top of page

ప్రేమంటే ఇదేనా! పార్ట్ 5


'Premante Idena Part 5' - New Telugu Web Series Written By Penumaka Vasantha

'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 5' తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

జరిగిన కథ:


విరిజ ఫ్రెండ్ పద్మ పెళ్లి జరుగుతుంది. పద్మ భర్తకు స్నేహితుడైన ఆనంద్ ని చూస్తుంది విరిజ.


వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది విరిజ. ప్రేమలో విఫలమైన రాజీని వైజాగ్ రప్పిస్తుంది. రాజీ బ్యాంకు ఎగ్జామ్స్ కి, విరిజ సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటారు.


ఆనంద్ వైజాగ్ లో బ్యాంకు లో పనిచేస్తుంటాడు. వారికి సహాయం చేస్తుంటాడు.


రాజీ కి బ్యాంక్ జాబ్ వచ్చింది. హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు. విరిజ గ్రూప్స్ కి సెలెక్ట్ అవుతుంది. ఆనంద్ ని కలుస్తుంది విరిజ.

తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని రాజీ వాళ్ళ నాన్నకు చెప్పినట్లు విరిజతో అంటాడు ఆనంద్. తన మనసులో ఒక అమ్మాయి ఉన్నట్లు కూడా చెబుతాడు.


ఇక ప్రేమంటే ఇదేనా! పార్ట్ 5 చదవండి.


రాజీకి తన బ్యాంక్ లో చేసే అతనితో, పెళ్లి కుదిరింది. విరి నువ్వూ! కూడా, పెళ్లి చేసుకో!, ఇక ఆంటీ వాళ్లకు ఒక బాధ్యత, తీరుతుంది. మొన్న మీ ఇంటికి వెళ్ళి నప్పుడు, మీ బామ్మ అంది. "రాజి నీకు పెళ్ళవుతుంది, నా మనవరాలికి ఎపుడు అవుతుందో! కాస్త నువ్వైనా, చెప్పరాదు, మీ ఫ్రెండ్ కు జాబ్ వచ్చింది కదే, ఇక పెళ్లి చేసుకోమని. "

"పెళ్లి లేదు, గిల్లి లేదు, నేను, ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వాలన్నాను" కోపంగా.

"గిల్లి వద్దు కానీ పెళ్లి చేసుకో" అని నవ్వుతూ! ఆట పట్టించింది రాజీ. అది ఒక టూ వీక్స్ ముందు వెళ్ళింది. నేను ఇపుడేగా జాయిన్ అయ్యాను, జాబ్ లో.

"పెళ్లికి టూ డేస్ ముందు వస్తానే" అన్నాను. "సరే తప్పక రావాలని" చెప్పి రాజీ ఊరు వెళ్ళింది.

రాజీ పెళ్లికి వెళ్ళాను. పెళ్ళికొడుకు ఆనంద్ కి ఫ్రెండుట. రాజీ కూడా తెల్సు కాబట్టి ఆనంద్ పెళ్లికి వచ్చాడు. పద్మ వాళ్ల ఆయన వచ్చారు. ఈ సారి నేను పద్మ కలిసి రాజీ పెళ్లి లో అల్లరి చేశాము. అపుడప్పుడు ఆనంద్ నన్ను చూస్తుండటం గమనించాను. పెళ్లిలో పంతులు గారు ఏదో తెమ్మంటే గదిలోకి వెళ్ళాను. అపుడే ఆ గదిలోకి ఆనంద్ వచ్చాడు.

"విరిజ గారు మీతో మాట్లాడాలి!" అన్నాడు.

"ఇపుడా! అక్కడ పెళ్లివాళ్లు, పిలుస్తున్నారు. ఈవెనింగ్ మాట్లాడుకుందాం" అని చెప్పాను.

ఈవెనింగ్ పెళ్లి సందడి తగ్గింది నేను, పద్మ కుర్చీలవీ! పనివాళ్ళ చేత తీయిస్తుంటే, "నేను హెల్ప్ చేయనా.. " అని ఆనంద్ అక్కడికి వచ్చాడు. ఇంతలో పద్మ నీ! వాళ్ల ఆయన పిలవటం తో పద్మ లోపలికి వెళ్ళింది నేను ఆనంద్ మిగిలాం.

"విరిజా జాబ్ వచ్చిందిట కదా! కంగ్రాట్స్ అండి" అన్నాడు ఆనంద్.

" థాంక్స్" అన్నాను. "నాకు హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయింది. వచ్చేవారం హైదరాబాద్ షిఫ్ట్ అవుతానన్నాడు. "


"మీకు కంగ్రాట్స్" అన్నాను

"మీరు ఉండేదెక్కడ"అని అడిగాడు చెప్పాను. నేను ఉండేది మీకు కొంచం దూరంలో, మరి నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్" అన్నాడు ఆనంద్.

"ఏముంది నాన్న కున్న అప్పులు తీర్చాలి" అన్నాను.

"మీ ప్లాన్ ఏంటని" అడిగాను ఆనంద్ ను.

"ఇక పెళ్లి చేసుకోవటం తరువాయి"అన్నాడు ఆనంద్.

"మరి మీ లవర్ ఓకే చెప్పిందా!" కొంచం వ్యంగ్యంగా అన్నాను.

"లేదండీ! ఆమె రిప్లై కోసమే, ఈ అగచాట్లు అన్నాడు. మరి ఇంకెందుకాలస్యం అడగక పోయారా!" అన్నాను. లోపల కోపముతో బయటికి నవ్వుతూ. "

"అడగాలనే ఉంది ఆమె నో! అంటే.. తట్టుకోలేనని ఆగాను. కానీ ఎపుడో.. ఆమెను అడగాల న్నాడు" ఆనంద్.

ఇంతలో నాన్న వచ్చి విరిజా! ఏమి చేస్తున్నావు తల్లీ !? ఇక్కడా" అంటే "ఇదిగో ఈ అద్దె సామాన్లు సర్డుతున్నా.. నాన్న.

"ఈయన" ఆనంద్ ను చూస్తూ సందేహంగా అడిగాడు నాన్న

"నాన్న ఈయన.. " నేను చెప్పేలోపు "నమస్తే అండీ! పెళ్ళికొడుకు ఫ్రెండ్ ను నా పేరు ఆనంద్. బ్యాంక్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నా" అన్నాడు.

"మీరు పద్మ వాళ్ల ఆయన ఫ్రెండ్ కూడా కదూ! అన్న నాన్న తో "ఆనంద్ గారు అందరికీ ఫ్రెండ్ లే నాన్న. "వస్తాం ఆనంద్ గారు" అని నాన్న నేను కదిలాం అక్కడ నుండి.

ఇంటికి వచ్చిన తర్వాత "ఈ అబ్బాయి మంచివాడు లాగా ఉన్నాడే" అన్న నాన్న తో "నాన్న మెరిసేదంతా బంగారం కాదు" అన్నాను.

'ఎందుకు అలా అన్నానంటే ఆనంద్ మనసు లో వేరే ఎవరో! ఉండటం వల్ల మనసులో ఏదో తెలియని అలజడి. చాలా కసిగా ఉంది నాకు. ఆనంద్ మనసులో ఉ న్నదేవరో, కనుక్కునేలోపు నాన్న వచ్చాడు. ఈసారి కూడా, ఆనంద్ చెప్పకుండా తప్పించుకున్నాడు. ఎవరై ఉంటారు అన్న ఆలోచన రాగానే, ఏంటి మళ్ళీ, కోరికలే గుర్రలైతే, పాట గుర్తుకు వచ్చి, వేరే పని కల్పించుకున్నాను. ఇపుడు నేను నాన్న కున్న అప్పులు తీర్చి ఆయన్ను సంతోషపెట్టటమే నా తక్షణ కర్తవ్యం. ఇక వేటి మీద లేదు నా దృష్టనీ!' మనసును దిటవు చేసుకున్నా.

మరుసటి రోజు లీవ్ లేకపోవటం వల్ల ఆరోజే హైదరాబాద్ బయలుదేరాను. నాన్న నన్ను పంపటానికి బస్టాండ్ కు వచ్చి "అమ్మలూ! మంచి సంబంధముంది. చేసుకుంటావా!" అని అడిగాడు.

"ఇపుడే గా జాబ్ వచ్చింది కొన్నాళ్ళు కుదుటపడనీ నన్నూ, ! అమ్మా, బామ్మ కూడా ఇలాగే ఇక పెళ్లి చేసుకో అని ఒకటే గొడవని" విసుక్కున్నాను.

"పెద్ద వాళ్ళం కదా! బంగారు. అసలే లోకం తీరు బాలేదు. నిన్ను ఒకయ్య చేతిలో పెడితే మా బాధ్యత తీరుతుందని అంటాము. సరే! జాగ్రత్త తల్లి. "

"అలాగే నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్త, " ఈలోగా బస్ స్టార్ట్ అయింది.

రాజి హైదరాబాద్లో వేరే కాపురం పెట్టింది. నేను ఒక చిన్న రూం చూసుకున్నాను. ఇప్పటి వరకు రాజీ నేను, కలసి ఉన్నాము. వేరేగా, వెళ్తుంటే.. బాధగా అనిపించింది. రాజి, "విరిజా! పర్లేదు, మాతోపాటు, కల్సుండవే" అంది.

నేను ఇష్ట పడలేదు. "నువ్వు ఊరుకున్నా, మీ ఆయన నన్ను తంతాడే ఇక్కడే.. ఉంటే"

"అలా ఏమి ! అనడు, మా ఆయన, నువ్వే మాకు ప్రైవసనీ! వెళ్తున్నావంది రాజీ.


ఆ తర్వాత రాజీ వాళ్ల ఆయన వాళ్ల ఊరు వెళితే ఒక్కతే ఉండలేక నా రూంకి వచ్చింది. ఇద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాం అపుడు రాజీ "విరిజా! నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. "

"ఏంటే అది!?"క్యూరియాసిటి గా అడిగాను.

"మొన్న ఆనంద్ వచ్చాడుగా! మా ఇంటికి"

"అయితే" అన్నాను.

"నాతో తన పెళ్లి విషయం గురించి మాట్లాడాడు. తనకు పెళ్లి కుదిరిందని, చెప్పాడు నా మొహం లోకి" చూస్తూ అంది

నా బాధను పైకి కనపడనీకుండా! "ఎవరే" అన్నాను. ఇంకా నా ఫీలింగ్స్ ను, గమనిస్తూ "ఎవరోనే! అజ్ఞాత ప్రేమికురాలు, నాక్కూడా తెలుసుట. ఎలాగైనా!? ఆమెతో మాట్లాడి పెళ్లి కుదర్చమని అడిగాడే. పాపం వన్ సైడ్ లవ్ ఆనంద్ ది. ఎన్నిసార్లు తన ప్రేమను చెప్పాలని చూసిన ఆ మొద్దు బుర్రకు అర్థం కాలేదుట ఇక నన్ను రాయబారం నడిపి ఎలాగైనా పెళ్లి జరిగేట్లు చూడమన్నాడు. "


"అలాగే, నువ్వూ, ! ఈ బ్యాంక్ జాబ్ మానేసి, చక్కగా, మ్యారేజు బ్యూరో నడపవే.. "కోపంగా అన్నాను


నాకు లోపల ఆనంద్, మీద చాలా కోపం వచ్చింది. 'నాతో, ఎన్ని సార్లు అడిగినా చెప్పలేదు. రాజీకి మటుకూ చెప్పాడు. నేనే రాజీ కన్న ఆనంద్ కు క్లోజ్. ఇక ఆనంద్ ఎదురు, పడినా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. కోపంతో పాటు ఏడుపు కూడా వస్తున్నది. మనుషులంతా సెల్ఫిష్ లు. ఎడవటానికి కూడా, లేదు. ఈ రాజి, నా మొహంలోకి చూస్తూంది.

"అదికాదు విరిజా, ఎవరై ఉంటారు!? నీకేమన్నా, తెలుసా, ఆనంద్, నాకన్నా కూడా నీకు బాగా తెల్సు కదా!"అంటూ నా మొహం లో చూసింది.

"యేట్లో సీతమ్మ, మనకెందుకు, అవన్నీ! ఇక పడుకుందాము, .

"అబ్బా! రేపు ఆదివారం, హాయిగా, కబుర్లు, చెప్పుకుందాం. మళ్ళీ రేపు ఈవెనింగ్ నేను మా ఇంటికి వెళ్తాను. ఏమి నిద్ర, లే, విరిజా! అని నామీద, దుప్పటి తీసి, నన్ను కూర్చోబెట్టింది రాజీ.


"రాజీ అఫీస్ లో అలిసిపోయాను ప్లీజ్ నన్ను పడుకోనివ్వవే, నీకొక నమస్కారమంటూ, మళ్ళీ పడుకున్నా. అటువైపు, తిరిగి పడుకుంటే కంట్లో నుండి నీళ్లు కారాయి. రాజి, నన్ను మళ్ళీ తనవైపు, తిప్పుకుంది.

"ఏంటే నాకు చెప్పకుండా రాజీ కి చెప్పాడు ఈ ఆనంద్ అని ఆలోచిస్తున్నావు కదూ!" అంది రాజీ.

"అదేమీ లేదులే, ఆయన ఎవర్ని ప్రేమిస్తే నా కెందుకు. !? అయినా రాజీ నాకు ప్రేమ మీద నమ్మకం లేదని నీకు తెలుసుకదా. నన్ను దీంట్లో కి లాగకు. నువ్వు పెళ్లి పెద్దగా ఆయనకు పెళ్లి చేయవే నాకు సంతోషమన్నాను" చాలా వ్యంగ్యంగా.

"నిజం గా నువ్వు ఒప్పుకుంటే నాకేమి అభ్యంతరం లేదు ఆనంద్ కు పెళ్లి చేయటానికి" అంది రాజీ.

"ఏయి నీకు పిచ్చా నేను ఒప్పుకోవటం ఏంటి!? అని ఆశ్చర్య పోయాను. "ట్యూబ్ లైట్ మాత ఆ అజ్ఞాత ప్రేమికురాలివి నువ్వే. విరిజా, !, ఆనంద్ కు నువ్వంటే, ఎంత, ఇష్టమో !? తెలుసా! మీ ఫ్రెండ్, ఒప్పుకుంటే, చాలు, ఎన్నేళ్ళయినా వెయిట్ చేస్తా, అన్నాడు. ఇదే సందని నువ్వు, ఆనంద్ ను ఒక యాభై యేళ్లు ఆగమని చెప్పకు. మనం ప్రేమించేవాళ్ల, కన్నా మనల్ని, ప్రేమించేవారు దొరకటం అదృష్టం. ఈ వచ్చిన అవకాశాన్ని వదులుకోకు.


"ఏమో! రాజీ, మా బావను, చూసాక నాకు, మగ వాళ్లంటే, అసహ్యం, వేస్తుంది. పెళ్లి మీద కూడా, పోయిందే. "


"అలా ఎందుకనుకుంటావు, మీ నాన్న లేరా, మీ అమ్మను, మంచిగా చూసుకోలేదా! మగాళ్లందరినీ! ఒకే గాటన కట్టేస్తే, ఎలా!? మంచి నిర్ణయం తీసుకో ఆలోచించి, ఇపుడు పడుకో" అని, రాజీ పడుకుంది.

========================================================================

ఇంకా వుంది..


========================================================================


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.







33 views0 comments

Comments


bottom of page