top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 10


He's an ex

'Premikudu (He's an ex) - Part 10' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 08/08/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 10' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఇంటికి వెళ్ళాక భార్య దగ్గర పార్వతి ప్రస్తావన తెస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. శేషగిరి దాపరికం లేని వ్యక్తి అని, కాబట్టి అతని ద్వారా ప్రతి విషయాన్నీ తెలుసుకొమ్మని చెబుతుంది గిరిజ తల్లి సరళ.


జాతర కోసం రికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు.

భర్త, పార్వతికి సహాయం చేయాలనుకోవడాన్ని అత్తమామల దగ్గర సమర్థిస్తుంది గిరిజ.



ఇక ప్రేమికుడు పార్ట్ 10 చదవండి. 


మర్నాడు..

టిఫిన్లు అయ్యేక..

రాగిణిని తయారు చేసి..

గిరిజ తయారైంది.

అప్పటికే శేషగిరి తయారై సిద్ధంగా ఉన్నాడు.

వాళ్లు బయటికి వెళ్లబోతున్నారని గ్రహించిన అప్పలస్వామి..

'ఎటు.' అనడగక..

"ఈ రోజు పండగగా. గుట్ట మీద జాతర ఉంటుంది." అన్నాడు.


ఆ వెంబడే.. శేషగిరి.. గిరిజలను చూస్తూ..

"మీకు తెలుసుగా." అన్నాడు.


"మేము అటు వెళ్లెందుకే తయారయ్యాం." చెప్పాడు శేషగిరి.


అప్పలస్వామి లోలోపల తడుముకుంటున్నాడు.

కారుతో ఆ గుట్టకు బయలుదేరాడు శేషగిరి.. భార్య.. కూతురుతో.

దార్లో..

"మనం పార్వతి ఇంటికి వెళ్తున్నామనుకున్నాడు నాన్న." అన్నాడు శేషగిరి.


ఆ వెంబడే..

"వీళ్ళు మారరు." నొచ్చుకున్నాడు.


"సర్లెండి. మనం క్లీన్ గా ఉన్నాం. ఇట్టివి పట్టించుకోకండి." చెప్పింది గిరిజ.


ఆ వెంబడే..

"సాయంకాలం పార్వతిని కలిసి తనకు జరిగినది మరింతగా తెలుసు కోవాలి." అంది.


చిన్నాగా తలాడించేసాడు శేషగిరి.

పది నిముషాల్లోపే ఆ గుట్ట జాతరని చేరారు వాళ్లు.

అక్కడి సందడికి రాగిణి తెగ సంబర పడిపోతోంది.

కూతురు ఉరకలని పసిగట్టిన.. ఆ తల్లిదండ్రులు..

రాగిణిని చుట్టూ కలయ తిప్పుతూ..

తమతో పాటుగా తనను.. 

సవారీ ఎక్కించారు..

జెయింట్ వీల్ ఎక్కించారు.. 

ఒంటె మీద ఎక్కించారు..


గుడారంలో మేజిక్ ట్రిక్స్ షోకి తీసుకు వెళ్లారు.. 

టెపరరీ టెంట్ హాలులోని కార్టూన్ ఫిల్మ్ షోకి తీసుకు వెళ్లారు..

మధ్య మధ్యన..

చెరుకు రసం.. కొబ్బరి నీళ్లు.. తనకూ తాగించారు.

చివరాఖరన..

అంగళ్లలో తను కోరిన బొమ్మలు కొని పెట్టారు.

రాగిణి ఇంకా ఆనందంలోనే ఉంది.


జాతరలో ఎదురైన తన పాత క్లాస్మేట్స్ తో కొద్ది సేపు ముచ్చటించాడు శేషగిరి.

అందులో కొందర్ని.. గిరిజకు పరిచయం చేసాడు.

అలా ఆ జాతర ముచ్చట్లు జరిగేక..

కారులో.. తిరిగి ఇంటికి బయలుదేరారు వాళ్లు.

దార్లో..

"బేబీ. నువ్వు కుషీ అయ్యావా." అడిగాడు కూతురుని.


ఆ వెంబడే..

"పాప చాలా ముచ్చట పడింది." గిరిజతో అన్నాడు శేషగిరి.


"మరే. గత యేడాది బిత్తర పడింది. కానీ ఈ మారు రియల్లీ ఎంజోయ్డ్ ఇట్." గిరిజ గొప్పయ్యింది.


శేషగిరి హెల్దీగా నవ్వుకున్నాడు.

కారు ముందుకు పోతోంది.

***

మధ్యాహ్నం భోజనాలు అయ్యేక..

భార్యా, పాపతో బయటికి బయలు దేరుతున్న శేషగిరితో..

"సాయంకాలం గ్రామదేవత ఊరేగింపు ఉంటుంది." చెప్పాడు అప్పలస్వామి.


ఆ వెంబడే..

"రకరకాల వేషాలు.. డప్పులు.. వాటిని పాపకు చూపించాలి." చెప్పాడు.


"ఆ వేళకి తిరిగి వచ్చేస్తాం." చెప్పాడు శేషగిరి.


'ఆ పార్వతి ఇంటికేనా ఇప్పుడు వెళ్లేది'.. అడగాలని ఉన్నా.. అప్పలస్వామి అడగలేక గింజుకుంటున్నాడు.


అది గుర్తించినట్టు..

"మేము పార్వతితో మాట్లాడాలి. వెళ్లి అప్పటికి వచ్చేస్తాం." అనేసింది గిరిజ.


"పండగ కదా. వాళ్లింటిలో పనులు ఉంటాయి. ఇరకాట పర్చడం ఎందుకు." అప్పలస్వామి నసుగుతున్నాడు.


"నేను ఫోన్ చేసాను. వంట ఐందట. పనులు లేవట." చెప్పుతోంది గిరిజ.


అక్కడే ఉన్న అనసూయతో పాటు అప్పలస్వామి స్తబ్ధతయ్యాడు.

"కొన్ని బొమ్మలు పట్టుకు వెళ్దాం. పాప అల్లరి ఉండదు." చెప్పాడు శేషగిరి.. కొన్ని బొమ్మల్ని తీసుకొని.


"ఆ బొమ్మలు ఇలా ఇవ్వండి. నేను పట్టుకుంటాను. పాపని మీరు ఎత్తుకోండి." చెప్పింది గిరిజ. భర్త నుండి బొమ్మలు తీసుకుంది.

రాగిణిని ఎత్తుకున్నాడు శేషగిరి.

వాళ్లు పార్వతి ఇంటి వైపుకు కదిలారు.

***

పార్వతితో కలిసి కూర్చున్నాక..

"ఉదయం గుట్టకు వెళ్లాం." చెప్పాడు శేషగిరి.


"అక్కడి జాతర బాగుంటుంది. పాపకు నచ్చుండొచ్చు." రాగిణిని చూస్తూ అంది పార్వతి.


రాగిణి బొమ్మలతో ఆడుకుంటుంది.

"మధ్యలో ఆగిపోయింది. తర్వాతది చెప్పు." శేషగిరే కదిపాడు.


పార్వతి మెల్లిగా కదిలింది. చెప్పనారంభించింది.

 ***

పార్వతి చెప్పుతున్న..

ప్లాష్బాక్ 2..

కుమార్ సూటిగా చెప్పేయడంతో..

పార్వతి.. కుమార్ ల శోభనం అతడి ఇంటిన పెట్టబడింది.


ముహూర్తం ప్రకారం..

పార్వతి తల్లి ఒక్కతె.. కూతురుని శోభనం గదిలోకి సాగనంపింది.

"గది తలుపు మూసుకో." చెప్పింది పార్వతితో.


పాలు గ్లాస్ తో గదిలోకి వచ్చిన పార్వతిని చూసి.. కుమార్ చిన్నగా నవ్వు కున్నాడు.

పార్వతి ఆ గది తలుపు మూస్తుండగా..

మంచం మీంచి గమ్మున లేచి వచ్చి..

"ఈ తలుపు ఎందుకు.. వీథి గుమ్మం తలుపు మూయాలి." సరసర అన్నాడు. 


అంతే రీతిన పార్వతిని దాటుకొని ఆ గది బయటికి వచ్చాడు.

చేరువలో ఉన్న పార్వతి తల్లిదండ్రులని చూసాడు.

"మీరు మీ ఇంటికి వెళ్తే.. నేను వీథి తలుపు మూస్తాను." చెప్పేసాడు.


పార్వతి తల్లిదండ్రులు బిత్తరపోయారు.

కదలలేక పోయారు.

"కదలండి." కుమార్ అరవ లేదు కానీ.. అదేలా అన్నాడు.


"బిడ్డని ఒంటరిగా వదలి ఎలా. దానికి ఈ ఇల్లు ఇంకా కొత్త. తోడుగా ఉండాలి." చెప్పుతోంది పార్వతి తల్లి.


"ఒంటరి ఏంటి. నేను లేనా." అనేసాడు కుమార్.


పార్వతి తల్లి.. భర్తని చూస్తోంది.

అతడు ఏమీ అనడం లేదు.

కుమార్ విసుగవుతున్నాడు.

ఆ వెంబడే..

"ఇది ఒంటి గది కొంప. మేమా కొత్తగా పెళ్లైన వాళ్లం. మాకు.. మాకు.." చెప్పి ఆగాడు.


పార్వతి తండ్రి అందుకున్నాడు..

"పదవే. ఊర్లోనే కదా. అల్లుడు చెప్పింది నిజమే. పెళ్లైన కొత్తోళ్లు గుట్టుని కోరుకుంటారు. మనం ఈడ ఉండ రాదు. వెళ్లి రేపు వద్దాం."


అతడు కదిలాడు.

భర్తని అనుసరించక తప్పలేదు పార్వతి తల్లికి.

వాళ్లు వెళ్లేక..

వీథి గుమ్మం తలుపు మూసి.. గడియ పెట్టి.. గదిలోకి వచ్చాడు కుమార్.


వెళ్లి మంచం మీద కూర్చున్నాడు.

"రా." పార్వతిని పిలిచాడు.


పార్వతి మెల్లిగా అటు నడుస్తోంది.

"నీ సోకు నడకలు ఆపి.. రా." విసురుగా చెప్పాడు కుమార్.


పార్వతి అతడి గొంతుక్కు జంకుతోంది.

మంచం వరకు వెళ్లి ఆగింది.

"పాలు నీకా.. నాకా." అడిగాడు కుమార్.


అతడి వాటం పార్వతిని హైరానా పరుస్తోంది.

పాలు గ్లాస్ ని కుమార్ కు అందిస్తుండగా..

"నువ్వు తాగించాలి." టక్కున చెప్పాడు కుమార్.


ఆ వెంబడే..

"అదీ ఎలాను అంటే.. ముందు నువ్వు నీ నోటి లోకి కొన్ని తాగు.. ఆ పాలుని నా నోట్లోకి పోయి. వాటిని నేను గుటకేస్తాను." బరబరా నవ్పుతున్నాడు కుమార్.


అప్పటికే పార్వతి ఏదోలా ఐపోతోంది.

భర్తనే వింతగా చూస్తోంది.

"ఏంటా మిడిగుడ్లేసుడు." నవ్వు ఆపి అన్నాడు కుమార్.


ఆ వెంబడే..

"నేను నీ నుండి థ్రిల్ కోరుకుంటున్నాను. నువ్వు చేసి పెట్టాలి." అనేసాడు.


పార్వతి ఇంచు మించుగా అలజడై పోతోంది.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










150 views0 comments

Comments


bottom of page