top of page
Writer's pictureMohana Krishna Tata

ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 3


'Prema Entha Madhuram Episode 3' - New Telugu Web Series Written By Mohana Krishna Tata

'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


సతీష్.. సుశీల సంసారం హ్యాపీ గా సాగుతుంది. సతీష్.. అప్పుడప్పుడు దిగాలుగా ఉండడం గమనించిన సుశీల.. కారణం తెలుసుకోవాలి అనుకుంటుంది..


ఒక డైరీ కనిపిస్తుంది. అందులో కొన్నిపేర్లు మాత్రమే రాసి ఉంటాయి.


మర్నాడు కొన్ని ఫొటోలు దొరుకుతాయి. సుశీల తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళడానికి సతీష్ ను పెర్మిషన్ అడిగి వెళ్తుంది. కమల.. సుశీలను తన ఫ్లాట్ కి తీసుకెళ్తుంది.. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ.. పిజ్జా తింటారు..


ఇక ప్రేమ ఎంత మధురం! - ఎపిసోడ్ 3 చదవండి.


"మరీ అడుగుతున్నావు కదా! చెబుతున్న".. అని అంతా చెప్పింది సుశీల


"పోవే, మీ అయన.. చాలా మంచి మనిషి.. నువ్వు ఇలాగ అనుమానించడం నాకు నచ్చలేదు"


"అనుమానం కాదే, మా అయన బాధ పోగొట్టాలని ఈ ప్రయత్నం కమల!"


"ఓకే, మరి ఏమిటి చేద్దాము అనుకుంటున్నావు?


"రేపు మా ఆయన చదివిన స్కూల్ కి వెళ్ళాలనుకుంటున్నా!"


"నాకైతే ఆఫీస్ ఉందే.. నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు"


"అలాగే కమల"


ఈలోపు బెల్ మోగింది. తలుపు తీసింది కమల.


“పిజ్జా వచ్చిందే సుశీల! కమ్ ఆన్ లెట్స్ ఎంజాయ్!”


మర్నాడు ఉదయమే రెడీ అయి.. సుశీల క్యాబ్ బుక్ చేసి స్కూల్ దగ్గరకు చేరింది..


అక్కడ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి, వాళ్ళాయన చదివిన ఇయర్ లో క్లాస్ మేట్స్ డీటెయిల్స్ అడిగింది. ఫోటో కూడా తీసుకుంది..


రాణి అడ్రస్ దొరికింది.. లక్కీ గా ఆ అమ్మాయి ఆ ఊర్లోనే ఉంది..


సాయంత్రానికి ఇంటికి చేరుకుంది సుశీల..


"హాయ్ సుశీల!” అంటూ గుమ్మం నుంచే పలకరించింది కమల..


ఫ్లాట్ లోకి అడుగుపెడుతూ.. “ఎలాగ గడిచింది.. నీ అన్వేషణ.. ఈ రోజు" అడిగింది కమల.


"ఊరుకోవే!.. అడ్రస్ అయితే దొరికింది.. రేపు వెళ్తాను.. రాణి ని కలవడానికి.."


"అల్ ది బెస్ట్"


"ఇప్పుడైతే రావే.. డిన్నర్ ప్రిపేర్ చేసి తిందామ్"


"నేను బయటనుంచి ఫుడ్ తెచ్చానే!"


"గ్రేట్"


"అయితే పదా!.. తిందామ్.. "


"ఏమిటో తెచ్చిన ఫుడ్?"


"నీకు ఇష్టమైనది.. ఏమిటో చెప్పు?"


"పిజ్జా అయ్యి ఉంటుంది"


"కాదే! ఎప్పుడు.. పిజ్జా యేనా! ఈసారి స్పెషల్ డిన్నర్ తెచ్చాను"


"నా తిండి మీద నీకెంత శ్రద్ధే సుశీల? మీ ఆయనకు కూడా ఇలానే వెరైటీస్ చేస్తావా ఇంట్లో?"

"అవునే, మా ఆయనకు వెరైటీస్ చెయ్యాలి.. ఉప్మా ఎక్కువగా చేస్తే తిడతారు.. "


"అవునే మరి! మనకి సులువని ఉప్మా చేసేస్తాం.. పాపం.. మగవాళ్ళు.. ఎలా తింటారు చెప్పు.. అసలే మీ అయన బయట ఫుడ్ అంతగా తినరు కదా.. !"


"అవునే! కరెక్ట్ గా చెప్పావు"


డిన్నర్ అయిన తరువాత, సుశీల కు సతీష్ గుర్తొచ్చి కాల్ చేసింది..


"ఏమండి! ఎలా ఉన్నారు? మీరే గుర్తొస్తున్నారండి. డిన్నర్ అయ్యిందా? ఏం తిన్నారు?"


"పూరి తిన్నాను సుశీల"


"నిన్న ఏమి తిన్నారు?"


"పూరి"


"రోజూ పూరి తింటే, మీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి.. ?"


"అందుకే నువ్వు తొందరగా వచ్చి.. నా గురించి పట్టించుకో!.." అన్నాడు సతీష్


"అలాగే! వస్తాను గాని.. తినేదేదో కాస్త మంచి హోటల్ లో తినండి.. "


"అలాగే! ఏమంటుంది మీ ఫ్రెండ్?"


"మిమల్ని వదిలి.. ఎలా వచ్చానని అడుగుతుంది?"


"నిజమే కదా మరి?"


***


మర్నాడు ఉదయం, మళ్ళీ సుశీల బయల్దేరింది. ఉదయానే లేచి.. తలంటు స్నానం చేసి.. పూజ ముగించుకుని, రాణి ఉన్న అడ్రస్ దగ్గరకు క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్స్ అన్నీ బిజీ గా ఉన్నాయ్ ఆ రోజు..


"కమల! లేవే!"


"ఎందుకు?"


"క్యాబ్ దొరకట్లేదు. కొంచం నన్ను డ్రాప్ చెయ్యవే!"


"ఉండవే! వస్తాను” అని డ్రెస్ మార్చుకుని వచ్చింది కమల.

సుశీల ని డ్రాప్ చేసి, కమల వెళ్లిపోయింది.


"చూస్తే ఇల్లు చాలా పాతది లాగానే ఉంది.. ఈ అమ్మాయి ఇక్కడే ఉందో లేదో అని అనుకుంది సుశీల. కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు తీసింది ఒక ఆంటీ.


"ఆంటీ! ఇది రాణి ఉండే ఇల్లే కదా"


"అవును.. రాణి నా అమ్మాయి.. పిలుస్తాను.. ఉండండి. లోపలికి రా అమ్మ, కూర్చో! ఇంతకీ నువ్వు ఎవరో చెప్పలేదు?”


"ఫ్రెండ్” అని చెప్పింది సుశీల.


ఈలోపు సుశీల, హాల్ అంతా గమనిస్తున్నది. సామానులు అన్నీ నీట్ గా అమర్చి ఉన్నాయ్. రాణి పెళ్లి ఫోటో అక్కడ ఉంది. చూసిన సుశీల కు కొన్ని విషయాలు తెలిసాయి.

ఆంటీ లోపలికి వెళ్లిన చాలా సేపటికి.. రాణి హాల్ లోకి వచ్చింది..


"ఎవరండీ మీరు?" అడిగింది రాణి.


"మీరు రాణి కదా! 10th క్లాస్ ఇక్కడ స్కూల్ లో చదువుకున్నారు కదా?"


"సారీ! నేను మిమల్ని గుర్తు పట్టలేదు" అంది రాణి.


"నేను సతీష్ కొలీగ్"


"ఓహ్ సతీష్.. ఎలాగున్నాడు సతీష్?” అని అడిగింది రాణి.


"బాగున్నారు"


"సతీష్ రాలేదా?"


"లేదు"


"నా గురించి ఇంత దూరం వచ్చారా? మీ పేరు?"


"సుశీల"


“ఉండండి, మీకు కాఫీ తెస్తాను..” అని రాణి లోపలికి వెళ్ళింది.


“సుశీల గారు! మీరు చాలా అందంగా ఉన్నారండి.. సతీష్ కు మీ లాంటి అమ్మాయిలంటే చాలా ఇష్టం.. చూస్తూ ఉండండి.. మిమల్ని ఒక రోజు ప్రపోజ్ చేసినా చేస్తాడు..” అంది రాణి.


రాణి చూడడానికి 5 అడుగుల పొడవు, గుండ్రటి ముఖము, మంచి శరీర సౌష్టవం తో ఉంది. చాలా చలాకీగా, సరదాగా మాట్లాడుతున్నది.


రాణి అన్న మాటకు మనసులోనే, సుశీల మురిసిపోయింది.


"నేను సతీష్ కు ఒక పార్టీ ఇద్దామనుకున్నాను.. పాత ఫ్రెండ్స్ అందరినీ కలిపేటట్టు" చెప్పింది సుశీల.”అది సతీష్ పుట్టిన రోజు నాడు”.


"చాలా బాగుందండి "


"రాణి ! నీ గురించి నాకు ఏమి తెలియదు.. నాకు తెలుసు కోవాలని ఉంది. చెప్పండి ప్లీజ్..”


“అది పదేళ్ల కిందట మాట..


టెన్త్ క్లాస్ లో చుదువుతున్నపుడు.. మా స్కూల్ కో-ఎడ్యుకేషన్ అయ్యినప్పటికీ.. గర్ల్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో క్లాస్ లు.. బాయ్స్ ఫస్ట్ ఫ్లోర్ లో..


మా స్కూల్ లో బాయ్స్ ఫస్ట్ సతీష్.. ఎప్పుడు స్కూల్ ఫస్ట్.. గర్ల్స్ లో నేను ఫస్ట్..


కానీ ఎప్పుడూ.. నేను సతీష్ ను కలవలేదు.. స్కూల్ లో గాని బయట గాని..

సతీష్ ఫ్రెండ్స్ ద్వారా సతీష్ అభిరుచులు.. ఇష్టాలు అన్నీ తెలుసుకున్నాను..


తర్వాత.. మా నాన్నగారికి, .. ట్రాన్స్ఫర్ అవడం చేత.. ఊరు మారిపోవాల్సి వచ్చింది.. మళ్ళీ కొన్ని సంవత్సరాలకి ఇక్కడకు సొంతింటికి తిరిగి వచ్చేసాను..”


"తర్వాత మరి మీరు సతీష్ ను కలవలేదా?”


"లేదు, సుశీల గారు”


స్కూల్ ఫోటో కూడా చూసే అవకాశం రాలేదు..


“చెప్పడం మర్చిపోయాను. నాకు పెళ్లి అయ్యిందండి. అది మా పెళ్లి ఫోటో. మా అయన పేరు కూడా సతీష్. నేను ఇంటర్ లో ట్యూషన్ తీసుకుంటున్నప్పుడు, అక్కడ పరిచయం. నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడ్డాడు త్రీ ఇయర్స్. సతీష్ ది మిడిల్ క్లాస్ ఫామిలీ. నేనంటే చాలా ఇష్టమని చెప్పడానికి.. ఒకసారి సూసైడ్ కూడా చేసుకోబోయాడు. ఇంతగా ప్రేమించే వాడు.. భర్తగా దొరకడం అదృష్టమని ఇష్టపడి పెళ్లిచేసుకున్నాను.


తర్వాత మా ఇంట్లో కొన్ని రోజులు ఒప్పుకోలేదనుకోండి. మా పాప పుట్టాక, అందరూ ఒక్కటయ్యాం. ఇప్పుడు నేను.. మా అయన చాలా సంతోషంగా ఉన్నాం. అయన క్యాంపు కు వేరే ఊరు వెళ్లారు”.


"మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి రాణి! మీకు పార్టీ ఇన్ఫో అప్డేట్ చేస్తాను"


"సరే. మిమల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది " అన్నది రాణి


సుశీల అక్కడనుంచి కొన్ని ఫోటోలు తీసుకుని బయల్దేరింది..


దారిలో ఒక సంఘటన జరిగింది. తన క్యాబ్ లోంచి చూసింది. ఎవరో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు.. ట్రైన్ కింద పడి. మా అయినను ఎలాగైనా.. డిప్రెషన్ నుంచి బయట పడేయాలి. ఇంతమంది సతీష్ గురించి ఇంత మంచిగా చెబుతున్నారంటే, నేనెంత అదృష్టం చేసుకుని ఉండాలి భర్త గా పొందడానికి అనుకున్నది సుశీల.


=====================================================================

ఇంకా వుంది..


=====================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ

82 views0 comments

Comments


bottom of page