top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 16


He's an ex

'Premikudu (He's an ex) - Part 16' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 07/09/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 16' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది.


జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది.


పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ.


ఇద్దరూ వాళ్ళ దగ్గరకు వెళ్తారు. పార్వతి సమస్యను వివరిస్తారు.


సానుకూలంగా స్పందిస్తారు వాళ్ళు.

తను కుమార్ తో మాట్లాడతానంటాడు శేషగిరి. 



ఇక ప్రేమికుడు పార్ట్ 16 చదవండి. 


"రిజా." పిలిచాడు గిరిజను.

"ఉఁ." కొట్టింది గిరిజ.


"నువ్వు పార్వతికి ఫోన్ చేసి మాట్లాడవచ్చుగా." గుణిసాడు శేషగిరి.


ఆ వెంబడే..

"నేనైతే సరిగ్గా మాట్లాడ లేను." అనేసాడు.


గిరిజ చిన్నగా నవ్వుకుంది.

"మీ వాలకంకి నాకు భయమేస్తోంది." సరదాగా అంది గిరిజ.


"భయమా.. ఎందుకు." శేషగిరి అవస్త పడుతున్నాడు.


"మరే.. ఆ కుమార్ ని ఇలా ఐతే.. ఎలా డీల్ చేస్తారో." గిరిజ అనేసింది.


"లేదులే. అతడితో నేను సవ్యంగానే వ్యవహరిస్తాను. ప్రామిస్." చెప్పాడు శేషగిరి.


"సర్లెండి. పితపితలాడకండి. నిబ్బరంగా ఉండండి." చెప్పింది గిరిజ.


ఆ వెంబడే..

"మనం పార్వతిని స్తిమిత పర్చాలి. మరవకండి." చెప్పింది.


"తను యస్ అంటే.. తన కోసం మనం ముందుకు వెళ్దాం." చెప్పాడు శేషగిరి.


"అంతే. తను కాదనక పోవచ్చు. రేపు తనతో నేనే మాట్లాడతాను. సరేనా." చెప్పింది గిరిజ.


"సరే." అనేసాడు శేషగిరి.


ఆ తర్వాత..

"గుడ్నైట్." చెప్పింది గిరిజ.


"గుడ్నైట్." చెప్పాడు శేషగిరి.

***

మర్నాడు..

శేషగిరి ఆఫీసుకు వెళ్లేక..

రాగిణి ఆటకి బొమ్మలు ఇచ్చేసి..

పార్వతికి ఫోన్ చేస్తోంది గిరిజ.


అటు పార్వతి ఫోన్ కాల్ కి కనెక్టయ్యింది.

"హలో." అంది.


"పార్వతిగారూ.. ఎలా ఉన్నారు." ఇటు గిరిజ అడిగింది.


"బాగున్నాను. మీరు." అడుగుతోంది పార్వతి.


"ఆఁ. బాగున్నాం." చెప్పింది గిరిజ.


"చెప్పండి." అంది పార్వతి.


"మేము మీ గురించి చాలా సేపు.. కూలంకషంగా మాట్లాడుకున్నాం. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిని చెప్పుతాను. మీ అభిప్రాయం కావాలి." చెప్పింది గిరిజ.


"చెప్పండి." అడిగింది పార్వతి.


"కుమార్ గారిని కలిసి మాట్లాడాలి.." చెప్పుతున్న గిరిజకి..

అడ్డై..

"ఎవరు కలుస్తారు. ఏం మాట్లాడతారు." సరసర అడిగేసింది పార్వతి.


"కూల్ కూల్. నన్ను చెప్పనీయండి. మీ శేషగిరిగారు వెళ్లి కలుస్తారు. కుమార్ తో మాట్లాడతారు. మిమ్మల్ని సరైన రీతిలో కలపడమే మా యత్నం." ఆగింది గిరిజ.


"అనవసరం. అతను వినుకోడనుకుంటా. లేదు వినుకోడు."

గిరిజ నిరుత్సాహం పడుతోంది.

"అయ్యో. ఎందుకలా అనేసుకుంటున్నారు." అడిగింది గిరిజ.


"ఆయనని ఎన్నో రకాలుగా నేను బతిమలాడుకున్నాను. ఉహుఁ. అతడు వినుకోడు." పార్వతి అలజడవుతోంది.


"కూల్ పార్వతిగారూ." అంది గిరిజ.


ఆ వెంబడే..

"మీ ప్రయత్నాలు విఫలమైతే అయ్యాయి.. అది వేరు. మీ తరుపున మా ప్రయత్నం ఒక అవసరం. మిమ్నల్ని పట్టించుకోనట్టు.. మధ్యస్థ ప్రయత్నాన్ని కొట్టేడం అంత సులభం కాదు." గిరిజ నచ్చచెప్పుతోంది.


పార్వతి ఏమీ అనడం లేదు.


"మీ తరఫు వకాలతు ఒకరు కుమార్ ని ఈ పరిస్థితుల్లో కలవడం ముఖ్యం. ఆ పని మీ శేషగిరిగారి కానిస్తారు. మీకు ఖచ్చితమైన భరోసా ఉందన్నది కుమార్ కు తప్పక తెలియాలి. మీరు అడ్డు రాకండి. మీ శ్రేయస్సుకే ఇదంతా." గిరిజ చెప్పడం ఆపింది.


పార్వతి ఎంతకీ మాట్లాడక పోయే సరికి..

"సరేనా. నా మాట వినుకుంటారా." అడిగింది గిరిజ.


"మరి మీ ఇష్టం. 'మీరు నా కోసమే ఆలోచించాం' అంటున్నారుగా." అనేసింది పార్వతి.


"అలా కాదు. కుమార్ మారిపోయి.. ఇంత వరకు మీ మధ్య జరిగిన జరగరానివి ఇకపై ఆగిపోతే.. అతడితో మీరు నిర్భయంగా ఉండగలరుగా." అడిగింది గిరిజ.


"అతడిలో మార్పు రాదు." అనేసింది పార్వతి.


"అలా అనేయ వద్దు. మారితే.. అన్న తర్వాతదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను." గిరిజ అనునయంగానే మాట్లాడుతోంది.


పార్వతి ఇంకా ఏమీ అనడం లేదు.


"అతడు మార లేదు.. అనుకుందాం. అప్పుడు.. మీ తరఫున అల్రడీ ప్రశ్నించి ఉన్నాం కనుక.. అతడిని నిర్దయగా రోడ్డున పడేద్దాం." చెప్పింది గిరిజ.


ఆ వెంబడే..

"అతడికి ఒక ఛాన్స్ ఇవ్వాలి." అంది.


"సరైతే." అనేసింది పార్వతి.


"గుడ్." గిరిజ తేలికయ్యింది.


ఆ తర్వాత..

"మరో మాట.. గ్రామ దేవత పండుగకు కుమార్ రాలేదు. మీరు పిలవ లేదా.. లేక.. అతడు రాలేదా." అడిగింది గిరిజ.


"అయ్యో.. అతడు ఆ ఊరు వదిలి ఎక్కడకీ పోడు. ముఖ్యంగా రాత్రులు ఆ ఇంటిని వదిలి బయటికి పోడు. పెళ్లి తర్వాతి ముచ్చట్లుకు పిలిచినా.. ఈ ఊరు అతడు వచ్చిందే లేదు." పార్వతి ఊగిపోతోంది.


గ్రహించిన గిరిజ.. మరి పెంచకూడదని..

"పార్వతిగారూ.. కుదరవ్వండి. అధైర్య పడకండి. మార్పు తీసుకు రావడానికి ప్రయత్నం చేద్దాం. మీకీ అవస్త తప్పాలని ఆశిద్దాం. సరేనా. ఉంటా మరి." అనేసింది గిరిజ.


పార్వతి ఏమీ అనలేదు.

గిరిజే ఫోన్ కాల్ కట్ చేసేసింది.

***

లంచ్ అప్పుడు..

భర్తకి పార్వతితో తన ఫోన్ సంగతులు చెప్పింది గిరిజ.

"ప్చ్. తను డీప్ స్ట్రగుల్ అవుతోంది." అనేసాడు శేషగిరి.


ఆ వెంబడే..

"నువ్వు చెప్పినట్టు.. మధ్యవర్తిత్వం ముఖ్యం. రాజీ ప్రయత్నం చేయందే టక్కున నిర్ణయం తీసుకోకూడదు." చెప్పాడు.


"అంతేగా మరి." అంది గిరిజ.


ఆ వెంబడే..

"ఈ సంగతులు మమ్మీ.. డాడీకి చెప్తాను. ఆ తర్వాత.. మీరు పకడ్బందీగా ముందడుగు వేద్దురు." అంది.


"నీ ఇష్టం." అనేసాడు శేషగిరి.


ఇద్దరి లంచ్ కొనసాగుతోంది. 

రాగిణి వాళ్లకి దగ్గరిలోనే ఆడుకుంటుంది.

***

బజారు నుండి.. దారం రీళ్ల బాక్స్ తో.. తన టైలరింగ్ షాపు లోకి వచ్చిన కుమార్ తో..

అతడి స్టాఫ్ మెంబర్ ఒకడు చెప్పాడు..

"మీ కోసం పోలీసు వచ్చాడు."


కుమార్ కంగారయ్యాడు.

"ఎప్పుడు.. ఎందుకు.." అడిగాడు.


"పది నిముషాలు అవుతోంది. ఇప్పుడే వెళ్లాడు. రాగానే మిమ్మల్ని టు టౌన్ పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పాడు." చెప్పాడు వాడు.


కుమార్ తల పట్టుకున్నాడు.

 "ఎందుకై ఉంటుందో." ఒకడు అడిగాడు.


"వెళ్లండన్నా." మరొకడు చెప్పాడు.


కుమార్ భారంగానే కదిలాడు. సైకిల్ తో అటు కదల గలిగాడు.

***

టు టౌన్ పోలీస్ స్టేషన్..

యస్ఐ ఎదుట నిల్చుని ఉన్నాడు కుమార్.

యస్ఐ మరో పనిలో ఉన్నాడు.


కుమార్ లోని ఆందోళన తగ్గడం లేదు.

పైన ఫ్యాన్ తిరుగుతోంది.

ఐనా.. కుమార్ వంటిన చెమట.. మరింత మందమవుతూనే ఉంది.

చేతిలో పని అయ్యేక..

యస్ఐ తలెత్తాడు.


అక్కడే ఉన్న కానిస్టేబుల్ చెప్పగా..

కుమార్ ని చూస్తూ..

"ఓ.. కుమార్ వా." అన్నాడు.


తర్వాత తన టేబుల్ సొరుగు నుండి ఒక కవర్ తీసాడు..

అందులోంచి.. 

మడతలతో ఉన్న ఓ ప్రింటెడ్ రసీదు పేపరును మాత్రమే తీసి..

దానిని విప్పి.. ప్రింటెడ్ మాటర్ ని చూపుతూ..


"ఇది ఎవరిదో చెప్పు." అడిగాడు యస్ఐ.. కుమార్ నే చూస్తూ.

దానిని చూసిన కుమార్..

"నాదే. నా టైలరింగ్ షాపు బిల్లు కాగితం." తడబడ్డాడు కుమార్.


కుమార్ సన్నగా వణుకుతున్నాడు.

తిరిగి ఆ కాగితాన్ని మడిచి.. ఆ కవర్ లోకి తోసి.. 

దానిలోంచి.. ఒక రాగి బిళ్లని తీసాడు. దానికి నల్ల మెలతాడు వేలాడుతోంది. అది బాగా సివికిపోయి ఉంది.


ఆ బిళ్లని చూపుతూ..

"ఇది ఎవరిదో చెప్పగలవా." అడిగాడు యస్ఐ.


కొద్దిగా ముందుకు వంగి.. దానినే చూసి..

"ఇది.. ఇది.." ఆగాడు కుమార్.


"చెప్పు." అడిగాడు యస్ఐ. 


అది విన్నవాళ్లకి అడిగినట్టు లేదు.. అదిలించునట్టు ఉంది.

"మరి.. అది.. మా నాన్నది. అతడి మొలకు ఉంటుంది." చెప్పేసాడు కుమార్.

యస్ఐ ఏమీ అనలేదు.


ఆ బిళ్లని తిరిగి కవర్లో పడేసాడు.

ఆ కవర్ ని తిరిగి తన టేబుల్ సొరుగులో పడేసాడు. సొరుగును తోసేసాడు.

కుమార్ ని చూస్తాడు.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










139 views0 comments

Comments


bottom of page