He's an ex
'Premikudu (He's an ex) - Part 13' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 23/08/2024
'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 13' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది.
జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. తనను బాధ పెట్టేలా ప్రవర్తించే వాడని చెప్పింది. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెప్పింది.
ఇక ప్రేమికుడు పార్ట్ 13 చదవండి.
"నాన్న చనిపోయేక.. కొద్ది నెలల్లోనే అమ్మకు పెరాల్సిస్ తో కాలు లాగేసింది. అమ్మకి తోడుగా మేనత్త వచ్చి ఉండేది.
మేనత్త కొన్నాళ్లు తన వాళ్లింటికి వెళ్లి తిరిగి వస్తానంటే.. ఆ రోజుల్లో అమ్మ ప్రాధేయ పడితే.. నన్ను అమ్మ అనారోగ్యం షాకున ఈ ఇంటికి అప్పుడప్పుడు నా భర్త పంపుతున్నాడు. ఈ కారణంన వచ్చి.. కొన్ని రోజులు పాటు.. అతడికి దూరంగా.. గుడ్డి కంటె మెల్ల నయమన్నట్టుగా ఇక్కడ ఉండ గలుగుతున్నాను.
ఈ మారు మాత్రం కోరే చాన్నాళ్లుగా ఇక్కడ ఉండి పోతున్నాను. మేనత్తకి ఒంట్లో బాగోలేదు.. తనకు నయమై.. ఇక్కడికి వచ్చేక.. నేను అక్కడికి రాగలనని ఫోన్ లో చెప్పుతూ ఉన్నాను. ఇది ఎన్నాళ్లు సాగుతోంది మరి." చెప్పడం ఆపింది గిరిజ.
"ఏంటీ.. మీ భార్యాభర్తల మధ్య తగాదా జరిగి మీరు ఇక్కడికి వచ్చేయలేదా. మీరు విడాకులు తీసుకోబోతున్నారని విన్నాను." గిరిజ ఆశ్చర్యమయ్యింది.
"అంతపాటి అదృష్టమా. నా కర్మ. నన్ను అతడు వదలడు. నేను వదిలించు కోవాలనుకున్నా అదీ సాగనివ్వడు. అదీ ప్రయత్నించి విఫలమయ్యాను." చెప్పింది పార్వతి.
గిరిజ మరింత విస్మయమయ్యింది.
"అంటే.. అవన్నీ పుకార్లేనా. ట కబురులేనా." అంది.
"అవును. ఇక్కడోళ్లు మారరు. ఆడిపోసుకోవడాలంటే ఇక్కడోళ్లలో చాలా మందికి ఇష్టం." అనేసింది పార్వతి.
"అంటే.. నువ్వు మళ్లీ అక్కడికి వెళ్లాలన్న మాట." అంది గిరిజ.
"తప్పదుగా. అమ్మ ఇప్పటికే గోల పెడుతోంది. మేనత్తని తెప్పించి పెట్ట మంటుంది. నన్ను కాపురంకి పొమ్మంటుంది." పార్వతి నీర్సమైపోతోంది.
కొద్దిసేపు ఆ ఇద్దరి మధ్య మాటలు ఆగాయి.
ఇద్దరూ భారమైన ఆలోచనలతోనే ఉన్నారు.
"నేను నా భర్తతో మాట్లాడతాను. దీనిని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. మీరు కుదురు కావాలి. అందుకు మేము నీతో ఉంటాం." భరోసాలా చెప్పింది గిరిజ.
పార్వతికి ఆ మాటలు నచ్చాయి.
"మీరైనా నన్ను అర్ధం చేసుకోవాలి." కోరింది.
"అయ్యో. తప్పక. మా ఇద్దరిలో లేకితనం లేదు. తోటి వారికి సాయ పడడం మా ఇద్దరికీ ఇష్టమే." అంది గిరిజ.
ఆ వెంబడే..
"అధైర్య పడకండి. మళ్లీ చెప్పుతున్నాను.. మనం ఒకరికి ఒకరిగా ఉందాం. నా భర్త మంచి వాడు. అతడు మీకు పరిచయస్తుడే. అతడి గురించి వేరే మీకు చెప్పనక్కర లేదు. మీరు అన్నారు.. 'అతడితో చెప్పుకుంటే బాగుణ్ణు' అని. మీ చొరవ.. మీ నమ్మకం వమ్ము కాదు. నేనూ వమ్ము కానివ్వను. సరేనా." లేచింది గిరిజ.
పార్వతి లేచింది. గమ్మున గిరిజ అర చేతుల్ని తన అర చేతుల్లోకి తీసుకుంది. మెత్తగా నొక్కింది.
"ప్లీజ్. సాయమవ్వండి. చెప్పుకోలేని ఈ స్థితిని నేను భరించలేక పోతున్నాను." అంది. ఆమె కళ్లల్లో నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి.
"కూల్. మంచికి మంచే జరుగుతోంది." పార్వతి భుజం తడుతోంది గిరిజ.
ఇద్దరూ అక్కడి నుండి కదిలారు.
గడపలోకి వచ్చారు.
"జాగ్రత్త. మేము ఈ రోజే ఊరికి బయలుదేరేస్తాం." చెప్పింది గిరిజ.
"అదేమిటి. రేపు అన్నారుగా." అడిగింది పార్వతి.
"నిజానికి మీతో మాట్లాడాలనే మేము మూడు రోజులు ఉండేలా వచ్చింది. కానీ మీతో మాట్లాడి విషయం తెలుసుకున్నాం. సో. మరి మేము ఆగడమెందుకు. మనం ఇక ఫోన్ కాల్స్ తో టచ్ లో ఉందాం. నా భర్తతో మాట్లాడి.. మనం కూడతీసుకొని నడుద్దాం." చెప్పింది గిరిజ.
ఆ వెంబడే..
"బై." చెప్పింది.
"బై. శేషగిరికి చెప్పండి. మీకు థాంక్స్." అంది పార్వతి.
చిన్నగా నవ్వేసి.. "త్వరలోనే అన్నీ సమసిపోతాయి." అనేసి..
వీథిలోకి కదిలింది గిరిజ.
పార్వతి ఇంట్లోకి నడిచించింది.
***
మధ్యాహ్నం..
భోజనాలు ఐయ్యేక..
"మనం మన ఊరికి బయలుదేరుదామా." అంది గిరిజ.. శేషగిరితో.
అంతక మునుపు.. భర్తతో..
"ఇక్కడ పని ఐంది. ఇంటికి వెళ్లేక మనం పార్వతి గురించి మాట్లాడుకుందాం." చెప్పింది.
ఆ వెంబడే..
"మరి ఇక్కడ ఉండడం ఎందుకు. ఈ రోజే బయలుదేరిపోదాం." అని చెప్పింది.
శేషగిరి లగేజీ సర్ది పెట్టాడు.
కొడుకు వాళ్లు తిరిగి బయలుదేరుతుండగా..
"బోర్ మోటర్ ని మెకానిక్ ని తెచ్చి చూపిస్తానన్నావు. ఆ పని చేసి పెట్టు." చెప్పాడు అప్పలస్వామి.. శేషగిరితో.
ఆ వెంబడే..
"పొలాల పనులు మొదలవుతున్నాయి." చెప్పాడు.
"నేను రెండు, మూడు రోజుల్లో మెకానిక్ ని ఇక్కడికి పంపగలను." చెప్పాడు శేషగిరి.
అప్పుడే..
అత్తమామల కాళ్లకు నమస్కరించి..
"మీ ఆరోగ్యాలు జాగ్రత్త." అంది గిరిజ.
ఆ వెంబడే..
"మీరు అతిగా ఆలోచించకండి. పార్వతి గురించి మీకు తెలిసినవన్నీ అబద్ధాలే. ఆమె చాలా ఇరకాటంలో ఉంది. ఆమెతో మాట్లాడేక మాకు తెలిసింది. సాయపడక పోతే పోయాం.. తప్పుగా మాత్రం మాట్లాడడం మనకు మంచిది కాదు. అర్ధం చేసుకోండి. మీ అబ్బాయి మంచోలు. బాధ్యత తెలిసి మనిషి. మీకు ఏ దిగులు వద్దు." చాలా సరళంగా చెప్పింది.. అప్పలస్వామి.. అనసూయలతో.
శేషగిరి లోలోనే మురిసాడు.
అనసూయ చేసిన పిండి వంటలు కట్టి ఇచ్చింది.
అప్పలస్వామి రెండు ఐదు వందల నోట్లని మనవరాలు చేతిలో పెట్టాడు.
ఆ తర్వాత.. వాళ్లు కారులో ఊరికి బయలుదేరారు.
***
రాత్రి..
రాగిణి నిద్రపోయేక..
హాలులో..
గిరిజ.. శేషగిరి సోఫాలో కూర్చొని ఉన్నారు.
పార్వతి కబుర్లు అన్నీ శేషగిరికి చెప్పింది గిరిజ.
అంతా విన్నాక..
"అరె. అవునా. పార్వతిది అంత దీనమా." భీతయ్యాడు శేషగిరి.
"మరే. మనం తనని ఆ ఊబి నుండి లాగ్గలమా." అడిగింది గిరిజ.
"ఎలా." అనేసాడు శేషగిరి.
"అదే ఆలోచిస్తున్నాను. నాకూ ఏమీ అనిపించడం లేదు." చెప్పింది గిరిజ.
ఆ వెంబడే..
"మా పేరంట్స్ తో మాట్లాడవచ్చా." అడిగింది.
అర నిముషం తర్వాత..
"భళే. ఆంటీ.. అంకుల్.. పెద్దవాళ్లు. పైగా యోచనాపరులు. వాళ్ల ముందు పెడదాం. తప్పక వాళ్లు పరిష్కారం చూపగలరు." చెప్పేసాడు శేషగిరి.
"ఆదివారం కలుద్దాం. మీకు, డాడీకి వీలవుతోంది." చెప్పింది గిరిజ.
ఆ వెంబడే..
"కారులో చెప్పాను. డ్రయివింగ్ లో వద్దన్నారు. పార్వతికి ఫోన్ చేయండి. మీరు తనకు చెప్పి రాలేదుగా." శేషగిరికి గుర్తు చేసింది.
శేషగిరి టైం చూసాడు.
"బాగా టైమయ్యి పోయింది. రేపు చేస్తాను." చెప్పాడు.
"సరే. పదండి. పడుకుందాం." లేచింది గిరిజ.
శేషగిరి లేచాడు. భార్య వెనుకనే గదిలోకి నడిచాడు.
***
మర్నాడు..
సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నారు.. శేషగిరి.. గిరిజలు.
"నీ ఫోన్ ఇవ్వవా." అడిగాడు శేషగిరి.
ఆ వెంబడే..
"పార్వతికి ఫోన్ చేయమన్నావుగా." చెప్పాడు.
టీపాయ్ మీద చేతిలోని కాఫీ కప్పును పెట్టి..
గదిలోకి వెళ్లింది గిరిజ.
రాగిణి.. ఇరు వైపుల దిండుల మధ్యన.. హాయిగా నిద్రపోతోంది.
చిన్నగా నవ్వుకుంది గిరిజ.
మంచం పక్కనున్న స్టూల్ మీంచి తన ఫోన్ ను.. అలాగే శేషగిరి ఫోన్ ను తీసుకుంది.
వాటితో హాలులోకి వచ్చింది.
తన ఫోన్ ని శేషగిరికి అందించింది.
ఎడమ చేతితో దానిని అందుకొని.. కుడి చేతిలోని కాఫీని తాగుతున్నాడు శేషగిరి.
సోఫాలో కూర్చొని.. చేతిలోని భర్త ఫోన్ ని ఆన్ చేసింది గిరిజ.
"చాలా మెసేజ్ లు.. ఇమెయిల్స్ అన్రీడ్ గా పడి ఉన్నాయి. చూసుకోలేదా." అడిగింది గిరిజ.
"చూస్తాను." చెప్పాడు శేషగిరి.
ఖాళీ కాఫీ కప్పుని టీపాయ్ మీద పెట్టాడు.
ఆ సమయంలోనే..
భర్త ఫోన్ ని టీపాయ్ మీద పెట్టి.. అక్కడ తను పెట్టిన కాఫీ కప్పును తీసుకుంది గిరిజ.
పార్వతికి ఫోన్ కాల్ చేసాడు శేషగిరి.
అర నిముషం లోపే..
తన కాల్ కి కనెక్టయ్యిన పార్వతి..
అటు నుండి.. "హలో." అంది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
תגובות