top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 14


He's an ex

'Premikudu (He's an ex) - Part 14' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 28/08/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 14' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది.


జాతర కోసం రికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెప్పింది. 

పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ.

పార్వతికి కాల్ చేస్తాడు శేషగిరి.



ఇక ప్రేమికుడు పార్ట్ 14 చదవండి. 


"నేను నిన్ను కలిసి బయలుదేరుతున్నట్టు చెప్పలేదు." చెప్పాడు శేషగిరి.

 "గిరిజ గారు మీరు చేరినట్టు చెప్పారు." చెప్పింది పార్వతి.


 "అవునవును." అనేసి..

 "గిరిజ నువ్వు చెప్పింది నాకు చెప్పగలిగింది. డోన్ట్ వర్రీ. మేము ఒక క్లారిటీకి వచ్చేక.. నీతో మాట్లాడతాం. నువ్వు కొన్నాళ్లు నీ భర్త వద్దకు వెళ్లకుండా ఆగు." చెప్పాడు శేషగిరి.


 "సరే." అనేసింది పార్వతి.


 "నేను ఆఫీస్ కు వెళ్లాలి. మరి ఉంటాను." చెప్పాడు శేషగిరి.


 "అలానే." చెప్పింది పార్వతి.


 ఆ కాల్ కట్ చేసేసాడు శేషగిరి. తన చేతిలోని ఫోన్ ని టీపాయ్ మీద పెట్టాడు.

 "అప్పచెప్పినట్టు మాట్లాడకండి." నవ్వింది గిరిజ.


 "లేదే. నువ్వు చెప్పింది చెప్పగలిగానుగా." శేషగిరి బిత్తరయ్యాడు.


 "నేను.. పార్వతితో.. 'కొన్నాళ్లు తన భర్త వద్దకు వెళ్లకుండా ఆగు' అని చెప్పమన్నాను. మీరు అలానే చెప్పారు. కాస్తా ఇంప్రవైజ్ చెయ్యవచ్చుగా.. పొలైట్ గా ఉండేది కదా." మెత్తగానే చెప్పింది గిరిజ.


 "ఎలా." శేషగిరి అమాయకమయ్యాడు.


 "ఇలా.. 'కొన్నాళ్లు నీ భర్త వద్దకు వెళ్లకుండా ఆగగలిగితే బాగుంటుంది.' అనవలసింది." చెప్పింది గిరిజ. చిన్నగా నవ్వింది.


 శేషగిరి తల గొక్కున్నాడు.

 అంతలోనే గది నుండి నిద్ర లేచి.. హాలులోకి వచ్చింది రాగిణి.

 "గుడ్ మోర్నింగ్ తల్లీ." అంది గిరిజ.. రాగిణిని దగ్గరగా తీసుకుంటూ.


 గిరిజ ఒడిలో రాగిణి చక్కగా కుదురుకుంది. 

 "రా. బ్రష్ చేద్దువు." పాపతో లేచింది గిరిజ.


 ఆ ఇద్దరూ వెళ్లేక.. శేషగిరి స్నానంకై కదిలాడు.

 ***

 ఆఫీస్ కు బయలు దేరుతున్న శేషగిరితో..

 "డ్రయివర్ కు ఫోన్ చేసి.. డాడీకి కారు పంపించేయనా." అడిగింది గిరిజ.


 "ఆఁ. ఆ పని చేయవా." చెప్పాడు శేషగిరి.


 "అలాగే.. వీలు చేసుకొని.. మెకానిక్ తో మాట్లాడండి. మామగారి పొలం పనులకు ఆటంకం కానీయకండి." చెప్పింది గిరిజ.


 "సాయంకాలం అటు వెళ్లి మెకానిక్ ని కలుస్తాను." చెప్పాడు శేషగిరి.

 "బై." అనేసింది గిరిజ.


 "బై." చెప్పి..


 గిరిజ పక్కనే ఉన్న రాగిణి బుగ్గని మెత్తగా గిల్లి..

 "బై తల్లీ." అన్నాడు శేషగిరి.


 రాగిణి చక్కగా కుడి చేతిని ఎత్తి ఊపుతోంది.

 శేషగిరి వెళ్లి.. మోటర్ సైకిల్ ని స్టార్ట్ చేసాడు.

***

 "ఏదీ మీ మేనత్తకి ఫోన్ చేసి ఇవ్వు. నేను మాట్లాడతాను." అడుగుతోంది పార్వతి తల్లి.


 "తనకు ఒంట్లో బాగాలేదట. నీ గోలాపు." విసుక్కుంటుంది పార్వతి.


 "మరీ బాగుంది. అంత విసుగెందుకు. ఇలా నాగా పెడితే అల్లుడు ఏమనుకుంటాడు. మరో మారు నేను పంపమంటే పంపుతాడా. ఏదైనా తెగే వరకు లాక్కూడదు." చిర్రవుతోంది పార్వతి తల్లి.


 పార్వతి ఏమీ మాట్లాడ లేదు.

 "నేనా లేచి నడవలేను. నాకేవీ అందనివ్వవ్వు. నువ్వా నా మాట ఆలకించవు. నువ్వు మీరిపోతున్నావే." సరసరా మాట్లాడుతోంది పార్వతి తల్లి.


 అక్కడ నుండి పార్వతి పెరటి వైపుకు వెళ్లిపోతోంది.

 పార్వతి తల్లి వాగుతూనే ఉంది.

 ***

 మర్నాడు..

 అప్పలస్వామి.. కొడుక్కు ఫోన్ చేసాడు.

 అప్పటికి శేషగిరి ఆఫీసులో ఉన్నాడు.

 ఆ కాల్ కి కనెక్టై..

 "చెప్పు నాన్నా." అన్నాడు శేషగిరి.


 ఆ వెంబడే..

 "మెకానిక్ ని పంపానుగా. వచ్చాడా." అడిగాడు.


 "వచ్చాడు. మోటర్ విప్పి చూసాడు. ఏదో కాలిపోయాయట. అతడితో మాట్లాడు." చెప్పాడు అప్పలస్వామి.


 "ఏదీ అతడికి ఫోన్ ఇవ్వు." చెప్పాడు శేషగిరి.


 "కోయిల్స్ కాలిపోయాయి. స్టాక్టర్ పోయింది." చెప్పాడు అటు మెకానిక్.. ఫోన్ లో.


 "రిపేర్ అవుతాయా." అడిగాడు ఇటు శేషగిరి.


 "పార్ట్ అక్కడికి తెచ్చి కోయిల్స్ మార్చాలి. స్టాక్టర్ అక్కడే కొని తేవాలి." చెప్పాడు మెకానిక్.


 "అలా చేయించుకుంటే మోటర్ తిరిగి పని చేస్తోందిగా." అడిగాడు శేషగిరి.


 "నేను చేసి పెడతానుగా." చెప్పాడు మెకానిక్.


 "ఎప్పటికి బాగు చేసి ఇవ్వగలవు." అడిగాడు శేషగిరి.


 "ఎల్లుండికి ఇక్కడికి తెచ్చి సెట్ చేసి ఇవ్వగలను." చెప్పాడు మెకానిక్.

 ఆ వెంబడే..

 "మొత్తం.." చెప్పుతున్నాడు.


 అడ్డై.. 

 "సరి సరే. ఇక్కడికి తేవలసినవి తెచ్చుకోండి. నా ఫోన్ నెంబర్ ఉందిగా. ఇక్కడికి వచ్చేక నాకు ఫోన్ చేస్తే నిన్ను కలుస్తాను. అప్పుడు చెప్పిన అమౌంట్ నేను చెల్లిస్తాను." చెప్పాడు శేషగిరి.


 మెకానిక్ "సరే" అన్నాడు. 


 అప్పలస్వామికి ఫోన్ ఇచ్చాడు.

 "బిడ్డా." అన్నాడు అప్పలస్వామి.


 "మాట్లాడేను. కొన్ని పార్ట్ లు ఇక్కడికి తెచ్చి.. ఇక్కడే సరి చేసి.. అతడే మళ్లీ వచ్చి ఎల్లుండికి సెట్ చేసి ఇచ్చేస్తాడు. నేను చూసుకుంటాగా." చెప్పాడు శేషగిరి.


 "సరే. ఉంటాను మరి." అప్పాలస్వామి చెప్పాడు.


 శేషగిరి ఫోన్ కాల్ కట్ చేసేసాడు.

 ***

 ఆదివారం..

 ఉదయం..

 నాగేశ్వరరావు ఇంటిన.. 

 రాగిణి బొమ్మలతో ఆడుకుంటుంది బాల్కానీలో.

 హాలులో..

 గిరిజ తల్లిదండ్రులతో.. శేషగిరి.. గిరిజ రమారమీ ముప్పావు గంట లగాయితు సమావేశమై ఉన్నారు.


 అప్పటికే పార్వతి సంగతులు క్లుప్తంగా నైనా.. వివరంగానే తన తల్లిదండ్రులకు చెప్పేసి ఉంది గిరిజ.

 నాగేశ్వరరావు దీర్ఘ నిట్టూర్పు తర్వాత..

 "చాలా పిట్టీ." అన్నాడు.


 మొత్తం విన్న సరళ.. 

 "ఆ పార్వతి సహనంకి నమస్కారం." అనేసింది.


 శేషగిరి ఏమీ మాట్లాడ లేదు.

 "మన వరకు వస్తే.. మనకెందుకులే అని వదిలేయడం హర్షణీయం కాదని చెప్పే వారుగా మీరు. అందుకే పార్వతి సంగతిని విదిలించుకోలేక పోతున్నాను." చెప్పింది గిరిజ.


 "యస్ బేబీ. యు ఆర్ రైట్. ఐ యాం ప్రవ్డ్ ఆఫ్ యు." గిరిజతో అన్నాడు నాగేశ్వరరావు. ఆమెను సంతృప్తికరంగా చూస్తున్నాడు.


 శేషగిరి చిన్నగా నవ్వుతున్నాడు.

 "మీలాగే అల్లుడుగారు కూడా మన అమ్మాయిని అర్థం చేసుకున్నారు." అప్పుడే అంది సరళ.


 "నిజం డాడీ. ఈయన భావాలు కూడా మీ లాంటివే." భర్తని చూస్తోంది గిరిజ.


 "మొత్తానికి మన మందరం ఒకేలా ఆలోచించ గలుగుతున్నాం. థాంక్ యూ లార్డ్." ప్రస్తుత తమ మెప్పుల సంభాషణకి ముక్తాయింపుగా అనేసాడు శేషగిరి.


 వారంతా చక్కగా నవ్వుకున్నారు.

 "వాట్ నెక్స్ట్.. ఎబౌట్ దట్ పార్వతి." అన్నాడు నాగేశ్వరరావు సడన్ గా.


 "ఏం చేస్తే బాగుంటుంది డాడీ." గిరిజే అడిగింది.


 అప్పటికి శేషగిరి.. గిరిజనే చూస్తుంటాడు. అది గుర్తించే తన తండ్రిని అడిగింది గిరిజ.

 "ఇది చాలా సున్నితమైనది బేబీ." చెప్పాడు నాగేశ్వరరావు.


 "జటిలమైనది కూడా." సరళ అందుకుంది.


 శేషగిరి సన్నగా ముందుకు వెనుక్కు తలాడించాడు.

 గిరిజ తల్లిదండ్రులనే చూస్తోంది.

 "పార్వతి భర్త.. ఎవరు.." అగాడు నాగేశ్వరరావు.


 "కుమార్." చెప్పాడు శేషగిరి.


 "య. దట్ పర్షన్.. ఎ పిక్యులర్ మేన్. కుమార్ కి ఈ మానసిక స్థితి పుట్టుక నుండి అతడికి ఉండేదా.. లేకా.. మధ్యలో అతడికి కలిగిందా.. లేకా.." ఆగాడు నాగేశ్వరరావు.


 అయననే చూస్తున్నారు మిగతా ముగ్గురు.

 "అతడి విడ్డూర చేష్టలు.. ఒక్క పార్వతి చెంతే అగుపిస్తున్నాయి. వేరొకరి వద్ద అతడు మామూలుగానే ఉన్నట్టు మనకు తెలుస్తోంది. సో.. అతడు నటిస్తున్నాడా." నాగేశ్వరరావు సందిగ్ధ పరిచాడు.


 మిగతా వారు ఏమీ కలగచేసుకొనే స్తిమితంలో లేరు.

 "పుట్టుక నుండి ఐతే.. మార్చే ప్రయత్నం 80 శాతం కష్టం.. మధ్యలో నుండి ఐతే.. మార్చే ప్రయత్నం 80 శాతం సులభం.. నటన ఐతే.. మార్చే ప్రయత్నం లేకుండానే తనంతట తానుగా దొరికిపోవడం 100 శాతం నిజం." నాగేశ్వరరావే చెప్పాడు.


 "ఈ మూడు కెటగిరీల్లో ఏది అన్నది ఎలా తెలుస్తుంది?" అడగ్గలిగాడు శేషగిరి.


 అర నిముషం తర్వాత.. "ఎట్ దిస్ స్టేజ్.. సైకియాట్రిస్ట్.. మానసిక నిపుణుడు.. సాయం మొండుగా ఉంటుంది." చెప్పాడు నాగేశ్వరరావు.


 "అంతేనా డాడీ." గిరిజ తంటాలవుతోంది.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










133 views0 comments

Comments


bottom of page