top of page

ప్రేమ తరంగాలు - పార్ట్ 15

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Prema Tharangalu - Part 15 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 08/02/2025

ప్రేమ తరంగాలు - పార్ట్ 15 - తెలుగు ధారావాహిక చివరి భాగం 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. 

కూతురు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు. కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు. 


ఫ్లయిట్ లో పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది. మానస పేరెంట్స్ తో మాట్లాడి మురళీధర్ తో మానస కు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది. తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. భామను కలవడానికి వచ్చిన మురళీధర్ ను అరెస్ట్ చేయిస్తాడు రాంబాబు. 


యాత్రలకు వెళ్లిన ముకుందరావు దంపతులకు రాంబాబు పోలికలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనితో ఉన్న యువకుడు డాక్టర్ శ్యాంబాబు అని తెలియడంతో భామకు సంబంధం మాట్లాడాలనుకుంటారు. అందుకోసం బాలగోవిందయ్యను పంపిస్తారు. శ్యాంబాబు అసిస్టెంట్ బాబు ద్వారా అతని వివరాలు తెలుసుకుంటాడు బాలగోవిందయ్య. 


ఆశ్రమంలో తల్లి ద్వారా శ్యాంబాబు, రాంబాబు, బాబు అన్నదమ్ములని తెలుస్తుంది. 

శ్యాంబాబుతో నిశ్చతార్ధం జరిగాక గతంలో మానస ప్రేమించింది అతణ్ణేనని తెలుసుకుంటుంది భామ. మానస, శ్యాంబాబుల మధ్య అపార్థాలు తొలుగుతాయి. 



ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 15 చదవండి. 


ముకుందవర్మ.. నీలవేణిలు అమెరికా నుంచి తిరిగి వచ్చారు. భామ.. శ్యాంబాబు, మానసల ప్రేమ కథను వారికి చెప్పి.. అదే ముహూర్తానికి వారిరువురి వివాహాన్ని ఘనంగా జరిపించవలసిందిగా వారికి చెప్పింది భామ. 


తొలుత.. ఆగ్రహావేశాలకు లోనైనా.. భామ వాదనలోని యధార్థాన్ని గ్రహించి వారు ఆమె నిర్ణయాన్ని ఆమోదించారు. 


విశాఖలో.. తాను శ్యాంబాబు గారి తల్లి శారదను చూచినట్లు.. శ్యాంబాబు, రాంబాబు, బాబు అన్నదమ్ములైనట్లు తనకు తెలిసిన నిజాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. 


బాలగోవిందయ్య.. ముకుందవర్మతో.. తాను, శారదను శ్రీకాళహస్తిలో చూచి మాట్లాడిన విషయాలను వివరించాడు. ముఫ్ఫై రెండేళ్ళ క్రిందట తాను.. తన చెల్లెలి విషయంలో ఎంత క్రూరంగా ప్రవర్తించిందీ తలచుకొని ముకుందవర్మ ఎంతగానో బాధపడ్డాడు. రాంబాబు తన మేనల్లుడైనందుకు గొప్పగా సంతోషించాడు. 


వీరు అమెరికా నుంచి తిరిగి వచ్చిన రెండు వారాలకు పరమశివం కుమారుడు డాక్టర్ ధనుంజయ్ ఆ గ్రామానికి వచ్చాడు. 


రాత్రివేళ.. భామ గదికి వెళ్ళి.. 

"భామా!.. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మామయ్యతో మాట్లాడి నిన్ను వివాహానికి ఒప్పించేదానికే నేను ఇక్కడికి వచ్చాను. మరో విషయం.. మా అమ్మా, నాన్న, చెల్లి, ఫ్రెండ్స్ మ్యారేజికి వెళ్ళిన ఆరోజు రాత్రి నిర్భయంగా మురళీధర్ నిన్ను కలవటానికి మా ఇంటికి వచ్చాడు. ముగ్గురం మందు త్రాగాము. నేను మీ ఇరువురి గ్లాసుల్లో మత్తుమందు కలిపి మీచేత త్రాగించాను. 

స్పృహ కోల్పోయిన ఆ మురళీగాణ్ణి మోసుకెళ్ళి వాడి కార్లో పడేశాను. తిరిగి వచ్చాను. నీవు వాడి స్థితిలోనే నైటీలో నా కళ్ళకు అప్సరలా కనిపించావు. చూచాను.. నేను నిన్ను ఆ రాత్రి పూర్తిగా చూచాను. హఁ.. ఎంతో ఆనందం. కనుక నా మనస్సులో నీతో నాకు ఆనాడే పెళ్ళి. ఫస్ట్ నైట్ జరిగిపోయాయి. 


భామా!.. ఇప్పుడు చెప్పు.. నన్ను నీవు ఇప్పుడు కాదనగలవా!.. వేరొకరిని పెళ్ళి చేసుకోగలవా! అది జరగని పని. నీవు నన్నే పెండ్లి చేసుకోవాలి" వికటంగా నవ్వాడు ధనుంజయ్. 


భామకు.. తనను వేధిస్తున్న ప్రశ్నకు జవాబు దొరికింది. తనను నాశనం చేసిన కిరాతకుడు.. ధనుంజయ్. 

"ఛీ.. నీచుడా!.. నీవు మనిషివేనా!.. పశువుకన్నా హీనం" ముఖాన ఉమ్మేసింది. 


ధనుంజయ్ జేబు నుండి ఎకే 47 గన్‍ను బయటికి తీశాడు. 

"నన్ను కాదంటే!.. నేను నిన్ను బ్రతకనివ్వను. కాల్చి చంపేస్తాను" బెదిరించాడు. 


భామ గదినుంచి బయటికి రాబోయింది. అడ్డగించాడు ధనుంజయ్. 

అతనిమీద అనుమానం వున్న ముకుందవర్మ.. ఆ గదిని సమీపించాడు. వారి సంభాషణను విన్నాడు. ఆవేశంతో క్రిందికి వెళ్ళి.. తన ఆఫీసు గది డ్రాయర్‍లో వున్న గన్‍ తీసుకొని వచ్చి.. తలుపు తెరిచాడు. 


అప్పుడే అక్కడికి వచ్చిన రాంబాబు ముకుందవర్మ ఆవేశాన్ని, చేతిలో గన్‍ను చూచి అతన్ని అనుసరించాడు. 


ధనుంజయ్ భామను మంచంపై త్రోశాడు. తుపాకిని గురిపెట్టి.. "ఒప్పుకో!.. నాతో వివాహానికి ఒప్పుకో.. కాదంటే కాల్చి పారేస్తాను" బిగ్గరగా అరిచాడు. 


ఆ దృశ్యాన్ని చూచిన ముకుందవర్మ ఆవేశంతో తన చేతిలోని గన్ నొక్కాడు. 

"అమ్మా!.. " అని అరిచి ధనుంజయ్ నేలకూలాడు. 


రాంబాబు ముకుందవర్మ చేతిలో గన్‍ను లాక్కున్నాడు. వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. 

భామ భోరున ఏడుస్తూ తండ్రిని చుట్టుకొంది. తుపాకి శబ్దం విని నీలవేణి, ఆనంద్ వర్మ పరుగున ఆ గదిని సమీపించారు. రక్తపు మడుగులో వున్న ధనుంజయ్‍ను చూచి ఆశ్చర్య పోయాడు. 

ముకుందవర్మ.. ధనుంజయ్ మరణవార్తను పరమశివంతో ఫోనులో చెప్పాడు. 


రాంబాబు పోలీసు స్టేషనుకు వెళ్ళి అనివార్య పరిస్థితుల్లో తాను ధనుంజయ్‍ను కాల్చి చంపానని గన్ ఇన్స్ పెక్టర్‍కు ఇచ్చి తను చేయని నేరాన్ని తాను చేసినట్లు చెప్పి జైలు పాలైనాడు. తనను కాపాడేటందుకు.. రాంబాబు తీసుకొన్న నిర్ణయాన్ని తలచుకొని ముకుందవర్మ.. ఏడ్చాడు. జరిగిన సంఘటనను ప్రత్యక్షంగా చూచిన భామ.. జైలుకు వెళ్ళి రాంబాబును కలిసింది. భోరున ఏడ్చింది. 

"ఏ పాపమూ ఎరుగని మీకు ఎందుకు ఈ శిక్ష!"


"సత్యా!.. మీ నాన్నగారు నా గురువు గారు.. వారు నాకు ఎన్నో విషయాలు నేర్పారు. నేర్పుతున్నారు. పైగా వారు వయస్సులో చాలా పెద్దవారు. అంతేకాదు.. వారు నాకు మేనమామ. మా మామయ్యను ఈ వయస్సులో కాపాడటం నా ధర్మం.. అదే, నేను ఎరిగిన ప్రేమతత్వం" చిరునవ్వుతో చెప్పాడు రాంబాబు. 


పరమశివం కుటుంబం అమెరికా నుంచి వచ్చింది. ధనుంజయ్ అంతిమక్రియలు ముగిశాయి. వారు వెళ్ళిపోయారు. 


జరిగిన విషయాన్ని విన్న శ్యాంబాబు.. రాంబాబుకు బెయిల్ ఏర్పాటు చేశాడు. రాంబాబు జైలు నుండి బయటికి వచ్చాడు. తల్లి, అన్నా, తమ్ముడు, మానసలను కలిసికొన్నాడు. 

దోషుల్లా తలలను దించుకొని ముకుందవర్మ, నీలవేణి, భామ, ఆనందవర్మ, బాలగోవిందయ్య వారిని జైలు ఆవరణంలో కలిసికొన్నారు. 


"సార్!.. నేను బయటికి వచ్చేశాను.. ఆనందంగా నావైపు చూడండి. " చిరునవ్వుతో చెప్పాడు రాంబాబు. 


"సార్ కాదు మామయ్యా!.. " అంది భామ క్రీగంట రాంబాబు ముఖంలోకి చూస్తూ. 


అందరూ ఆమె ముఖంలోకి చూచారు. భామ నవ్వింది. అందరి వదనాల్లో నవ్వుల పువ్వులు విరిశాయి. 


============================================================================

సమాప్తం

ప్రేమ తరంగాలు ధారావాహికను ఆదరించిన పాఠకులకు రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి తరఫున, మనతెలుగుకథలు.కామ్ తరఫున అభివాదాలు తెలియజేస్తున్నాము.

============================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


17 views0 comments

Comments


bottom of page