top of page

ప్రేమకు ప్రతిరూపం

అమ్మకి మాతృ దినోత్సవ (12/05/2024) శుభాకాంక్షలు


'Premaku Prathirupam' - New Telugu Article Written By Pudipeddi Venkata Sudha Ramana Published In manatelugukathalu.com On 16/05/2024

'ప్రేమకు ప్రతిరూపం' తెలుగు వ్యాసం

రచన: పూడిపెద్ది వెంకట సుధారమణ



అవధులు లేని, అంతులేని ప్రేమకు అర్థం అమ్మ.

ఏమంటారు, అవునంటారా! కాదంటారా!


అనురాగానికి, ఆప్యాయతకి, అండదండలకి, అక్కున చేర్చుకొని ఆశీర్వదించడానికి అమ్మ ప్రతీక.

అందరు చెప్పినట్లుగా చెడ్డ మనుషులు ఉండొచ్చుగానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదు అనేది వాస్తవం. ఎంత మంది పిల్లల్ని కన్నా కూడా అందరికీ సమాన ప్రేమను పంచగల మాతృ మూర్తి అమ్మ. కడుపున పుట్టిన పిల్లలలో  ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా చూస్తున్నది అని అనుకుంటే అది చూసేవారి చూపులోని, మనసులో భావనలోని తప్పు తప్ప నిజం ఎంత మాత్రం కాదు.


నవ మాసాలు మోసి, పురిటి నొప్పులు పడి, ఎంతో వ్యధ అనుభవించి, తల్లి తన పిల్లలకు జన్మనిస్తుంది. అందుకే తల్లికి పిల్లలందరూ సమానమే. కానీ పిల్లలలో ఉన్న రక రకాల భావనలు, ఆలోచనల వలన అమ్మని తప్పుగా అర్థం చేసుకుంటారు కొందరు. కానీ అదీ నిజం కాదు. 

స్వచ్ఛమైన ప్రేమకి, ఆప్యాయతకి ప్రతీక అమ్మ అనే నిజం మనం తెలుసుకోవాలి. 

బిడ్డ కడుపులో పడిన దగ్గరనుండి తను తనువు చాలించే వరకు తన పిల్లల క్షేమం గురించే ఆలోచించేది అమ్మ. తన పిల్లల్ని ఏవిధంగా సంతోష పెట్టాలా అని నిరంతరం ఆలోచించే అమ్మకి జేజేలు చెపుదాం.  అమ్మ మనసు కష్టపడకుండా చూసుకుందాం. 


వయసు రీత్యా అమ్మ మాటల వలన, చేష్టల వలన ఏమైనా బాధ కలిగితే, మనం చిన్నప్పుడు తెలిసీ తెలియని వయసులో అమ్మని పెట్టిన ఇబ్బందులను గుర్తు చేసుకొని, ఆనందంగా వాటిని అనుభవిస్తూ అమ్మని ఒక చంటి బిడ్డలా చూసుకుందాం. మన చిన్నప్పుడు ఎంత అల్లరి చేసినా అమ్మ మనల్ని వద్దనుకోలేదు, విసిరి పారియ్యలేదు కదా. 


అందుకే మనం కూడా మన అమ్మని తన అవసాన దశలో వదిలించుకోవాలని అనుకోకూడదు. అమ్మ సేవలో తరించాలి అనుకుందాం  మనకి జన్మనిచ్చి, మనం ఎదిగి, ప్రయోజకులం అయ్యేవరకు అమ్మ ఎన్ని త్యాగాలను చేసిందో  తనకి, ఆ కనబడని  దేవునికి తప్ప ఇంకెవ్వరికీ తెలియని అతి మధురమైన సత్యాలు అవి. ఆ రహస్యాలను అమ్మ చెప్పకపోయినా మనకి పిల్లలు కలిగాక వాటంతట అవే బయటకు వస్తాయి అనుభవ పూర్వకంగా. 


బిడ్డ అడగక ముందే అమ్మ బిడ్డకి కావలసినది అమర్చి పెడుతుంది. అందుకు ఎంత కష్టాన్ని అయినా హాయిగా అనుభవిస్తుంది. తన బిడ్డ దేనికీ ఇబ్బంది పడకూడదని, అందరికంటే ఎంతో ఉన్నతంగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. బిడ్డ పెద్ద చదువులు చదువుకొని తనని పోషించాలని ఆశించి కాదు. బాగా చదువుకొని తన కాళ్ళ మీద తాను నిలబడితే తన బిడ్డ ఎవరి ముందు  దేహీ అని చెయ్యి చాచ వలసిన అవసరం రాదనే భావనతో పిల్లల్ని పెద్ద చదువులకు ప్రోత్సహిస్తుందే తప్ప తను మాత్రం వాళ్ళ నుండి ఏమీ ఆశించి కాదు అన్నది జగమెరిగిన సత్యం. 


అందుకే అమ్మ అనే ఆ కమ్మని మాటకి కట్టుబడి ఉందాం. అమ్మని నేనే ఎందుకు చూడాలి అనే భావనని వదిలిపెట్టి, అమ్మ నాకే స్వంతం అనే భావనతో అమ్మని ప్రేమగా అక్కున చేర్చుకుందాం.  

అమ్మ అనే పిలుపుకి దూరమయ్యేలోపే,  ఎంత చేసిన తీర్చలేని అమ్మ ఋణం కొంత అయినా తీర్చుకునే ప్రయత్నం చేద్దాం.   తల్లిని మించిన దైవం లేదనే సత్యాన్ని నిరూపిద్దాం.

అమ్మకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.      

మాతృ మూర్తులందరికీ శత కోటి వందనాలు.    

***

పూడిపెద్ది వెంకట సుధారమణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వెంకట సుధా రమణ పూడిపెద్ది. నేను రాంభట్ల వారింట పుట్టి, పూడిపెద్ది వారింట మెట్టాను. నేను ఎప్పటినుంచో కథలు, కథానికలు రాస్తున్నా, ఈ మధ్యనే వాటిని పత్రికలకి పంపడం ప్రారంభించాను. నేను ఇంకా ఓనమాలు దిద్దుతున్నాను రచనావిభాగంలో.


నా అక్షర ప్రయాణానికి అడుగులు పడిన మా ఇంటి నేపధ్యం.. Dr . రాంభట్ల నృసింహ శర్మ (ప్రముఖ కవి ) నాకు స్వయంగా అన్నయ్య మరియు Dr . రాంభట్ల వెంకట రాయ శర్మ ( పద్యకవి. రచయిత ) నాకు స్వయానా మేనల్లుడు, అలాగే, మెట్టినింటి నేపధ్యం ఏంటంటే, శ్రీశ్రీ గారు,పూడిపెద్ది లక్ష్మణ మూర్తి గారు (పూలమూర్తి గారు ) (శ్రీశ్రీగారికి స్వయానా తమ్ముడు), ఆరుద్రగారు, మొదలగు ప్రముఖులు నాకు తాతగార్లు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఉగాది వసంత పూడిపెద్ది నాకు స్వయానా పిన్ని.


ఓనామాలతో ప్రారంభమైన నా ఈ అక్షర ప్రయాణం, సుదూరయానంగా మారాలని ఆశిస్తున్నాను.


జన్నస్థలం: కుప్పిలి, శ్రీకాకుళం జిల్లా

జననీ జనకులు: వెంకట రత్నం, బాలకృష్ణ శర్మ.

విద్యార్హతలు : ఎం. ఏ తెలుగు, ఎం. ఏ పాలిటిక్స్, బి. ఈ డీ

వృత్తి : ఉపాధ్యాయిని గా 15 సంవత్సరాలు.

ప్రస్తుతం: గృహ నిర్వహణ

భర్త : వెంకటరామ్, రిటైర్డ్ ఆఫీసర్, హెచ్. పి.సి ఎల్

సంతానం : అబ్బాయి డాక్టర్, ( స్వంత హాస్పిటల్ )

అమ్మాయి సాఫ్టవేర్ ఇంజనీర్, U. S. A

అభిరుచులు : సాహిత్యం పై మక్కువ, పుస్తక పఠనం, కథలు వ్రాయటం.

అభిలాష : నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని,

వీలైనప్పుడు దైవ దర్శనం, బంధు దర్శనం చేసుకోవడం.

చిరునామా : విశాఖపట్నం









                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               


1 commentaire



@venkataramp.s.3561

• 4 hours ago (edited)

Amma gurinchi chala baga chepperu

J'aime
bottom of page