top of page

ప్రేమే పెన్నిధి

Updated: May 17, 2024

అంతర్జాతీయ కవితా దినోత్సవ సందర్భమున



'Preme Pennidhi' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 21/03/2024

'ప్రేమే పెన్నిధి' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


ప్రకృతిలో సకలం ప్రేమ పాత్రమే.

ప్రేమే పెన్నిధి. 

మగువా మగనిని ప్రేమించు

స్వామీ స్వామినిని ప్రేమించు

మనిషీ మానవుల ప్రేమించు

తనయుడా తలిదండ్రుల ప్రేమించు

తల్లీ తనయుల తనయల ప్రేమించు

తండ్రీ కుటుంబాన్ని ప్రేమించు

నాయకుడా జనాన్ని ప్రేమించు

భక్తుడా భగవంతుని ప్రేమించు

మానవుడా దీనుల ప్రేమించు

ద్విపాత్తు దివ్యాంగుల ప్రేమించు

హాలికుడా హలభూతి ప్రేమించు

పొలమరీ పశువుల ప్రేమించు

లోక బాంధవా లోకుల ప్రేమించు

జియ్యా జీవుల ప్రేమించు

అయ్యా అందరిని ప్రేమించు

ప్రభువా ప్రజలను ప్రేమించు.

ప్రజలారా ప్రకృతిని ప్రేమించండి.

ప్రేమే పెన్నిధి అని తలువండి.


--సుదర్శన రావు పోచంపల్లి

Comments


bottom of page