'Prema Entha Madhuram Episode 11' - New Telugu Web Series Written By
Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 09/03/2024
'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
వెబ్ సిరీస్ ని చదివిన అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ సిరీస్ కి సంబంధించి బోనస్ ఎపిసోడ్ రాయాలనిపించింది. చదివి, లైక్ చేయగలరు..
జరిగిన కథ:
సుశీల చనిపోయిన తర్వాత సతీష్ ఒంటరి వాడైపోయాడు. సతీష్ ను పలకరించడానికి ఫ్రెండ్స్ అంతా వచ్చారు. సుశీల ఆఖరి కోరిక గురించి అందరికీ చెప్పాడు. లత.. సతీష్ ను పెళ్ళి చేసుకుంది. కళ్యాణి కూతురిని.. సతీష్ తన సొంత కూతురు లాగ చూసుకుంటున్నాడు.
ఇక ప్రేమ ఎంత మధురం! - ఎపిసోడ్ 11 (బోనస్ ఎపిసోడ్) చదవండి..
"ఏమండీ.. ! మీరు నన్ను పెళ్ళైతే చేసుకున్నారు.. కానీ.. నాతో సరదాగా ఉండట్లేదు. సుశీల లేని లోటు మిమల్ని ఇంకా బాధిస్తుందని నాకు తెలుసు. అక్కతో మీరు ఎంత సంతోషంగా ఉండేవారో నేను ఉహించుకోగలను. అక్క నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చినప్పుడు.. తను మాట్లాడిన తీరు చూస్తే, అలాంటి మంచి మనిషి దూరం అయిన తర్వాత మీకు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అప్పుడు అక్క, 'మీరంటే నాకు ఇష్టమా.. ?' అని నన్ను అడిగింది.. నాకు ఏం అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు అంతా తెలుస్తుంది. మిమల్ని నాకు అప్పగించి తాను వెళ్ళిపోయిందని. కానీ, విధి వ్రాత ఎవరు తప్పించలేరు కదా.. " అంది లత.
"లతా.. ! నన్ను ఒంటరిగా ఉండనిస్తావా.. ప్లీజ్.. ?"
"అలాగే.. నా గురించి కుడా కొంచం ఆలోచించండి. మిమల్ని ప్రేమించాను. మీ లాంటి మంచి మనిషి వేరొకరు దొరకక.. పెళ్ళి కుడా చేసుకోలేదు. నాకు మీ మీద ఎంతో ప్రేమ ఉంది.. " అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది లత.
సతీష్ మది నిండా సుశీల ఆలోచనలే.. లత చెప్పినట్టు జరిగిపోయిన దాని గురించి అలోచించి ఏమిటి ప్రయోజనం.. ? నేను నా సూశీ కి ఇచ్చిన మాట తప్పుతున్నానా.. ? నా సూశీ ఏ లోకంలో ఉన్నా.. ఇదంతా చూసి బాధ పడదుగా.. ? ఇలాంటి ఆలోచనలతో రాత్రంతా నిద్రపట్టలేదు సతీష్ కు.. నేను ఇలా ఉంటే, కళ్యాణి కి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటాను.. ? శ్రావ్యను ప్రేమగా ఎలా చూసుకోగలను.. ? అసలే శ్రావ్య నన్నే డాడీ అనుకుంటోంది.. అని ఆలోచించాడు సతీష్.
నిద్రపట్టక.. అలా స్టడీ రూమ్ లో బుక్ చదువుదామని వెళ్ళాడు సతీష్. ఎప్పటినుంచో చదవని పుస్తకాలు అక్కడ చాలా ఉన్నాయి. సుశీల షెల్ఫ్ వైపు సతీష్ దృష్టి పడింది. అక్కడకి వెళ్లి పరిశీలిస్తున్నాడు. అక్కడ చాలా సుశీల కు సంబంధించిన వస్తువులు, పుస్తకాలు చూసి.. కంట్లో నీళ్ళు తిరిగాయి సతీష్ కు. ఒక పుస్తకం తీస్తుండగా.. అందులోంచి ఒక కాగితం కింద పడింది. ఏమిటి అబ్బా ఇది.. ? అని దానిని ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాడు. అది సుశీల రాసిన ఉత్తరం అని వెంటనే గ్రహించాడు సతీష్. డేట్ చూస్తే, సుశీల ఆఖరి రోజుల్లో రాసినట్టు ఉంది..
ప్రియమైన శ్రీవారు..
ఈ ఉత్తరం మీరు చదువుతున్న నాటికి నేను మీ లోకం లో ఉండను. బాధపడకండి.. ! ఏడవకండి సతీష్.. ! కళ్ళు తుడుచుకోండి.. ! మీరు ఎంత మంచివారో అంత కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించారని నాకు తెలుసు. మీతో నేను నిండు నూరేళ్ళు జీవించాలని ఎన్నో సార్లు అనుకున్నాను. ఎవరి దిష్టి తగిలిందో.. దేవుడు నాకు ఈ రోగం ఇచ్చి.. ముందే తన దగ్గరకు తీసుకుపోయాడు. మీతో అప్పట్లో చెప్పాలనుకున్న మాటలు.. మీ పరిస్థితి చూసి చెప్పలేక, ఇలా ఉత్తరంలో రాస్తున్నాను.
మీరు నా మాట కాదనరని నాకు తెలుసు. ఎందుకంటే, నేనంటే అంత ప్రేమ మీకు. లత ని పెళ్ళి చేసుకున్న తర్వాత కుడా.. నా గురించి అలోచించి మీ జీవితం, లత జీవితం నాశనం చేసుకోవద్ధు. లత మీ మీద ఎన్నో అశలు పెట్టుకుని మీ జీవితంలోకి వస్తుంది. అప్పట్లో నేను మిమల్ని పెళ్ళి చేసుకుని ఎలా మీతో సంతోషంగా ఉన్నానో.. అలాగే, అంతే సంతోషాన్ని మీరు లత కి ఇవ్వాలి.. నేను తాళి కట్టమన్నానని లతకు తాళి కడితే సరిపోదు.. నాతో ఉన్నట్టుగానే, ఆమె తో కుడా ఉంటేనే.. ఇక్కడ ఉన్న నాకు సంతోషం. మనం ఎన్ని చోట్లకి వెళ్ళామో.. ఎంత ఎంజాయ్ చేసామో.. అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ ఇద్దరూ చెయ్యాలి. లత లో మీరు నన్ను చూసుకుని, మీరు హ్యాపీ గా ఉండాలి..
నేనంటే మా అమ్మకు ప్రాణం. నాకు ఒక ముల్లు గుచ్చుకుంటేనే, విల విల లాడిపోతుంది అమ్మ. అలాంటిది.. ఇప్పుడు చాలా బాధ పడుతూ ఉంటుంది. మా అమ్మ ని కలిసి ఆమెను మీరే ఓదార్చాలి.. లత ను అమ్మ కు.. నాన్నకు పరిచయం చేసి, దగ్గర చెయ్యాలి.. నా లోటు వాళ్ళకి తెలియకూడదు. నా చెల్లి కి నేనంటే పిచ్చి ప్రేమ. ఎంత తిట్టుకున్నా, కొట్టుకున్న నేనంటే దానికి పిచ్చి ప్రేమే. దానికి మీరు ధైర్యం చెప్పాలి..
నా ఫ్రెండ్ కమల ఒక వెర్రి పిల్ల. దానికి నేనే మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఆ బాధ్యత మీరే తీసుకోవాలి. మీ లాంటి ఒక మంచి అబ్బాయిని చూసి.. దానికి గ్రాండ్ గా పెళ్ళి చెయ్యాలి. అప్పుడు అది చాలా హ్యాపీ గా ఫీల్ అవుతుంది. నేను ఉండి ఉంటే, ఇద్దరమూ కలిపి పెళ్ళి చేసేవాళ్ళం. ఇప్పుడు మీరే ఆ బాధ్యత మొత్తం తీసుకోవాలి..
కళ్యాణి కోరిక మేర తన కూతురు శ్రావ్య ని చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బాగా చదివించి.. సొంత కుతురిలాగా పెంచి.. తను ఆనందంగా ఉండేలా మీరే చూడాలి..
మీరూ, లతా సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. పైనుంచి నేను అంతా చూస్తూనే ఉంటాను. మిమల్ని కనిపెడుతూనే ఉంటాను. మీ ఇద్దరికీ నేను మళ్ళీ పుడతాను.. మీ వొళ్లో ఆడుకుంటాను.. మీతో అన్నీ కొనిపించుకుంటాను.. అల్లరి చేస్తాను.. మీ కూతురిగా నాకు అన్నీ మీరు కొనిపెట్టాలి. నన్ను కుడా అప్పుడు అన్ని చోట్లకి తిప్పాలి.. మీ లాంటి మంచి మనిషిని భర్త గా వెదికి.. ఒక తండ్రిగా నాకు పెళ్ళి చెయ్యాలి సతీష్..
మీ ఫ్రెండ్స్ అందరితో సరదాగా ఉండండి.. మీరు చేయగలిగినంత సాయం చేసి వారి జీవితాలు కుడా ఆనందమయం చేయండి. ఇప్పుడు నా బాధ్యత అంతా మీదే కదా.. !
ఇట్లు.. మీ శ్రీమతి సుశీల..
ఉత్తరం చదివిన సతీష్ కంట్లో నీళ్ళు ఆగలేదు. మనసులో బాధను ఆపుకోలేక, గట్టిగా ఏడ్చేసాడు. 'ఎందుకు సుశీల ఇలా చేసావు.. ? ఆ దేవుడు నీ లాంటి మంచి మనిషిని ఎందుకు అంత తొందరగా తీసుకుపోయాడు.. ?' నువ్వు చెప్పినట్టుగా, నీ కోసం అన్నీ చేస్తాను..
హాల్ లోకి వచ్చిన సతీష్.. కళ్ళు తుడుచుకుని.. చల్లటి నీటితో ముఖం కడుక్కుని లత కోసం చూసాడు..
"లతా.. ! మనం రేపు హనీమూన్ కి వెళ్తున్నాము, బట్టలు సర్దు.. నిన్ను నేను ఇంక కష్టపెట్టలేను.. మనం హ్యాపీ గా ఉందాము.. "
"సడన్ గా ఎంత మార్పు వచ్చింది మీలో.. " అంది లత.
"కలలో ఒక దేవత కనిపించి.. నేను చేయాల్సిన పనులు గురించి ఆదేశించింది.. అంతే.. !" అన్నాడు సతీష్.
సంవత్సరం తిరిగేసరికి లతకి ఆడపిల్ల పుట్టింది. సుశీల పుట్టిందని ఎంతో సంబరపడిపోయాడు సతీష్. అమ్మాయికి పేరు కుడా 'సుశీల' అనే పెట్టాడు. సుశీల ఉత్తరం లో రాసినట్టు అన్నీ చేసాడు సతీష్.
=================================================================================
సమాప్తం
ప్రేమ ఎంత మధురం! ధారావాహికను ఆదరించిన మా ప్రియమైన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ తాత మోహనకృష్ణ గారి గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
=================================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలుతాత మోహనకృష్ణ
Comments