#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #ప్రేమలేఖ, #Premalekha, #TeluguStories, #తెలుగుకథలు

Premalekha - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 05/03/2025
ప్రేమలేఖ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"నా స్టొరీ చదివి, మీ అందరూ లైక్ చెయ్యండి.. అప్పుడే నాకు సపోర్ట్ గా ఉంటుంది" అంటూ కథ చెప్పడం స్టార్ట్ చేసింది వసుంధర.
నాకు కొత్తగా పెళ్లైంది. మా ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. కొత్తజంట వేరేగా ఎక్కడో ఇల్లు తీసుకుని ఉంటే బాగుంటుందని అత్తయ్య, మావయ్యలు చెప్పి ఒక అందమైన ఇల్లు మాకు చూసి పెట్టారు. ఆ రోజు నా ఆనందానికి హద్దే లేదు. మా ఆయన ఆ సిటీ శివార్లలో ఉన్న ఆ ఫ్లాట్ చూసి, చాలా రొమాంటిక్ గా ఉంటుందని.. నాతో తెగ చెప్పేవారు.
"పోండి.. ! మీరూ మీ సరసం.. " అనేదానిని.
కొత్త ఇంట్లోకి అనుకున్న టైం కే షిఫ్ట్ అయ్యాము. ఎక్కడో ఒకటి రెండు అపార్ట్మెంట్స్ తప్పా చుట్టూ చెట్లతో అక్కడ వాతావరణం చాలా బాగుంది. నాకూ ఇలాంటి వాతావరణమంటే చాలా ఇష్టం. సరిగ్గా నాలాగే ఆలోచించాడు నా హస్బెండ్ వంశీ కుడా.
ఇద్దరం కొత్త ఇంట్లో చాలా హ్యాపీ గా ఉన్నాం.. అప్పుడే మా జీవితం అనుకోని టర్న్ తీసుకుంది.
"పోస్ట్.. !" అంటూ లెటర్ ఇంట్లో పడేసి వెళ్ళాడు పోస్ట్ మాన్.
"కొత్తగా ఇంటికి వచ్చిన మాకు.. ఎవరబ్బా ఉత్తరం పంపించింది.. ?" అనుకుని ఉత్తరం చదవడం మొదలుపెట్టాను.
"డియర్ వసుంధర,
ఎలా ఉన్నావు.. ? మన ప్రేమకు ఇప్పటికి ఐదు సంవత్సరాలు. ఆ రోజు మనం ఊటీ ట్రిప్ కు వెళ్ళిన తర్వాత నుంచి నువ్వు కనిపించనేలేదు. నీ చదువు అయిపోయాక మళ్ళీ కలుస్తానని ఒక ఉత్తరం రాసి ఇచ్చి వెళ్ళిపోయావు. ఇప్పుడు మనం మళ్ళీ కలిసే టైం వచ్చింది. నా మనసాగక నీకు ఉత్తరం రాస్తునాను.
నీ లవర్,
వాసు"
ఎవరబ్బా.. ఈ వాసు.. ? 'వసుంధర' అని నా పేరుతో లెటర్ రాసాడు. రాంగ్ లెటర్ అయి ఉంటుంది. నా గూట్లో పెట్టి, తరువాత ఎవరైనా అడిగితే ఇచ్చేస్తానని అనుకున్నాను. అదే నేను చేసిన పెద్ద తప్పు..
మర్నాడు నేను మార్కెట్ కు వెళ్ళినప్పుడు, నా గూట్లో మా ఆయన ఆ ఉత్తరం చూసాడు. అందులో వసుంధర అని ఉండడంతో, అదీ నా గూట్లో ఉండడంతో, నన్ను అనుమానించడం మొదలుపెట్టాడు.
ఆ రోజు రాత్రి.. "కాలేజీ రోజుల్లో నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా వసూ.. ?" అడిగాడు నా భర్త వంశీ.
"లేదండి.. ! అయినా ఎందుకు అలా అడుగుతున్నారు.. ? మీరే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్.. " అన్నాను.
'అయితే, ఈ వాసు అనేవాడు ఎవరు.. ?' అంటూ ఎన్నో ఆలోచనలతో నిద్ర పట్టక.. ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదివాడు వంశీ. ఎక్కడో ఉత్తరంలో అడ్రస్ దొరికితే, అక్కడికి వెళ్లాలని అనుకున్నాడు నా భర్త.
"వసూ.. ! నేను ఆఫీస్ ట్రిప్ మీద రెండు రోజులు ఊరు వెళ్తున్నాను.. జాగ్రత్త!" అని చెప్పి వెళ్ళాడు వంశీ.
రెండు రోజుల తర్వాత.. చాలా టెన్షన్ తో ఇంటికి వచ్చాడు వంశీ. అడిగితే, ఆఫీస్ లో టెన్షన్స్ అని చెప్పాడు. నేనూ లైట్ గా తీసుకున్నాను. చాలా రోజులు అలాగే ఉన్న వంశీని గమనించిన నేను, ఒక రోజు గట్టిగా అడిగితే..
"నీ పాత ప్రియుడు వాసు దగ్గరకు వెళ్ళాను. వసుంధర అని నిన్నే కలవరిస్తున్నాడు పాపం. మీ ఇద్దరు ఎంత క్లోజ్ గా ఉన్నది అంతా చెప్పాడు. నాకు వొళ్ళు మండి.. వెంటనే కత్తితో అతని మెడ కోసేసాను. నీ మీద కూడా కోపం వచ్చింది.. ఏం చెయ్యను.. ? నా భార్యవి కదా.. అందుకే ఇంతవరకూ నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు నా భార్య అయినా సరే, ఎంగిలి ప్రసాదం నాకు వద్దనుకుంటున్నాను"
"నువ్వు తెలుసుకున్నది, విన్నది అంతా అబద్ధం. నా పేరు తో వచ్చిన ఉత్తరం అయితే, నాది ఎలా అవుతుంది.. ?" అని ప్రశ్నించాను.
"నేను నీ మాటలు వినను. నేను ఇక నీకు ఎప్పటికీ కనిపించను.. దూరంగా వెళ్ళిపోతున్నాను" అంటూ అదే కత్తితో నా మెడ కోసాడు. అలికిడి అయి చుట్టుపక్కలవారు రావడంతో వంశీ అక్కడ నుంచి పారిపోయాడు.
ఇప్పుడు నేను హాస్పిటల్ లో ఉన్నాను. ఈ స్టొరీ నా కోసం వచ్చిన నా ఫ్రెండ్ కి చెబుతున్నాను. అప్పుడే.. నన్ను చూడడానికి ఒక అమ్మాయి వచ్చి నాకు 'సారీ' చెప్పి, ఏడుస్తూ వెళ్లిపోయింది.
"ఆమె ఎవరు?" అని నా ఫ్రెండ్ ని అడిగాను.
"మీ ఇంట్లో నీకన్నా ముందు ఉన్న వసుంధర తానే అంట.. " అంది నా ఫ్రెండ్.
********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments