎక్కడినుండే పడ్తున్నట్టుగా, ఏదో లీలగా కనిపిస్తుంది, ఏంటా అని ఆలోచించే ప్రయత్నం చేస్తే చాలు తలనొప్పిగా అనిపిస్తోంది. ఎందుకలా అని ఆలోచించటానికి లేకుండా తలనొప్పి...


అమ్మానాన్నలకు కూడా చెప్పాలనిపించలేదు. కుశాల్ ఎంత ప్రయత్నిస్తున్నా ఆలోచనలు కుదుటపడటం లేదు, ఇంకా తల నొప్పి పెరుగుతన్నట్టుగా అనిపించింది...


కుశాల్కు స్కూల్కెళ్ళి డాక్టర్ నితిన్ని కలిస్తే బాగుంటుందనిపించి, వెంటనే రెడీ అయ్యి స్కూల్కు బయలుదేరాడు, షాలిని టిఫిన్ తినమని పిలుస్తున్నా వినకుండా, తినకుండా స్కూల్కు వెళ్ళి పోయాడు కుశాల్.


అక్కడే వున్న కుమార్ షాలినీతో, "పర్వాలేదులే నేనీరోజు నానీ స్కూల్కు వెళ్తున్నాను, క్యారియర్ కట్టి వుంచు నేనే తీస్కెళ్తాను," అని చెప్పాడు.


షాలిని,"అలాగే," అంది.


కుశాల్ స్కూల్కెళ్ళగానే క్లాస్మేట్ 'హసీ' కనిపించి, "ఏంటి కుశాల్! అలా వున్నావు? మళ్ళీ తల నొస్తుందా? అయితే తొందరగా మన డాక్టర్ని కలవమని సలహా ఇచ్చి, బై చెప్పి", వెళ్ళి పోయింది.


డాక్టర్ నితిన్ కుశాల్ వాళ్ళకు కౌన్సెలింగ్ మొదలెట్టినప్పటి నుండి స్కూల్కు అస్సోసియేట్గా వున్న హెల్త్ కేర్ యూనిట్లోనే ప్రతిరోజూ వచ్చి స్కూల్ టైమంతా అక్కడే వుంటున్నాడు. పిల్లలకు అక్కడ కౌన్సెలింగ్ ఇవ్వటమే కాక పూర్తిగా తను వాళ్ళను గమనిస్తున్నాడు కూడా. ఎవరైనా ఇతరులు నితిన్ని అర్జెంటుగా కన్సల్ట్ చేయాలంటే అక్కడికే వారిని రమ్మంటున్నాడు, లేకపోతే ఆన్లైన్లోనే వారికి కావాల్సిన సలహాలిస్తున్నాడు.


కుశాల్ కూడా హసీకి బై చెప్పి స్కూల్లోని 'హెల్త్ కేర్ యూనిట్' దగ్గరకు వచ్చాడు. సైకియాట్రిస్ట్ నితిన్ అక్కడ కూర్చుని కనిపించాడు. ఇంకా ఉదయమే కావటాన ఫ్రెష్గా కనిపిస్తూ, ఇస్త్రీ చేయబడిన శుభ్రమైన లేత రంగు షర్ట్కు ముదురు రంగు పాంట్ వేసి, టక్ చేసి, టై, షూస్తో పైన డాక్టర్ కోట్తో చూస్తూనే డాక్టర్ లా ప్రశాంతంగా కనబడుతున్నాడు. అతని వయసు అరవై పైనే వున్నా అస్సలంత వయసున్నట్టే కనబడడు. మరి ఆయన మైండ్ స్పెషలిస్టు కదా, ఎప్పుడు, ఎలా ఆ మనసును ఆధీనంలో వుంచుకోవాలో, ఎలా దాన్ని ఆనందంగా వుంచాలో బాగా తెలిసిన వ్యక్తి. మనసు ఆనందంగా వుంటే శరీరంలో ఎంతో వయసు తగ్గినట్లు కనిపిస్తుందన్నదానికి ఆయనో నిలువెత్తు నిదర్శనం.


సైకియాట్రిస్ట్ నితిన్ అప్పుడే వచ్చిన కుశాల్ని చూసి, "కమ్ నానీ" అంటూ పిలిచి కూర్చోమన్నాడు. (కుశాల్ను వాళ్ళ నాన్న పిలిచే పేరు 'నానీ' అని ముందు చెప్పాను గుర్తుంది కదా) ...


నితిన్ కావాలనే కుశాల్ను ముద్దు పేరుతో పలకరించాడు. దానివల్ల దగ్గరితనం పెరిగి మనసులోనిది బయటపెడ్తాడనేమో.


"ఏంటి ప్రాబ్లం నానీ?" అని అడిగి, "మళ్ళీ తనే అదే ప్రాబ్లమా" అని అడుగుతుండగానే ఒక ఇద్దరు జూనియర్ సైకియాట్రీ డాక్టర్లు వచ్చారు. వాళ్ళను కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చోమన్నాడు నితిన్. వాళ్ళు వెళ్ళి పోయాక మళ్ళీ నానీ వంక చూసాడు, అప్పుడు నానీ "అవునని సమాధాన"మిచ్చాడు...


దానికి డాక్టర్, "'నీకు కౌన్సెలింగ్ లో ఏమి చెప్పాను, నీకు ఆందోళన కలిగించే వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దనీ, వాటి గురించి అంతా నీకు పూర్తిగా ఈ కౌన్సెలింగ్ అయిపోయే లోపల తెలుస్తుందని చెప్పాను కదా, అయినా వినటం లేదా?!.' అంటూనే ' విపరీతంగా ఒకే విషయాన్ని ఆలోచిస్తుంటే ఇలా జరగటం క్వైట్ నార్మల్, టేక్ ఇట్ ఈజీ నానీ' అని, మళ్ళీ తనే 'నేను నీ తలనొప్పికి టాబ్లెట్ ఇస్తాననుకున్నావా? నో! ఈసారి నేను నీకు టాబ్లెట్ ఇవ్వటం లేదు. నీకు కలిగే భావాలను, ఆలోచనలను నేనర్థం చేస్కోగలను, వాటిని నీవు కంట్రోల్ చేస్కోవాలని నీకు చాలా సార్లు చెప్పాను. అలాగే ఇప్పుడు నీ కొచ్చే ఆలోచనలను సరైన దారిలోకి మార్చి నీ తలనొప్పిని ఎలా తగ్గిస్తానో చూడు,'" అన్నాడు.


కుశాల్ అన్నీ వింటూ, "ప్రయత్నిస్తున్నాను డాక్టర్," అన్నాడు.


"చూడు నానీ, నీకుగా నీవు, నీకు కలిగే భావాలను అణచి పెట్టి, నేను చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ వుండాలి, లేకపోతే ఈ టాబ్లెట్లకు అలవాటు పడి పోతావు. ఇవి వేస్కోటం అంత మంచిది కాదు కూడా," అన్నాడు నితిన్.


" 'అందుకే నానీ నేను చెప్పేది బాగా విను, దాని వల్ల నీకు టాబ్లెట్లు వేస్కునే అవసరం లేకుండా పోతుంది. నీకెప్పుడైతే ఇలా కొద్ది, కొద్దిగా తలనొప్పి మొదలైనట్లుగా తోచిందో, అప్పుడు వెంటనే ఎవరైనా నీకున్న మంచి స్నేహితులతోనో, మీ అమ్మతోనో, నాన్నతోనో కాసేపు మాట్లాడ్తూ వుండు. అప్పుడే ఇంత తల పగిలిపోతున్న బాధ వరకు రాకుండా వుంటుంది,' అన్నాడు. 'అలాగే నీవు నన్ను ఏది అడగాలనుకున్నా, ఎప్పుడైనా అడగవచ్చు, ఫీల్ ఫ్రీ అని,' " చెప్పాడు నితిన్.


మళ్ళీ తనే, "నానీ నీకు మంచి స్నేహితులున్నారు కదా, అదే మౌనిక, అఖిల్," అని అడిగాడు.


"హాఁ! ఉన్నార"న్నాడు నానీ.


"వాళ్ళు నీతో మాట్లాడినవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడే కూర్చోనుండు, ఒక్క పది నిమిషాలు నేనిప్పుడే లోపలికి వెళ్ళొస్తా"నని కాన్ఫరెన్స్ హాలుకెళ్ళాడు నితిన్. అక్కడ ఒక నలుగురు పి.జి. చేసే సైకియాట్రీ డాక్టర్లు కూర్చుని వున్నారు. వాళ్ళనుద్దేశించి, "అందరూ వచ్చారా, ఇంకా ఎవరైనా రావాలా?" అని అడిగాడు నితిన్.


"ఇంకో ఇద్దరు రావాలి సార్," అన్నారు వాళ్ళు.


"సరే అయితే వాళ్ళిద్దరు కూడా వచ్చాక లెక్షర్ మొదలెట్తాను," అని వాళ్ళతో చెప్పి మళ్ళీ నానీ దగ్గరకు వచ్చాడు నితిన్.


ఇక్కడ కుశాల్ (నానీ) నితిన్ చెప్పినట్టుగానే మౌనిక, అఖిల్ ల గురించి ఆలోచించ సాగాడు. వాడికి మౌనిక మాటలు గుర్తొచ్చాయి.


కుశాల్ నీకు మీ అమ్మ అన్ని పనులు సమయానికి చేసిపెట్టటమే కాక నీకు చదువులో కూడా పూర్తిగా సాయం అందిస్తుంది. మా అమ్మకైతే నాతో గడపటానికి అస్సలు సమయమే వుండదు , ఎప్పుడైనా చదువులో ఏదైనా డౌట్ వచ్చి అడిగినా నాకు చాలా పనుందమ్మా , రేపు మీ ట్యూషన్ టీచర్నడిగి తెలుసుకో అంటుంది. అయినా నేనేమీ బాధ పడను ఎందుకంటే అమ్మ పొద్దుటినుండి ఎంత పని చేస్తూ కష్టపడుతుందో నాకు తెలుసు. అయినా మా అమ్మ నాతో ఏ పనీ చేయించదు, పెద్దయ్యాక ఎలాగూ ఈ చాకిరీ అంతా తప్పదు, ఇప్పటినుండే నిన్ను కష్టపెట్టటం ఇష్టం లేదంటూ అంతా తనే కష్టపడి చేస్కుంటుంది. ఒక్క ఆదివారం రోజు మాత్రం కొన్ని చిన్న, చిన్న పనులు నాకు నేర్పించి చేయిస్తూ, వేరే పనులు తను చేస్కుంటుంది. అందుకే మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయంలో నీవెంత లక్కీనో నీవే ఆలోచించు అని మౌనిక చెప్పినది గుర్తు చేస్కున్నాడు.


అలాగే అఖిల్ తనతో అన్నవి గుర్తొచ్చాయి.


కుశాల్ నీకు మీ అమ్మ అన్ని పనులూ చేసిపెడ్తుంది, మాకు మా పనులు మేమే చేస్కోవాలి. కనీసం మాకు మాతో ప్రేమగా మాట్లాడే వారెవ్వరూ వుండరు. మేము మాకు బాధ కల్గినప్పుడు, ఏదైనా సందేహం వచ్చి అడగాలన్పించినప్పుడు ఒకరితో ఒకరము మాట్లాడుకోవటమో లేక మా బొమ్మలతో మేము మాట్లాడుకోవటమో చేస్తుంటాము. బొమ్మలైతే మాతో తిరిగి మాట్లాడలేవు, ఇంక ఫ్రెండ్సైతే మాకెంత తెలుసో వారికంతే తెలుసు కాబట్టి డౌట్లైతే తీర్చలేరు. ఇంకా అప్పుడప్పుడూ ఆయమ్మలతో, డాక్టర్లతో మాట్లాడొచ్చనుకో, కానీ వాళ్ళకెన్నో పనులుంటాయి, మేమేమో ఇంతమందిమి, ఎలా వీలవుతుంది మాట్లాడటానికి. అయినా వారే అప్పుడప్పుడూ వచ్చి అందరినీ పలకరించి ఏమైనా అడగాలనుకుంటే సంకోచించకుండా అడగమని చెప్తుంటారు. అదే మాకెంతో ఆనందాన్నిస్తుంది. అంతే కాక వారంలో ఒకరోజు నిధి ఆంటీ ఒక్కొక్కరితో కొంచెం సేపు పర్సనల్గా మాట్లాడి మాకొచ్చే అనుమానాలన్నీ తీరుస్తుంది. నేనైతే నాకు తెలుసుకోవాలనుకున్నవన్నీ ఒక పుస్తకంలో వ్రాసిపెట్టుకుని ఆ రోజు అడుగుతాను. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని ఎదురు చూస్తుంటాను. ఆమె ఎంత ప్రేమగా మాట్లడ్తుందో, నాకు అమ్ముంటే ఇలాగే మాట్లాడేది కదా అనిపిస్తుంది. నాకందుకే నిధీ ఆంటీ అంటే చాలా ఇష్టం.

అలా చూస్తే నీవెంత లక్కీనో తెలుసా అని అఖిల్ అనటం గుర్తు చేస్కున్నాడు.


దాంతో కుశాల్కు ఎక్కడో పడిన ముడులు విడిపోతున్నట్టుగా అనిపించి చాలా మటుకు తలనొప్పి తగ్గిపోయింది. ఇంతలో నితిన్ తిరిగి కుశాల్ దగ్గరకు వచ్చి, " ఏంటి, ఎలా వుందిప్పుడు?"అని కుశాల్ ముఖంలోని మార్పుని గమనిస్తూ అడిగాడు.


"ఇప్పుడు నాకు చాలా బాగుంది, తలనొప్పి చాలా మటుకు తగ్గిపోయింది, బాధ కూడా అనిపించటం లేదు," అన్నాడు కుశాల్.


"వెరీ గుడ్! సో, నౌ యువార్ ఆల్రైట్, అందుకే నీకు చెప్పింది, అలా తలనొప్పి వచ్చినప్పుడు నిన్ను ఇబ్బంది పెడ్తున్న ఆలోచనేదో దాన్ని కాకుండా అందరూ చెప్పిన మంచి విషయాల గురించి ఆలోచించడమో లేక నీ

ఫ్రెండ్స్ తో కాసేపు మాట్లాడటమో చేయమని. అయితే నీవింక నీ క్లాస్కి వెళ్ళు," అని చెప్పి నవ్వుతూ వీపు మీద ప్రేమగా తట్టాడు నితిన్.


అంతలో అక్కడికి కుమార్ వచ్చాడు.


"ఏంటి నానీ! టిఫిన్ తినకుండా వచ్చేసావు, ఇదిగో మీ అమ్మ నీకు టిఫిన్ ఇచ్చి పంపింది, తినేసి వెళ్ళు," అన్నాడు కుమార్.


"లేదు నాన్నా! నేను బ్రేక్లో తింటా," అంటూ నితిన్ వైపు చూసాడు. అప్పుడు నితిన్, కుశాల్ వైపు చూసి, నవ్విన చిన్న నవ్వును చూసాక, వాడికి చూసావా మీ అమ్మ నీ గురించి ఎంత కేర్ తీస్కుంటుందో అన్నట్టుగా అనిపించింది.


నానీ ఆనందంగా క్లాస్కు బయల్దేరాడు.


ఇంతలో రావాల్సిన ఇద్దరు జూనియర్ డాక్టర్లు కూడా వచ్చేసారు.


కాసేపటికి ప్రేయర్ బెల్ మ్రోగిన శబ్దం వినిపించింది.


తర్వాత డాక్టర్ నితిన్ తన కుర్చీలోంచి లేచి, కుమార్ను వెంట తీస్కొని కాన్ఫరెన్స్ హాలుకెళ్తూ కుమార్తో, "నీతో ఒక విషయం చెప్పాలనే పిలిచాను," అన్నాడు.



(ఏం చెప్పాడన్నది మరో భాగంలో తెల్సుకుందాము. ఇక వుంటాను. బై )


============================================================

ఇంకా వుంది


============================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.






19 views0 comments

Kommentare


bottom of page