top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 20


#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #ప్రేమికుడు, #Premikudu, #He'sAnEx

'Premikudu (He's an ex) - Part 20' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 27/09/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 20' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ. 


జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది. 


పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. మామగారి కారులో కుమార్ ని కలవడానికి వెళతాడు శేషగిరి. కుమార్ గురించి తెలుసుకోవడానికి డ్రైవర్ సుందరం సహాయం తీసుకోవాలనుకుంటాడు.


ఇక ప్రేమికుడు పార్ట్ 20 చదవండి. 


లంచ్ ఐయ్యేక..

సుందరం కారు పార్కింగ్ వైపుకు వెళ్తుండగా..

ఆ హోటల్ ముందు స్థలంలో.. ఓ పక్కగా నిలిచి..

గిరిజకి ఫోన్ చేస్తాడు శేషగిరి.

అటు గిరిజ తన ఫోన్ కాల్ కు స్పందించేక..

"రిజా.. సుందరం నమ్మకస్తుడేనా." అడిగాడు.


"ఆఁ. నో డౌట్. ఐనా ఏం." సంశయిస్తోంది గిరిజ.


"నాకో ఐడియా వచ్చింది. చెప్తాను. విని.. నీ అభిప్రాయం చెప్పు." చెప్పాడు శేషగిరి.


"చెప్పండి." అంది గిరిజ.


"సుందరం మాటలు బట్టి తెలిసింది.. నా సంగతులు సరిగ్గా సేకరణ చేసి మీకు అందించాడు. 

కదా." ఆగాడు శేషగిరి.


"ఓ.. ఆ కబుర్లు ఆడాడా." అంది గిరిజ కాస్తా బిడియంగా.


"అబ్బే.. మాటల వరసన చెప్పాడు. మీకు తను మంచి సేవకుడుగా చెప్పుకున్నాడు. అంతే." సర్దే ప్రయత్నం చేసాడు శేషగిరి.


గిరిజ ఏమీ అనలేదు.

"సుందరంలో మంచి డిటెక్టివ్ ఉన్నాడు. సో.." ఆగాడు శేషగిరి.


"సో.." అందుకుంది అటు గిరిజ.


"కుమార్ ని డైరక్ట్ గా ఎప్రోచ్ అయ్యే ముందు.. అతడు నడవడి ఎట్టిదో మొదట సుందరం ద్వారా సేకరిద్దాం. ఆ సేకరణ.. నేను కుమార్ ని కలిసి మాట్లాడడానికి ఉపయోగ పడవచ్చు. ఏమంటావు." అడిగాడు శేషగిరి.


"ఇంతకీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు." అటు అడుగుతోంది గిరిజ.


"ఊరి చేరిపోయాం. లంచ్ కూడా చేసేసాం. ఆ హోటల్ ముందు ఉన్నాను. సుందరం కారు తీసుకు రావడానికి సెల్లారు లోకి వెళ్లాడు." చెప్పాడు శేషగిరి.


"నేను మమ్మీ.. డాడీలతో మాట్లాడి చెప్తాను. మీరు ఆగండి." చెప్పింది గిరిజ.


"సరే." శేషగిరి ఆ ఫోన్ కాల్ కట్ చేసేసాడు.


అర నిముషం తర్వాత..

పార్వతికి ఫోన్ చేసి.. తను కుమార్ ఊరు చేరినట్టు.. లంచ్ చేసినట్టు.. కుమార్ ని కలవాలని చెప్పాడు.

***

నాగేశ్వరరావు ఇల్లు..

గిరిజ.. తన పేరెంట్స్ తో మాట్లాడుతోంది.

వాళ్లు లంచ్ చేస్తున్నారు.

రాగిణి బొమ్మలతో ఆడుకుంటుంది.

"సుందరం ఏం వాగేడో.. అల్లుడుగారు కొత్త ఆలోచన చేసారు." అంది సరళ. 


"సుందరం సంగతి తెలిసిందేగా. తన గొప్పను చెప్పుకుంటాడు. అంతేలే." తేలిగ్గా అనేసాడు నాగేశ్వరరావు.


ఆ వెంబడే..

"అల్లుడుగారి ఆలోచన బాగుంది. ఆ కుమార్ ని ఎంప్రోచ్ కావడానికి ఉపయోగ పడవచ్చు." అన్నాడు.


"సుందరంకి విషయం తెలుస్తోందిగా." నసిగింది గిరిజ.


"అరె. సుందరం మనకు ఎప్పటి నుండో తెలిసిన వాడు. వాడు మనకు అనుకవైన వాడు." చెప్పాడు నాగేశ్వరరావు.


"కుమార్ గురించి సుందరం తెలుసుకునే వరకు అల్లుడు గారు ఎక్కడ ఉంటారు." అంది సరళ.

ఆ వెంబడే..

"ముందు అనుకోవలసింది. అప్పుడు సుందరంనే పంపేవాళ్లం. ఆ తర్వాత అల్లుడు గారు వెళ్లేవారు." అంది.


"అరె. అల్లుడుగారికి.. సుందరంతో మాట్లాడేక ఈ ఐడియా వచ్చిందటగా." కలగ చేసుకున్నాడు నాగేశ్వరరావు.


ఆ వెంబడే..

"ఏం లేదు. ఆ ఊరు పెద్దదేగా. అల్లుడుగారు ఏ హోటల్లో స్టే చేస్తారు. సుందరంకి ఒక రోజు సరిపోవచ్చు." చెప్పాడు.


"ఐతే.. ఆయనకు 'సరే' అని చెప్పేదా." అడిగింది గిరిజ.


"చెప్పమ్మా." చెప్పాడు నాగేశ్వరరావు.


గిరిజ.. శేషగిరికి ఫోన్ చేసింది.

"మీరనట్టే కానీయండి. మీరు హోటల్ లో రూం తీసుకొని స్టే కండి. వీలైతే.. రేపటికి కుమార్ ని కలిసి రండి. లేదా అప్ డేట్స్ తెల్పండి. చూద్దాం." చెప్పింది.


శేషగిరి 'సరే' అనేసాడు.


"అలానే.. మరీ డీప్ కు పోక.. కుమార్ గురించి ముందుగా సుందరంకి వివరణ ఇవ్వండి." చెప్పింది గిరిజ.


శేషగిరి "అలానే" అన్నాడు.

ఆ ఫోన్ కాల్ కట్ చేసింది గిరిజ.

***

హోటల్ రూంలో..

కుమార్ గురించి శేషగిరి.. సుందరంకి చెప్పుతున్నాడు.

"ఈ కుమార్ మా ఊరి వారికి కావలసిన వాడు. అతడిది ఓ వింత స్వభావమట. పగలు బాగుంటాడట. రాత్రులు చెత్తగా ప్రవర్తిస్తాడట.." 


అడ్డై..

"అల్లుడు సార్.. 'ట' అంటున్నారు. అంటే.. మీకు తెలియక పోవచ్చు. కానీ అతడి గురించి తెలిసిన వాళ్లకు అవేమిటో తెలుసుంటుంది. వాళ్లు అవేమిటో చెప్పి ఉంటారుగా. అవి చెప్పండి." అన్నాడు సుందరం.


శేషగిరి తటపటాయిస్తున్నాడు.

"పైగా పగలు ఒకలా.. రాత్రులు మరొలా అన్నారు. అంటే.. పగలు అతనితో ఉండి తెలుసుకోడానికి ఏదోలా వీలవుతోంది. రాత్రులంటే.. కష్టమవుతోందిగా." చెప్పాడు సుందరం.

శేషగిరి బిత్తరపోయాడు.


'అవును కదా.' అనుకున్నాడు.


"కుమార్ గురించి అతడి వాళ్లు మీకు ఏం చెప్పారు. మీరు అతడిని దేనికై కలవాలని వచ్చారు." అడిగాడు సుందరం.


సందిగ్ధంలో పడ్డాడు శేషగిరి.

సుందరంనే చూస్తున్నాడు.

'చెప్పకపోతే సుందరం వదిలేలా లేడు.' అనుకున్నాడు.


అంతలోనే..

"చెప్పండి అల్లుడు సార్." సుందరం అడిగేసాడు.


'అనవసరంగా ఇరుక్కుపోయాను.' అనుకున్నాడు శేషగిరి.


గిరిజతో మాట్లాడే ఆలోచన కూడా చేయలేక పోతున్నాడు.

సుందరం ఆగడం లేదు. చెప్పమని మళ్లీ అడిగాడు.

శేషగిరి చిన్నగా కదిలాడు.


తమాయించుకుంటూ..

"ఇది చాలా సున్నతమైన విషయం. పైగా ఆడపిల్లకు సంబంధించింది. అందుకే బయట పెట్టడానికి కిందా మీదా పడుతున్నాను. ఆ అమ్మాయికి సాయ పడాలని వచ్చేసాను." చెప్పగలిగాడు శేషగిరి.


"అయ్యో.. అల్లుడు సార్. నాకు ఇద్దరు ఆడ పిల్లలు. నేను పితలాటకం మనిషిని కాను. చెప్పాలనిపిస్తే చెప్పండి. ఆ అమ్మాయికి సాయపడడంలో నేను మీకు సాయ పడగలను." చెప్పాడు సుందరం.


అర నిముషం తర్వాత..

"కుమార్ భార్య మా ఊరి అమ్మాయి. పగలు మామూలుగా ఉన్నా.. రాత్రులు మాత్రం ఆమెకు నరకం చూపుతున్నాడట. శాడిస్ట్ కన్నా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడట. ఆమె ఏదోలా మా ఊరి చేరింది. సాయం కోరుతోంది." చెప్పగలిగాడు శేషగిరి.


"మరి.. ఆమె పెద్దలు కలగ చేసుకోలేదా." అడిగాడు సుందరం.


"ఆమెకు తండ్రి లేడు. తల్లి అవిటిది. బాధ్యత తీసుకొనే బంధువులా లేరు." చెప్పాడు శేషగిరి.


"మరి. కుమార్ పెద్దలకి చెప్పలేదా." అడిగాడు సుందరం.


"అతడికి తల్లిదండ్రులు లేరు. అతడు ఒంటరి." చెప్పాడు శేషగిరి.


సుందరం తల విదిలించుకున్నాడు.

అతడినే చూస్తున్నాడు శేషగిరి.

నిముషం తర్వాత..

"అల్లుడు సార్.. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి.. ఆ అమ్మాయి చేత పోలీస్ కంప్లెంట్ ఇప్పించడం. రెండు.. మన లాంటి వాళ్లు కలగ జేసుకొని డైరక్ట్ కావడం." చెప్పాడు సుందరం.


"నేను వచ్చింది.. అతన్ని కలిసి మాట్లాడాలనే." చెప్పాడు శేషగిరి.


"మరేం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు. పదండి. కలిసి మాట్లాడండి." తేల్చేసాడు సుందరం.


ఆ వెంబడే..

"అతడ్ని కలిస్తే ఏం అంటాడో విందాం." చెప్పాడు.


శేషగిరి ఏమీ అనక పోయే సరికి..

"లేవండి. మరే ఆలోచన వద్దు. అమ్మాయి వైపుది విన్నారు. కుమార్ ది వినండి. తర్వాతది తర్వాత." చెప్పాడు సుందరం.


ఆ తర్వాత..

శేషగిరి.. గిరిజకి ఫోన్ చేసాడు.

అటు గిరిజ తన ఫోన్ కాల్ కి కనెక్ట్ కాగానే..

"సుందరంతో మాట్లాడేక.. ప్లాన్ మామూలయ్యింది. కుమార్ తో డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నాను." చెప్పాడు.


"అదేమిటి." అటు గిరిజ విస్మయమవుతోంది.


"సుందరం ప్రకారం.. ఈ కుమార్ కై చాటుమాటు విషయ సేకరణలు కుదరని పని.. అతడ్నే డైరక్ట్ గా ఏయిమ్ చేసేయడమే తేలిక.." చెప్తూ ఆగాడు శేషగిరి.


"సరే. ఏమైనా.. అతడ్ని కలవాలనేగా వెళ్లారు. మరో ఆలోచన లేక.. ఆ పని పూర్తి చేయండి." చెప్పేసింది గిరిజ.


ఆ ఫోన్ కాల్ కట్ చేసి.. కదిలాడు శేషగిరి.. సుందరంని తీసుకొని. 


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










143 views0 comments

Коментарі


bottom of page