top of page
Writer's picturePenumaka Vasantha

ప్రేమంటే ఇదేనా! పార్ట్ 4


'Premante Idena Part 4' - New Telugu Web Series Written By Penumaka Vasantha

'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 4' తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

జరిగిన కథ:


విరిజ ఫ్రెండ్ పద్మ పెళ్లి జరుగుతుంది. పద్మ భర్తకు స్నేహితుడైన ఆనంద్ ని చూస్తుంది విరిజ.

వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది విరిజ. ప్రేమలో విఫలమైన రాజీని వైజాగ్ రప్పిస్తుంది. రాజీ బ్యాంకు ఎగ్జామ్స్ కి, విరిజ సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటారు.

ఆనంద్ వైజాగ్ లో బ్యాంకు లో పనిచేస్తుంటాడు. వారికి సహాయం చేస్తుంటాడు.

రాజీ కి బ్యాంక్ జాబ్ వచ్చింది. హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు. విరిజ గ్రూప్స్ కి సెలెక్ట్ అవుతుంది.



ఇక ప్రేమంటే ఇదేనా! పార్ట్ 4 చదవండి.


రోజులు గడుస్తున్నాయి. రాజీ అపుడప్పుడు కాల్స్ చేస్తూ.. ఉంది. అది హైదరాబాద్లో బాగానే క్లిక్ అయింది.


"ఇంటిలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాకు విరిజా”


"మరి చేసుకోవే ఒక పని అయిపోతుంది మీ అమ్మ వాళ్లకు" అన్నాను.


"లేదే! ఒకసారి రవిని, ప్రేమించి, మోసపోయాను, ఇపుడు, చేసుకునేవాళ్ళను, జాగ్రత్తగా చూసి, విచారించి, చేసుకోవాలి. "

"గుడ్! అలా ఆలోచించి తీసుకోవే! మంచి నిర్ణయం. "

"ఏ విరిజా !ఆనంద్ ను చేసుకుంటే ఎలా ఉంటుం”దన్నది!

ఒక్కసారి నాకు గుండెలో కలుక్కుమంది.. అయినా తోట్రుపడకుండా, "బానే ఉంటుంది. మీ నాన్న గారిని ఒకసారి ఆనంద్ వాళ్ల అమ్మానాన్న కి కాల్ చేసి కనుక్కోమనవే" అన్నాను.

"అవును కదా! ఇపుడే చెపుతాను. థాంక్స్ విరిజ ఒకసారి ఆనంద్ తో నువ్వు కూడా మాట్లాడవా!” అంది.

"ఆనంద్ కలకత్తా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే మాట్లాడేదాన్ని" అన్నాను.

"కానీ మంచివాడే కదా!” అంది.


“ఏమోనే! నేనేమి అతన్ని దర్మామీటర్ పెట్టీ కొలవలేదు రాజీ. ఎంత గుడ్ ఎంత బాడ్" అని ఫోన్ పెట్టేసాను విసుగ్గా.

'దీనికీ ఏమైందీ! సడెన్గా ఫోన్ కట్ చేసింది. కొంప దీసి విరిజ, ఆనంద్ ను లవ్ చేయటం లేదు కదా. !'


అదేమికాదు, విరిజకు లవ్వంటేనే, గిట్టదు ఛాన్స్ లేదు. అది ప్రేమించదు, సో ఆనంద్ నా వాడే..’ అనుకుంది రాజీ.

కానీ ఆ నైట్ నిద్ర పట్టలేదు విరిజకు. రాజీ ఏదైనా అయ్యేదాకా దేనిని వదలదు. దానికి బ్యాంక్ జాబ్ ఉంది. చూడటానికి బావుంటుంది. ఇక ఆనంద్, రాజీనీ! వద్దనటానికి.. నాకేమి కారణం దొరకలేదు. ఆనంద్ కొంపతీసి రాజిని పెళ్లి చేసుకోటానికి ఒప్పుకోడుగా!' అని మనసులో ఒకటే దిగులు.


ఆనంద్ ఎవరిని చేసుకుంటే నాకెందుకు.. ఒక వేళ సినిమాల్లో చూపించినట్లు నాకు ఆనంద్ మీద లవ్ గాని లేదుగా. నో నెవర్.. ! ప్రేమా, , దోమా జానతా నై.. అయిన నా డియరెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటే, హ్యాపీ గా ఫీల్ అవకుండా ఏంటి! నేను సెల్ఫిష్ గా థింక్ చేస్తున్నాననీ! తిట్టుకున్నా, నన్ను. '

ఫోర్ డేస్ ఆగి రాజీ బ్యాంక్ నంబర్ కి కాల్ చేశా. ఆనంద్ పెళ్లికి ఒప్పుకున్నాడ లేదా! అని.. లోపల చాలా టెన్షన్ గా ఉంది.

"ఏ విరిజా! బిజీ గా ఉన్నాను ఈవెనింగ్ కాల్ చేస్తానే " మా రూం మేట్ సెల్ నంబర్ కి కాల్ చేసింది రాజీ ఆ ఈవెనింగ్.

“ఎంటే విరిజా! ఎపుడు నేనే చేస్తా, ఇవాళ నువ్వు చేశావు" అంది రాజీ.

వెంటనే నేను "ఎపుడు నువ్వే చేస్తావు! ఈసారి నే చేద్దామని చేశా. ఏంటి ఎలా ఉన్నావు ఎంటి సంగతి. !?”


“బానే ఉన్నాను విరిజ. మా నాన్న ఆనంద్ వాళ్ల నాన్న తో మాట్లాడాడు. ‘మా అమ్మాయి కూడా బాంక్ జాబ్ చేస్తుంది. ఆల్రెడీ మీ అబ్బాయి మా పిల్లను చూసాడు. మీరు ఒప్పుకుంటే, వీళ్లకి పెళ్లి చేద్దామంటే..’

‘మా అబ్బాయిని కనుక్కుని చెప్తాం’ అన్నారుట. ”

తర్వాత నా కుతూహలాన్ని చంపుకోలేక అడిగా. "తర్వాత ఏమైంది వాళ్ళు ఏమన్నారు. "

"కధ కంచికి చేరలేదు"అంది రాజీ.

"చంపుతా రాజీ సస్పెన్స్ లో పెట్టక అసలు ఏమైంది చెప్పవే తల్లీ నీకు దణ్ణం పెడతా. "

"ఏముందీ ఆనంద్ కి ఇపుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదుట. మీరు వేరే సంబంధం చూసుకోండి అని చెప్పాడుట ఆనంద్ నాన్నగారు. "

ఇక చాలు! ఈ న్యూస్ తో నాకు మనసులో సంతోషం వేసింది. కాని పైకి "అబ్బా ఏంటిట!? అంత నిక్కు ఆనంద్ కి నీ కన్నా మంచి మాచ్ వస్తుందా ఏంటి?.. అసలు నీకేమి తక్కువ రాజీ, అందం, ఉద్యోగం ఉన్నాయి. ఈ ఆనంద్ కాకపోతే మరో గోవింద్" అని రాజీకి దైర్యం చెప్పే ప్రయత్నం చేసాను, ఏవో జోక్స్ చెప్పి.

ఫోన్ పెట్టేసి ఎగిరి గంతేసి రూమ్మేట్స్ తో కలిసి సినిమా చూసొచ్చి పడుకున్నాను.

'ఏంటి నాలో ఈ తెలియని ఆనందం. రాజిని పెళ్లి చేసుకోటానికి ఆనంద్ ఒప్పుకోక పోవటమేనా?.. అదేమీ కాదు. మరేంటి ఇది.. ఇదేనా ప్రేమంటే. !' ఇక ఈ ఆలోచనలు కట్టిపెట్టి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ రోజు కాదు రేపటి నుండి చదువుకోవాలి. ప్రేమా.. పెళ్లి నుండి నా దృష్టినీ మరల్చాలి.

మరుసటి రోజు సూపర్ బజార్ లో ఆనంద్ వాళ్ల అమ్మ కనిపించారు. "నేను హాయ్ ఆంటీ నమస్తే" అన్నాను.


నన్ను చూసి నవ్వూతూ "ఓ! విరిజా బావున్నావమ్మా! చాలా రోజులైంది నిన్ను చూసి. మా ఆనంద్ రేపు వస్తున్నాడు. ఇక్కడ ఏదో పని వుందట. మేము ఊరి నుండి వచ్చాము వాడు ఉన్నన్నాళ్ళు.. ఇక్కడే ఉండీ! వాడు కలకత్తా వెళ్ళగానే మేము, మా ఊరు వెళ్తాము. ఈ వారం వండుకోవటానికి కావాల్సిన సరుకులు కొందామని వచ్చాను. ఒకసారి రా ఇంటికి, బొత్తిగా కనపడటం మానేసావు" అన్నారు.

నాకు మనసులో ఆనంద్ వస్తున్నాడా! వెళితే చూడొచ్చు కాని ఎగ్జామ్స్ ఉన్నాయి. "చూస్తా ఆంటీ! ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి" అని చెప్పి రూం కి వచ్చాను. ఆవిడ రాజీ వాళ్ల నాన్న కాల్ చేసింది చెప్పలేదు నేను ఆ టాపిక్ తేలేదు.

ఆ వారం ఎగ్జామ్స్ బిజీ లో ఉన్నా! ఆనంద్ వాళ్ల ఇంటికి వెళ్లటానికి కుదరలేదు. పరీక్షలు అయిపోయిన రోజు కాసేపు హ్యాపీ గా గడపటానికి ఒక్కదాన్నే బీచ్ కి వెళ్ళాను.

"విరిజ గారు బాగున్నారా !" అన్న మాటతో అటు వైపు చూస్తే ఆనంద్. "బావున్నా! మీరు ఎపుడు వచ్చారు ఎలా ఉంది! కలకత్తా లో జాబ్" అన్నాను.

"పర్లేదు కాని నాకు వైజాగ్ కన్నా ఏ సిటీ నచ్చదండీ. అవునూ ! మీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కదా ఇపుడు మీరు రాసేది" అన్న ఆనంద్ తో "అవునండీ! ఇవి అయితే ఎంఎ డిగ్రీ చేతికి వస్తుంది. "

"మరి నెక్స్ట్ ఏంటి" అన్న ఆనంద్ తో "చూడాలండి, మొన్న గ్రూప్స్ కూడ రాశాను. సెలెక్ట్ అయితే జాబ్ చేయటం లేదా ఏదైనా కాలేజ్ లో లెక్చరర్ గా జాయిన్ అవ్వటం అన్నాను. "

మొన్న మీ ఫ్రెండ్ రాజీ వాళ్ల ఫాదర్ కాల్ చేశారు. రాజిని చేసుకోమని. నేను ఇపుడే చేసుకునే ఉద్దేశ్యం లేదన్నాను. "

"మా రాజీ కి ఏమండీ! చక్కనిది జాబ్ ఉంది" అన్నాను.

"నాకు ఇక్కడ అనిపించాలి కదండీ!" అని నవ్వుతూ గుండెను చూపించాడు. "నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ల రిప్లై కోసం వెయిటింగ్" అన్నాడు నా వైపు, నవ్వుతూ చూస్తూ.

నా మనసులో భావాల్ని, కనపడకుండా, జాగ్రత్త పడినా, నా కళ్లల్లో, ఆనంద్ మీద, ఎంత కోపంగా ఉందో!? పైగా ఆ నవ్వొకటి. అక్కడే, ఉంటే నేను ఏమైనా, అనగలను. వెంటనే వెళ్లిపోవాలని లేచాను.

"మీరు, నాకు కొంచం, హెల్ప్ చేయాలి అన్నాడు. నా లవర్ కి నా ప్రేమ సందేశాన్ని, అందించాలి మీరు. "

"సారీ అండి నాకు ప్రేమల మీద, నమ్మకం, లేదు. నేను, మీకు, ఏవిధంగాను హెల్ప్ చేయలననీ" విసుగ్గా అన్నాను. అందరికీ ఈ ప్రేమ, రాయబారాలను షేర్ చేయటంతోనే, నా లైఫ్ గడిచేటట్లుంది.

నాకు అక్కడ ఉండ బుద్ది కాలేదు. అయితే ఆనంద్ మనసులో ఇంకెవరినో లవ్ చేస్తున్నాడు. "మీ లవర్ మీ లవ్ ని అంగీకరించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్" అన్నాను.

"థాంక్స్ నాకు నచ్చిన అమ్మాయి ఎవరో! తెలుసుకుని, నా ప్రేమ, సందేశమంటున్న ఆనంద్, మాటల్ని, కట్ చేస్తూ, విసురుగా, అక్కడి నుండీ వెళ్తుంటే..


"కాసేపు కూర్చోవచ్చు కదా!" అన్న ఆనంద్ మాటను పట్టించుకోకుండా కదిలాను.

'ఎందుకంటే నా పేరు ఎటు ఉండదు. సో! ఇంకెవరి పేరైన చెపితే తట్టుకునే శక్తి నాకు లేదని తెలుసు. అందుకే అక్కడి నుండి తప్పించుకున్నా మెల్లిగా

ఇంటికి వచ్చాను కాని ఆనంద్ మనసులో ఉన్న అమ్మాయి ఎవరు. !? నా కంటే బాగుంటుందా .. తెలుసుకుంటే.. పోయేది అన్నిటికీ తొందరేనీ! నా తొందరపాటుని నిందించుకున్నా. రాజీ నుండి ఆనంద్ ను దక్కించుకున్నానంటే, మళ్ళీ ఇపుడు ఆనంద్, ఎవరో, అమ్మాయినీ! లవ్ చేస్తున్నాడు. పోతే పోనీ, ఇక ఆనంద్, గూర్చి, ఎప్పటికీ థింక్ చేయకూడదు.


'అసలు నాకు ఏమౌతుంది, సుమక్కను, నా ఫ్రెండ్ రమణమ్మ ను, చూసి కూడా బుద్ది లేకుండా, ఇలా అయిపోతున్నాను. నాన్న వచ్చే ముందు, నా విరిజ, బంగారు తల్లి, నా గౌరవానికి, భంగం కలిగించే పనులు, చేయదని, తన ఫ్రెండ్స్ తో అన్నాడు. ఎందుకు, రోజులు, బాగాలేవు, ఇంకా, పెద్ద చదువులు, ఎందుకు, ఒకయ్య, చేతిలో, విరిజను, పెట్టకా! అన్నప్పుడు, నాన్న అలా అన్నారు.


'సారీ, నాన్న, నీ గౌరవానికి, ఎటువంటి, భంగాన్ని, కలిగించను. ఒకవేళ, నన్నే ప్రేమిస్తున్నానని, ఆనంద్, చెప్పినా.. సరే, నేను, ఒప్పుకోను. ప్రేమ పెళ్లిళ్ల మీద, నాకు సదభిప్రాయం, లేదనుకుంటే.. కానీ! నా మనసు కుదుట, పడలేదు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


40 views0 comments

Comments


bottom of page