top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

ప్రేమామృతం


'Premamrutham' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 23/10/2023

'ప్రేమామృతం' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


ప్రేమ అనే పదానికి

పెద్ద అర్థముంది లే

అది జీవకోటి మనుగడకు

చేవ నిచ్చు అమృతం

భవిత అనే బాట నడువ

భద్రమైన సాధనం

ప్రేమ అనే పదం లేక

పెరుగదేజీవి ఐన

ఆ ప్రేమ అనే పదార్థం

పెరుగుచుండు పంచుచుండ

ఖగమైనా మృగమైనా

కానరాని జీవి ఐనా

ప్రేమ మార్గ మందె బెరిగి

పెద్దదౌట నిజము

సముద్ర మథనం లో సాధించిన

సుధకన్నా వసుధలోన ప్రేమ మిన్న

అంతరాత్మ తడిమి చూడ

అనంతమైన ప్రేమామృతం

అందుచుండు అది నిజం

ఆవేష కావేషాల చిచ్చు

ఆర్పును ఈ పీయూషం

రాగ ద్వేషాల సొద

నెదుగనీయదీ అమృతం

అమ్మయనే పదములోనె అమృత ముంది

ఆ అమ్మ ప్రేమ చూరగొన్న

జన్మ యెంత ధన్యమో

ప్రేమ పాశం ప్రేరణతో

యమపాశం వెనుదిరుగును

సముద్రాలు ఎన్నైనా

చాల వింక ప్రేమ నింప

ప్రేమ ఉంటె చాలులే

ఈ వసుధ వైకుంఠ మగునులే

ప్రేమ కన్న మిన్నలేదు

తరచి చూడ భువిని దివిని

రుణానుబంధ రూపేణ

పశు పత్ని సుతాలయ

ఇది ప్రేమ లోని భావాలకు పవిత్రార్థం

జీవకోటి మనుగడ

సౌధానికి ప్రథమ ద్వారం

ప్రేమ లేక జీవి లేదు

జీవి లేక జగము లేదు.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.



25 views0 comments

Comments


bottom of page