'Premante Idena Part 8' - New Telugu Web Series Written By Penumaka Vasantha
'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 8' తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
జరిగిన కథ:
తన ఫ్రెండ్ పద్మ పెళ్ళిలో ఆనంద్ ని చూస్తుంది విరిజ.
వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది. ఆనంద్ వైజాగ్ లో బ్యాంకు లో పనిచేస్తుంటాడు. విరిజకి సహాయం చేస్తుంటాడు.
రాజీ కి బ్యాంక్ జాబ్ వచ్చింది. హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు. విరిజ గ్రూప్స్ కి సెలెక్ట్ అవుతుంది. ఆనంద్ ని కలుస్తుంది విరిజ.
తన మనసులో ఒక అమ్మాయి ఉన్నట్లు చెబుతాడు ఆనంద్. ఆనంద్ ప్రేమించేది తననే అని రాజీ ద్వారా తెలుసుకుంటుంది విరిజ. తన ఆర్ధిక పరిస్థితి ఆనంద్ కి వివరిస్తుంది విరిజ. తనకు అన్ని విధాలా సహకరిస్తానని చెబుతాడు ఆనంద్. జ్వరంతో ఉన్న ఆనంద్ ని హాస్పిటల్ కి తీసుకోని వెళ్తుంది విరిజ.
ఇక ప్రేమంటే ఇదేనా! పార్ట్ 8 చదవండి
ఒక వారం తర్వాత అమ్మ, నాన్న, అక్క ఊరి నుండి వచ్చారు. నాన్న ఆనంద్ వాళ్ల అమ్మకు ఫోన్ చేశారు. సండే మీరు వచ్చి పిల్ల ను చూడండి అని. అక్క నేను అమ్మ వంట తింటూ ఎంజాయ్ చేసాము. డాబా పైకి వెళ్లి కబుర్లు చెప్పుకున్నాము.
అక్క అంది "నువ్వు చాలా లక్కీ నే.. విరి ఆనంద్ లాంటి అబ్బాయి దొరికాడు. మీ బావ గారి లాగా కాకుండ నీ జీతం నువ్వు వాడుకుని అప్పులు తీర్చుకో అన్నాడు”.
“ఏమో అక్క! ఇపుడే ఆనంద్ మంచివాడు అని కితాబు ఇవ్వకూడదు. పెళ్లయి కొన్నాళ్ళయిన తర్వాత కానీ చెప్పలేము ఆనంద్ మంచితనం”.
"అన్నం ఉడికిందా, లేదా, ఒక్క మెతుకు, పట్టుకుంటే, చాలే! అన్నం మొత్తం పట్టుకోక్కరలే! ఆనంద్ ను చూస్తే, ఇట్లే, అర్థమవుతుంది, మంచివాడని. " అంది అక్క.
“అక్కా! బావను చూస్తే, ఎవరైనా, నిన్ను, ఏడిపించుకు, తింటాడని, ఊహిస్తారా! ఆయన, మాట్లాడే తియ్యటిమాటల్ని చూసి.ఇంతకీ పాపను, ప్రేమ గా చూస్తున్నారా?” అడిగిన నాతో, "పర్లేదు" ఒక నిరాశ తో కూడిన నవ్వొకటి నవ్వింది అక్క.
ఇంతలో అమ్మ పైకి వచ్చింది "ఆదివారం పెళ్ళివారు వస్తారుట విరి. ఈ టూడేస్ లీవ్ పెట్టు ఆఫీస్ కు".
"ట్రై చేస్తా కాని, రాజీ ను కూడా పిలుద్దామమ్మ. ",
“తప్పకుండా” అమ్మ రాజీకి కాల్ చేసి చెప్పింది రమ్మని.
రాజీ వచ్చింది. నేను ఏమి కట్టుకోవాలన్నవి సెలెక్ట్ చేసి పెట్టింది. సండే ఆనంద్ వాళ్ళు వచ్చారు. ఆనంద్ అక్క సౌమ్య, నాతో చాలా కలివిడిగా మాట్లాడింది. "ఆనంద్ సెలక్షన్ ఎపుడు బావుంటుంది. ఇపుడు నిన్ను కూడా బాగా సెలెక్ట్ చేసుకున్నాడు."
ఇంకా ఆనంద్ ఇష్టాఇష్టాలు అన్నీచెప్పింది. ఆనంద్ ను చిన్ని అంటారుట ఇంట్లో. దొరికాడు, ఆనంద్ నూ నేను ఏడిపించాలి ఇక.
నాన్న, ఆనంద్ నాన్నగారు మాట్లాడుకున్నారు. ఇక పెళ్లి కి ముహూర్తాలు మాఘమాసం లో పెట్టుకుందామను కున్నారు. నేను ఒక చెవి నాన్న వాళ్ళు ఏమి!? మాట్లాడుకుంటున్నారు అనే దానిపై దృష్టి పెట్టాను.. అంటే ఇంకో నాలుగు నెలలు టైం ఉంది కాబట్టి నిదానం గా పెళ్లి పనులు చేసు కోవచ్చనుకున్నారు.
నాన్న స్వీట్, హాట్ తెచ్చారు. అవి తీసుకెళ్ళి వాళ్లకు ఇచ్చాను. మైసూర్ సిల్క్ చీర సన్నటి గోల్డ్ చైన్, చిన్న బొట్టు, సింపుల్ గా రెడీ అయ్యాను. ఆనంద్, లాల్చీ, పైజామా లో సింపులు గా, ఉన్నాడు.
ఆనంద్, నన్ను చూసి సూపరన్నట్లు చేయి చూపాడు. అది చూసి సౌమ్య "చేతి సైగలు దాక వచ్చారంటే! మనం ఇక్కడనుండి బయటకు వెళితే బెట”రంది నవ్వుతూ.
దానికి ఆనంద్, "అంతొద్దులే! మేమిద్దరం రూంలోకి వెళ్లి మాట్లాడుకుంటా”మని రూం లోకి వెళ్ళాడు. నన్ను, చూసి ఆనంద్ అక్క "నువ్వూ వెళ్ళు విరిజ! సిగ్గు పడ”కంది.
హాల్లో ఆనంద్ అక్క అరుణ, రాజీ, అక్క ఒక బ్యాచ్ అమ్మ, ఆనంద్ అమ్మగారు ఒక బ్యాచ్, నాన్న ఆనంద్ నాన్న ఒక బ్యాచ్ గా మాట్లాడుకుంటున్నారు.
రూం లోకి వెళితే ఆనంద్ "విరి ఈ చీరలో క్యూట్ గా ఉన్నా”వన్నాడు.
"అవునా! చిన్ని" అన్నాను.
"చిన్ని ఎవరు” అన్నాడు ఆనంద్ ఏమి తెలియనట్లు.
"అబ్బా! మీరేనండి, ఆనంద్" గారు అన్నాను.
“అండి, బాండి లు కాదు నందూ! అని పిలువ”న్నాడు ఆనంద్.
"అత్తయ్య గారి ముందు ఏమండీ అంటా! మనమిద్దరం ఉన్నప్పుడు నందు ఓకేనా!” అంటే “నీకు, ఎలా పిలవాలనిపిస్తే అలా! పిలు”వన్నాడు ఆనంద్.
కాసేపు, ఉండి, ఆనంద్ వాళ్ళు, వెళ్ళిపోయారు. వెళ్తూ సౌమ్య, విరిజకు బై చెప్పి, మా ఇంట్లో నీవు, ఫ్రీ గా వుండవచ్చు. మా తమ్ముడితో పాటు, నాకు, ఫోన్ చేస్తుండు"
"అవునమ్మా, మాకు సౌమ్య, ఎంతో, నువ్వంతే" అన్నారు, ఆనంద్, అమ్మగారు.
"థాంక్స్ ఆంటీ" అన్నాను.
వాళ్ళు వెళ్ళిన తర్వాత నాన్న అన్నాడు. "విరిజా! ఆనంద్ వాళ్ల నాన్నగారు కట్న కానుకలు వద్దు. పెళ్లి చేయండి చాలని చెప్పారు. ఎంత మంచి సంబంధం కదా. "
అక్క వెంటెనే “విరి, జాబ్ చేస్తుంది కదా! అందుకే కట్నం వద్దనుకుని ఉంటా”రంది.
వెంటనే రాజీ "నేను చేస్తున్నాగా మరి! నేను కట్నం ఇచ్చాగా.. అదేమీ కాదు, ఆనంద్ వాళ్ల ఫ్యామిలీ మంచి వాళ్ళు. ఆస్తి కూడా చాలా ఉంది వాళ్ల”కంది రాజీ.
“ఎంత మంచివాళ్ళు కాకపోతే రాజీ, పెళ్లి ఖర్చులు కూడా చేరి సగం వేసుకుందామని చెప్పమన్నాడుట ఆనంద్, వాళ్ల అమ్మగారు చెప్పారు. ఒక మంచి రోజు చూసుకుని లగ్న పత్రిక రాసుకుందామన్నా”రని అమ్మ అంది.
"అవును. నాకు అదే చెప్పారు ఆనంద్ నాన్న. కాబట్టి విరి తల్లి.. నువ్వేమి కంగారుపడకు, నేను అప్పుల పాలవుతానని. నువ్వు ఈ నాలుగు నెలలు పంపే డబ్బు, పొలం కౌలు, ఖర్చు పెడితే.. నీ పెళ్లవుతుంది. ఇంకా మిగులు తగులు ఖర్చులుంటే చిన్నగా.. నే తీర్చుకుంటా”నన్నాడు, “లేదా పొలం అమ్మకానికి పెడతా”నన్నాడు.
"నో నాన్నా! అక్క పెళ్లికి పొలం అమ్మావు. మిగిలిన ఆ ఎకరం కూడా అమ్మొద్దు, నేను చూసుకుంటాను. నువ్వే అంటావుగా నాన్నా!.. కొడుకయినా, కూతురయినా, నేనేననీ! ఇపుడు నేను నీ కొడుకునీ నాన్న” అన్నాను.
నాన్నకు నేనన్న మాటతో సంతోషమేసి, దగ్గరకు, వచ్చి నా నుదుటి మీద ముద్దుపెట్టాడు. “అవును తల్లీ! నువ్వు నా కొడుకువే కానీ, కూతురివి కాదు” అన్నారు.
రాజీ అంది "నాకు అన్న ఉన్నాడన్న మాటే కాని నా పెళ్ళికి ఏ సాయం చేయలేదు. పాపం నాన్న నా పెళ్ళికి పొలం అమ్మాడు. "
“విరిజా కొడుకు తో సమానంగా నీకు అండగా ఉండి చేస్తున్నది. సో బాబాయి, పిన్ని ఇక మన విరిజ, పెళ్లి ఏ టెన్షన్ లేకుండా జరుగుతుంది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. "
"అవును విరిజా కొడుకు లానే నన్ను ఆదుకుంటుం”దనీ నాన్న అన్నారు.
"అబ్బా, ఏంటి! నాన్న మమ్ముల్ని పెంచి ఇంతవాళ్ళ ను చేసిన మీకు ఇది కూడా చేయకపోతే మేము పిల్లలమే కాద”న్నాను నాన్న బుజం పై చేయి వేసి.
'అమ్మయ్య! ఇపుడు నాకు కొంచం మనసు కుదుట పడింది. ఏదన్నా ఖర్చువుంటే నేనే ఏదో లోన్ తీసుకుని నాన్న కు టెన్షన్ లేకుండా చేస్తే నా మనసుకు శాంతి. మనసు లో ఆనంద్ కు థాంక్స్ చెప్పుకున్నా. ఎక్కడ కట్నం అడుగుతారోని భయపడ్డాను. ఇంత తేలికగా ఈ సమస్య నుండి బయట పడతాననుకోలేదు.'
అందరం, ఇంత హాపీ గా మాట్లాడుకుంటుంటే, అక్క కు బావ, కాల్ చేసాడు,వెంటనే, బయలుదేరి, రమ్మని. నాన్న, ఫోన్ తీసుకుని, బావతో “మీరు కూడా వస్తె బావుండేది. ఇవాళ, విరిజకు, పెళ్లి, సంగతులు మాట్లాడుకున్నాము. లగ్న పత్రిక, రాసుకునే టైం కు మీరుండాలి. అమ్మాయిను మాతో పాటు, తీసుకొస్తాం. ఓ అలానా! సరే, పంపుతా”నని నాన్న, ఫోన్, పెట్టేసాడు.
"ఏంటి నాన్నా!” అన్న అక్క మొహం లో ఆందోళన ను గమనించాను.
“ఏమిలేదు, నిన్ను, ఇపుడే, మీ ఊరు బస్ ఎక్కించమని, చెప్పాడు, మీ ఆయన. మీ అత్తగారికి, బాగలేదుట."
“సరే, నే వెళ్తా, నాన్న” అంటూ, పాపను తీసుకుని, బయలుదేరింది.
“అక్కా, పాపను ఇక్కడుంచి, వెళ్ళు. తర్వాత, మేము తెచ్చి దింపుతా”మని, పాప దివిజ ను మా దగ్గర అట్టిపెట్టుకున్నాం.
"వస్తా విరి, ఆనంద్ వాళ్ళు, మంచివాళ్ళుగా ఉన్నారు. పెళ్లి గురించి ఎటువంటి దిగులు పెట్టుకోకుండా, బీ, హాపీ" అంటూ వెళ్ళలేక, వెళ్ళింది, అక్క.
అక్కను, బస్ ఎక్కించి, వస్తానని, నాన్న, వెళ్ళాడు.
వసుధ, అత్తగారికి, బాలేకపోవటం, కాదు, ఇంటి చాకిరీ, వాళ్లత్త చేసుకోలేక, ఫోన్చేయించి, ఉంటుంది. నేనెక్కడా చూడలేదే ఇలాంటి వాళ్ళను. అత్తగారికి సరే, హరి కైనా బుద్ది ఉండొద్దు, వాళ్ళు ఎడిపిస్తుంటే.. ఏంటని కూడా అడగడు. ఈ పిచ్చిపిల్లకు నోరులేదు, వాళ్ల తో ఎలా వేగుతుందో! పాపం" అంటూ బామ్మ, బాధపడింది.
అమ్మ కూడా, మా, బామ్మ వైపు చూస్తూ.. "బాగా, చెప్పారు. పెళ్లి మాటలు, మాట్లాడుకుంటున్నాం, రండని, పిలిస్తే, వాళ్ళత్త ‘ఇపుడు, రెండోపిల్ల పెళ్లి వైభవం లో ఉన్నారుగా, వచ్చినా, మేము, మీ కళ్లకు ఆనతామా’, అని వ్యంగము గా అంది. "
మన, బుడ్డి, పెళ్లికన్నా వస్తారో రారో. రాకపోయినా నష్టమేమీ లేదు. వచ్చినా వీళ్ళను మా కన్నా బాగా చూస్తున్నారు, పెళ్లి బాగా చేస్తున్నారని, ఏడ్చిపోరూ. విరిజను చేసుకునే పెళ్ళివారు కట్నం తీసుకోవటం లేదు. పైగా పెళ్లిఖర్చులు, సగమేసుకుంటున్నారని చెప్పాలి వాళ్లకు" బామ్మ మెటికలు విరుస్తూ, అంది.
ఇంత ఆనందం లో నాకు అక్కను గూర్చి తలుచుకుంటే, చాలా బాధేసింది. దానికి హైదరాబాద్ అంతా తిప్పి, చూపిద్దామనుకున్నా, చూడకుండా వెళ్ళింది. పాపకు కావాల్సినవి కొనిపెట్టాలనుకున్నవి, కొనిపెట్టీ ఆడుకున్నా దానితో.
ఇక, రాజీ నేను, పెళ్లి కి ఏ కలర్ చీరల, నగల, గూర్చి, మాట్లాడుకున్నాము. ఈవెనింగ్ వరకు ఉండి, వెళ్ళింది. నాల్గురోజులుండి, అమ్మ, నాన్న, బామ్మ మా ఊరికి వెళ్ళారు. ఇల్లంతా, బోసిపోయింది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comments