ప్రేమా! రావే మా ఇంటికీ!
- Karlapalem Hanumantha Rao
- 6 days ago
- 3 min read
#ప్రేమారావేమాఇంటికీ, #PremaRaveMaIntiki, #KarlapalemHanumantha Rao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నైతికకథలు

Prema Rave Ma Intiki - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao
Published In manatelugukathalu.com On 04/04/2025
ప్రేమా! రావే మా ఇంటికీ! - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
తాయారమ్మ తన ఇంటికి ఎదురుగా ఉన్న చెట్టు కింద దేనికోసమో ఎదురు చూసే ముగ్గురు అపరిచితులను గమనించింది. ' మీరెవరు? ఎప్పుడూ చూసిన గుర్తులేదే ? ' అని అడిగింది దగ్గరి కెళ్లి.
అందరిలోకి పెద్దగా కనిపించే ఆయన అన్నాడూ ' మేం ముగ్గురం మీకు కొత్తే. నాపేరు ప్రేమ. ఇతని పేరు 'సంపద'. ఈ మూడో వాడి పేరు 'విజయం'.
'మీరెవరైతే నాకేం గానీ, బాగా ఆకలి మీద ఉన్నట్లున్నారు. లోపలికి రండి, భోంచేద్దురు గాని' అని పిలిచింది తాయారమ్మ అప్యాయంగా.
'ఇంట్లో మొగాళ్ళెవరూ లేరా ? ' రెండోవాడు - సంపద సందేహం.
'లేరు. మా బంగారయ్య పని మీద పక్కూరి కెళ్లాడు. చీకటిపడితేగాని రాడు ' అంది తాయారమ్మ.
'అట్లాగయితే మేం రాలేంలే! ' అని కరాకండిగా చెప్పేసాడు మూడోవాడు, విజయం.
తాయారమ్మ సాయంత్రం బంగారయ్య ఇంటికొచ్చిన తరువాత గుమ్మం తలుపులు తెరిచి చూస్తే ఆ ముగ్గురూ ' యధోభవ.. స్థిరో భవ ' అన్నట్లుఆ చెట్టు కిందే కునికిపాట్లు పడుతూ కనిపించారు.
తాయారమ్మ మళ్లా వాళ్ల దగ్గరికెళ్లి 'మా బంగారయ్య ఇంటికొచ్చాడు. ఇక మీరంతా లోపలి కొచ్చేయచ్చు.. రండి ' అని ఆహ్వానించింది.
దానికి మళ్లీ మునుపటి పెద్దాయనే అన్నాడూ ' అందరం ఒకేసారి రాలేంలే తల్లీ. ప్రేమ, సంపద, విజయం.. మాలో ఒక్కర్ని మాత్రమే నువ్వు ఎంచుకోవాలి '
తాయారమ్మ సంకటంలో పడడం చూసి ' పోనీ, ఇంట్లో కెళ్లి మీబంగారయ్యను సలహా అడిగి రారాదూ!దాని ప్రకారమే చేయచ్చూ ! ' అన్నాడు రెండోవాడు - సంపద.
తాయారమ్మ చెప్పిందంతా విని ఎగిరి గంతేసాడు బంగారయ్య. ' ఇందులో ఆలోచించడాని కేముందే పిచ్చిమొద్దూ ? ముందా సంపదను పిల్చుకు రా ! పో! ' అని తొందరపెట్టాడు బంగారయ్య.
వీళ్లిద్దరి మాటలూ వింటూ అక్కడే కూర్చుని చదువుకొనే పదేళ్ల కూతురు పూర్ణమి అంది ' ప్రేమను పిల్చుకొద్దామమ్మా ముందూ. ప్రేమ వస్తే ఎంతో బాగుంటుంది '
తల్లిదండ్రులిద్దరికీ కూతురు మాట బాగా నచ్చింది. తాయారమ్మ బైటికెళ్లి ' మీ ముగ్గుర్లో ప్రేమ ఎవరో? వాళ్లు రండి ! ' అని పిలిచింది.
తాయారమ్మను అనుసరించి ఇంట్లోకి పోవడానికి పెద్దాయన ' ప్రేమ ' లేచాడు.
ప్రేమ వెనుకే సంపద, విజయం కూడా లేచి రావడం చూసి తాయారమ్మ ఆశ్చర్యపోయింది.
అప్పుడు సంపద అన్నాడూ.. ' నన్ను పిలిచుంటే నేనొక్కడిని మాత్రమే వచ్చుండేవాడిని. ఈ విజయాన్ని పిలిచినా అంతే. విజయం ఒక్కటే వచ్చుండేవాడు. మీ పాప చాలా తెలివైనది. తనకు ప్రేమ విలువ బాగా తెలుసు. అందుకే ' ప్రేమ ' ను పిలవ మన్నది. ప్రేమ లేకపోతే మేం సంపదా, విజయం.. వ్యర్థం. అందుకే మేమూ ప్రేమ వెనకనే రావడం ' అంటూ సంపద, విజయం ప్రేమను అనుసరిస్తూ తాయారమ్మ ఇంట్లోకి అడుగు పెట్టాయి.
వట్టి సంపద కోసం విజయంకోసం మాత్రమే వెంపర్లాడకుండా తాయారమ్మకు మల్లే మనందరం కూడా ' ప్రేమ ' విలువ తెలుసుకొని మనసారా ఆహ్వనిస్తే సంపదా, విజయమూ వాటంతట అవే ప్రేమ వెంటబడి ఇంట్లోకొచ్చేస్తాయి మరి!
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.
Comments