top of page
Writer's pictureMohana Krishna Tata

ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 4


'Prema Entha Madhuram Episode 4' - New Telugu Web Series Written By Mohana Krishna Tata

'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


సతీష్.. సుశీల సంసారం హ్యాపీ గా సాగుతుంది. సతీష్... అప్పుడప్పుడు దిగాలుగా ఉండడం గమనించిన సుశీల... కారణం తెలుసుకోవాలి అనుకుంటుంది... ఒక డైరీ కనిపిస్తుంది. అందులో కొన్నిపేర్లు మాత్రమే రాసి ఉంటాయి.

మర్నాడు కొన్ని ఫొటోలు దొరుకుతాయి. సుశీల తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళడానికి సతీష్ ను పెర్మిషన్ అడిగి వెళ్తుంది. కమల... సుశీలను తన ఫ్లాట్ కి తీసుకెళ్తుంది... ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ.. పిజ్జా తింటారు... సుశీలకు రాణి అడ్రస్ దొరుకుతుంది..


మర్నాడు రాణిని కలవడానికి వెళ్తుంది. రాణి స్టోరీ అడిగి తెలుసుకుంటుంది సుశీల... త్వరలో చేయబోయే పార్టీ గురించి చెప్పి... రాణి ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడనుంచి బయల్దేరుతుంది సుశీల..


ఇక ప్రేమ ఎంత మధురం! - ఎపిసోడ్ 4 చదవండి.


"తర్వాత నా పయనం ఎక్కడికో?" అనుకుంది సుశీల

లిస్ట్ లో తర్వాత ఉన్న... అమ్మాయి డీటెయిల్స్ వెదికింది సుశీల.


"సతీష్ ఇంటర్ చదివింది.... వైజాగ్ లో... సో, వైజాగ్ వెళ్ళాలి" అని అనుకుంది సుశీల.


రాత్రికి ఫ్లాట్ కు చేరుకుంది సుశీల..

"కమల!... నేను ఇంక బయల్దేరతానే!.... "


"ఇంకా కొన్ని రోజులు ఉండేవే... సరదాగా ఉంటుంది"


"లేదే! నీకు తెలుసు గా... మా అయన నాకోసం కలవరిస్తున్నారు... తొందరగా నా పని ముగించుకుని వెళ్ళాలి కదా!"


రాత్రి సతీష్ కు ఫోన్ చేసింది.... సుశీల.


"ఏమండీ! ఎలా ఉన్నారు? ఇంటికి వచ్చారా? డిన్నర్ అయ్యిందా?"


"సూసీ! అయ్యింది డిన్నర్! ఆఫీస్ నుండి ఇందాకలే వచ్చాను... నిన్ను చూసి త్రీ డేస్ అయ్యింది సుశీల! రాత్రి ఒక్కడినే పడుకోలేకపోతున్నాను! ఎప్పుడు వస్తున్నావు?


"ఇంకో 2 డేస్ అండి... వచ్చేస్తాను.... మా ఫ్రెండ్ ఉండమంటూ బలవంతం చేస్తుంది"


"టేక్ కేర్ సూసీ”

***

"కమలా! నా బట్టలు ప్యాక్ చేసావా బ్యాగ్ లో?”

"మేడ మీద ఆరేసి ఉన్నాయే... తీసుకొస్తాను ఉండు…”


సుశీల! ఒకసారి మీద మీదకు రావే... "


"ఈ టైం లో ఎందుకే? వస్తున్నాను.. ఉండు"


"చూడవే ఆకాశం ఎలా ఉందొ... మబ్బు పట్టి చాలా చల్లటి గాలి వీస్తుంది కదా.. !"


"అవునే!"


"ఇందాక టీవీ లో కూడా తుఫాన్ అలెర్ట్ వచ్చిందిగా... ఎక్కడకు బయటకు వెళ్లోద్దని చెప్పారు గా... నువ్వు వెళ్లడానికి లేదే ఇంక... ఇక్కడే ఉండిపో... ఈ చల్లటి వాతావరణం లో... మనం భలే ఎంజాయ్ చెయ్యొచ్చు... "


"ఇంక చేసేదేమి ఉంది చెప్పు.... ఉంటాను లే ఇక్కడే... అయితే ఇప్పుడు ఏమిటి నీ ప్లాన్ చెప్పవే!"


"నేను ఆఫీస్ కు లీవ్... ఎంచక్కా టీవీ లో సినిమాలు చూద్దాం.... వేడివేడి గా స్నాక్స్ చేసుకుందాం.... బాగా ఎంజాయ్ చేద్దాం.... ఈ క్లైమేట్ లో కార్ లో డ్రైవ్ కు వెళ్దాం.. "


రెండు రోజులు తుఫాన్ పుణ్యమా అని... కమల సుశీల ఇద్దరూ సరదాగా ఎంజాయ్ చేసారు... వాళ్ళ స్నేహం అంత గొప్పది మరి!


మర్నాడు... సుశీల బ్యాగ్ సర్దుకుని, బస్సు టైం కు బస్సు స్టేషన్ చేరుకుంది... కమల కార్ లో డ్రాప్ చేసి... ఒక గిఫ్ట్ ఇచ్చింది.


"ఇది నువ్వు.... ఇంటికి వెళ్ళాక ఓపెన్ చెయ్యి" అని చెప్పింది కమల.


"అలాగే" అంది సుశీల.


బస్సు స్టార్ట్ అయ్యింది...

వైజాగ్ అంటే తన కాలేజీ రోజులు గుర్తొచ్చాయి....... అప్పట్లో... చాలా స్లిమ్ గా... ఉండేది... ఎప్పుడూ.. అబ్బాయిలు తన వెంట పడుతూ ఉండేవారు... అదే.. ఆమె అందానికి ప్రూఫ్ అనుకుంది సుశీల.


తెల్లారేసరికి వైజాగ్ చేరుకుంది... బస్సు స్టాప్ లో ఫ్రెష్ అయ్యి.... ఇంటర్ కాలేజీ దగ్గరకు చేరుకుంది...


అది 5 అంతస్తుల పెద్ద భవనం.... కొత్తగా రంగులు వేశారు.. లోపలికి వెళ్ళింది. అక్కడ ఆఫీస్ రూమ్ లో డీటెయిల్స్ సేకరించింది... అడ్రస్ పట్టుకుని బయల్దేరింది... నెక్స్ట్ డెస్టినేషన్ రజని దగ్గరకు...


రజని అడ్రస్ ఒక గేటెడ్ కమ్యూనిటీ. సుశీల లోపలికి వెళ్ళింది... అది ఒక పెద్ద హౌస్... చూడడానికి చాలా బాగుంది... మా అయన ఎప్పుడు కొంటాడో... ఇలాంటిది అనుకుంది.... సుశీల..


కాలింగ్ బెల్ రింగ్ చేయగానే, పని అమ్మాయి వచ్చింది... "ఎవరు కావాలి?" అని అడిగింది


"రజని ఉన్నారా?"


"మీరు ఎవరు?... "


"ఫ్రెండ్ అని చెప్పండి. " బదులిచ్చింది సుశీల


"కూర్చోండి పిలుస్తాను"... అంది ఆ అమ్మాయి


సోఫా లో కూర్చొని... ఇల్లంతా గమనిస్తుంది సుశీల.... అక్కడ కనిపించింది రజని ఫోటో.... మరుక్షణం రజని వచ్చింది...


"హలో! ఎవరండీ?" అంది రజని.


"నేను సతీష్ ఫ్రెండ్.... ఇంటర్ లో సతీష్ మీ క్లాస్ మేట్ కదా?"


"హా! అవును... సతీష్ ఎలాగ మర్చిపోతాను.... తాను చేసిన సాయం"


"ఏమిటండి ఆ సాయం?" ఆతృతగా అడిగింది సుశీల.


"ఇంటర్ లో సతీష్ బాయ్స్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చునేవాడు.... పక్కన గర్ల్స్ బెంచ్ లో నేను కుర్చునేదానిని. చదువులో ఏమైనా.. డౌట్స్ ఉంటే, క్లియర్ చేసెవాడు... సతీష్.


కెమిస్ట్రీ ల్యాబ్ లో కూడా చాలా హెల్ప్ చేసేవాడు... తాను హెల్ప్ చేయకపోతే నేను ఈరోజు ఇలాగ ఉండేదానినికాదు. తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది కూడా... చెప్పడం మరిచిపోయాను.... ఈ స్థలం కొనడానికి మొత్తం హెల్ప్ చేసింది సతీష్... "


"మీకు సతీష్ అంటే ఇష్టమా?"


"నిజం చెప్పాలంటే.. చాలా ఇష్టం.... ఎప్పుడు చెబుదామని అనుకున్నాను... కానీ చెప్పలేదు... "


"తరువాత, కొన్ని కారణాల చేత ఇంట్లో చెప్పిన పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది... ఇప్ప్పుడు నేను నా పాప ఉంటున్నాము ఇక్కడ... ఈ ఇంట్లో"


"మీ అయన ఉన్నారా ఇంట్లో?"


ఆ మాట వినగానే కంట్లో నీళ్లు పెట్టుకుంది రజని...


"ఏమైందండీ రజని! ఏమైనా బాధ పెట్టనా?"


"లేదు"


"మా అయన ఆక్సిడెంట్ లో లాస్ట్ ఇయర్ చనిపోయారు... నేను మా పాప మాత్రమే ఉంటున్నాము... సతీష్ ఎలా ఉన్నాడు? సుశీల గారు"


"బాగున్నారండి"


"అడిగానని చెప్పండి"


"నేను ఒక పార్టీ ప్లాన్ చేస్తున్నాను సతీష్ పుట్టిన రోజు కు.... మీరు పార్టీ కు రావాలి... సతీష్ ను కలవొచ్చు" అంది సుశీల


"థాంక్స్... ఇంత ఆలోచిస్తున్నందుకు.... "


"నా సతీష్ కోసం, చేస్తున్నానండి అంతే... " అంది సుశీల


"భోజనం చేసి వెళ్ళండి.... నాకు తోడు గా ఉన్నటుంటుంది.... "


"అలాగే.... కానీ వంట నేనే చేస్తాను" అంది సుశీల.

"అలాగేనండి... మీ చేతి రుచి చూస్తాను... "


సుశీలకి సతీష్ కు ఇష్టమైన వంటకాలు గూర్చొచాయి... వెంటనే వంకాయలు తీసి కట్ చేసింది... వంకాయ కూర రెడీ చేసింది... సాంబార్ చేసి వేడి వేడి గా అప్పడాలు వేయించింది.


"సుశీల గారు! మీరు చాలా అందంగా ఉన్నారు! సతీష్ ఎప్పుడు మీ లాంటి అమ్మాయిలంటే ఇష్టపడేవాడు.

ప్రపోజ్ చెయ్యడానికి అందుకే ధైర్యం చేయలేకపోయానండి"


"అవునా?"


"వంట బాగా చేసారండి... చాలా బాగుంది... అంది రజని... "


"నేను ఇక వెళ్తాను.... మెసేజ్ పెడతాను.. తప్పకుండా రావాలి.. పార్టీ కి"


"సరే” అంది రజని.


సుశీల లత ను కలవాలి.... ఆమె కూడా ఇక్కడే చదువుకుంది....


సుశీల ఆ కాలేజీ డీటెయిల్స్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు.... అక్కడ ఒక విషయం గమనించింది.... కాలేజీ నోటీసు బోర్డు లో సతీష్ అండ్ లత పేర్లు ఇద్దరివీ టాప్ లిస్ట్ లో ఉన్నాయి.


అడ్రస్ తీసుకొని, బయల్దేరింది...


ఆ అడ్రెస్స్ ఒక కొండ మీద ఉండే కాలనీ లో ఇల్లు...


లత బయటే ఉంది....


""మీరు లత కదా!"


"అవును"


మీరెవరు?"


"నేను సతీష్ కొలీగ్... సుశీల"


"రండి. సతీష్ ఎలా ఉన్నాడు?"


"బాగున్నారు. నేను ఒక పార్టీ ప్లాన్ చేశాను.. సతీష్ పుట్టిన రోజు నాడు... మీ గురించి తెలుసుకోవాలనుంది. కాలేజీ లో సతీష్ పేరు... మీ పేరు చూసాను బిల్డింగ్ లోపల?”


"అదా! సతీష్.. నేను ఒక నాటకం వేసాము.... అందులో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.... అందుకే మా పేర్లు అలా ఉంచారు”.


“మీకు సతీష్ అంటే ఇష్టమా! అప్పట్లో?”


"చాలా ఇష్టం. అదొక పెద్ద స్టొరీ అండి..."


"చెప్పండి... పర్వాలేదు..” అని అడిగింది సుశీల.


=====================================================================

ఇంకా వుంది..

=====================================================================


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ

70 views0 comments

Comments


bottom of page